కారాలు+మిరియాలు = గారాలు+మురిపాలు

ఏమున్నదిలే నేర్పరితనమందున,
అసలు కిటుకు తెలుసుకొనుటయేగాక.
పాకశాస్త్రమన్నది నలభీములది కానేకాదు,
చాకచక్యమున్న ఎవరికైనను కరతలామలకమది.

ఆకు తరిగితే పప్పు ఉడకాలి,
కాడ మిగిలితే పులుసు పిండాలి.
అరటి, బీర వండితే తప్పదు తొక్కల పచ్చడి,
పనసపొట్టుకి ఆవ, 
పొట్టిక్కలతో చేవ
అసలింతియె గాక-
ఇంతుల కెందులకు ఏమరుపాటు!?

పప్పు, దప్పళాలు, పచ్చళ్ళు,
ఇగుర్లు, వేపుళ్ళు, కారప్పొళ్ళు,
ఇరుగుపొరుగుల చేదోడువాదోడు వంటలు,
నలుగురితో సయ్యాటలు పిండివంటలు.

పోపు గింజల చిటపటల తకథిమి తాళాలు,
సనికెల్లు మోతల సుర దుందుభులు,
లేత కూరల గుభాళింపు దాకలు,
తీగ పాకపు నోరూరించు డేగిసాలు,
పొంగేటి పాల పరవళ్ళు,
ఉడికేటి ముక్కల ఉరవళ్ళు,
మా ఇంటి వంట నా కొంగుబంగారము

కారాలు కూరినా మమకారమూ వేస్తాను,
గారాలు పోయినా కడుపునిండా కూరతాను,
మురిపాల వడ్డనలో మాకెదురు ఎవరు?
నా చేతి ముద్ద నమ్మరూ "అబ్బో అమృతమే"నంట,
నాకీ వంటలు వంటబట్టించిన అందరికీ నమోనమః


************************************
వంట పట్ల నాకు చాలా మక్కువ, అలాగే వండుతున్నంతసేపూ చాలా ప్రశాంతంగా గడుపుతాను. పాటలు పెట్టుకుని, డాన్స్ చేస్తూ, పాల గ్లాసుతో మొదలుపెట్టి, సగం కూర ముక్కలు స్వాహా చేసి, మరి కొన్ని పళ్ళూ మాయం చేసి ముగిస్తానా ప్రదర్సన. నా వంటకి మంచిపేరు కూడా ;)

ఇక పొతే చూసి కొంత, ఆసక్తితో ఊహ జోడించి కొంత తప్పా పాళ్ళు, లెక్కలు నా తలకెక్కవు. నాన్ స్టిక్ వాడను. మా అమ్మ గారు వాడిన ఇత్తడి, ఇనుప మూకుళ్ళు నాకూ రోజూ వారి వంటకి వినియోగపడతాయి. అలాగే సనికెల్లు వాడకం.

ప్రతి కూరగాయ నుండి వీలైనంత సారాన్ని, ఉపయోగాన్ని మా నాయనమ్మ, అమ్మమ్మ గార్లు చూపారు. నాకు నా వంట ప్రతీది ఇష్టమే. అందుకే ఒక్కటో వ్రాయలేక నా పద్దతి వ్రాసాను.

54 comments:

  1. చాలా బావుంది ఉష.. ఎంతైనా నీ స్టైల్ అదుర్స్..

    ReplyDelete
  2. నలభీమపాకాలంటారు కానీ అతివలచేతి రుచులు వారికెక్కడ వస్తాయండీ. బాగా చెప్పేరు. :)

    ReplyDelete
  3. యంతైన మీదైన రీతిలో మురిపించారు ,మీ ఇంట బోజనంకోసమైన ఇనుపరెక్కల పక్షినేక్కి మీముంగిట వాలాలి . (పనిలో పని మీ పూలతోట కన్నులారా కాంచవచ్చు)

    ReplyDelete
  4. ఇలా వూరించే బదులు యిసారి ఇండియా వచినప్పుడు మమ్మల్ని అందర్నీ పిలిచి ఆ తొక్కలా పచళ్ళ రుచి చూపించి ,మీ మమకారాల తో కూడిన విందు భోజనపు అమృతాన్ని మాకు పంచితే ఆ మురిపాలకి మేము నోచు కుంటాము గా ఉష గారు .

    ReplyDelete
  5. సోదరీమణులంతా కార్తీక సోమవారం కడుపు నిండా తినిపించారు.ఆత్మబంధువు కార్తీక నైవేద్యం ఇంకా పెట్టలేదే అనుకున్నా! చివరకు పేద్ద సాహితీ విందే ఇచ్చేసారు.

    ReplyDelete
  6. అనుకుంటూనే ఉన్నాను..."నా స్టైలే వేరు.." అని డవిలాగేస్తారని...వేసేసారు.... :)

    ReplyDelete
  7. బాగుంది అని చెప్పాలా
    బహుబాగు అని చెప్పాలా
    ఇరగతీసావు అని చెప్పాలా

    ఇవన్నీ కాదు గానీ, ఇందులో ఒక్కటి చెప్పాలన్నా.. వనభోజనం పెట్టంది మేం చెప్పం. అంతే!

    ReplyDelete
  8. @ జ్యోతి, చిన్ని, తృష్ణ, సుజ్జి, నా తరహా/స్టైల్ ని స్వీకరించినందుకు థాంక్స్.
    @ చిన్ని, తప్పక రండి. మా ద్వారాలు మీ కొరకు ఎప్పుడూ తెరిచేవుంటాయి.
    @తృష్ణ, నా డవిలాగ్స్ మీకెవరు లీక్ చేసారబ్బా? ;)

    ReplyDelete
  9. మాలతి గారు, :) అంతే కదండి, ఆ అస్థిత్వపు పోరులోనే కదా ఇవన్నీను.

    ReplyDelete
  10. విజయమోహన్ గారు, మీరంతా చూస్తారనే ఇలా అన్నమాట వున్నమాట విప్పిచెప్పటం. :) మీరనే ఆ ఆత్మబంధువు అన్నమాట మరీ ముదావహం.

    ReplyDelete
  11. అనుకున్నా అనుకున్నా ఇలా మీదైన తరహాలో వండి వడ్డిస్తారని. ప్లైటు టిక్కెట్లు పెట్టుకోరాదూ మీ ఇంటికే వచ్చి మీ తటాకాన్ని, మీ మొక్కల్ని చూసి పనిలో పనిగా మీ చేతి విందు ఆస్వాదించి వస్తాం. టిక్కెట్లు నా ఒక్కదానికే కాదమ్మాయ్..అందరికీనూ!!

    ReplyDelete
  12. ఉషా ,
    మేమంతా వంటలు చేస్తే , మీరు కవితా వంట చూపించారు . ఎంతైనా మీ రూటే వేరు. చాలా బాగుంది .
    నేనూ ఇత్తడి గిన్నె , పెనమే వాడుతాను .

    ReplyDelete
  13. రవిగారు, తప్పక ప్రయత్నిస్తాను కానీ రెండు ఇబ్బందులు - దూరాభారం తలుచుకునే రావటం తగ్గించింది. ఆపై, మీరన్న పని చేస్తే అంతా కట్టగట్టుకు నన్నక్కడే ఆపి పూటకూళ్ళమ్మని చేసేస్తారేమోనని భయం. :)

    ReplyDelete
  14. భా.రా.రె. మీరు పంపిన పులిహోర తినగానే మా వూర్లో వనభోజనాలకి మీకు ఆహ్వానం పంపుతాను. ;)

    ReplyDelete
  15. @ సిరిసిరిమువ్వ గారు, అలాగేనండి ఒకసారి కళ్ళు మూసుకుని అన్నీ వూహించేసుకోండిక. వూహకి అందని విహారం లేదు. విహారం చూడని వినోదం లేదు కదా?

    @ మాలాగారు, మరి కవయిత్రికి తప్పనిసరి కదా అది ;)

    ReplyDelete
  16. ఆహాహా ఉషగారు ..నేను మిమ్మల్ని అలా కళ్ళ ముందు నిలిపేసుకున్నా..ముగ్ధమనోహరంగా మీరు సన్ని కల్లుని తకధిమి అంటూ తాళం వాయిస్తూ చిరు చెమటను అలోవకగా పమిటకు తుడుచుకుంటూ.. ఎంత బాగున్నారో ..అన్నట్టు అరటి తొక్కతో కూడా పచ్చడి చేస్తారా??.. ఈ లెక్కన మా ఆయన అన్నట్లు నేను దేనికి పనొకొస్తాను :(

    ReplyDelete
  17. నిన్న రాత్రి హడావుడిలో రాయటం మర్చిపోయానండీ...నేను కూడా మా నాన్నమ్మ తరాలకి చెందిన ఇనప,ఇత్తడి మూకుడులూ,2,3 సైజుల ఇత్తడి గిన్నెలు, రాచ్చిప్ప, గూటం.. అవీ తెచ్చుకున్నా అత్తారింటికి...నాన్ స్టిక్ తో పాటూ నాకు వాటిల్లో వండటం కూడా భలే సరదా..:) ఎంతైనా old is gold కదా మరి..!!

    ReplyDelete
  18. నేస్తం, అంతా బానే వుంది కానీ ఆ పమిట బదులు, పైజమాస్ లో టిష్యూ తో తుడుచుకోవటం లో నన్ను వూహించుకోవాలి. ఇక్కడ ఈ చలి ప్రదేశంలో చీరల వాడకం తక్కువే. ;) మిగిలినవి ఓకే. మీవారి మాటలకి అర్థం మీ బ్లాగు టపాల్లో ఈ వారాంతం లో వెదుకుతాను. కావాలిస్తే చెప్పండి దానికీ ఓ కవిత గిలికేస్తాను.

    ఉడికిన అరటి తొక్కలు లోపల నుండి మొత్తం గీసి తీసి, వేపిన ఉప్పు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర తో కలిపి నూరి పెరుగు కలిపి, ఆవాలు కర్వేపాకు, కొత్తిమీర, పోపు వేయాలి. లేదా, ఉప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు వేపి నూరి ఆ పొడిలో అరటి ముద్ద కలిపి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, బెల్లం తో కలిపి నూరి పోపు వేయాలి. రెండూ బాగుంటాయి. ట్రై చేయండి. ;) ఇదే మాదిరిగా వెలగకాయ పెరుగు/పండిన వెలగ పండు గుజ్జుతో తీపి పచ్చడి కూడా చేస్తారు.

    ReplyDelete
  19. తృష్ణ, నా ఇత్తడి సామానంతా అక్కడే దాచాను కానీ ఒకటీ రెండూ పాలకోవా/చక్ర పొంగలి చేయటానికి తెచ్చుకున్నాను. అలాగే అమ్మమ్మ గారివి కొన్ని గిన్నెలు, నానమ్మ కాఫీ ఫిల్టర్, అమ్మ పూరీ కర్ర, గవ్వల చెక్క ఇలా ఇంకెన్నో. మిగిలినవాళ్ళు వెండి బంగారాలడిగితే, వాటిని మించిన ఆరోగ్యం అందించే ఈ ఇనుప ఇత్తడి పాత్రలు నేను అడిగి తెచ్చుకున్నాను. ఇపుడు వేటికీ కొదవలేదు నాకు. :)

    ReplyDelete
  20. అబ్బో! చాలా చాలా చాలా బాగుంది.మీ పాక శాస్త్ర ప్రావీణ్యం.

    ReplyDelete
  21. ఏమున్నదిలే నేర్పరితనమందున

    బాగు బాగు. మొదలుపెట్టడఁవే శ్లేషతోనా! అందున నేర్పరితనము ఏమున్నదిలే, నేర్పరితనమందున ఏమున్నదిలే.

    పాకశాస్త్రమన్నది నలభీములది కానేకాదు,
    చాకచక్యమున్న ఎవరికైనను కరతలామలకమది.


    నేనింకా వాళ్లెక్కడైనా కనబడితే వండించుకుని తిందాఁవనుకుంటూంటే ఏం...థ మాట అనేశారూ!

    ౩ ఏమీ అనుకోవద్దూ ఇలా అంటున్నాననీ, కాకపోతే ఇగుర్లూ జిగుర్లూ నాకు తెలియవండీ. మా అమ్మగారు చేసే వంటలలో నాకు చేతనైన వంటల్లోనూ ఇగుర్లు లేవండీ. అన్నట్టు, మజ్జిగచారువంటి వాడకాలూ లేవు మాయింటి వంటల పదజాలంలో... నిజానికి ఆ పదార్థాన్నే మేఁవూ మజ్జిగపులుసూ అంటాం. అలాగే పప్పుపులుసూ అంటాం, పప్పుచారు కాదు. బయట తిరిగి తిరిగీ ఈ పదాలు తెలిసాయ్ కానీ కొన్నిటి విషయంలో ఏదేఁవిటో ఇప్పటికీ నాకు అనుమానఁవే. అలాంటి కోవలోకి చెందుతుంది ఈ ఇగురు కూడానూ.

    ౪ మీరు నాట్యమాడుతూ చేస్తారా ఏమిటండీ వంటని? నిజఁవే లెండి, వంట చేయడం ఆస్వాదించలేకపోతే చీకాకొచ్చేస్తుంది.

    ౫ అరటికాయ తొక్కలపెచ్చడా? ఉషగారూ, మీరు అత్తగారి కథలు చదివారా?

    నాకీ వంటలు వంటబట్టించిన అందరికీ నమోనమః

    మఱి ఇందాకానేఁవో కిటుకూ నేర్పరితనఁవూ అన్నారు, నలభీములది కానే కాదన్నారు... :D

    ౬ బాగుందండీ. మళ్లీ ఏఁవనుకోనంటే మఱొహ విమర్శ. మొత్తం మీద ఇది కవితలా కాక విరహిత కవితలా (అంటే కతలా) ఉంది. :)

    ReplyDelete
  22. తృష్ణ,
    గూటం అంటే ఏమిటి?

    ReplyDelete
  23. tRshNa gaaru,

    gunDu sUdi shapelO inkoncham peddagaa baruvugaa vuntundi.
    Edainaa danchaDaaniki upayogistaaru vanTa chesetappudu .kaanI daanni asalu talupulaku gollemgaa upayOgistaaru.

    ReplyDelete
  24. వావ్...ఇదీ...ఉషా స్పెషల్....భలే బాగుంది....ఎన్ని వొంటలో తినేసి....చాలా బ్రేవ్ లు వొచ్చేసాయి... కొన్నాళ్ళవరకు ఇంక ఏమి తినక్కరలేదు.ఎప్పుడూ కడుపునిండా పెట్టే కవితల్లాగే ఉంది... ఒక పెద్ద పూల దండ ...ఇదిగో తీసుకోండి..

    ReplyDelete
  25. Nice nice. ;-)

    Usha (rendo peredo meere pettukondi. ika nunchi a pakam ani piluddam

    ReplyDelete
  26. మనమెంత శుచిగా రుచిగా చేసినా మావారు మాత్రం హోటల్ తిండినె మెచ్చుకుంటారు. ఆది నుంచి మీరు వండుతున్నా పేరొచ్చింది మాత్రం మగవారికే గదా.. అంతెందుకు ఈనాడు ఏ హూటల్ లోనైనా మగవారే..షెఫ్ లుగా ఉంటున్నారు. వారు వండినవి మీ ఆడువారు కూడా లొట్టలేసుకుని తినడం లేదా....అంటారు.(ఇందులో కొంత నిజం లేకపోలేదు కదా)
    సనికల్లు,దాకలు,డేగిసాలు ఇవి ఇపుడెకడున్నాయండి..

    ReplyDelete
  27. అద్భుతం. ఘుమఘుమలు నాసికా పుటాలను తాకుతున్నా కడుపులో మాత్రం ఎలుకల విహారం ఎక్కువే అయ్యింది...

    ReplyDelete
  28. బావుంది బావుంది ఉషా నీ వంటల, నాట్య తీరుల జుగల్బంది. పెళ్ళి పుస్తకం లో దివ్య వాణి రొట్టెలు చేసే సీన్ గుర్తు వచ్చింది...

    ReplyDelete
  29. సుజాత, కృష్ణుడు గారు చెప్పినది కరక్ట్...దాని బేసిక్ ఉపయోగం వేరైనా దాన్ని వంటింట్లో ఏదైనా దంచటానికి ఉపయోగిస్తారు.

    ReplyDelete
  30. కార్తీక విందు ! అబ్బో నోరూరించిందండీ ...

    ReplyDelete
  31. సునిత, జయ, సుజాత, కృష్ణుడు, తృష్ణ, వెంకటరమణ, కుమర్, థాంక్స్.
    మీరే ప్రశ్నలు వేసుకుని, సమాధానాలు తెలుపుకుని ఈ మరువపు విస్తరిలో చక్కని సమాచారం వడ్డించారు. :) మళ్ళీ థాంక్స్. ;) మరి మళ్ళీ మళ్ళీ రండీ ప్లీజ్..

    ReplyDelete
  32. @ అడ్డగాడిద గారు, ఆ పనేదో మీరే చేయకూడదు. నల, భీమ == ఉష, ? అని ఎక్కడైనా ఒపీనియన్ పోల్ లేదా ఈబే లో ఆక్షన్ పెడితే సరి కదా? ;) థాంక్యు.

    ReplyDelete
  33. భావన, నిజంగానే అలాగే చేస్తాను వంట, ఇంకా వేడిసెగ తగలకుండా చర్మరక్షణ కోసమని గంధం అరగదీసి, పాలు, పసుపు, తేనే కలిపి మొహానికి అద్దుకుని, చేతులకి ఆలివ్ ఆయిల్ [అదే వంటకీ వాడతాను] రాసుకునీ మరీ ... ;) అదేకదా వచ్చిన ఇబ్బంది అంతా నన్ను అనుకరించేవారే వాణీలు, రాణీలు .... :)

    పరిమళం, అసలిన్నాళ్ళు అమ్మ గారింట్లో కార్తీక విందులు, పూజలకే వెళ్ళివచ్చివుంటారు కదా, మళ్ళీ ఈ నోరూరింపులు ...? ;)

    ReplyDelete
  34. శ్రీనిక, మీవారన్నారని మీరు చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు. కానీ ఆ మూలాలు వెదకాలంటే మనం మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్యవ్యవస్థగా పరిణమించిన కారణాల్లోకి వెళ్ళాలి కనుక ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద కాంటినెంటల్ హొటెల్స్ లో కూడా స్త్రీ షెఫ్ లు కనపడతారు. ఇకపోతే, సుమరు పదిహేనేళ్ళకు క్రితం ఇందిరాపార్క్ సమీపంలో రాళ్ళ కార్మికులు ముఖ్యంగా స్త్రీలు వివిధ పనిముట్లు చెక్కి అమ్మేవారు. నా దగ్గర వున్నది అక్కడ కొన్న సనికెల్లు [బహుశా పది రూపాయల లోపే ఇచ్చాను]. తర్వాత ఇక్కడ లోకల్ అమెరికన్ స్టొర్ లో ఇంకాస్త పెద్దది పదిహేను డాలర్లకి కొన్నాను. రెండూ వాడతాను. నా దగ్గర అరచేతిలో పట్టేంత దాక నుండి నేను పట్టేంత సైజు వరకు దాకలున్నాయి. చిన్న డేగిసా వుంది. పెద్దవి ఇండియాలో దాచుకున్నాను. నమ్మనంటే మా ఇంటికి రండి. చూడొచ్చు. లేదా నాకు ఒపిక వుంటే పిక్చర్స్ తీసి చూపిస్తాను. :) నమ్ముతారా మరిక?

    ReplyDelete
  35. రాఘవ, పెద్ద సమీక్ష వ్రాసి నా కవితకొక అర్థం కల్పించారు. ధన్యవాదాలు. ఏం...త బాగా వ్రాసారో కూడా .... :) నలుడు, భీముడు ఇకరారు. నన్ను గుర్తులో వుంచుకోండిక.
    కాస్త పులిసిన మజ్జిగలో పచ్చివుల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర,కర్వేపాకు పొపు వేస్తే అది మజ్జిగచారు. అదే కాసిని వుల్లిపాయలు, తోటకూర కాడలు, సొరకాయ ముక్కలతో వుడికించి, అల్లం దంచి కలిపి, బియ్యం/శెనగ పిండి కాస్త గరిటజారుగా కలిపి పోసి, పోపువేస్తే అది పులుసు.
    పప్పులుసులో పప్పు మెదపరు, పలుకుగా వేస్తారు. పప్పుచారులొ బాగా మెదిపి కలుపుతారు.
    ఉడకబెట్టిన కూరగాయలు వేపితే అదే ఇగురు, ఉదా: అరటి/చేమ/బంగాళదుంపల ఇగుర్లు. అదే కాస్త ఉల్లిపాయ వేపి, చింతపండు పులుసు పోసి ఈ ముక్కలతో ఉడికిస్తే ఇగురు పులుసవుతుంది.
    హ హ హ్హా, పడ్డారుగా అడ్డంగా, నాకు వంట నేర్పినవారు నా వంటలు తిన్నవారే ;) వండుతూ వండుతూ నేర్చుకున్నానన్నమాట!

    నావి వచనాలు, వచన కవితలే కదా, కాస్త భావం వెదుక్కోండి అంతే సార్!
    మళ్ళీ ఓ సారి కృతజ్ఞతలు.

    ReplyDelete
  36. రాఘవ, పైన వ్రాయటం మర్చిపోయాను. నేను "అత్తగారి కథలు" చదివాను కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఆవకాయ ప్రహసనమే గుర్తుకువస్తుంది. మేము చాలా రకాల రోటి/నూరుడు పచ్చళ్ళు చేస్తాము. అందులో ఈ తొక్కలతో చేసే రకాలు కొన్ని.

    ReplyDelete
  37. ఆలస్యమైంది.....అందరూ తినేసారు ఇంక నాకు ఏమీ మిగల్చలేదుగా:(

    ReplyDelete
  38. Lte's go with "Usha ?" pakam (to be pronounced 'ushaprasna pakam' ;-)

    ReplyDelete
  39. పద్మార్పిత, మరదే మీ చమత్కారం. ఇక్కడ వండింది ఏమీ లేదు వడ్డించిందీ ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు నాల్గు పదాలు నా కవిత నుండి స్వాహా చేయటం తప్పా? :) మీక్కావాల్సింది మీరూ లాగించేయటమే.

    ReplyDelete
  40. అడ్డ గాడిద (The Ass), ok then go for it. It's your call. :)

    ReplyDelete
  41. నావరకైతే!! నా దగ్గర అన్ని చమత్కారాలు లేవండి. కావాలంటే, ఎవరైనా కష్టపడి వండి పెడితే, చిటికెలో తిని పెడతా!!

    ReplyDelete
  42. నాకు ఈ మధ్య కాస్త బుద్దిమాంధ్యం వచ్చినట్లుంది :( + ;)

    లేకపోతే రాఘవ గారి అంత చక్కని చెణుకు మిస్సవుతానా? మరోసారి చూడండి.

    "అరటికాయ తొక్కలపెచ్చడా? ఉషగారూ, మీరు అత్తగారి కథలు చదివారా?"

    పెచ్చడా :) కథాకమామీషు ఇది. నేను అరటికాయ అనగానే "అత్తగారూ అరటికాయపొడీ" అన్న కథ గుర్తొచిందన్నమాట! పైగా, వంకాయపచ్చడిని వాళ్ల వంటవాడు వెంకాయపెచ్చడి అంటాడింకొహచోట. అదీ ఇదీ కలిపి అరటికాయ పెచ్చడీ అని వ్రాసారు [ కాబోలు :) ]

    భలే చమత్కారం. రాఘవ ఎంతైన విమర్శలో మీది పైచేయ్యేను.

    అనుకోనిది, అంటే ఆ ఆలోచనలోవున్నాను కనుక కంటికి వెంటనే దొరికిందీను... "అత్తగారు అరటికాయపొడి ఆడియో" ఇక్కడ చూసి ఆనందించండి. :)

    "http://pbhanumathi.blogspot.com/2009/11/blog-post.html"

    ReplyDelete
  43. సాయిప్రవీణ్, బహుకాల దర్శనం. నాకింకా ఆశ్చర్యమే అలా "చిటికెలో" తినేవార్ని పుట్టించిన బ్రహ్మేనా ఇలా నాలా నాన్చుకుంటూ గంటలు గంటలు కంచం ముందేసుకు కూర్చునేవారినీ పుట్టించిందని. అర్థమైంది కదా. నాకు వండటంలో వున్న సరదా తినటానికి రాదు సుమా! మా జిల్లాల స్పెషల్ పాకం గారెలు/పుణుకులు, ఉలవచారు, వడియాల కూర వంటివి మాత్రం గంటల్ని నిమిషాలకి కుదిస్తాయి. వ్యాఖ్యకి థాంక్స్.

    ReplyDelete
  44. కవిత అదిరింది ఉష గారు. ఏదో వంటకం గురించి రాసేయడం కాకుండా మీ ప్రత్యేకతను నిలుపుకున్నారు.
    నేను కూడా అంతే, పాటలు పెట్టుకుని వింటూ వంట చేస్తూ రిలాక్స్ అవుతాను. అంటే నా వన్నీ ఏదో సర్వైవల్ వంటలే లెండి, ఏదో తినేయచ్చు అద్భుతం గా ఉండవు అలా అని ఘోరంగానూ ఉండవు. గిన్నె మాత్రం ఖాళీ అవుతుంది :-)
    అన్నట్లు అఱటి, బీర తొక్కల పచ్చడి గురించి చెప్పి భలే ఙ్ఞాపకాలు కదిలించారు :-) వేంటనేనేనో టపా రాసేయాలి.

    ReplyDelete
  45. నేను ఇలా మీ బ్లాగ్ ఓపెన్ చేసి వ్యాఖ్య రాసే సమయం లోనే మీరు నాగురించి తలచుకుని నా బ్లాగ్ లో వ్యాఖ్య రాసినది చూసి అచ్చెరువొందాను. టెలిపతీ! అనుకోవచ్చేమో :-)

    నేను మరువపు వనానికే కాదండీ బ్లాగువనానికే కాస్త దూరమయ్యాను. ఆఫీసులో కొన్ని చికాకులు అదే సమయం లో నాన్న గారికి కాస్త అస్వస్థత కారణంగా బ్లాగుల్లో ఎక్కువ సమయం గడపడం లేదు. మళ్ళీ ఈ రోజే, మీ బ్లాగుతోనే మొదలు పెట్టాను :-) నాన్న గారి ఆరోగ్యం ఇపుడు కాస్త మెరుగైంది లెండి.

    ReplyDelete
  46. వేణు, (అసలు వ్యాఖ్య మూడో పేరాలో..) ఇది మీ విషయం గూర్చి - మరి కదా :) ఆ టెలిపతీ అవీ వూరికే కనుగున్నారా ఏమి? నాన్న గారికి స్వస్థత చేకూరుతున్నందుకు ఆ మాట పంచుకున్నందుకు సంతోషం. అటువంటి చిన్న చిన్న నలతల సమయంలో మాసికంగా కూడా ప్రక్షాళన జరిగుతుందని చదివాను, నిజమేకూడననిపించే ఘటనలు చూసాను. అయినా అస్వస్థత కారణంగా కలిగే యోగాలు R K Narayan గారి Convalescence is better than Sickness గుర్తు చేసుకోండో సారి. ఆయనకి ఇప్పుడు రాజయోగం పట్టిందన్నమాట. అందరికీ ఆ పైవాడే ఆప్తుడు, కాచే నాథుడూను.

    ఇక "ఆఫీసులో కొన్ని చికాకులు" ఎవరికి తప్పవు చెప్పండి. నలుడు కొలువు నాటి నుండి వున్నవే ఇవి. మిమ్మల్ని చికాకు పెట్టేవారినో పుల్లైస్ గా వూహించి నీరుగార్చి పడేయండి. సింపుల్ + సత్వరంగా పని చేసే చిట్కా. :)

    నేను సరాసరి వంట గదిలోకి వెళ్ళానంటే అదొక గుర్తు కాసేపు ప్రశాంతంగా గడపాలనుందని. అంత థెరఫీ అది నా వరకు. మీ టపా కొరకు ఎదురు చూస్తాను. తప్పక ఏవో నోరూరించే పచ్చళ్ళ వూసులుండేవుంటాయి. :) అక్కడ మరిన్ని విశేషాలు వెదుక్కుని నావీ కలుపుతాను. నాకు కొంచం పెరుగన్నమైనా కూరాలన్న ప్రయత్నంలో అలవాటు చేసిన నంజుళ్ళు ఇవి. అవి నా హయాంలో ఇంకా అభివృద్ది చెంది రుచిగా శుచిగా నా వంటగదిలో సృష్టించబడుతున్నాయి. కంది పచ్చడి, కారంచేడు ప్రాంతాల్లో చేసే తోటకూర+ఆముదం పచ్చడి, బెండకాయ పచ్చడి ఇంకా ఇలా ఎన్నో కదా..

    ముందుగా మరువపు వనానికి విచ్చేసినందుకు సదా కృతజ్ఞతలు.

    ReplyDelete
  47. kalvaMlo nurinaa jaaraalu miriyaalu

    madiniMda nilipaavu mamataanuraagaalu

    niMDEnulE kaDupu nI cEtivaMTatO

    paMDEnulE manasu nI kavita dhaaratO..

    I tried my level best to paste it in telugu fonts. but couldn't succeed.

    ReplyDelete
  48. కల్వంలొ నూరినా కారాలు మిరియాలు
    మదిలోన నిలిపావు మమతానురాగాలు
    నిండేనులే కడుపు నీ చేతి వంటతో
    పండేనులే మనసు నీ కవిత ధారతో

    ReplyDelete
  49. naaku kaDupu ninDipoeyindi! miiru vaDDinchinadanitoe.braav! mari vakkapoDi evaristaarammaa?

    ReplyDelete
  50. శ్రీలలిత గారు, మరో మారిలా చిరు కవితతో నా వనాన మీ మొలక నాటినందు ధన్యవాదాలు. విందు తర్వాత తాంబూలం మాదిరి ఎంత బాగా వ్రాసారో. చాలా థాంక్స్.

    అశ్వినిశ్రీ, అప్పుడేనా మరో నాల్గు భోజనాలైన ముగించనిదే ఆకు లేదు వక్క లేదు. కాసేపలా ఒడ్డిగిల్లండి. ఆనక చూద్దాం పోకచెక్కల సంగతి ;)

    ReplyDelete
  51. Thanks for your kind words ఉషగారు, about అస్వస్థత మరియూ ఆఫీసులో చికాకులు గురించి. మీరు చెప్పిన పద్దతులు పాటించడానికి ప్రయత్నిస్తాను.

    భలే వారే ముందే చెప్పాను కదా నావన్నీ ఆపద్దర్మ వంటలు అని, మీరలా రుచికరమైన పచ్చళ్ళు గురించి ఎదురు చూస్తే నిరుత్సాహ పడిపోతారు జాగ్రత్త మరి.

    ReplyDelete