(ముందుగా ఈ వచనం చదివి చిత్రం పంపిన ఆత్మీయురాలి ద్వారా, గూగుల్ సౌజన్యం తో)
పక్కకి వత్తిగిల్లి- మనిషి పట్టేంత మనసు తో,
బోలుగా, ప్రసరణ, ప్రకంపన, ప్రతిధ్వని తాకని దేహంతో-
తను నన్ను చేరువగా రమ్మని సైగ చేసింది.
ఆ మునివేళ్లలో సవ్వడి చేసే గాలి:
మూసుకుంటున్న నా హృదయపు తలుపుల మీద
తోసిపుచ్చలేని మాటలా బరువుగా వాలింది.
విద్యుద్దీపపు కాంతులలో మెరిసే దుప్పటి మీద:
సజ్జలో మిగిలి పోయి వడిలిన మందారం లా,
శస్త్ర చికిత్స గురుతులతో ముడుచుకున్న ఆ వదనం.
మదిలోని మాటకన్నా, వాయుకోశాల లోని వేడినే
వెదజల్లుతున్న ఆ నోరు తెరుచుకున్న అగ్నిపర్వతం.
కనుపలకల మీద తరుచుగా తారట్లాడే
చీకటివెలుగుల మౌనం:
నీలిరంగు తెరల బింబాలు, నీలి నీడలుగా.
సమీపానే బిరాబిరా సాగుతున్న ప్రవాహం,
మిడిసిపడుతున్న వినీలాకాశం కలిసికట్టుగా
విశ్వపు గాథ ఆలపిస్తునట్లే-
ఆ/మె జీవితకాల/దేహపు గాయాల చరిత్ర వినిపిస్తూ...
ఓడిపోతున్నాయి అల్పమైన వేదనలు
రాలిపడుతున్న నా అశ్రు కణాల రణంలో,
వీగిపోతున్నాయి విలువ లేని శోధనలు
కూడదీసుకుని తను విప్పుతున్నమానవతతో.
మరణ స్పృహ తో కాంక్షా గ్రహణం విడిచిన చందమామ
లోకపు మరకలు అంటని తెల్లని మమత చుడుతూ,
మరుక్షణపు తీరు ఎరుగని పసితనపు దయ కురిపిస్తూ
ముడుచుకున్న నా ఆత్మలోకి పయనిస్తోంది.
పరాజయం పాలుచేస్తూనే ప్రక్షాళనం చేస్తుంది
బెరడు చీల్చుకుని మోడులోని పచ్చదనమై మిగిలిన స్పర్శ
రాతి పగుళ్ళలో మొలకెత్తిన అంకురమై తన స్ఫూర్తి.
మలిగిపోతున్న దీపాన్నికాచే హస్తం, తన అమృత గుణం.
ఆమె నన్ను బతుకు రాటకి బంధిస్తూనే,
నుదుటి మీద స్మృతిగా వెలుగుతూ
నా శవం నుంచి నన్ను విడుదల చేసింది
శాశ్వత నిదురలోకి జారిపోతూ నన్ను మేలుకొలిపింది.
బోలుగా, ప్రసరణ, ప్రకంపన, ప్రతిధ్వని తాకని దేహంతో-
తను నన్ను చేరువగా రమ్మని సైగ చేసింది.
ఆ మునివేళ్లలో సవ్వడి చేసే గాలి:
మూసుకుంటున్న నా హృదయపు తలుపుల మీద
తోసిపుచ్చలేని మాటలా బరువుగా వాలింది.
విద్యుద్దీపపు కాంతులలో మెరిసే దుప్పటి మీద:
సజ్జలో మిగిలి పోయి వడిలిన మందారం లా,
శస్త్ర చికిత్స గురుతులతో ముడుచుకున్న ఆ వదనం.
మదిలోని మాటకన్నా, వాయుకోశాల లోని వేడినే
వెదజల్లుతున్న ఆ నోరు తెరుచుకున్న అగ్నిపర్వతం.
కనుపలకల మీద తరుచుగా తారట్లాడే
చీకటివెలుగుల మౌనం:
నీలిరంగు తెరల బింబాలు, నీలి నీడలుగా.
సమీపానే బిరాబిరా సాగుతున్న ప్రవాహం,
మిడిసిపడుతున్న వినీలాకాశం కలిసికట్టుగా
విశ్వపు గాథ ఆలపిస్తునట్లే-
ఆ/మె జీవితకాల/దేహపు గాయాల చరిత్ర వినిపిస్తూ...
ఓడిపోతున్నాయి అల్పమైన వేదనలు
రాలిపడుతున్న నా అశ్రు కణాల రణంలో,
వీగిపోతున్నాయి విలువ లేని శోధనలు
కూడదీసుకుని తను విప్పుతున్నమానవతతో.
మరణ స్పృహ తో కాంక్షా గ్రహణం విడిచిన చందమామ
లోకపు మరకలు అంటని తెల్లని మమత చుడుతూ,
మరుక్షణపు తీరు ఎరుగని పసితనపు దయ కురిపిస్తూ
ముడుచుకున్న నా ఆత్మలోకి పయనిస్తోంది.
పరాజయం పాలుచేస్తూనే ప్రక్షాళనం చేస్తుంది
బెరడు చీల్చుకుని మోడులోని పచ్చదనమై మిగిలిన స్పర్శ
రాతి పగుళ్ళలో మొలకెత్తిన అంకురమై తన స్ఫూర్తి.
మలిగిపోతున్న దీపాన్నికాచే హస్తం, తన అమృత గుణం.
ఆమె నన్ను బతుకు రాటకి బంధిస్తూనే,
నుదుటి మీద స్మృతిగా వెలుగుతూ
నా శవం నుంచి నన్ను విడుదల చేసింది
శాశ్వత నిదురలోకి జారిపోతూ నన్ను మేలుకొలిపింది.
(ఈ చిన్ని వచనకవిత కారెన్ కి అంకితమిస్తూ. దాదాపుగా మృత్యుఛాయలకి నేనూ వెళ్ళొచ్చాను. దీనివలన బ్రతకాలన్న ఆశకన్నా బ్రతకటం/బ్రతికి ఉండటం లోని విలువ ఇంకాస్త అవగాహనలోకి వచ్చింది. అలాటి పరిస్థితిలో కలిసిన ఒకరి జీవితం మరొక పాఠం. నాకు ఆమె ఆస్పత్రి లో పరిచయం.
పేరు Karen She is being treated for a disease that has no cure. Up until 10 years ago she was an active sports person and energetic employee. Now she is bed-ridden. She gets a drip of nutrients injected for about 14 hours each day. No food through mouth given even in liquid form. Time to time she gets stomach upset and needs to use bed pan for 20-30 times. She can't sit without support and tied up. Her body started to give up. Not able to bear her pain her husband left her (it's a bitter fact but true). She is alone. Her body heats up so much she has to put ice packs around body to cool off. In the middle of this trauma she does volunteer work - she gives counseling to parents that have kids of this disease and ease up their stress. She runs fund raising programs.
She touched and talked to me in such a kind and inspiring voice and so keen looks. I felt that I touched god. In recent days she is the only one that I felt at peace being with. నందివర్థనం వంటి తన అరచేయి లో నా చేయి ఉంచుకుని ఆమె నాతో జోల పాడించుకుంది, నాకు వచ్చిన రీతిలోనే పాడిన 'జో అచ్యుతానంద...' వింటూ పడుకుని "మర్నాడు నిన్న రాత్రి చాలా హాయిగా నిద్రపోయాను" అని తను అన్నప్పటి ఆనందం కన్నా నిదురలో ఉన్న ఆమె మోములోని ప్రశాంతత నన్ను నిలవరించింది. ఎన్నో రోజుల వ్యవధిలేని ఆమె జీవితం ఇంకాస్త పొడుగ్గా సాగితే ఆ ఛాయల్లో మరి కొందరికి నీడ/ఆలంబన దొరకవచ్చు.
ఈ భావాలు ఏవీ మిగలకపోవచ్చు, బహుశా ఈ స్ఫూర్తి అనంత కాలప్రవాహం లో ఇంతే గాఢత తో ఉండకపోవచ్చు, కానీ ఈ జ్ఞాపకాన్ని దర్శించే ప్రతి సారీ అంతే ప్రభావాన్ని మాత్రం చూపుతుంది. ఈ నలుపు తెలుపుల సమ్మిళిత బ్రతుకు లో కొన్ని కాంతిరేఖలు ఇలాంటి కొందరు. "వారి కొరకే వస్తారు సూర్య చంద్రులు...")
మాటలు రావడం లేదు చదివాక. చావు కన్నా బతుకు గొప్పదే. కరేన్ స్ఫూర్తినిస్తూనే వుంటుంది ఎప్పటికీ..
ReplyDelete"తోసిపుచ్చలేని మాటలా బరువుగా వాలింది. " ఈ వాక్యం బాగుంది.
ReplyDeleteమీ స్నేహితురాలి గురించి తెలుసుకొవడమే బ్రతకడానికి గొప్ప ఇన్స్పిరేషన్ అనిపించింది...