గీతకి అటువైపు ఏముంది?

అనుకున్నది జరిగినపుడు
అన్నీ మంచి తరుణములే, కాని నాడో?

అడియాస తీతువై
అపశకునం మోసుకొస్తుంది

ఎడబాటు రాచపుండై
మరణశాసనం చేతికిస్తుంది

కంటికి నీరు కరువై
రక్తాశృవులు అరువడుగుతుంది

స్వప్నగీతం కర్ణకఠోరమై
అపశృతుల్లో లయమైపోతుంది

ఓదార్పు ఎండమావై
బ్రతుకు రాజీనామా కోరుతుంది

అపనమ్మిక వూబిలో
అంతిమశ్వాస అనివార్యమౌతుంది

అస్థిత్వం అచేతనై
శిధిలమై మృతకళేబరమౌతుంది

ఇన్ని భయానక దృశ్యాలు కాంచాక
ఇక ఏమి మిగులుతుంది?

28 comments:

  1. అనుకున్నది జరిగినపుడు అంతా మన గొప్పతనమే అని అనుకుంటాము.అనుకున్నది జరగనఫ్ఫుడు ధైర్యంగా ఉండగలగాలి.రేపటికోసం ప్రయత్నం చేయగలగాలి.అలుపెరగకుండా ప్రయత్నం చేయాలి.ఫలితం ఇచ్హేవాడు ఒకడున్నాడు.తనకి తెలుసు మనకేది ఇవ్వాలో.మనం చేసేది ఎవ్వరూ పట్టించుకోకపోవచ్హు.కానీ పంచభూతాలున్నాయి.అవే సాక్షీభూతాలు.ఆశను కోల్పోకుండా ప్రయత్నించడమే మన పని.

    ReplyDelete
  2. ఉష గారు
    మీరు విషాదాన్ని విషమం చేసారు..చివర్లో ఎప్పట్లాగే ధైర్యం చెప్తారు అనుకున్న నాకు ఏమి అనిపించలేదు
    If you fail don't worry, it’s not the end,
    You will have a chance to do it again,
    Never give up, on things you do,
    Life is long, you will pull through.

    You learnt it hard, which will do you good,
    You will definitely shine better than you would,
    So take that failure and move ahead,
    You will come out stronger than every head.

    Don't take this failure out of your life,
    It will make you stronger, and fly high as a kite,
    Failure helps you learn greater details of life,
    Failure is not wrong, unless you take it right.

    నిహారిక గారు చెప్పిందే నిజం

    ReplyDelete
  3. గీతకు ఆవతలివైపు ఇవతలి వైపు ఛాయారూపమే అని తెలిస్తే!అంత నిరాశలనూ జీవితంపై ఆసక్తి కలిగి, భయానక దృశ్యాలు భస్మమౌతాయి.

    ReplyDelete
  4. జీవితం లో కొన్ని సమయాలలో అపశ్రుతులు సహజం

    ReplyDelete
  5. Q. ఇన్ని భయానక దృశ్యాలు
    కాంచాక ఇక ఏమి మిగులుతుంది?
    A. గీత పరిమితిని పెంచగలిగే అనుభవం!

    ReplyDelete
  6. అనుకున్నామని జరగవు అన్నీ ...
    అనుకోలేదని ఆగవు కొన్నీ .....

    ReplyDelete
  7. నిజమే ఒక్కోసారి తీవ్ర నిరాశకు గురైనపుడు మీరన్నట్లే అనిపిస్తుంది

    ReplyDelete
  8. మనస్సుని గట్టి పరుస్తుంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధైర్యాన్నిస్తుంది....

    ReplyDelete
  9. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంలోనే గొప్పతనం ఉంది...

    ReplyDelete
  10. * నీహారిక, హరేకృష్ణ, మహేష్, కథాసాగర్, ప్రసాద్, పరిమళం, నేస్తం, మురళి, పద్మార్పిత - అందరికీ కృతజ్ఞతలు.
    మీ అందరి భావాలు ఎంతో అమూల్యమైనవి, ముందుగా చర్చని మొదలుపెట్టటానికే నా అభిప్రాయాన్ని ఆపి, ఆ పరిస్థితి గోచరమయ్యే దృశ్యాన్ని మాత్రం మీ ముందుంచాను. కర్మ సిద్దాంతాన్ననుసరిస్తు, ధ్యానమార్గాన సాధన చేస్తున్న నాకు మీరు చెప్పిన మార్గోపాయాలతోపాటు నేను అమితంగా నమ్మి ఆచరిస్తున్న వాక్కులు క్రింద వ్రాసాను. చదువరులకు ఇందుమూలంగా ఎంతో కొంత సాంత్వన పలుకులు మనసులో హత్తుకుని సరైన సమయాన వారిని పునర్జీవులని చేసి ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాను.
    ***************************************
    When I Asked God for Strength
    He Gave Me Difficult Situations to Face

    When I Asked God for Brain & Brown
    He Gave Me Puzzles in Life to Solve

    When I Asked God for Happiness
    He Showed Me Some Unhappy People

    When I Asked God for Wealth
    He Showed Me How to Work Hard

    When I Asked God for Favors
    He Showed Me Opportunities to Work Hard

    When I Asked God for Peace
    He Showed Me How to Help Others

    God Gave Me Nothing I Wanted
    He Gave Me Everything I Needed
    - Swami Vivekananda

    ReplyDelete
  11. "కర్మ సిద్ధాంతం అనుసరిస్తూ, ధ్యాన మార్గం లో సాధన చేస్తూ" - చూడ ముచ్చటగా, వినసొంపు గా ఉంది!

    ReplyDelete
  12. "ఇన్ని భయానక దృశ్యాలు కాంచాక
    ఇక ఏమి మిగులుతుంది?" ---
    బుద్దుడు చావుని చూసినప్పుడు ఏమి తెలుసుకున్నాడో అదే
    విజయమే శాశ్వతం కాదు, పరాజయం శక్తికి పరాన్న భుక్కు కాదు
    విజయమూ పరాజయమూ భాదించని అలౌకిక అనుభూతిలోకి

    ReplyDelete
  13. దులుపుకు పోయే వాడికి దుమ్మంటదు. అమ్మో అనుకునే వాడికే ముఖాన మరకలు మిగిలేది. బాగుంది ఉష గారు.

    ReplyDelete
  14. apanammika voobilo amtimaswaasa anivaaryamoutumdi - baaga chepparu, evadoo tanaku taanuga mrutyuvunu ahvaanimchadu. kaani okkomaaru tanakamte mimchina swaamtana ledanipistumdi. drohaaniki gurainapudu amtakamte maargam kaanaraadu. nijaniki tanadi otami kaadanukumta. chetakaani paristutullo kooda batukeedche vaallakamte atade/ame goppadani anukumta. nannu tittukumtunnara? imta niraasaavaadam emani. kaani nenu chetakaani vaalla partylo vunnavaadine. manasuku evo saakulu cheppukumtoo vaayidaalu korutunna moorkhudine. navvukomdi amtaa....

    ReplyDelete
  15. ఇక్కడ పరిస్థితి బాగా బరువుగా ఉంది. కొంత తేలికపరచటానికి నాదో టెక్నికల్ ఫాల్ట్ :-)

    >> "అస్థిత్వం అచేతనై
    శిధిలమై మృతకళేబరమౌతుంది"

    కళేబరం శిధిలమవటం ప్రకృతి సిద్ధం. శిధిలమయ్యాక కళేబరమవటం కవితా ధర్మమా?

    ReplyDelete
  16. అబ్రకదబ్ర గారూ. ఇక్కడ శిధిలమయి మృతకళేబరమయ్యేది అస్థిత్వమూ చేతన. ఒక్క కంటి నీరు తప్ప ఉష గారు మరే ఇతరు భౌతిక వస్తువు గురించి చెప్పినట్లు లేరు గమనించగలరు. దాన్ని కూడా రక్తాసృవు అరువుతెచ్చుకుంటుంది అనడంతో.. అదికూడా కవితావస్తువే అయిందికానీ భౌతికం కాదు. మంచి ప్రశ్న వేశారు అభినందనలు. ఉష ఏమి చెపుతారో చూడాలి

    ReplyDelete
  17. * ప్రసాద్ గారు, వినుడీ అని మన పెద్దవారు వినసొంపుగా చెప్పిన మాటలే కదండీ ఇవన్నీను. జగమే బృందావనమై జీవాత్మ పరమాత్మ ప్రేమతత్వం నిండిపోతే బాగుండు.
    * ప్రదీప్, "విజయమూ పరాజయమూ భాదించని అలౌకిక అనుభూతిలోకి " అదే కర్మయోగులు చూపిన మార్గం. మానవ జీవితంలో సాధ్యమా? సాధన చేత సాధ్యమే. సద్గురు సాంగత్యంలో సర్వం సాధ్యం.

    ReplyDelete
  18. * ఆత్రేయ గారు, "దులుపుకు పోయే వాడికి దుమ్మంటదు. అమ్మో అనుకునే వాడికే ముఖాన మరకలు మిగిలేది" - మాత్రం మహా నచ్చేసిందండి. ఈ అర్థంలో వేరేవి విన్నా ఈ అమరికలో వినటం ఇదే మొదలు. ముందుగా నవ్వు [ఎందుకో తెలియదు] వచ్చింది. తర్వాత తరిచిచూస్తే ఆ ముందుదే కదా అవధూత లక్షణం ["నేను, నాది అన్న భావముగాని, గౌరవా గౌరవాలన్న తేడాగాని ఉండనివారు అవధూతలు"] కొంచం భాషాబేధంలో అని అనిపించింది. ఇక రెండోదీ కూడా తామరాకు మీద నీటిబొట్టులా మనలేక భవసాగరంలో మునకలు వేసే వాడి తీరు. వద్దని వైదొలగించుకోవాల్సిన రీతి. చిన్న వ్యాఖ్యలో నాకింత శోధన చేయను అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  19. వర్మ గారు, ముందుగా నా మాట "కృషితో నాస్తి దుర్బిక్ష్యం". మీ అభిప్రాయం విని తిట్టుకోవటం, నవ్వుకోవటం చెయ్యను. అసలు ఎందుకలా అనిపించింది మీకు? మీరన్న నైరాశ్యం నన్ను పలుమార్లు నలిబిలి చేసింది. భర్త చేతిలో బలవంతపు మరణం పొందిన నా చెల్లి నా ఆదర్శాన్ని వెక్కిరించింది. ఒకరి పెళ్ళి వరకు పనిలో పని "అన్ని పనులకూ" ఉపయోగపడి ఆ తర్వాత వూరి చివరకి విసిరివేయబడ్డ ఓ అమాయకురాలు నన్ను వెక్కిరించింది. చివరికి విధి నన్నూ విడిచిపెట్టలేదు. వద్దురా నాకీ జీవితం అన్నంత విసిగించింది. నేనూ మృత్యుసమక్షానికి పోయే విఫలయత్నం చేసాను. ఈ క్షణం అదే ప్రియం అనిపించిందే, మరు క్షణం నేనెందుకు ముగిసిపోవాలి అనిపించేట్లు చేసింది. అదే మరణం లోని మహత్యమేమో, తన వంతు వరకు వేచే తోడబెట్టుకుపోతుందేమో. విధీ నేను ఆడిన తాడాటలో చివరికి దాన్ని యేమార్చి నేను ఆ కర్మయోగ మార్గాన నడవటం మొదలుపెట్టాను. ఇందరి ముఖంగా వెళ్ళే ఈ జవాబు ఇంత ధైర్యంగా అందుకే చెప్పాను. మానవపరంగా ఎందరో నైతికబలాన్నిచ్చినా నాలోని శక్తిని జాగృతం చేసింది మాత్రం ఒకరే, నా ప్రియ నేస్తం. మీకు ఇన్ని వేల బ్లాగ్మిత్రుల్లో ఎవరో ఒకరు తోడవకపోరు. ఆ చెలిమి మిమ్మల్ని ఆ చింత చెలియలి కట్ట దాటే వరకు తోడుగా రాకపోరు. నా కవిత లోని పంక్తులతో ముగిస్తున్నాను. అన్యధా భావించరనే ఇంత వివరంగా వ్రాసాను. నేను సంపూర్ణ ఆశావాదిని ఇపుడు. నా చుట్టూ అదే ప్రభావం వ్యాప్తి చేస్తున్నాను.
    నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది! http://maruvam.blogspot.com/2009/03/blog-post_11.html

    మాట వచ్చు, భాష వుంది, మనసు వుంది, మార్గం వుంది,
    యోచన తెలుసు, శోధన వచ్చు, భావం తెలుసు, భావ్యం తెలుసు,
    అయినా మనిషికి ఏమిటి లేదు? మనిషికి మనిషికీ నడుమ సఖ్యతెందుకులేదు?
    సంకల్పానికి బలిమి ఎందుకు లేదు? కలిమిలేముల కలవరమెందుకు పడతాడు?

    తల్లికో, తండ్రికో తన ఓటమి అప్పచెప్పి, పరుల ప్రజ్ఞాపాఠవాల్ని చూసి నొచ్చుకుంటాడు.
    తనకు తాను పలుపుతాడు కట్టుకుని, వంకల పలాయనం చిత్తగించి ఆపై పాశ్చత్తాపడతాడు.
    వాయిదాలు వేసుకుని, వంతులు వేసుకుని సామర్ధ్యాన్ని చంపుకుంటాడు.
    ప్రాయాన్ని జార్చుకుని, పయనాన్ని ఆపుకుని, ప్రయాస పడననుకుంటాడు.

    ఒక్కటంటే ఒక్కసారి తిరిగి ఏ ఏకలవ్యుడో ఇలకు దిగివస్తే ఇలా చెప్పడా?
    "నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది.
    కాలాతీతం కానీకు, కానరాని శోకాన్ని వెదకకు, ఓటమికి వెరువకు.
    ఆ గమ్యాన్ని అందుకో, నువ్వు చేరాల్సిన తీరాన్ని చేరుకో" అని

    మనిషీ! నిక్షిప్తమైన నీ పటిమను వెలికి తీయ్, నిద్రాణమైన నీ ప్రతిభకు సాన పట్టు.
    ఆ ప్రకృతే నీకు స్పూర్తి నీ కీర్తికి నాంది నీ విజయానికి పునాది.
    మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం?
    వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం.

    ReplyDelete
  20. @ఉష గారు,
    మొదట అసాధ్యం కాదుగా (నా వ్యాఖ్యకు మీ సమాధానానికి) అందామనుకున్నా, అంతలో పైన మీరు రాసిన మలివ్యాఖ్య చదివాక హృదయం ద్రవించిన భావన. మళ్ళీ అంతలోనే ముందుకు సాగమంటూ చెప్పిన కవిత.
    కృషితో నాస్తి దుర్బిక్ష్యం .... జీవన గమనం ఏ రోజు కోసమూ ఆగదు.

    ReplyDelete
  21. ప్రదీప్, మీలోని ఆర్థ్రతకి చిహ్నం మీ వ్యాఖ్య. నా "పునరపి జననం, పునరపి మరణం" http://maruvam.blogspot.com/2009/01/blog-post_05.html మా చెల్లి జ్ఞాపకాలే. ఇక నా శోకం ఏనాడో పూడ్చిపెట్టాను, ఒక్కోమారు నిశ్శబ్దంలో మాత్రం అప్పటి నాలోకి తొంగి చూసుకుంటానంతే, కనుక శాంతిపథం, క్రాంతిపథం వైపే ఈ చూపు. నా విలాపాలు, విహారాలకి మారుపేరే నా మరువం. ఇక జల్లెడ వారు నా బ్లాగు తీసివేసేలోగా మనమీ భారాన్ని గుండ్రంగా చుట్టి బంతాట ఆడేద్దాం... ;)

    ReplyDelete
  22. అబ్రకదబ గారు, బరువుగా వున్నదాన్ని నేనొక్కదాన్ని నెట్టలేననే ఇదిగో మీ అందరి సాయం అడుగుతా, తేలిక కాదు కనీ మరో మాట చెప్పండి, తీసివేద్దాం, ఇకంతా సఫలమవ్వాలి. మీ చెణుకుకి నా ప్రతి-చెణుకు. ఆత్రేయ గారు నన్ను దాటి పరిగెట్టేసారు. నిజానికి ఆ "కంటి నీటి" ప్రయోగం దగ్గరే కాస్త తడబడ్డాను, తర్కించుకున్నాను "నయన విలాపం ఉప్పెనై" అని వ్రాసాను, మళ్ళీ నచ్చక మార్చాను. అలా ఆత్రేయ గారన్నట్లు ఆ ఒక్క బౌతిక రూపాన్ని మాత్రం వాడాను. మీ ప్రశ్నకి ఆత్రేయ గారి మాటే నేనూ కార్బను కాపి తీసి వ్రాయాలి సమాధానంగా. నాకూ కొంత మీమాస కలిగింది ఇక్కడే, కొత్తపాళీ గారు ఓ మొట్టికాయ వేస్తారేమోనని. బదులుగా మీరు కర్ర పట్టుకొచ్చారు. శిధిల-మృత సమన్వయించటం కాస్త కష్టతరమే అయింది. లోతైన ప్రశ్నతో మరో కవి గారి చేత వివరణ వ్రాయించారు. బహు పసందైన కవితా గోష్టి. మీ ఇరువురకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలా తృప్తిగావుంది ఈ కవితోపాఖ్యానం.

    ReplyDelete
  23. mee javabu chadivaaka naaku meelamti tobuttuvu vunte enta baavunnu anipimchimdi. ushassu velugulu lokamanta virajimmaalani manahspoortiga korukumtoo

    ReplyDelete
  24. naa kotha post kanneeti chinukulu ninna raasanu. meeru choostaranukunna. okamaru choodagalaru.

    ReplyDelete
  25. వర్మ గారు, స్వఛ్ఛమైన [నిజానికి ఇది కూడా సాపేక్ష నిర్వచనం] చెలిమికి వావి వరస అవసరం లేదని నా అభిప్రాయం. నా పట్ల మీ ఆకాంక్షకి ధన్యవాదాలు. మీ కవిత త్వరలో చదువుతాను. ప్రస్తుతం సమయాభావ రక్కసి కోరల్లో చిక్కుకునున్నాను.

    ReplyDelete
  26. mee manasu emta nirmalamgaa vuntundo mee javaabu chebutomdi. anta nirmalamgaa vumdataaniki emtagaano pryatnistunna. mee kavitaapaadaalaku malle amta nishkarshagaa, nirmohamaatamga maataade shakti naaku kaavalani korukumtunna. kavitvamamte naaku pranam. nenu raastunnadi kavitvamena ani naa doubt. kaani mee comments chinna aasaraanistunnayi. dhanyavaadaalu. ikkada telugulo comment ela rastunnaru. naaku amta comp. parignaanam ledu. alaage naa blog headernu telugulo ela rayavacho meeru kaasta teerikaga vunnappudu cheppagalaru. naa mail id:venneladaari@gmail.com

    ReplyDelete
  27. వర్మ గారు, తెలుగులో ఎలా వ్యాఖ్య వ్రాయాలి అన్న మీ ప్రశ్నకి ఈ వేదిక ముఖంగానైతే మరి కొందరికి ఉపయోగపడొచ్చు, మరికొమదరు ఇంకొన్ని సూచనలు ఇవ్వొచ్చు... ఇదొకసారి చదవండి, నేను బ్లాగు మొదలు పెట్టిన తొలిరోజుల్లో చదివి దాచుకున్న రిఫరెన్సిది.. http://blog.vihaari.net/2008/05/2.html అలాగే నేను వీవెన్ గారి http://lekhini.org/ ఎక్కువగా నిజానికి ఈ వ్యాఖ్య వ్రాయటానికి కూడా వాడుతున్నాను. కానీ ఒక స్నేహితురాలి సలహాతో http://service.monusoft.com/TeluguTypePad.htm కూడా వాడుతున్నాను. ప్రతిదానికీ ప్రత్యామ్న్యాయ తరుణోపాయాలు వుంచుకోవటం అలవాటు. అందుకు ఇలా 2-3 పద్దతులు, వినియోగాలు తెలుసుకున్నాను. కొందరు గౌతమీ http://www.ascenderfonts.com/font/gautami-telugu.aspx వాడతారు. ఇవి ప్రయత్నించి చూడండి. బహుశా మరొకరైనా might jump in and say "Yeah! try this, it's cool" అని ఇంకొక టూల్ గురించి చెపొచ్చు. చివరిగా నా పట్ల మీ ఆదరణపూరిత వాక్కులకి ధన్యవాదాలు.

    ReplyDelete
  28. మీరు రాసిన జవాబుతొ ఒకసారి ప్రయత్నిద్దామని,ధన్యవాదలు ఆచార్యా. అలాగే తెలుగులొ బ్లొగ్ హేదెర్ను పెత్తుకోవచ్చో తెలియచెయగలరు.

    ReplyDelete