మరువం అంటారని ఒక ప్రశ్న, గుర్తుకొచ్చామా నేను నా శిష్యగణం మరి? ;)
ఏడాదికి పైగానే అయింది మా బడి కబుర్లు చెప్పుకుని, ఈ బ్లాగులో ఏమైనా రాసుకుని. అంచేత చిన్న పలుకరింపు, నా చిన్నారుల ఊసులు చెప్పుకుందామని, సమీప భావిలోనో, ఆ తదుపరి కాలంలోనో నా పిల్లకాయలే చదువుకుని సంబరపడతారనీను కూడా-
ప్రస్తుతం వేరే ఊరికి నా నివాసం మార్చినా, పిల్లలు దూరశ్రవణం ద్వారాగానూ పాఠాలు నేర్చుకొనటానికి, చదువుకొనటానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో స్కైప్ ద్వారా బడి నడుపుతున్నాను. అదే అనుకోని మార్పు నా బడి నిర్వహణలో. పిల్లలంతా ఒక్క వారం లోపే వినటం, ప్రశ్నలు వెయ్యటం, సందేహ నివృత్తి వంటివి ఒక క్రమంలో చెయ్యటమూ అనూహ్యమైన తృప్తి. ఒక పంతులమ్మకి ఇంతకన్నా విలువైన గురుదక్షిణ ఉండదనే చెప్తాను.
పాఠ్యాంశాలు ఎప్పటిలా నేనే కూర్చుకుంటున్నాను. ఆ పరంగా వెదుక్కుని కొన్న కొత్త పుస్తకాలు ఇక్కడ ఉంచుతున్నాను.
1) నా సహోద్యోగి రేమాండ్ కి ఈ భాష పట్ల నాకున్న అభిమానం వలనే నేనంటే అభిమానమని నా గట్టి నమ్మకం వమ్ముకాలేదు. అతనికి పాత పుస్తకాల విక్రయశాలలకి వెళ్ళి ఎప్పుడూ ఏవో కొనటం అలవాటు(ట). ఒకానొక అటువంటి చోటులో ఈ పుస్తకం అతని కళ్ళబడటం, పదిలం గా కొని, రెండు చాక్లెట్స్ తో కలిపి నాకు కానుక గా ఓనాటి ఉదయాన్నే నా డెస్క్ మీద పెట్టి వెళ్ళటం నన్ను ఆశ్చర్యానందభరితురాలిని చేసింది. పోతే ఇవి పంచతంత్ర కథలన్నమాట!
పుస్తకం లోని బొమ్మలు చాలా బావున్నాయి, మచ్చుక్కి ఒకటి:
ఈ పుస్తకం గూర్చిన వివరం:

2) ఈ రెండు పుస్తకాలూ నేను Best Book Centre,Hyderabad, AP వారి వద్ద కొన్నాను
ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి ఇలా చెప్పుకుపోతే. కొన్ని:-
పోయినేడాది,
1. పాలగుమ్మి వారు స్వరపరిచిన 'సీతమ్మ వాకిట చిరుమల్లె చెట్టు చిరుమల్లె చెట్టేమొ చితుక పూసింది' పాటని వింటూ నేర్చుకుని పిల్లలు ఆ సాహిత్యాన్ని అచ్చుతప్పులు లేకుండా రాసారు.
2. జతపరిచిన పరీక్షాపత్రం తో వారి స్థాయి చూసుకుని కొత్త అంశాలు ఎంచుకున్నాను.
ఈ ఏడాది,
1. పెద్ద పిల్లలు పద్యరచన అంశాలు, లక్షణాలు, అలంకారాలు, ఛందస్సు నేర్చుకుంటున్నారు. సామాన్య, సాంఘిక శాస్త్రాలు వాడుక భాషతో అభ్యసిస్తున్నారు, ఆంగ్లం నుంచి తెలుగు కి, తెలుగు నుంచి ఆంగ్లానికి వాటిని అనువాదాలు చెస్తున్నారు (అమెరికా అధ్యక్షుని ఎన్నిక, స్ట్రాటస్ మేఘాలు...)
2. చిన్న పిల్లలు ఆ అక్కలు, అన్నల బాటలో నడుస్తున్నారు. వాక్య నిర్మాణం, కథలు చదవటం, సంభాషణలు నేర్చుకుంటున్నారు
ఇవండి ఇప్పటికి మా బళ్ళో పిల్లలకి నేను నేర్పుతున్నవి, పిల్లల వలన నేను నేర్చుకుంటున్నవి. పనిలో పనిగా సంస్కృతం సాధన మొదలుపెట్టాను. నేను గురువులుగా ఎంచుకున్న వారి తలతింటున్నాను నా పుష్టికి.
అన్నట్లు నా బడి ఐదవ సంవత్సరంలోకి అడుగిడింది, అంతలోనేనా అనిపిస్తున్నా గానీ...
Very nice to c u again. Wish u many happy returns of the day. What a remarkable journey! Good going.
ReplyDeleteసుజాత గారు, బడి/నేర్పటం పట్ల నాకింత మక్కువని పిల్లల సమక్షం లోకి వచ్చాకే తెలిసిందండి. ఉగాది-2009 నుంచి అప్రతిహతం గా సాగుతున్న ఈ నిర్వహణ చాలా తృప్తిని ఇస్తుంది. నెనర్లు.
ReplyDelete