మంచు కురిసిన మోహనం

అవని, ఆమని, అతివలు

ఎవరికో విసిరేది అ మంచుపోగుల వలలు,
ఆకాశ రాజు ఆకతాయి పనులు?


మంచు కురిసినా,
మబ్బు కమ్మినా,
నడివేసవి వడగాలి విసిరినా...

ఒకరికొకరైన ఆ ఇరుహృదయాలు
ఆలాపించవా వలపు రాగాల నవ గీతాలుగాలుల సడి గాజుల గలగల,
వెన్నెల మాల జాజుల మధురిమ తెస్తుంటే,
మోజుల మురిపాలు తనువులు మోస్తుంటే,
ప్రకృతీకరమైన సమ్మోహనవేడుకల సందళ్ళతో...

62 comments:

 1. అసలు కన్నా కొసరు బావున్నట్టు,పరిగెట్టిస్తూ పరిగెత్తిన మూడవది బాగుంది.
  ఇక, " ఆమనిపైనా, అవనిపైనా ఆ ఇరువురినీ మించిన అతివలపైనా "
  -- ఈ రెంటిలో అవని ఎలాగూ స్త్రీమూర్తే.
  " ఆమనిపైనా " లో పైనా అన్నది ప్రాస కోసం వాడారా? ఆమనిలోన అంటే సరి ఏమో? ఆమని అంటే కాలం కదా !, ఇక మరలా పైన ఏమిటీ?

  ReplyDelete
 2. గాజుల గలగల గాలులు చేస్తుంటే,
  జాజుల మధురిమ వెన్నెల తెస్తుంటే,
  మోజుల మురిపాలు తనువులు మోస్తుంటే,
  ప్రకృతి, మనిషి కలిసి సాగించరా సమ్మోహనవేడుకలు?

  Sure. Sure. :-)

  ReplyDelete
 3. తప్పదు కదా.... ప్రకృతి వరం అదేననుకుంటా....

  ReplyDelete
 4. ప్రకృతీ, పురుషుడూ కలిసి.. అనొచ్చేమోనండీ..??

  ReplyDelete
 5. కవిత చాలా బాగా నచ్చిందండి. ఇంతబాగా నచ్చిన కవితకు వ్యాఖ్య వ్రాయాలంటే కొంచెం ఇబ్బందిగా వుంది. అయినా ఏంచేస్తాం. నచ్చింది కాబట్టి ఈ కవితను పోగులు పోగులు గా చీల్చి చండాడాలని ఈ ప్రయత్నం :)

  అయినా ఆకాశరాజు వల విసిరి తన వశము చేసుకోవాలనుకుంటాడు కానీ, ఇలా సుందరంగా వున్న అవనిపై మంచుపూల దుప్పటి కప్పి ఏంచూస్తాడండీ, మీరు మరీను? పోనివ్వండి ఇలా అర్థం చేసుకుంటాను, ఏదో అతివను వర్ణిస్తూ ఆమనికంటే, అవనికంటే అందమైన అతివపైన మనసుపడి వల విసిరాడే అనుకోమనా మీ అర్థం?

  ఇక రెండోది. మంచుపడితే లెదర్ జాకెట్ తొడుక్కుంటారు ఇద్దరూ, మబ్బు కమ్మితే వర్షం పడుతుందని బిర బిరా లోపలికి పరిగెత్తుత్తారు. నడివేసవి వడగాలి విసిరితే భాస్కరుని తిట్టుకుంటారు ( ఇప్పుడు మీరు పళ్ళునూరుతున్నట్టు :D ). ఇకా రాగాలాపన ఎక్కడ? ఒట్టి ఆలాపనే, ఆ కోటిమ్మనో, ఆ గొడుగిమ్మనో లేక ఎ.సి వేయమనో.

  ఇక మూడోది. చేతికున్న గాజులెప్పుడైనా గాలికి గలగలల చప్పుడు చేయడం మీరు విన్నారా? గలగలల చప్పుడు ప్రక్కన్న పెట్టండి. అసలు కదలడమెప్పుడైనా చూశారా? వెన్నల జాజుల మధురిమను తీసుకురావడమా? వెన్నెలకెక్కడైనా వాసన వుంటుందా? మోజులు, మురిపాలు ఇవి శరీర సంబంధమా లేక మనసుకు సంబంధమా? సమ్మోహనము అంటే మిక్కిలి ఆనందం అని కదా! ప్రకృతి, మనిషి కలిసి మిక్కిలి ఆనందమైన వేడుకలు సాగిస్తారని కదా? ఏ వేడుకలవి? పైన చెప్పినవా?

  ReplyDelete
 6. ప్రదీప్, నేను అనుకున్నది ఇది. ఆమనిని స్త్రీతో పోల్చాను. ఆమె అందాలు పూలవనాల్లో చూసి మనసు పారేసుకున్న పడుచువాడు ఆకాశరాజు. అవని కూడా స్త్రీతోనే పోల్చాను (అది మీరు అన్నదే). వీరిరువురి అందాలను మించిన అందాలు కలవారు మానవ స్త్ర్ర్రీలు/అతివలు. ఈ మువ్వురి అందాలు చూసి మనసు పడిన వాడు ఆకాశ రాజు. ఆ అందానికి అతను వేసిన వల - మంచుదారాలతో అల్లినది. చాలా వరకు నా కవితలు చివరి పాదం నుండి పైకి వ్రాస్తాను. ఇదీ అంతే. అందుకే ఆ మూడో పాదంలో అంత జీవం.

  ఈ వివరణ చాలకపోతే మళ్ళీ అడుగుతారని తెలుసు. ;)

  ReplyDelete
 7. @ సృజన, థాంక్స్.

  @ కుమార్ గారు, తప్పకపోయినా వరమంటి నడతలివి కదా?

  @ ప్రియ, మీరు అసంపూర్తి వ్యాఖ్య వదిలారా? మిమ్మల్ని మీరు "హేమిటో" అని ప్రశ్నించుకున్నారా? "హేమిటో" అని ఏదైనా నన్ను ప్రశ్నిస్తున్నారా? వీలైతే వివరణ ఇవ్వండి. లేదూ నేను ఆల్రెడీ ఇచ్చిన వాటితో సమాధానపడివుంటే, ఓసారి ఓ.కె. అనేయండి. థాంక్స్ ఫర్ ఈదర్.

  ReplyDelete
 8. నేనొప్పుకోను. అందరికీ సమాధానమిచ్చి మళ్ళీ నా వ్యాఖ్య సమాధానాన్ని మాత్రం తొక్కిపట్టారు.ఇది తప్పక కుట్రే.

  ReplyDelete
 9. మురళి గారు,

  ఇక్కడ "ప్రకృతి" స్త్రీగా ఉటంకించలేదండి. ఆరు ఋతువుల నడుమ సాగేటి కాలం/నేచర్.
  అలాగే "మనిషి" అన్నది పురుషుడు మాత్రమే కాదు. స్త్ర్రీ కూడా కావచ్చు. ప్రకృతిలో ఋతుపరంగా వచ్చే ప్రతి మార్పులోనూ ప్రేమైక జీవనం సాగించే స్త్రీ/పురుషుడు ఆలాపించే గీతమే జీవనం/ నా ఈ కవనం.

  క్రొత్త ప్రయోగాలని తెలుసు. కొన్ని ప్రశ్నలు ఇలాంటివి తప్పవని వూహించానందుకే. సాధారణంగా వివరణ ముందే ఇచ్చేసే నేను ఆగింది మీచేత మరువపు వనాన మీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పిద్దామనే. :) థాంక్స్.

  ReplyDelete
 10. భా.రా.రె. ఇదెక్కడి రుబాబండీ బాబు. ఏదో FIFO వ్యూహం ఫాలో అవుతున్నాను. ఆగరా ఏమి? మళ్ళీ మరో వ్యాఖ్యాబాణం వేస్తారని ఈ జవాబు. మీ అసలు వ్యాఖ్యకి సమాధానం ఇస్తున్నాను. కాస్త ఆగండి.

  ReplyDelete
 11. కవిత చాలా బాగుంది ఉషగారు.
  భారారె మీరు కవితని నాకు కొత్త కోణం లో చూపించారు :-)

  ReplyDelete
 12. @వేణూ శ్రీకాంత్-- అంతే నండీ, నేనంత కష్టపడి అన్ని లైన్లు వ్రాస్తే మరీ ఒక్కలైను సమాధానమా? బాబ్బాబూ మరో రెండు లైన్లు వ్రాయరా? కాపీ/పేష్ట్ లు లేవు. అలా అని ఒకటే కామెంటుని మాడులైన్లు వ్రాసినా వూరుకోము.

  ReplyDelete
 13. భా.రా.రె, ముందుగా కవిత అంతగా నచ్చి, దాన్ని పోగులు పోగులు గా చీల్చి చండాడినందుకు థాంక్స్. ;)

  నా చమత్కారం, విసురు అర్థం కాలేదు - అందమైన అతివల పట్ల మగవారు ఆకర్షణతో ప్రయత్నాలే ఆ మంచుపోగుల వంటి వలలు. ఇట్టే కరిగిపోయేవి. అవి ఆకతాయి పనులే కనుక ఇదీ అంతే. పైన ప్రదీప్ కి వ్రాసాను ఆ మొదటి పాదం లోని ప్రతీకల వివరణ.

  మీరు ఆ రెండో పాదంలో వ్రాసినవి జీవితాన్ని అనుభూతిగా కొలవలేని వారు చేసే పని. ;) క్షణానికొక జీవితం గా గడిపే నా వంటివారూ వుంటారు. మాతో పాటు జీవించాల్సివచ్చినవారూ వున్నారు. కోపమొస్తే నా ముక్కు ఎర్రబడి, మూతి ముడుచుకుంటుంది కానీ పళ్ళు నూరబడవు. అసలు కోపానికి ఒక యూనివర్సల్ కోడ్ లేదు కనుక అవీ పలు రకరకాలు. ఇప్పుడు నా మొహంలో ఏ మార్పూ లేదు [కనుక కోపం లేదు], మీ వ్యాఖ్య చదివినపుడు మాత్రం పెదాలు చెవుల వరకు సాగాయి. దాన్ని "ఫక్కున నవ్వటం" అంటారని మా నానమ్మ చెప్పారు. :D

  చిరు గాలుల్లో, ఆ గలగలల్లో మీరెపుడూ క్రొత్త శబ్దాలు వెదకలేదా? ఈ సారి డిశంబర్ మాసం లో అలా సన్న గాలి పిలిచినపుడు వెళ్ళి వినిరండి. అప్పుడు మీరే అంటారు, మట్టి గాజుల సవ్వడి వినిపించిందని.

  వెన్నెల రాత్రి, మంచు కురుస్తుంటే, అవి జాజిపూల మాదిరి జాలువారుతుంటే (ఉదయాన్నే కాస్త నలిగి తీగె నుండి రాలి పడే సన్నజాజి పూలు మాదిరి వుంటాయి) మీకు తెలిసిన అన్ని పూల మధురిమ ఆ క్షణం మీకు ఆస్వాదనలోకి వస్తాయి.

  ఇక మోజులు, మురిపాలు - ముందుది శరీరానికి సంబంధించినది, రెండోది మానసికమైనది. ఇవి సగపాళ్ళలో కలవని వలపు లో నిండుదనం వుండదు. మిగిలిన వివరణ మురళి గారికి ఇచ్చాను. అంతటి మిక్కిలి ఆనందం మనసున్న మనిషి సొంతం. ఇక ప్రకృతి మాట అంటారా - ఋతువుకొక పోకడగా సాగేటి తన గమనం మిదు మిక్కిలి ఆనందకరం కాదా?

  ఇక్కడితో మీరు సంతృప్తి పడకపోతే మళ్ళీ చెండాడండి.

  ReplyDelete
 14. వేణు గారు, కాస్త వెనుదిరిగి నేను వ్రాసిన వ్యాఖ్య చూస్తారు కనుక ఈ కవితకి స్ఫూర్తి మీ వ్యాఖ్యకి ధన్యవాదాలతో పాటుగా అందిస్తూ..

  ఊహుహూ అని అంతా వణుకుతూ గడిపే శీతాకాలంతో ఓ రోజు, దాదాపు -10F వుండి వూరిని వణికించేస్తున్న ఓ మునిమాపున, నేల నింగికి చాపినట్లున్న మోడుల చేతులకి చుట్టుకుని గాజుల మాదిరి గలగలలు వినిపిస్తున్న గాలుల్లో, వెన్నెలే కురుస్తున్నట్లున్న మంచులో, ప్రేమైక జీవనం గడిపే ఓ జంట ప్రక్కప్రక్కన ఒకరికొకరు ఆనుకుని నడుస్తూ "జగతిన వున్నది మనమిద్దరమే.." అని భావిస్తూ, ఇంకాసిని అటువంటి అనుభూతులని (అవేమో మీ వూహకే వదిలేస్తూ) కలబోసుకుంటే వచ్చేది ఇటువంటి కవిత కాదా అవునా?

  ReplyDelete
 15. నిస్సందేహంగా అవును ఉషగారు. కవిత చదవుతుండగానే నా వ్యాఖ్యను గుర్తు తెచ్చుకున్నాను, గాలులలో గలగలలూ వినగలిగాను వెన్నెలలో మధురిమలూ ఆఘ్రాణించగలిగాను. అందుకే భారారె గారు తన వ్యాఖ్య ద్వారా నాకు కవితను కొత్తగా అర్ధం చేసుకునేలా పరిచయం చేశారు అని చెప్పాను :-)

  భారారె మీకు పదిలైన్ల వివరణ ఉషగారు ఇస్తేనే బాగుంటుందని ఒకలైన్ తో సరిపెట్టానండీ. విషయం మీకు చేరింది కదా పదైనా ఒకటైనా :-)

  ReplyDelete
 16. హ్మ్మ్.. మొదలు పెట్టేవా తెలి మంచు ల సొగసు తెరలు తేట తెల్లమయ్యే కవితలు... :-)
  నాకైతే హేమంత హేమంత మంటారు కాని చేమంతి నవ్వు ను హరించె ఆ మాయదారి మంచు తెర
  భూదేవి కి మేలి ముసుగు వేసి ఆమె చంద్రకాంతల సయ్యటలలో నవ్వుతుంటే వోర్చుకోలేకనో ఏమో... ఇంతలోనే కాంతలను చంద్రయ్యను వెక్కిరించి మూసేసే మంచు జడి..
  కురిసే మల్లెల వానా అని విభ్రమ గా చుస్తుంటే వితరణే లేకుండా కుప్పలు పోసి కలవరం పుట్టించే మంచు గాలుల రాసులు..
  వా.. నాకొద్దు నాకొద్దు ఈ హేమంత శిశిరాలు.. ఎంతో ముద్దు వసంత సమీరాలు..

  ReplyDelete
 17. ఉష గారు మంచు మాసం లో అక్కడ వేసుకునే డ్రెస్ ని కూడా ద్రుష్టి లో పెట్టుకుంటే గాజులు గలగలలు గాలులు చెయ్యలేవేమో ? ఎందుకంటె అతివలు కూడా ఫుల్ స్లివ్స్ వేసేసుకోవడం వాళ్ళ గాజులు కదలకుండా టైటు గా చేతులకి అతుక్కుని గాలులు వీచినా గమ్మున వుంటాయి గాని గల గలలు చెయ్యలేవేమో?

  ReplyDelete
 18. అయ్యో ఉష గారు నాకు మీ పోస్ట్ చూడగానే నాకు అనిపించిన భావాన్ని వెంటనే కామెంట్ గా పోస్ట్ చేసేయ్యడమే అలవాటు , వేరే వాళ్ళవి చదివితే నా భావం చెదిరి పోవచ్చని . నా కామెంట్ పోస్ట్ చేసాక భ ర రే గారి ధీ చూసాక నా లాంటి భావాన్నే వ్యక్త పరిచారు .

  ReplyDelete
 19. భావన, ఋతురాగాలు ఎన్నో విధాలుగా వర్ణిస్తూనేవుంటాము కదా? వసంతాన్ని వదిలానా చెప్పు. ఒకప్పుడు, అన్నీ కలిపి కవితగా ఇలా అనుకున్నాను...

  "సంతసం వసంతంలా ఇట్టేవచ్చి అట్టే జారుకుంటది.
  మనస్తాపం గ్రీష్మంలా కాల్చేస్తది.
  దుఃఖం వర్ష ఋతువులా గుండె లోగిల్ని వరద పాల్చేస్తది
  శరత్, హేమంత శిశిరాలు మిగిలన్నిటా తామున్నాయంటవి"

  అవికాక, కవితలో పెట్తని భావాలు

  "ఆ మిగిలిన మూడు ఋతువుల్లో ఆత్మవిమర్శ, ఆత్మనింద, ఆకు రాలినట్లు గోచరించే ఆరంభశూరత్వం, అవి రాలినట్లే సర్వం ధారబోయగల దాత్రృత్వం, మోడువోలె నిలచి తిరిగి ఆశటూపిరుల చివురువేసే శిశిరలోని వృక్షాలు, స్నేహితం, లక్ష్యం, గమ్యం.. ఇలా ఎన్నో వేల భావనలు ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిబిక్కిరిచేస్తే ఆ క్షణం అనిపించింది" [పూర్తిగా: http://maruvam.blogspot.com/2009/02/blog-post.html ]

  ఏదేమైనా కానీ నాకు శీతాకాలమే ఎక్కువ ఇష్టం! కారణాలు వెయ్యున్నాయి. ;) తన వూపిరిలో చలికాచుకునే ఆ మునిమాపులు, నా లోగిల్లో నవ్వే కనకాంబరాలు, కిటికీ నుండి కవ్వించే శీతల సూరీడు .. ఇలా...

  ReplyDelete
 20. రవిగారు, మీకిప్పుడో హోమ్ వర్క్ ;) పైన భా.రా.రె. వ్యాఖ్యకి దిగువన వున్న నా వ్యాఖ్యలన్నీ చదివి రండి. గాజుల గలగల వినిపిస్తుంది. మంచు తెరల్లో బరువుగా వీచే గాలికి ఉపమానమది. జీవించండి బాబోయ్, మీరంతా కలిసి జీవితంలో జీవం వెదకండి నేస్తం. ;) ఈకలు పీకినందుకు, భా.రా.రె. జట్టు పట్టినందుకు థాంక్స్. అదిగో మీకు తోడు ఈ సారి మా వసంత కోకిల, భావనమ్మా చేరిందీసారి.

  ReplyDelete
 21. నాకు ఇష్టమే ఉషా మంచంటే.. toes నుంచి nose వరకు చలి ముంచేసే వరకు మంచు కుప్పలలో ఆడుకుని snow man కు కేరట్ ముక్కు పెట్టీ పూల వానలలో మునిగి పోవటం బాగుంటుంది.. వూరికే నిన్ను వుడికించటానికి.. అంతే.....;-)
  నాకు సెప్టెంబర్ నుంచి సంక్రాంతి టైం వరకు సవత్సరం మొత్తం లో ఇష్టమైన కాలం... ఇప్పుడే స్నేహితునికి రాసిన వుత్తరం లో ఎంత పొగిడేనో చూడు మంచు జడులను.. "నాకు చలి అంటే అస్సలు ఇష్టం వుండదు.. ఆ బాధ ఒక్కటి తప్ప నేను వుండే ప్లేస్ అంటే చాలా ఇష్టం.. ప్రతి రోజొక అధ్బుతమై, జీవితమే ఒక అనుభవమై... రోజు రోజొక వినూత్న జీవన గీతాన్ని కొత్త రాగాలతో ప్రకృతి... గాలి వేణువు లతోనో,, మేలి రంగుల వర్ణాలతోనో, శ్వేతాంబర కొండలతో నో.. ఆ కొండల మధ్య వీచే ఒక వెర్రి వూళ మోసుకొచ్చే మంచు రజనులతోనో బలే బలే బహుమతులిస్తుంది మనకు వినే మనసుండాలే కాని. నిజం ఇవి అన్ని మీకు వుంటాయి కాని ఆ గాలి ఆపాదించే స్వచ్చత, ఆ రంగుల లలోని మిశ్రమాల మేళవింపు, స్వేతాంబరాన్ని మేలి ముసుగు గా చేసి కొంచం గా పైన్ అంచులను నేసుకుని గిరులు తల వంచి గాలితో కలిసి మెరిసే వెండి ఎండతో ఇంద్ర ధనుస్సు ను రప్పించే చిత్రం మాకు మాత్రమే ప్రత్యేకం, ఈ చలికి వణికే మనసుకు ఒక బహుమానం తెలుసా.." నీ విశ్వా 'మిత్ర '' కు నా షాయరి ని ఇచ్చేసేను చూడు..

  ReplyDelete
 22. చర్చ చిలవల పలవలతో భలే రంజుగా ఉంది. కవితలా

  బొల్లోజు బాబా

  ReplyDelete
 23. మీ మంచు గాలుల వర్ణనలు నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. నేను కూడా నా ఊహల్లో మీ అనుభవాలనే అనుభవిస్తున్నాను. ఉషా గారు కొన్ని ఫొటో లను కూడా పెట్టొచ్చుగా...

  ReplyDelete
 24. baagundandi...
  గాజుల గలగల గాలులు చేస్తుంటే,
  జాజుల మధురిమ వెన్నెల తెస్తుంటే,
  మోజుల మురిపాలు తనువులు మోస్తుంటే,
  usha garila kavitalu raastunte baagundi

  ReplyDelete
 25. భావన, మా మిడ్ వెస్ట్ చలికాలం ముచ్చట నేను వ్రాస్తే, చక్కటి ఈస్ట్ చలి పోకడలు నీవు తెలిపావు. బాగుంది. అనుకోనిది ఈ కవిత భలే బాగా కబుర్లు చెప్పించింది. థాంక్స్ వోయ్! ;)

  ReplyDelete
 26. కవిత ఐతే సూపరు,కాని ఏడున్నాయి ఈ గాజుల గలగలలు జాజి పూల సువాసనలు :( మా బెంగలూరులో మాత్రం లేవు

  ReplyDelete
 27. బాబా గారు, నాకు "రంజు" అన్నమాటకి పూర్తి అర్థం తెలియదు. హుషారా/ఆసక్తా/మరేమిటీ? ఎప్పుడొ విన్న పాట "రంజు భలే రాం చిలకా రంగేళీ రవ్వల మొలకా.."

  నిజమేనండి ఇక్కడ కవిత కన్నా కబుర్ల మోత ఎక్కువైంది.

  ఏదైతేనేమి నా పోయినేడు మంచు మీద కవితకి "హృద్యంగా వుంది" అని మీరిచ్చిన హుషారే ఈ "రంజైన.." కవితకు దారి తీసింది. :)

  ReplyDelete
 28. జయ, నా ఫొటోస్ అన్నీ ఒకటే ఆల్బమ్. మీరు సినిమాలలో చూసేవి కాక మా ఇంటి చుట్టూ నేను తీసినవి మొదటి "పదకుండు" ఈ "పదకుండో" నెలలో :) ఇక్కడ చూడండి. నా కవితకి స్ఫూర్తి ఈ పిక్స్ తీసిననాటిదే.. ఈ యేడాది వి త్వరలో కలుపుతాను - http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#

  నిజమేనండి ఈ గాలులదే మహిమంతా... నేనూ ఓ పాట పాడేసుకుంటున్నాను.

  "స్వాతి చినుకు సందె వేళలో,... భలేగుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట. ఇదే కదా పడుచు ముచ్చట, ... ఇదే కదా చిలిపి ఆపద" ;)

  @వంశీ, హాయ్, హెల్లో, వ్యాఖ్యకి ధన్యవాదాలు. క్రొత్తవారిని పలుకరించేలా చేసిందన్న మాట నా కవిత.

  ReplyDelete
 29. హాయ్ రాఘవ్, భలే గాలిలా వచ్చేసి చేరిందే మీ వ్యాఖ్య. నిజానికి ఈ మంచు గాలులు ఒక్కోసారి "అబ్బా" ఇక చాలు అని కూడా అనిపిస్తాయి. టోర్నడోలు ఇక్కడే చూసాను. మంచు తూఫాన్ లోనూ మునిగి తేలాను. జీరో విజిబిలిటీ లోనూ డ్రైవ్ చేసాను. అంతా మా వూరి మహిమ. ;)

  మీ బెంగళూరు నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు అక్కడే స్థిరపడాలి అనుకునేదాన్ని బృందావన్ గార్డెన్స్ కోసమని...

  వ్యాఖ్యకి థాంక్స్.

  ReplyDelete
 30. రాకుండా ఎలా ఉంటామండి,మీ విశ్వామిత్ర నన్ను కట్టి పడేసింది మరి :)

  ReplyDelete
 31. మీ కవితోత్సవాలకి.....మనసిజుడే ముఖ్య అతిధి అన్నమాట !
  మీ అక్షర సుమమాలతో అతన్ని ఆహ్వానిస్తుంటే మీ బ్లాగ్ లోనే తిష్ట వేసుక్కూర్చుంటే మరి పాపం మిగతా ప్రేమికులు ?

  ReplyDelete
 32. ఈమధ్య బ్లాగుల్లో భావుకత్వం పొంగి ప్రవహిస్తోంది. మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువయ్యారల్లే ఉంది. ;-)

  కవిత బాగుంది కానీ, నా "హేమిటో" మురళి గారికండీ. కిన్దే రాస్తున్నాను కదా అని పేరు మెన్షన్ చెయ్యలేదు. మీరు అపార్ధం చేసుకున్నారు.

  ReplyDelete
 33. చాలా బావుందండి.
  అటు కవితలో,ఇటు వ్యాఖ్యలలో మీరేసిన మంచు పోగుల(కు) వలలు.

  ReplyDelete
 34. నూతక్కి వారి తరఫున [సాంకేతిక లోపం కావచ్చేమో! ]
  *-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
  వుషా నీ విరచిత "మంచుపూల మోహనం" మరియు "మంచుపూల పేరంటం" కవితలకు వ్యాఖ్య పంపాలంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా, వ్యాఖ్యను అనుమతించడం లేదు అందుకే యిలా నా అభినందనలు...."

  మహాద్భుత దృశ్య కావ్యం
  నేత్ర పర్వ సుధా గానం
  గాత్రోద్భవ వర్ణ శోభితం
  వర్ననాతీత మనోజ్ఞ చిత్ర రాజం......Nutakki

  ReplyDelete
 35. కవిత నచ్చింది కాబట్టి అంత సులభంగా వదిలేయ బుద్ధి అవటం లెదు. అందుకని సరదాకి మరో రెండుమాటలు.
  >> నా చమత్కారం, విసురు అర్థం కాలేదు.

  అబ్బా మీరింత చమత్కారులనుకోలేదు సుమా ;)

  >>చిరు గాలుల్లో, ఆ గలగలల్లో మీరెపుడూ క్రొత్త శబ్దాలు వెదకలేదా? ఈ సారి డిశంబర్ మాసం లో అలా సన్న గాలి పిలిచినపుడు వెళ్ళి వినిరండి. అప్పుడు మీరే అంటారు, మట్టి గాజుల సవ్వడి వినిపించిందని.

  మావూర్లో చిరుగాలులు ఉయ్య్య్య్య్య్య్య్య్య్య్య్య్ ఊయ్య్య్య్య్య్య్య్ గుయ్య్య్య్య్య్ గూవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అనే అనడం విన్నా కానీ గల గలా గలా అని వినడం ఎప్పుడూ వినలేదండీ. మీరు చెప్పారు కదా డిశంబర్ లో బయటకి వెళ్ళి వినమని. ఆ గాలుల గాజులమ్మి బంగారు గాజులు వేసుకోకుండా మట్టి గాజులు వేసుకొని చలికి వుహుహు వుహుహు అనకపోతే విని చెప్తాను :-)

  ReplyDelete
 36. రాఘవ్, అమ్మో నాకు కొమ్ములొచ్చేస్తున్నాయి. అసలు ఆ విశ్వామిత్ర వచ్చి నా కవితల్ని దెబ్బతీసింది. :) త్వరలో ముగిసిపోతుంది. ఈ సం. ఆఖరుకి మీరూ విడుదల అయిపోవచ్చు. కవితలు వ్రాసుకుంటుంటే యేదో హాయి. కథ వ్రాయబోతే ఇంకా కాస్త బెరుకు. అదీ అసలు కథ.

  ReplyDelete
 37. పరిమళం, మీరొచ్చాక ఇక నా జోరు సాగుతుందా? :) అయినా మనసిజులు ఓ చోట ఆగరుగా, స్పందన వెదుక్కునిపోతూనే వుంటారు. అటువంటి వాటికి లోటు లేనిదీ వనం. టోకుల్లెక్కన వున్నాయి.

  ప్రియ, వివరణకి థాంక్స్. అపార్థం లేదు. అర్థం కాలేదంతే. ఇక నాకూ ముందూ ఎందరో భావుకులు తచ్చాడిన ఈ బ్లాగ్లోకంలో నా వెనకా మరెందరో వస్తారు. :) నేను నిమిత్త మాత్రురాలిని.

  ReplyDelete
 38. ఫణి, చూడబోతే, నా ఈ కవితా వల చదువరుల మీద బాగా పనిచేసినట్లుంది నిజానికి. :) మీరు క్రొత్తవారనుకుంటా ఈ వన విహారుల్లో? స్వాగతం. వ్యాఖ్యకి థాంక్స్.

  ReplyDelete
 39. @ నూతక్కి వారికి, పెద్దలు మెచ్చితే అదో ఆనందం.

  @ భా.రా.రె, అంతేనండి, అదే ఏ "సి.నా.రె./సిరివెన్నెల/వేటూరి/భువనచంద్ర వ్రాస్తే కిమ్మనరు. దాన్ని ఎన్ని పదులో దాటిన వారు అభినయించినా ఇంకా ఆనందిస్తారు. వ్రాసింది ముగ్ధ మరువం కనుక ఈ సాగదీసుడు..

  ReplyDelete
 40. భావన, నీ సుమధుర వర్ణనలతో కూడిన ఆ శిశిరపు పోకడలు [లేఖ] చదివినవారు భాగ్యవంతులు. ఆశ్చర్యంగా వుంది. దాదాపు సం. నాటి అనుభవం. విశ్వామిత్ర లో శీతాకాలం ప్రస్తావనలతో, వేణు గారి వ్యాఖ్యతో వెలికి వచ్చింది ఓ చిరు కవితగా. దానికి అంతా ముఖ్యంగా నువ్వు కలిపిన ఈ వ్యాఖ్యానం ఎంత చలువునిచ్చిందో. చెలిమి చేయరమ్మంటే కలిమి నీవై వచ్చావా? మరువపు వనమిక నీకు రాసిచ్చేయొచ్చు.

  ReplyDelete
 41. వేణు గారు, ఆ మాట మీదే వుండండి, బలాబలాలు తేల్చుకునే పరిస్థితి వస్తే నాకే ఎక్కువ వోట్లు వుండాలని స్వార్థం కన్నా భా.రా.రె. ని ఓడించాలన్న పంతం గా వుంది. :) [అన్నీ ఉత్తుత్తికే సుమా!] థాంక్స్. నిజానికి విశ్వామిత్ర-9 కి మీ వ్యాఖ్య ద్వారా వచ్చిన స్ఫూర్తి ఇది. ఏ ఋతువు మార్పైనా ఇలా కవితగా వెలికివస్తుంది, ఈసారి మీరొక కాటలిస్ట్ పాత్ర వహించారు.

  ReplyDelete
 42. Question marks అవసరం లేదనిపిస్తుంది. ఇంకొవిషయమేమంటే title ఇంకోమాదిరి పెడితే బాగుంటుందేమో ఎందుకంటే కవితలో overall విషయం ఎంతో బావుంది. పైన కామెంట్స్ చదవకున్నా విషయం నాకైతే చక్కగా అర్థమైంది, చాలా బావుంది కూడాను, ఉష గారు మీకు congrats.

  ఏమైనా, ప్రకృతి ప్రేమికుల హృదయాన్ని దోచే మీ కవితోత్సహానికి హ్యట్సాఫ్...

  ReplyDelete
 43. పృథ్వి, పృథ్వి, మీరే కదా? ముందు నన్ను నేను గిల్లుకుని, ప్రక్కనున్న మరువపు కొమ్మనీ గిల్లి చూసాను. ఇద్దరం బ్రతికేవున్నాము. చాలా సంతోషం. ఏప్రిల్ నుండీ మీ కోసం ఎదురుచూపు. ఎన్నాళ్ళకెన్నాళకు ఇలా తొంగిచూసారు? కానీ ఇంకా ఏమీ చిత్రం గీయనందుకే కాస్త విచారంగా వుంది. ఆ పనీ కానిచ్చేయండిక.

  ఏమని టైటిల్ మారిస్తే బాగుండేది? ముందు "ప్రేమ కురిసిన శిశిరం" అనుకున్నాను. కానీ ఇలా పెట్టాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

  నాకు "ప్రేమానురాగాలు" "అనుభూతి సాగరాలు" ఈ రెండు అంశాలు ఇస్తే అలా అలా ఓ ప్రబంధం వ్రాసేస్తాను. జగమంతా ప్రేమమయంగా తోచే దివ్య భావనలు నా మనసుని పవిత్ర గంగాజలాల మాదిరి ఎప్పుడూ పునీతం చేస్తూనేవుంటాయి.

  ఇకపై తప్పక రావాలి మీరు. మరువపు తొలినాళ్ళలో మీరిచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరవను. ఈ రోజు చాలా హాయిగా పడుకుంటాను, నేస్తం తిరిగి కలిసిన రోజని పాడుకుంటూ...

  ReplyDelete
 44. నడివేసవి వడగాలి విసిరినా
  ఒకరికొకరైన ఆ ఇరుహృదయాలు
  ఆలాపించవా వలపు రాగాల నవ గీతాలు

  That is what is called love ani evaro ante vinnaanu.

  kannadaithe ledinthavaraku i blogs lo thappa. ekkado sidhilamaina manavanubhuthulani thatti leputhunnaru. So, meevi chadivaaka nenu nala undalante malla a gnapakalani samadhi cheyyalannamata. :-D

  kavitha bagundi. inthaki "usha?" pakam survey emanna pette alochana undaa?

  ReplyDelete
 45. "ఆమని పైనా, అవని పైనా
  ఆ ఇరువురినీ మించిన అతివలపైనా?
  ఎవరికో విసిరేది అ మంచుపోగుల వలలు,
  ఆకాశ రాజు మొదలిడిన ఆకతాయి పనులు? "

  ఆకాశ రాజు ఎలాగు అవనిని చుట్టుకొనే ఉన్నాడు అతని దృష్టి అంతా అత్మాభిమానం(మించిన అన్న పదానికి అర్థం)ఉన్న అతివల పైన.వారు మామూలు బంధనాలకు అందరు,మరి మంచుపోగుల వలలు వేయాల్సిందే.అవనిని మించిన అతివలను ఆశ్చర్యంతో అవలోకించాల్సిందే అనుకుంటున్నాడు ఆకాశ రాజు.
  "మంచు కురిసినా, మబ్బు కమ్మినా,
  నడివేసవి వడగాలి విసిరినా
  ఒకరికొకరైన ఆ ఇరుహృదయాలు
  ఆలాపించవా వలపు రాగాల నవ గీతాలు"

  గాలికి కూడా కందిపోయే హృదయాలు ఉన్నప్పుడు మంచైనా,మబ్బు అయినా నడివేసవి అయినా ఆ హృదయాలను రాగాలు ఆలపించేలా ఉన్మత్తతకు గురిచేస్తాయి.

  "గాజుల గలగల గాలులు చేస్తుంటే,
  జాజుల మధురిమ వెన్నెల తెస్తుంటే,
  మోజుల మురిపాలు తనువులు మోస్తుంటే,
  ప్రకృతి, మనిషి కలిసి సాగించరా సమ్మోహనవేడుకలు"
  ఆ వలపుకు గాలి శబ్ధం గాజుల గలగల లా ఉంది
  జాజులు మాధుర్యం రూపంలో వెన్నెల్లా శొభిస్తుంటే
  ఒక్కో సారి మురిపాలను కూడ మోయలేము అది సున్నితత్వానికి తార్కాణం
  ప్రకృతే తానై సాగించే మనిషి శృంగార కావ్యాన్ని ఇక్కడ కవయిత్రి అద్భుతంగా వర్ణించారు .. నాకు అద్భుతంగా అనిపించింది ... హృదయం కవితలో పుష్కలంగా ఉంది... మనకే పొందే అర్హత లేదేమో
  ఉష గారు మీ హృదయ సౌందర్యానికి హృదయ పూర్వక నమస్కారాలు

  ఇట్లు
  నరసింహ మూర్తి

  ReplyDelete
 46. నరసింహ మూర్తి గారు, నా కవితలోని ఆత్మని చూసినందుకు, నిజానికి పైన వ్యఖ్యానించిన అందరు దాన్ని పట్టారనే నా నమ్మకం. నాకు ప్రేమ మీద వున్న అపారమైన నమ్మకం, ఆ ప్రేమలో మునిగితేలే మనసిజుల వలపు పట్ల మక్కువ. ఒకటిలేని మరొకటి లౌకికపరంగా మనలేవు. ఒక ఆత్మీయమైన స్పర్శ ఇచ్చే సాంత్వన, మనకోసం జారే ఒక కన్నీటి బొట్టు పంచే సముదాయింపు ఇవి చాలవా ప్రకృతిగా మనగలిగే మనిషి జాడ తెలుపను.

  ఇది బాబా గారి బ్లాగులో మీ వ్యాఖ్యకి జవాబు, అక్కడ వ్రాసి ఆ టపా దారి మార్చటం ఎందుకని...

  వయసు పరంగా మీకన్నా మరీ పెద్దదాన్ని కాదు. అనుభవం కొలిచినా అందులోని పరిణితి దృష్ట్యా మీరూ చిన్నవారు కాదు. నాలో నేస్తాన్ని వెదుక్కోండి. సమస్య పట్ల అవగాహన కలిగాక, ఆచరణగా మార్చుకోవటం నాకు అలవాటు. అందుకే మీకు ఆ సమాధానం ఇచ్చాను అక్కడ. అన్వేషుకులకు మార్గం అదే సుగమం అవుతుంది. జీవితానికి అర్థం అలాగే చేకూరుతుంది. మీ మాటల వలన మిమ్మల్ని అంచనా వేసినంతలో వెలికి వచ్చిన అభిప్రాయమిది. ఇదే భావనలో మీకు చేరాలని..

  అడ్డగాడిద గారు, మీ స్పందనకీ ధన్యవాదాలు. ఒక జ్ఞాపకం గాఢతని బట్టే కదా, మరేదైన కదిపితే ఇదీ వెలికి వస్తుంది. కనుక ఇక్కడ కవితకన్నా మీ అనుభూతిదే పాత్ర.

  ReplyDelete
 47. The spring in your steps
  And the spring in nature
  Playing a match
  That let me have a catch
  Of a bit of happiness
  In all my loneliness

  In all my loneliness
  This weather makes me
  Light as a feather
  Dreaming us together

  (Going into warm and bright spring from cool and grey winter)

  ReplyDelete
 48. ఎలా మిస్ అయ్యానబ్బా ఈ కవితని? బాగా రాశారండీ. మీ కవితకి spontaneous గా నేను స్పందించటం ఇది నాలుగోసారి.

  తేనెలొలుకు తెలుగు మాతృ భాషైనా నాకెందుకో ఆంగ్లంలో కాస్త స్పాంటేనిటీ ఎక్కువ. ధారా పాతంలా వస్తుంది. చిన్న చిన్న తప్పులుండొచ్చు, but it's natural, and most of the times effective. ఇక్కడెలా ఉందో మీరే చెప్పాలి.

  తెలుగైనా అంతే ఎఫెక్టివ్ గా వ్రాయగలననుకోండీ... అంతా కృష్ణ మాయ! ;-)

  ReplyDelete
 49. :-) This is another half century for me here

  ReplyDelete
 50. ఉష గారికి నమస్కారం,
  ధన్యవాదాలు

  ReplyDelete
 51. ఉషగారు, మీ స్నేహసౌందర్యానికి ప్రశంసనీయుడను. బ్లాగు queries చూసాను, but i unable to inform personally. రుపారుపుడి అనుగ్రహం లేక life frustrations లో continuation చేయలేక పోతున్నాను.
  ధన్యవాదాలు

  ReplyDelete
 52. మీలో లేనిదేమిటి ? బహుషా భగవంతుడు మిమ్మలిని మంచి మూడ్ లో వున్నప్పుడు తన ప్రతినిధిగా పంపాడేమో ! , మీ తోట , మీ నర్తనశాల , మీ బ్లాగ్ , మార్థాన్ ఇంకా ఏమేమికళలున్నాయి ఉషా మీలో ? మీలాంటివారిని మా మిత్రులని చెప్పుకోవటం నా అదృష్టం .

  ReplyDelete
 53. చాలా బావుంది
  మరో అర్ధ సెంచరీ :)

  ReplyDelete
 54. మనవి: ఈ కవిత తరువాతి కవితని నేనే తొలగించాను. కానీ ఈసరికి వతనుగా వచ్చేవారు చదివేవుంటారు అన్న భావన + ఎందుకో విషాదాన్ని పంచానే అన్న అయిష్టత వలన ఆ నిర్ణయం తీసుకున్నాను.

  ReplyDelete
 55. ఈ కవితకి చక్కని స్పందనతోను, ప్రతి-కవితలతోను అందరినీ అలరించి, తరువాతి నా విలాపంలోనూ పాలు పంచుకున్న..

  గౌరవనీయులైన పెద్దలు కొందరు, ప్రియ నేస్తాలు మరి కొందరు, అంతా నాకు ఆత్మ బంధువులే, అభిమానంగా నను పలుకరించిన వారే. మీ సందేశాలకి, సముదాయింపులకి, సాంత్వన వచనాలకి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  మసక వెలుతురు, పొగమంచు, ధూళితెర, నివురు విడివిడిగానే చిత్రాన్ని కలగాపులగం చేస్తాయి; దృష్టిని ఏమారుస్తాయి. ఇదీ అంతే! నిజానికి అన్నీ కలిసికట్టుగా కమ్మేసినట్లుగా అనిపించింది. ఉద్వేగం ఊపిరాడనంతగా నన్ను వణికించేసిన విచిలితమైన ఆ స్థితి మరెన్నడూ రాకూడదనే ప్రార్దిస్థున్నాను. బహుశా నాపై అపైవాడు రువ్విన పరీక్షాపత్రం కావచ్చిది, జీవితం ఇక నాది కాదా అన్నంత వెరపు పుట్టించిన ఆ స్థితి నుండి బయటపడ్డాను కానీ మానసికంగా అలసటగా వుంది. ఈ వారం నుండీ నాకు చేతనైనంత వ్రాయటానికి ప్రయత్నిస్తాను. అందరికీ మరోసారి వందనాలు.

  భవదీయురాలు,
  మీ,
  మరువం ఉష.

  ReplyDelete
 56. "మనవి: ఈ కవిత తరువాతి కవితని నేనే తొలగించాను. కానీ ఈసరికి వతనుగా వచ్చేవారు చదివేవుంటారు అన్న భావన ....."
  మరి చదవని నాలాంటివాళ్ళకి? :((

  అప్పుడప్పుడూ ఇలాంటి పరీక్షాపత్రాలు మన జీవితానికి గల అర్హతని ప్రశ్నిస్తుంటాయి. శక్తి అంతా పోగుచేసుకుని సమాధానం చెప్పడమే మనం చేయాల్సినపని. మీ పరీక్షలో మీరు విజయం సాధించే ఉంటారని నమ్మకం.. జడివాన నించి బయటపడ్డ మరువపు సువాసనలు ఎంతో పరిమళభరితమని విన్నాను.. మరి ఎదురుచూస్తుంటాను :-)

  ReplyDelete
 57. నిషిగంధ, ఈ కవిత భాగ్యమేమో కానీ ఎంతమంది పాతమిత్రుల్ని దరికి చేర్చిందో... ;) మీరు రావటం అరుదు వ్యాఖ్యారూపంగా కనుక మీ ముచ్చట ఆపటమెందుకు...

  అవును, ఆయన పిచ్చి కానీ నన్ను పరిక్షలతో ఆపగలడా...

  అయినా నీకు మనస్తాపం కలగకుండా ఆ విలాపం [ప్చ్.. ఇది నన్ను వదలదు ఇక] ఇదిగో
  ********************************

  రాలు పూలలో రాలిన ఆశలు
  వాలు కనులలో రంగుల కలలు
  చూడని కన్ను ఏది?

  కదలని కాలంలో రేయి నిట్టూర్పులు,
  వదలని మోహంలో వేయి వేడుకలు
  కాంచని హృది ఏది?

  నివురుకమ్మిన వేకువపొద్దులో దోగాడు నిరాశలు
  తారలుపొదిగిన నీలాకాశంలో తొంగిచూసే సంబరాలు
  దర్శించని మనసు ఏది?

  కంటికి అందనిది హృదయానికి దొరుకునేమో,
  హృదయం లేని మనిషికి మరొక తోడు అవసరమా,
  తోడువీడిన మనిషికి మనసు మాత్రం ఎందుకు?

  అసలీ తెలుపు నలుపులు ఎందుకు, బంధనాలు ఎందుకన్న ఈ ప్రశ్న ఎందుకు?
  వేదన మరిచి, శోధన విడిచి, మనలేను ఎందుకు?
  రాయిని రప్పనీ చూసినేర్వని పాఠం మిగిలున్నందుకా?
  **************************************
  బ్రతుకే ప్రశ్నార్థకం అనునిత్యం, ప్చ్ ఎందుకు?

  ReplyDelete
 58. "అవును, ఆయన పిచ్చి కానీ నన్ను పరిక్షలతో ఆపగలడా.."
  ఇలా అన్నారు బావుంది :-)

  కవిత మరల పోస్ట్ చేసినందుకు బోల్డన్ని కృతజ్ఞతలు..
  చదవగానే కాస్త బరువెక్కింది మనసు..

  "కంటికి అందనిది హృదయానికి దొరుకునేమో,
  హృదయం లేని మనిషికి మరొక తోడు అవసరమా,
  తోడువీడిన మనిషికి మనసు మాత్రం ఎందుకు?"

  ఈ వాక్యాలలో ఇంకాసేపు తిరిగొస్తాను! ఇప్పుడిప్పుడే వదిలేలా లేవు!

  ReplyDelete
 59. నిషిగంధ, అక్కడే ఎక్కువ తిరగకండి, ఆ బాధలోని లోతు నేను చూసినంతగా మరొకరు చూసివుండరు. ;) "ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు" అని పాడుకుని బయట పడుతుంటాను.

  మీరడిగిన పరిమళాలు వెదజల్లను కాస్త వూపిరి పీల్చుకోవాలని ముందుగా వీర గంధం దిద్దుకున్నాను. వీలైతే మొట్టికాయలు వేయండి. అక్కడ అంత సరుకుంది మరి... ;)

  ReplyDelete
 60. గీతాచార్య, నా హేమంత శిశిర సమ్మోహనానికి మీ వసంత సమీరం జత చేయటం బాగుంది. మీమీద మీకున్న నమ్మకం ఇంకా బాగుంది. :)

  హరేకృష్ణ, మీరు అర్థ సెంచరీ కోసమే ఆగి ఇలా ఆలస్యంగా తొంగిచూస్తున్నారా? ;)

  ReplyDelete
 61. పృథ్వీ, మీతో ఒకమాటన్నా చెప్పాలనిపించి, హృదయాన దైవాన్ని కొలువుంచుకున్నవారికి ఆయనెపుడూ చేరువగా వుంటాడు. కరుణ కురిపించి ప్రశాంతతని ఇస్తూనేవుంటాడు. పరీక్ష పెట్టినా అంతిమ విజయాన్ని ఆయనే చేకూరుస్తాడు. ఆ నిరాకారమూర్తిని మీ చెంతనే అనుక్షణం నిలుపుకోండి, నమ్మకాన్ని విడనాడకండి. మీ చిత్రాలు మాతో కవితలు వ్రాయించాయి, మరువకండది. తప్పక త్వరలోనే చిత్రలేఖనం పునరుజ్జీవనం కావాలి మీ కుంచెలో.

  ReplyDelete