నేను సైతం - ఓ 'చంపక మాల' పద్యం వ్రాసేసా[గా]!

నా మొదటి పద్య ప్రయత్నమిది. డా. ఆచార్యఫణీంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

తప్పులతడక: ప్రాస నియమాన్ని మరిచాను కాని మొదటి పద్యమయినా ఇతర ఛందో దోషాలు లేకుండా వ్రాసానోచ్ :)

చదువరి తాననే కనుల చాటున కైతలు నేను రాయగా,

గడుసరి తానుగా చిలిపి గానము చేసిన రీతి వేడుకే!
తనసరి లేరనే ఆతని తామస చేతలు నాకు కానుకే,
మదనుని భారి నే పడిన మానస వేదన మీకు వాడుకే!

ఆచార్యల వారి చేత మార్చబడగా ఈ వర్షన్:

చదువరి తానటంచు, కను చాటున కైతలు వ్రాసి చూపగా,
చదువుచు పాడె వానిని విశారదు డాతడు - నాకు వేడుకే !
ఇదె సరసంపు కాన్కలని, ఎవ్వరు నా సరియంచు నీయగా -
మదనుని బారి నే పడిన మానస వేదన మీరెరుంగరే !


ఆచార్య ఫణీంద్ర గారికి సరిదిద్దటానికి ఇచ్చిన వివరాలు.

ఆచార్యా! నాదీ మొదటి పద్యమే. నాకు చంధస్సు తెలిసిందీ తక్కువే. అందులోనూ గుర్తున్నదీ శూన్యమే. మీ పైన పాఠం చదివి అలవోకగా వ్రాసినదిది. నాకు నా వాడే నాయకుడు. ఇందులో అన్నీ తప్పులేమోనని నా ఊహ. ఎందరికి నవ్వు తెప్పింస్తుందో కానీ. సంవత్సరాంతానికి ఒక పద్యం వ్రాయాలన్న తపన ఇలా తీరింది. కాసిని మొట్టికాయలేసి దిద్దిపెట్టరూ?

మరికొన్ని వివరాలు, బహుశా మీకు ఈ తప్పుల తడకని సరిదిద్దటానికి ఉపయోగపడతాయని. ముందు నాకు తెలిసిన భాష ఇంగ్లీష్ లో అసలు ఫీల్ వ్రాస్తున్నాను.
********************
it is just a feel. may be not suitable for a poem as such.

చదువరి తాననే కనుల చాటున కైతలు నేను రాయగా,
i know he could read the language/poetry my eyes express/write
గడుసరి తానుగా చిలిపి గానము చేసిన రీతి వేడుకే!
he reads and sings them too as he is wise and it is my pleasure
తనసరి లేరనే ఆతని తామస చేతలు నాకు కానుకే,
he says none can be comparable to him in 'sarasam', hence that 'taamasa' deeds are like gifts to me [no other woman gets it from her lover]
మదనుని భారి నే పడిన మానస వేదన మీకు వాడుకే!
only when one is lost to thoughts of her lover could see the pain that 'madanuDu' causes like me. And me expressing such is known to all.

**********************************

అసలు సంగతి ఇక్కడ:
సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )

28 comments:

  1. బాగున్నాయి రెండూ.. ఇంక అంత కంటే నాకేమి తెలియదు కదా, అందుకే ఆపేస్తున్నా.... భావమొక్కటే ఈ భావన కు తెలిసింది...... పూల మాలలో, చరణములదరగ నాట్యం చేసే చంపక మాలలో.... వూరించే వుత్పల మాలలో.. విహరించే విరించి పలుకులో...
    ఏమో బాబు ఆచర్యులకే ఎరుకైతది, ఉషమ్మ కలానే కలకండల పలుకవుతది.. ఏమంటారు మిత్రులంతా..

    ReplyDelete
  2. భా.రా.రె. ధన్యవాదాలు. ప్రోత్సాహానికి, ఉత్సాహానికి వున్న లంకెకి ఋజువు ఈ పద్యం. :)

    భావన, మరీ ఈ గూటిపలుకు అంతగా పలికేస్తే ఎలానే నా పంచవన్నెల పంచదార చిలుకా? ;) నాకు నిజంగా అంత భాషాప్రావీణ్యం లేదు. మొదట్లో ఒక కవితకి నరసింహ(వేదుల కృష్ణమూర్తి] గారు "మీ ఆలోచనలు బాగున్నాయి. పద్యకవితగా రూపంలోకి మలచగలిగితే శాశ్వతత్వం సంతరించుకుంటాయి." అని సూచన ఇచ్చారు. అయినా భయపడ్డాను. తర్వాత ఈ ఆలోచన వచ్చింది. వివరాలు పైన వ్రాసాను. ఇదేమి గొప్ప పద్యం కాదు. కానీ మొదటి పద్యమన్నది నా 'కన్న' మీదే వ్రాయాలని మొదటి రోజు కలిగిన ఆలోచన. దానికి మాత్రం కట్టుపడ్డాను. ;)

    అడ్డగాడిద, thanks for your LOL.

    ReplyDelete
  3. అభినందనలు ఉషాగారూ !

    ReplyDelete
  4. అభినందనలండీ. భారి ముద్రారాక్షసం మినహా మిగతా దోషాలు నాకు తెలియదు.

    ReplyDelete
  5. జాన్‌హైడ్ గారు, సునిత, పరిమళం, ధన్యవాదాలండి.

    వెంకటరమణ, మొత్తానికి నాకు మరో మాస్టారు [మీరే :) ] దొరికారు. థాంక్సండి.

    ఇంతకీ నవ్వివారంతెమంది భయటపడలేదో? ;)

    ReplyDelete
  6. Thanks for thanking my LOL. I expected a nice poem from you. But came a first padyam. appudu na moham lo bhavalu addam lo chusi anukunna LOL

    ReplyDelete
  7. >> I expected a nice poem from you. But came a first padyam.

    I perhaps am lost on what you're trying to convey to me. What was your expectation of me when you said "nice poem" :) and "But came... padyam" some things need wavelengths to match the catch the right expressions. may be we are not on those. anyways ...

    ReplyDelete
  8. manchi kavitha, ante me style lo top class ga unnadi. I expected a kavitha.

    meru padyam try chestharani anukoledu nenu. anduke oka expectation loss aindi. anthe. hatattuga padya rachana modaledatharani anukoledu.

    ReplyDelete
  9. ushagaaru,

    good attempt. and succeeded too.

    one observation.

    your english version is fantastic really VERY VERY FANTASTIC.

    but your telugu (not corrected one) is not so free and flowing. (i am not reffering to chandassu or yati something like that that hinder the flow)

    you will understand what i am saying when you read chalam's gitanjali translation and compare the english and telugu versions. you will find how an english thought is translated in best hands.

    if you donot have chalam version have a look at wiki for bellamkonda's gitanjali translation. it is also not bad.

    any how very very good work.
    i look forward to read more padyams in due course.

    good luck.

    bollojubaba

    ReplyDelete
  10. బాబాగారు, చాలా సంతోషం. మీరు చెప్పిన మాటల్లోకి వెళ్ళేలోగా ముందుగా ఒకమాట మీ మోమున నవ్వులు పూయించాలని.

    నాతో ఈ దేశంలో బయటవున్నపుడు నాకు కోపం తెప్పించకుండా మా ఇంటి మనిషి జాగ్రత్త పడతాడు - ఎందుకో చెప్పుకోండి చూద్దాం? ;)

    ఎందుకంటే నాకు ముక్కు మీద కోపం, అదీకాక కోపం వస్తే నాకు తెలుగులో మాట్లాడటం అసలు రాదు. "అంతా చూస్తున్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది, ప్లీజ్.." ఇవేమీ పనిచేయవు. అదో ప్రవాహం. ఆగదు.

    కవితావేశం అంతే. చకా చకా మనసు బయటకి తోసే భావాలని, అంతే వేగంగా తెలుగులోకి తర్జుమా చేస్తాను. నిజానికి మీకు కోపం వస్తుందేమో కానీ I get better wording in English. అలాగని అదీ రాదేమో సరీగ్గా.

    మీ అభిప్రాయానికి చాలా థాంక్స్. ఈ రోజే chalam's gitanjali translation సంపాదించాను. భావనకి కృతజ్ఞతలతో 13, 19, 28 చదివాను. ఇంకా చదువుతాను. తప్పక శ్రద్ద పెట్టి వ్యక్తీకరణలో మెరుగవటానికి ప్రయత్నిస్తాను. స్పష్టత, క్లుప్తత నడుమ నాకు వస్తున్న చిక్కేమో ఇది. మీకొక ప్రశ్న - but your telugu is not so free and flowing - అన్నది నా వచన కవితలకి కూడా వర్తిస్తుందా?

    మరోసారి మీరు అభిమానంగా ఇచ్చిన సూచనలకి ధన్యవాదాలు. మీరు మరోసారి ఈ వ్యాఖ్యకి సమాధానమిస్తారని ఆశిస్తూ..

    ReplyDelete
  11. thank God
    you took me in right spirit.

    మీకొక ప్రశ్న - but your telugu is not so free and flowing - అన్నది నా వచన కవితలకి కూడా వర్తిస్తుందా?

    the answer in NO.

    because your vachana kavithalu express deep meanings in a perfect style that is unique to your self. when i could understand and appreciate and enjoy, the meaning behind them what else a writer needs

    in this context what i observed, after reading the english version i could see something that stood in between your english thought and telugu version. the former is bright and later is paler.


    bollojubaba

    ReplyDelete
  12. హి హి హి హ హ హ ఉషా నీకు వుందా ఆ జబ్బు. కోపం వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడటం.. నాకు కూడా చాలా కోపం నిజం గానే వచ్చిందని (అంటే వూరికే కూడా వస్తుంటుంది కదా అప్పుడప్పుడు :-)) మా ఇంటి లో వాళ్ళకు కూడా అర్ధం అవుతుంది నేను నా ఆర్గ్యుమెంట్ లేదా క్లాస్ పీకటం ఇంగ్లీష్ లోకి మారగానే.... కళ్ళు చికిలించి సో అని ఒక పెద్ద ధీర్ఘం వచ్చిందంటే మొదలు... ;-)

    ReplyDelete
  13. ఈ కామెంట్స్ చదువుతుంటే...
    ఉషగారు తెలుగులో వ్రాసారు కాబట్టి కోపంరాలేదు
    ఉష అడిగిన ప్రశ్నకు బాబాగారికి కోపమొచ్చి ఇంగ్లీషులో కామెంటారు.
    ఉష,భావన ఇద్దరికీ మధ్యాహ్నం కోపంగా వున్నదేమో ఇంగ్లీష్ లో కామెంట్లు
    నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏమొచ్చినా తెలుగులోనే. :)

    ReplyDelete
  14. బాబా గారు, చాలా థాంక్స్. మళ్ళీ ఏడాదికి మీచేత శభాష్ అనిపించుకుంటాను. :)

    భావన, ఈ మధ్య స్పానిష్ కానీ జర్మన్ కానీ నేర్చుకుందామని కాస్త దిగాను. ఇంగ్లీష్ వాడి వాడి విసుగ్గావుంది. వాడటానికి వాడి వేడి మాటలు చాలటం లేదు. ;)

    భా.రా.రె. అదేంటో అంటారు ఆ.. ఆ .. గుర్తుకొచ్చింది, మీకు మౌనం కూడా వచ్చటగా? ;) అదీ తెలుగులోనేనా? ఎలాగబ్బా......

    ReplyDelete
  15. @ఉష, రేరాజ్ ని అడగండి. తెలుగులో ఎలా మౌనంగా వుండాలో నేర్పిస్తారు ;)

    ReplyDelete
  16. భా.రా.రె. ఏమిటండి మీ అందరికీ నేనెలా కనబడుతున్నాను? ;) ఇప్పుడు క్రొత్తగా ఆ మైత్రి/వైరి నాకు అవసరమాట? నన్నిలా వుండనీయండి. మౌనం నాకు పుట్టుకతో వచ్చిన భాషే.. ;)

    ReplyDelete
  17. భా.రా.రే: బాగా కనిపెట్టేసేవే డిడెక్టివ్ నారద... (టుయ్ టుయ్...మ్యూజిక్ వేసుకో)
    అవునా నీవు మౌనమనే భాషా ప్రవీణ వా???

    ఉషా: ఇదేదో ఐడియా బాగుందే స్పేనిష్ లేదా జర్మనీ లో తిట్ట్లు.... ;-)
    మౌనం పుట్టుక తో వచ్చిన భాష... బాగుంది..

    ReplyDelete
  18. భావన, ఏం చేయను చెప్పు. తెలుగు వచ్చేసాక పిల్లకాయలు "క" భాష ప్రవీణులైపోయారు. నాకు ఏదైనా క్రొత్త భాష మీద మోజు పుట్టింది. జర్మన్ మా హెల్ముట్ వలన సరదా, స్పేనిష్ టివీలో డోరా చూసి చూసి ఆసక్తి. అదీకాక ఈ రెండు భాషల్లో మా పిల్లకాయలకి మంచి ప్రవేశం వుంది. కనుక కానీ ఖర్చు [అసలే రిసెషన్ కదా? ;)] లేకుండా నేర్చుకోవచ్చునని... :)

    ఇక భా.రా.రె. కి "సకల కళావల్లభన్" సన్మానం చేసేయొచ్చు....;)

    ReplyDelete
  19. మనం ఈ డిపార్ట్మెంట్ లో పూర్తిగా వీక్ :-) వ్యాఖ్యల బట్టి చూస్తే మొదటి ప్రయత్నం విజయవంతమైందనే అనిపిస్తుంది. వరుసగా మొదలెట్టేయండి మరి.

    ReplyDelete
  20. ఉషా, ముందు మీకు అభినందనలు. ఎందుకంటే పద్యం వ్రాయడానికి ప్రయత్నించి, విజయం సాధించినందుకు. తరవాత కృతఙ్ఞతలు. ఇవి ఎందుకంటే ఇదివరకు ఒకసారి పద్యం వ్రాయడానికి ప్రయత్నించి, చేతకాక ఊరుకున్న నాకు, మీ పద్యం చూడగానే మళ్ళీ ఆవేశం లాంటిది వచ్చేసి, పద్యం రాసేసి, మీ అడుగుజాడల్లోనే ఆచార్య ఫణీంద్ర గారికి పంపించి దిద్దించుకున్నా..
    ఈ సమయం లోనే మరో అభ్యర్ధన..నేను చేసిన పని ఆరంభశూరత్వం కాకుండా ఉండాలంటే మీరిలా పద్యాలు వ్రాస్తూనే ఉండాలి... మిమ్మల్ని చూసి నేనూ అందుకోవడానికి పరుగెట్టాలి.. ఏమంటారు?...

    ReplyDelete
  21. వేణు, మీ వ్యాఖ్యల్లో ఎప్పుడూ ప్రోత్సాహం ద్వనిస్తుందండి. వరసగా కాదు కానీ అపుడపుడు మాత్రం వ్రాయటానికి ప్లాన్ చేయాలి. థాంక్స్.


    శ్రీలలిత గారు, చాలా సంతోషకరమైన వార్త పంచారు. మీకూ చాలా సంతృప్తిని ఇచ్చివుండవచ్చు. ఇక పోతే మీరడిగిన విషయం + "ఆరంభశూరత్వం" అన్న దానిపై - మీరలా నన్ను మైలురాయిగా పెట్టుకోవద్దండి. నేను పరిగెట్టల్సిన వ్యాపకాలు చాలా వున్నాయి. అందులో చేరిన మరొకటి ఇది. అయినా ఈ రోజుల్లో టైం మానేజ్మెంట్, ప్రైయారిటీస్ ప్రమాణకంగా సాగే జీవితాల్లో ఎన్నో వదిలేస్తాం, మరెన్నో చేస్తాం, కొన్ని సఫలం, కొన్ని విఫలం కనుక మీ సాధ్యమైన పరిమితుల్లో మీరు సాగండి. ఆచార్య ఫణీంద్ర గారి వంటి సహకారం అందించే ఆత్మీయులకి కొదవ లేదిక్కడ. తప్పక మీరు విజయవంతులౌతారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  22. బాగుంది ముఖ్యంగా మెరుగులు దిద్దబడ్డాక

    ReplyDelete
  23. ప్రదీప్, గురువులు/గురు సమానుల వద్ద అభ్యాసమన్న అంశం ఆవశ్యకత చూపిన ప్రయత్నమిది. నా పద్యానికి సొబగులద్దిన ఘనత ఆచార్య ఫణీంద్ర గారిదే. నెనర్లు.

    ReplyDelete
  24. swami sharanam!naa parichayam naa blog lo..kasto..koostoo..nenoo raastaanoo koostaanoo..
    anduke meeto chelimi chestaanu..jagati gelustaanu.. macchuki ..oka baasaramata geetam tho ..
    నాదానివై భాసిల్లు
    ఓంకార నాదానివై భాసిల్లు బాసరమాతా
    నా స్వరపేటి అనునాదానివై రాజిల్లు
    వేదానివై విలసిల్లు
    నామది చదివేదానివై విలసిల్లు విశ్వమాతా
    నా గళసీమ నిక్వాణివై విరాజిల్లు
    1. నా భాషణమున మకరందానివై
    నా జీవనమున సుమగంధానివై
    నాహృదయమున సదానందానివై
    పదపదమున ప్రభల ప్రబంధానివై
    ప్రభవించవే ప్రణవదేవీ
    ప్రణతులందవే వాగ్దేవీ
    2. సుతి తప్పనీయకు నా ఏ గీతి
    గతి వీడనీయకు నా అభినుతి
    మతి మరవనీయకు ఏ సంగతి
    సద్గతి సాగనీయవె జ్ఞానద్యుతి
    భారమికనీదే హే భారతీ
    ప్రగతి నాకీవె బ్రహ్మసతి


    pl.visit and comment www.raki9-4u.blogspot.com /www.rakigita9-4u.blogspot.com /raki9dash4u.wordpress.com

    sadaa mee snEhaabhilaashi
    raki

    ReplyDelete