నీవు లేని వేళల నా లోకమిది

నిదుర నన్నొదిలిపోయింది కలలిక కననన్నానని
పోతే పోనీ మనసులోని నిన్ను చూస్తూ రేయిగడిపేస్తాను

ఇంకొంచం తీరిక చిక్కితే నిన్నలోకి చూసుకుంటాను
చదువుకోను నీ జ్ఞాపకాల రచనలున్నాయి

లేనిపోని కినుకలు నేర్పుతుందని గుండెకి గడియపెట్టేసాను
అపోహలు వెదికి నను నిలవనీయవని వూహలకీ సెలవిచ్చేసాను

గుప్పిట విప్పాలని లేదు, నీ వేలిముద్ర దాచానందులో
ముంగురులు ముద్దాడుకున్నాను నీ జాడలున్నాయని

కొనగోర్లు నీ మునిపంటి పదునుకని పదిలపరిచాను
ఇంకేమిచెప్పాలన్నా నునుసిగ్గు కమ్మేస్తుంది

పులకింతల పారిజాతాలు పక్కగా పరిచాను
మధురిమల మరువాలు జతగా కలిపాను

చెలిమి గంధాలు అద్దుకుని, వలపు చిలకులు చుట్టుకుని
నీ ఆలింగనంతో చాలించే విరహవ్రతం మళ్ళీ పట్టాను

[నా మనోవిహారంలో తామసి తాండవమాడుతున్న నెలవుల్లో సంచరించినపుడు తారసపడ్డ వూహ]

13 comments:

 1. మీ ఫ్లో బావుంది ఉష గారు ..మరువాన్ని కూడా జత చేసారు కదా :)

  ReplyDelete
 2. హరేకృష్ణ, మొత్తానికి మరువాన్ని కనిపెట్టేసారు ;) నెనర్లు. వాస్తవాల్లో అలిసిన మరువం కాస్తిలా సేదదీరను తెలిసిన దారి పట్టింది. మనసున మనసైన తోడు అన్నది ఎంత ధీమానిస్తదీ అన్న భావనే ఈ కవితకి ప్రేరణ.

  ReplyDelete
 3. 'విరహ వ్రతం' ...బాగుందండి...

  ReplyDelete
 4. సేదతీరారు గనుకనే ఇంత బాగా వర్ణించారు .. పద్మార్పిత గారికి చిట్టి లాగా సూరత్ అంటే ఇష్టం వుండదు అనుకుంటా :)

  ReplyDelete
 5. "ముంగురులు ముద్దాడుకున్నాను నీ జాడలున్నాయని " - కష్టమైన పనేమో ;). ఈ వాక్యం ఒక్కటి తప్పిస్తే మొత్తం కవిత బాగుంది.

  ఆ మధ్యనెప్పుడో ప్రేమ కావ్యం (http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html) అని ఒకటి రాసారు. ప్రేమ కావ్యమంత బాగున్నట్టు లేదేమి చెప్మా విరహ వ్రతం.

  అయినా ఏ కవిత అందం ఆ కవితదే....

  ReplyDelete
 6. వ్యాఖలు వ్రాసిన మీ అందరికీ ధన్యవాదాలు. జనవరిలో వ్రాసిన నా "శృంగార సూరీడు!" వంటిదే ఇదీను. ఇదీ ఒక అనుభూతి. రాగం, భావం కలగలిపిన రససృష్టి.

  * మురళి, ఈ విరహ వ్రతానికి విధానం లేదండి. ఎవరి మనసుని బట్టి వారు అనుసరిస్తారు అందుకే నాకు సరిపడింది. :)

  * పద్మార్పిత, మీ "మన్ పసంద్" చేయగలిగినందుకు "హం కో బహుత్ ఖుష్ హూయి". తప్పులుంటే మన్నించేయ్ తల్లీ, ఈ రెండు మాటలకి అరగంట తడుముకున్నాను.

  * హరేకృష్ణ, మీరు కానీ పంతులా అదే మాస్టారా ఏమిటి? నన్ను అర్థాలు వివరించమని క్లాసులో పరీక్షలు పెడతారు. వ్యాఖ్యలు తరిచి హోంవర్క్ దిద్దుతారు. ఏం సార్ ఏమిటీ కథ.

  ReplyDelete
 7. ప్రదీప్, ముంగురులు సవరించిన తన చేతి స్పర్శ నేనన్న జాడ. అవి ముద్దాడటం అన్నది వాటిని మళ్ళీ నా చేతులతో నిమరటం అన్న దానికి కవితలో కనబరిచిన అతిశయోక్తి. మన అనుభవం ప్రకటితం అయ్యే తీరు, అది మరొకరి అనుభూతికి అందే రీతి నడుమ ఆస్వాదన అన్న అడ్డుకట్ట వుంటుంది. అందుకే అభిప్రాయబేధం వస్తుంది. ప్రేమకావ్యాన్ని మళ్ళీ వ్రాయమంటే నా వల్లే కాదు. అనుభూతి గాఢతని బట్టే కదే కవితలు వెల్లువౌతాయి. మీరన్నట్లు దేనికవే. నెనర్లు.

  ReplyDelete
 8. రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ... అన్న ఎ.ఎన్నా.ఆర్., వాణిశ్రీల పాట గుర్తొచ్చింది. విరహ వేదనను వ్యక్తీకరించదంలో మీకు మీరే సాటి.

  ReplyDelete
 9. please see my another blog sahacharudu.blogspot.com

  ReplyDelete
 10. వర్మ గారు, మనది రాధామాధవీయం అని తనతో నేను చెప్పే వూసు గుర్తు చేసారు మీ వ్యాఖ్యతో. విరహం వేదన మిళితమైన అనుభూతి, అదీ వేలకవితలు వొలికించింది మదికో రూపు దాల్చుకుంటూ. ధన్యవాదాలు. మీ మరో బ్లాగు వీలునిబట్టి చూస్తాను.

  ReplyDelete
 11. విరహం యుధ్ధమైతే ఙాపకమే సంధిమంత్రం.

  ;-)

  "But sometimes, war is a necessary evil for a good purpose." - Someone's quote (Sorry forgot the name.)

  ఎలా ఉన్నారు ఉషగారూ???

  ReplyDelete
 12. ఆనంద్, ఆశ్చర్యం. ఆనందమానందమాయే. ఎలా వున్నావు మిత్రమా? ఎలా వుంది కొత్త కాపురం? ;) నేను విరహవ్రతం అంటే మీరు విరహాన్ని ఏకంగా యుద్దం చేసేసారే? ఏమిటటా ఆ కథాకమామీషు. :) మరువం మీద miracle growth soil జల్లిపెడుతున్నారు చదువరులు, అంచేత శాఖోపశాఖాలై ఇదిగో ఇటు నటు వ్యాప్తిచెందుతోంది. నెనర్లు.

  ReplyDelete