మిత్ర అమెరికాకి తిరుగు ప్రయాణం నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. సర్దుకోవటం మొదలుపెట్టిందే కానీ మనసులో ఏదో దిగులు. సుబ్బాలు దగ్గరగా కూర్చుని అన్నీ అందిస్తుంది. అనంత మరో గంటలో వస్తున్నానని కబురు పంపింది. కాసేపు విశ్రాంతిగా కూర్చోవాలనిపించి చేతిలో పనాపి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళింది.
చదువుతున్న పుస్తకం ప్రక్కన పెట్టి, మిత్రని దగ్గరకి తీసుకుని "అమ్మలు! తాతగారు తెచ్చిన షాల్ పెట్టుకున్నావా?" అని అడిగారు.
"ఊ," అంటూ "నానమ్మా! వెళ్ళాలనిలేదు." గోముగా అంటూ ఆవిడ వొళ్ళో తల పెట్టుకుని చిన్న పిల్లలా ముడుచుకుని పడుకుంది.
కాసేపు తలనిమురుతూ వుండిపోయారు. చెప్పనవసరం లేకుండానే ఏవో మాటలు ఆ మనసునుండి ఈ మనసుకి చేరిపోతున్నాయి.
"అది నీవు ఎంచుకున్న జీవితం తల్లీ. దూరాభారాలు, రాకపోకలు ఎప్పుడూ వున్నవే. దిగులు పెట్టుకోకు మరి. నీవెక్కడ వున్నా రాణించేస్తావు, మా అమ్మలు వరాలమూట" బుగ్గలు పుణికిపుచ్చుకున్నారు.
"సుబ్బాలు, ఇలారా. రేగివడియాలు పెట్టావా?" అని కేకవేసి అడిగారు.
"ఆయ్, మర్చిపోతే మిత్రమ్మ వూరుకుంటుందా." అంటూ వచ్చింది.
ముగ్గురూ మాటల్లో పడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా కొన్ని కబుర్లు ఇంకా వినాలనేవుంటుందేమో, గది గుమ్మం దగ్గర కూర్చుని మిత్రని మళ్ళీ అడిగిన మాటలే అడుగుతున్న సుబ్బాలు ఏదో అలికిడికి వెనక్కి వంగి ప్రక్కగా చూసి "అనంతమ్మ వచ్చారు." అంటూ లేచింది.
"రామ్మా, దేవబాబు రాలేదా?" అని అడిగారు లక్ష్మీదేవమ్మ గారు.
"లేదమ్మమ్మా, పనుల రోజులు కదా, మీకు తెలియనిదేముంది." చిన్నగా నవ్వుతూ మిత్ర ప్రక్కన కూర్చుంది.
"పద వదినా నా గదిలోకి వెళ్దాము." మిత్ర లేచి అటుగా దారితీసింది.
ఇద్దరూ కూర్చున్నాక చేతిలో పాకెట్ విప్పి "మిత్ర, విశ్వకి ఇష్టమని కాస్త చికెన్, ప్రాన్స్ పచ్చళ్ళు తెచ్చాను. వీలవుతుందా?" అని అడిగింది.
"అ.." అనబోయిన సుబ్బాలుని కళ్లతోనే వారించి "అలాగే వదిన. దానికేముంది." అంది.
"వాడూ వస్తే బాగుండునని నాన్నగారు, నేను అనుకున్నాము. ఇన్ని నెలలు చూడకపోవటం మాకూ ఇదే మొదలు." అంది అనంత.
ఈసారి పాకెట్లోంచి చీర ఒకటి తీసింది. "నేనే వర్క్ చేసాను. నీకు ఈ రంగు బాగుంటుందని అమ్మమ్మ నేను ఇద్దరం వెళ్ళి కొన్నాము." అంది విప్పి చూపిస్తూ.
పట్టుకుంటే మృదువుగా వున్న పాలపిట్ట రంగు చీర మీద పెయింటింగ్. "చాలా బాగుందొదినా." అంటున్న మిత్రని తదేకంగా చూస్తున్న అనంత "మిత్ర ఒకమాట అడగనా?" అని అడిగింది.
ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ఏమడుగుతుందో అనుకుంది.
"విశ్వ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఈమధ్య రెండు, మూడు సార్లు తన మాటల్లో నీ గురించి ఏదో ఒకటి చెప్పాడు." పది సెకన్లాగి "మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా?" అంది.
ముందు చిరుకోపం. ఏమని చెప్పివుంటాడు. తనతో ఏమీ చెప్పలేదింకా అనుకుంది లోలోపల.
"అది వదిన మరి .." ఏదో బిడియం. "తర్వాత మాట్లాడదాం" మాట తప్పించేసింది.
"సరే నాకు తెలిసిపోయింది కథ. వాడేమీ చెప్పలేదు. నేనే వూహించాను. వాడు అంత త్వరగా బయటపడే రకం కాదు." నవ్వేస్తూ "మీరెప్పుడు సిద్దంగా వుంటే అప్పుడే చెప్పండి." అంది అనంత.
"వదినా నిజానికి నాకు మీ నాన్నగారి గురించి విశ్వ చెప్పినపుడు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. తన విషయం కూడా చెప్పాడు." నెమ్మదిగా అంది మిత్ర.
"అవును మిత్ర. నాకు నాన్నగారి జీవితాశయాలు, ఆయన వాటి పట్ల చూపిన నిబద్దత చాలా ఇష్టం," అంటూ "దశరథ్ గారి అమ్మాయి అన్న ఆ గౌరవం ఎంత ఆనందాన్ని ఇస్తుందో." అంది అనంత.
తిరిగి తనే పొడిగిస్తూ "చిన్నాడు రఘురామ్ కి కొంచం అటూఇటూ వచ్చినా, విశ్వ మీద మాత్రం అంతా ఆ నాన్న పెంపకం, ప్రభావం పూర్తిగా పడ్డాయి. ఒక్క మృదుస్వభావం తప్ప. అది మాత్రం వాడి సహజ తత్వం. అలాగే ఆ మితభాషణం కూడా." అంది.
అలా అలా వాళ్ళ వూరి కబుర్లు, చిన్నప్పటి సంగతులు చెప్తుండగానే సాయంత్రమైపోయింది. "జాగ్రత్తగా వెళ్ళిరా మిత్ర. మళ్ళీసారి నాకు శుభవార్త వినిపించాలి." అని మరి మరీ చెప్పి వెళ్ళింది.
*************************************************
అనంత అలా వెళ్ళిందో లేదో ఇలా నవీ రానే వచ్చింది. ఆ రాత్రికి నవీని తన దగ్గర వుండటానికి రమ్మంది. పిల్లలిద్దరినీ తల్లికి అప్పజెప్పి ఒక్కతే వచ్చింది.
మిత్ర స్నానం చేసి వస్తానని లేచివెళ్ళింది.
"నానమ్మా! ఏమి వండుతున్నారు మాకు." అంటూ చొరవగా వంటగదిలోకి వెళ్ళింది నవీ.
పావుగంటకి మిత్ర రాగానే, ఇద్దరూ డాబా మీదకి దారి తీసారు. అలా ఎన్ని రాత్రులు అక్కడే కొబ్బరాకు వీవెన్ల నడుమ బూరుగు పరుపుల మీద పడుకుని పైన ఎగిరే చిలక బాతుల సన్నని గజ్జెల మోతవంటి సవ్వళ్ళు వింటూ, మినుకు మినుకుమనే తారల్ని చూస్తూ, కబుర్లతో సగం రాత్రి గడిపేసేవారో.
సన్నజాజి మొగ్గల పళ్ళెం ముందేసుకుని సూదికి ఒక్కో మొగ్గ ఎక్కిస్తూ, నెమ్మదిగా దండలోకి సవరిస్తూ "ఊ ఇప్పుడు చెప్పు. ఏమిటో 'సంఘ' మిత్ర పనులు చేస్తున్నావట." అని ధీర్ఘం తీసింది నవీ.
చిన్నగా విచ్చుకున్న పెదాలతో నవ్వేస్తూ "సుబ్బాలు చెప్పేసిందా" అంది.
"మరి, నేను ఆమ్లెట్ తింటేనే మొహం అదోలా పెడ్తావు. ఇప్పుడేమో ఏకంగా పెట్టెలో సర్దుకున్నావట అనంతక్క ఇచ్చినవేవో.." ఇంకాస్త ఉడికిస్తూ అంది. "ఏమిటీ కథ. కాస్తేదో సుబ్బాలు మోసింది కానీ." అని మిత్ర మొహంలోకి పరీక్షగా చూసింది.
నవీ చెయ్యి తన చేతిలోకి తీసుకుని "నవీ నువ్వు కాస్త సీరియస్ గా వున్నావని ఆగిపోయానే. నాకే స్పష్టతలేక నీకు ఏమని చెప్పాలో తెలియక మరి కాస్త ఆగాను" అంది మిత్ర.
గుచ్చిన దండ మిత్ర తల్లో తురుముతూ "ఊ, అమ్మడి విషయం తెలిసిందే. ఇప్పుడా విషయమై ఎన్ని నెలల నించి చించుతున్నావు?" అంది నవీ.
మిత్రాకి ఆలోచనలు ఎక్కువని, ప్రతి విషయాన్నీ తరిచి తరిచి శోధిస్తుందని ఆలోచించటాన్ని అలా "చించుతున్నావు" అని ఆటలు పట్టించటం అలవాటు నవీకి.
"పోవే, చెప్పటానికేమీ లేదు." అంది మిత్ర. ఆ ఇద్దరి నడుమ స్నేహానికి అంతకన్నా వివరాలు అక్కరలేదు.
"అసలు మునుపు కదిపాక వద్దనుకున్నది కదా. మరి ఇదెలా సంభవం?" కాస్త ఆశ్చర్యం కలిపిన కుతూహలం ద్వనించే గొంతుతో అడిగింది నవీ.
నిదానంగా అన్నీ చెప్పుకొచ్చింది. మధ్యలో సుబ్బాలు తీసుకొచ్చిన పుణుకులు అల్లం పచ్చడి లో అద్దుకుని మిత్రకి కూరుతూ తనూ తింటూ వింటూవుంది నవీ.
"బాగుంది. విశ్వామిత్రం - అపురూపం, అమోఘం.." అంటూ గలా గలా కొబ్బరాకులా నవ్వుతున్న నవీ ని చూస్తుంటే ఏదో ఆనందం. తను వచ్చినప్పటికి, ఇప్పటికి ఎంత మార్పు. తిరిగి మామూలు మనిషైంది అనుకుంది.
"మరి మా మిత్ర మనసు దోచినవాడు మాటకారేనా?" అన్న నవీ మాటలతో విశ్వ మౌనం ఆ మౌనం తనలోపలికించే గానం గుర్తుకొచ్చాయి.
"ఊహు, మరీ మొహమాటస్తుడు. మాటలు కొలిచి ఆచి తూచి వాడతాడు." అని నవ్వేసింది.
దాదాపు తెల్లావారిపోయే వరకు ఇద్దరూ పాత, క్రొత్త వూసుల్లో మునిగిపోయారు. మధ్యలో భోజనానికి ఓ అరగంట మాత్రం క్రిందకి వెళ్ళివచ్చారు.
తెల్లవారి వెళ్ళే రైలు శబ్దానికి, ఆకాశం లో వెలుగుతున్న వేగుచుక్కని చూస్తూ "వేగు చుక్క పొడిచింది. వేకువ కాబోతుంది. గాలిలోన తేలేనాదం మేలుకొలుపు పాడింది." అప్రయత్నంగా ఇద్దరూ ఒకేసారి పాడుతూ నవ్వేసారు.
నవీ నిద్రలోకి జారుకుంది. మిత్రకి మనసు నిండా విశ్వ నిండిపోయాడు.
'నీ జ్యేష్ఠకుమారున్నాకు ఇమ్ము దశరథా' అని అడిగేస్తే ఎప్పుడో విన్న భక్తిగీతం పెదాల మీద పలికింది. ఆ వెనుకే ఓ మొలక నవ్వూ విచ్చింది.
తన చుట్టూ వున్న నవీ చెయ్యి నెమ్మదిగా జరిపి, లేచి గోడ దగ్గరగా నిలబడి, క్రింద నుండి పాకించిన విరజాజి తీగె మీద చెయి వేసి సవరిస్తూ, ఆ సువాసనలు అఘ్రాణిస్తూ వుండిపోయింది. వీళ్ళందర్నీ వదిలి వెళ్ళాలన్న దిగులు వున్నా, అతని దగ్గరకి తిరిగి వెళ్తున్న ఆనందం మనసుని తేలికపరుస్తుంది. అతని తాలూకు వూహలు విరజాజులకి మల్లేనే ఆమె మదిలో మధురిమలు వొలికిస్తున్నాయి.
**************************************************
మర్నాటికి సురేంద్ర, కస్తూరి వచ్చారు. వచ్చిన వారానికి తల్లీ, తండ్రుల దగ్గరకి వెళ్ళి పదిరోజులు గడిపివచ్చింది. ట్రాన్స్ఫర్స్ మీద తిరగటం వలన అదీ క్రొత్త వూరు కావటంతో ఓ వారం గడవగానే మళ్ళీ నానమ్మ వూరు మీద ధ్యాస మళ్ళిపోయి తిరిగి వచ్చేసింది.
మళ్ళీ హడావుడి. అందరిలో తెలియని దిగులు. పైకి చూపితే ఎదుటివారు బాధ పడతారని ఎవరికి వారే గుంభనగా వున్నారు.
సుబ్బాలు మాత్రం అప్పుడప్పుడు కొంగుతో కళ్ళు అద్దుకుంటూ బయటపడిపోతుంది. అజ్జి తాత లేవటం లేదని తెలిసి ఓ సారి వెళ్ళిచూసివచ్చింది. మద్యపానం వలన దెబ్బ తిన్న ఆరోగ్యం ఇక కోలుకోలేడేమోననిపించింది. జాగ్రత్తలు చెప్పి వద్దన్నా మందులకి డబ్బు చేతిలో పెట్టి, భాసికి కూడా ఓ మాట చెప్పి వచ్చింది ప్రయాణం ముందు రోజు.
తర్వాత అంతా వేగంగా సుడిగాలి మాదిరి గడిచిపోయింది.
**************************************************
ఒంటరి ప్రయాణం విసుగ్గానే వుంది. విశ్వ కి బయల్దేరేముందు ఫోన్ చేసింది. మిత్ర ఆఫీస్ లోనే వుండటం వలన తను రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు. అదీకాక తన ఇంటి తాళాలు అతనికే ఇచ్చివచ్చింది. లాండింగ్ ఆనౌన్స్మెంట్ వినగానే కాస్త రిలీఫ్. మరో గంటకి లోపల ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి బయటకి చేరే సరికి, విశ్వ ఎదురు చూస్తూ వున్నాడు.
చిరునవ్వే అతని పలకరింపు. ఆ నవ్వులోనే ఎన్నో కుశలప్రశ్నలు.
సామాను బూట్ లో పెట్టాక, మిత్ర కూర్చున్నాక, తను కూడా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక కుడిచెయ్యి చాపి, మిత్ర ఎడమ చేతిని తన చేత్తో బందిస్తూ "మిత్ర, ఐయామ్ సో హాప్పీ. మిమ్మల్ని బాగా మిస్సయాను." అన్నాడు.
ఆ స్పర్శలోని ఆత్మీయతని అలా అస్వాదిస్తూ వుండిపోయింది. మునుపటి జంకు అతనిలో లేదు. మిత్రలోనూ అదేదో చాలా సహజంగా జరిగిపోయిన చర్య మాదిరి ఫీలింగ్. వెచ్చని వెడల్పాటి అతని చేతిలో అరిటాకు సుతిమెత్తని ఆమె చెయ్యి పూర్తిగా ఇమిడిపోయింది. ఏదో అనుభూతి తాలూకు శక్తి ఇద్దరిలోనూ ఒకే విధంగా నిండిపోయింది.
"విశ్వ, నాకిలా మిమ్మల్ని తిరిగి కలవగానే చెప్పలేని ఆనందం." మిత్రకి అప్పుడు స్ఫురించింది విశ్వ నే ముందు మనసు విప్పాడు. ఆ భావన తాలూకు ఉత్తేజం మరింత నింపింది.
అలా సాఫీగా సాగిపోతున్న ఆ కార్ లో అతని ప్రక్కన కూర్చుంటే జీవితం ఇలాగే నడిచిపోతే ఎంత హాయిగావుంటుంది కదా అనిపించింది.
ఇండియా కబుర్లు చెప్పుకుంటూ మూడు గంటలు ప్రయాణం ముగించి మిత్ర ఇంటికి చేరారు. మధ్యలో ఆపుతానన్నా వద్దని వారించింది. గాస్ స్టేషన్ లో పాలు మాత్రం కొన్నారు.
ప్రయాణపు బడలికని అతని సమక్షం మరిపిచేస్తుంది. విరహం, తిరిగికలవటం అప్పుడే తనకి అనుభవంలోకి వచ్చేసాయి.
"మరిక నేను వెళ్ళనా?" అతని ప్రశ్నకి తల అడ్డంగా వూపుతూ "ఊహూ, ఈ రాత్రికి వుండిపోండి. ఇప్పుడేగా వచ్చాను." మారాంగా అడిగింది.
తమ మధ్య ఇలా సంభాషణకి మిత్రకీ లోలోపల ఆశ్చర్యం, ఎందుకు తనిలా తపించిపోతుంది. అతన్ని వెళ్ళనీయాలని ఎందుకు లేదు. ఇంకేదో అడగాలని, చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది?
"సరే అలాగే కానీ మీకు విశ్రాంతి కావాలి. నేను ఉదయాన్నే వస్తాను." అని "వెళ్ళేదా?" అని అడిగాడు.
"మరదే నాకు కోపం తెప్పిస్తున్నారు." మిత్ర గొంతులో అలక. విశ్వ దృష్టి దాటిపోని మరో విషయం మిత్ర కోపంలో చూపు కాస్త క్రిందగా నిలిపి, కుడిపాదం బొటనవ్రేలు నేలకి నొక్కి పట్టి చక్రాలు చుడుతుంది.
'ఎంత ముద్దుగా వుందో ఆ భంగిమ. సత్యభామ ని తలపుకి తెస్తూ' అని ఒకడుగు మిత్ర వైపు వేసాడు.
అదే సమయానికి ముందుకు కదిలిన మిత్ర దాదాపుగా అతన్ని హత్తుకున్నంత చేరువకి వచ్చింది.
అప్పుడు జరిగిందది. యుగాల తరబడి స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పునాదిగా జనించే ఆకర్షణ. అది శారీరక వాంఛ కాదు. కానీ ఒకరిలో ఒకరుగా వొదగాలన్న భావన. మిత్ర అతని చుట్టూ చేతులు వేస్తూ దగ్గరగా జరిగింది. అతని ఛాతి మీద తలపెట్టి అలా పట్టుకుని వుండిపోయింది. విశ్వ లో ఏదో తెలియని ఉద్వేగం, అనుభూతి, ఆనందం, అన్నిటి కలపోత. ఇంకా కమ్ముకుపోవాలన్న తపన.
మనసావాచా కలవనున్న ఆ ప్రేమికుల ఏకీభావ గానమిది.
మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.
as usual వెన్నెల్లో చల్ల గాలి అలా వచ్చి వెళ్ళినట్టు బాగుంది :)
ReplyDeleteNice narration. You are growing from strength to strength. Am getting sort of addicted
ReplyDeleteరాఘవ్, మొత్తానికి మీకూ భావుకత అంటేసింది. మీ వ్యాఖ్య లో తొణికిసలాడిపోతుండది. థాంక్స్.
ReplyDeleteఅడ్డగాడిద, thanks for the compliment. yeah, I could see what you meant by addiction. Anyways I am not an exception. So as with any other writers more readers and more feedback is always fun and most valuable.
ఉష గారూ.. ఇంత పెద్ద టపా ఎక్కడ చదవాలబ్బా అని మొదలెట్టి చివరికి ఎప్పుడు చేరానో తెలియలేదు. కొన్ని వాక్యాలదగ్గర కాసేపు ఆగిపోయాను కూడా!
ReplyDeleteచెప్పనవసరం లేకుండానే ఏవో మాటలు ఆ మనసునుండి ఈ మనసుకి చేరిపోతున్నాయి!.
ఇలాగే "పైకి చూపితే ఎదుటివారు బాధ పడతారని ఎవరికి వారే గుంభనగా వున్నారు. సుబ్బాలు మాత్రం అప్పుడప్పుడు కొంగుతో కళ్ళు అద్దుకుంటూ బయటపడిపోతుంది".
అవునుకదా మనసులోని బాధనైనా ఆనందాన్నైనా అందరి ముందు పంచుకోవటం సుబ్బాలు లాంటి వారికే సాధ్యం.
మధ్యలో స్నేహితురాళ్ళ చతుర్లూ బాగున్నాయి.
great work
ReplyDeletenice
ఉష గారు ఎన్నో చెప్పాలని ఉంది కానీ ’బాగుంది’ అనే చిన్న పదం తప్ప ఏమీ చెప్పలేని అశక్తత నాది.
ReplyDelete"చెప్పనవసరం లేకుండానే ఏవో మాటలు ఆ మనసునుండి ఈ మనసుకి చేరిపోతున్నాయి!." ఈ వాక్యం దగ్గర అలా నిలిచి పోయాను. ఓ చిరు స్పర్శతో మనతో మాట్లాడగలిగే వ్యక్తులు జీవితంలో కొందరే ఉంటారు. ఆ అనుభూతిని ఆస్వాదించగలిగితే అంతకన్నా ఆనందంలేదు.
"యుగాల తరబడి స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పునాదిగా జనించే ఆకర్షణ. అది శారీరక వాంఛ కాదు. కానీ ఒకరిలో ఒకరుగా వొదగాలన్న భావన." చాలా బాగా చెప్పారు. మనసావాచా కలవనున్న ఆ ప్రేమికుల ఏకీభావగానం చాలా చాలా చాలా నచ్చేసింది.
మరే.. ఆరు వారాలు బ్లాగు చదివితే వాళ్ళు వీళ్ళయ్యారని :)
ReplyDeleteభా.రా.రె. మళ్ళీ ఈ "గారు" "గీరు" "పాకం గారెలు" గోల ఏమిటి drop that tail off.
ReplyDeleteవేణు, మీరు కూడా చక్కగా ఉష అనండి చాలు.
నిజానికి అంతా అదే దారిన రండి. ;)
నేను మా నానమ్మ దగ్గర ఆ ఆత్మీయ స్పర్శ ఇచ్చే భాష్యాలు చాలాసార్లు చవిచూసాను.
భా.రా.రె. మరొక నిజ జీవిత పాత్ర అయిన మా సుబ్బ ని చూస్తే నాకు ఒక్కోసారి చాలా అసూయగా కూడ వుంటుంది. మనసు ఏ బరువు మోయనవసరం లేదు. వచ్చిన తలపు అదే దారిన వెలికిపోతుంది.
వేణు, ఎంత సున్నితంగా అచ్చుతప్పుని సరిదిద్దారు? ;) "మనసావాచా" అన్నది ఇప్పుడు మార్చాను. మీ ఈ వ్యాఖ్యలోని అభిమానం మరువలేనిది.
నిజానికి ఆ చివరి అంశం పై నాకు ఒక స్నేహితురాలికి చాలానే చర్చ జరిగింది. ప్రేమ, ఆకర్షణ విడతీయగలమా? అది స్త్రీ, పురుష స్వతః సిద్ద స్వభావాల్లో పొదగబడిన శక్తి అది. స్నేహం అన్న బంధం అనురాగం గా మారటానికి ఇరు హృదయాలు ఒక లయలోకి రావాలి. ఆ స్థాయికి చేరిన రెండు వేర్వేరు శరీరాలు ఒకే మానసిక స్థితిలో వుంటాయి. విడదీయబడలేవు. ఏమో ఇది అందరికీ ఆమోదం కాదేమో. శారీరక సంబంధానికి కాదు ఇక్కడ స్థానం, తద్వారా కలిగే మనసుల అనుసంధానిది అసలు బలం. నా దగ్గర తగినన్ని మాటలు లేవు ఇంకాస్త బాగా చెప్పటానికి. పవిత్రత మనసుకి చెందినది. మీరు నా భావన గ్రహించగలరనే నమ్మకం. నెనర్లు.
హరేకృష్ణ, నెనర్లు.
ReplyDeleteరాఘవ, భావుకతే కాదు. మాండలీకం కూడ మారినట్లుంది సుమా! ;) ఆరు వారాల బ్లాగే మీ భాష మార్చిందంటే, ఈ పాటికి "కన్నడ కంఠీరవ" అయిపోయారా మీ బంగళూరు వాసంతో? నేనన్నది నిజమేనండి. నేను "వెన్నెల్లో చల్ల గాలి అలా వచ్చి వెళ్ళినట్టు" అన్న మీ వ్యాఖ్యని పొడిగిస్తూ ఒక కవిత త్వరలో వ్రాస్తాను. థాంక్స్.
నిజం చెప్పాలంటే ఆ మనసుల అనుసంధానాన్ని అనుభూతించిన వారికే అర్ధంచేసుకోవడం కష్టం ఉషగారు ఇక మాటలతో వివరించి ఎదుటి వారికి అర్ధమయ్యేలా చెప్పడమంటే అసాధ్యమే.
ReplyDeleteఅన్నట్లు నాకు కొన్ని సావాసాల వల్ల కాస్త గోదావరి వాసనలు అంటాయి లెండి :-) ’గారు’ మెల్లగా అదే పోతుంది.
మ్రోగించరే దేవ దుందుభులు
ReplyDeleteఅల్లరే మరి సువాసనలు గుప్పించు విరులు
వడ్డించరే వేడుకైన వివాహ విందులు
అయినప్పుడు మిత్రా విశ్వలు ఆలుమగలు
చాల బాగా రాసారండి ,బాగుంది .హమ్మ రేగుపళ్ళ వడియాలు గుర్తు చేసారు అవంటే ప్రాణం .
ReplyDeleteపరస్పరానురాగ బద్ధులైన వారిద్దరిని బైట పడేలా చేసింది విరహమన్న మాట !
ReplyDeleteవేణు, భలే, మా జిల్లాల పద్దతి నాకే ఎత్తిచూపారుగా? :) మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. కొన్ని వివరణకి, వ్యక్తీకరణకి అందని అనుభూతులు. అవి అనుభవంలోకి వచ్చినా అనిర్వచనీయాలే.
ReplyDeleteశ్రీలలిత గారు, ఎప్పటిమాదిరే చిక్కటి కవితా చిరు జల్లులు. ఈ సుగంధపు పూతలతో నా రచనకి నిండుదనం తెస్తున్నారు. చాలా సంతోషం.
చిన్ని, నిజానికి ఈ రచన నాకు అలాంటి చక్కటి గతస్మృతులని నెమరేసుకునే అవకాశం ఇస్తుంది. ఒక నిజ జీవిత అనుభవాన్ని తీసుకుని దాని చుట్టూ కల్పన అల్లి వ్రాయటం అన్నది ప్రతివారం చేస్తున్నాను కనుక అది సాధ్యం అయింది. రేగివడియాలు, పాకం గారెలు/పుణుకులు, పులుసు కూరలు, వెన్న, క్రొత్త కారం కలిపిన నూకలన్నం, జీడావకాయ, కాజాలు, పూతరేకులు, గోరుమిటీలు, వెన్నుండలు, మామిడి బద్దల పప్పు, ఇలా తరగదు కానీ - నచ్చని గోదావరి జిల్లాలవారు వుండారేమో. ఇప్పటికీ నా ఇష్టాల్లో మార్పు లేదు ఇన్నేళ్ళు ఇక్కడ గడిపినా. అలాగే నా ఇష్టాలు ఏమిటో మా వూర్లలోని ఆత్మీయులు, బంధువులు మరిచిందీ లేదు. :) పెద్ద కథ చెప్పేసానా మళ్ళీ ఎప్పటి మాదిరే?
ReplyDeleteపరిమళం, అచ్చంగా అదే అక్కడ జరిగింది. ఒకరికొకరు చేరువగా వున్నంత కాలం ఆపిన కారణాలన్నీ ఆ కాస్త ఎడబాటు విరహపు వరదలో ముంచి, ఆలింగనంలో తేల్చిందన్నమాట. ఒక్కరైనా ఈ మూవ్ ని గమనించినందుకు థాంక్స్. విశ్వకి మొదటిచూపులోనే అభిమానం/ఆరాధన కలిగినా, మిత్ర పరంగా ఇలా క్రమేణా బలపడిన బంధం అది అని చెప్పాలన్నదే నా అభిమతం. అందువలనే ఆ గాఢత ఇరువురి వైవిధ్యాల నడుమ సాధ్యపడింది. ఈ రెండు రకాల అనురాగావిష్కరణ లోను బలముంది. ఈ ప్రేమ కథలో కావాలనుకున్న వ్యక్తికి చేరువయ్యే పయనం అతనిది, కలిసిన వ్యక్తిలో తలవకనే తన ప్రేమకి మూలాలు చూసిన జీవనం ఆమెది. చాలా థాంక్స్.
ReplyDeleteఉష (గారు తీసివేయ బడింది) బ్లాగర్స్ లోనే గారు తీసివేయ మన్న మీరు ,ఆత్మ సంయోగం చెందడానికి ముందు కుడా విశ్వ ., మిత్రాల మద్య ఆ అండి, గారు సంభాషణ అలాగే జరిపించారు. .వాళ్ళు అన్నాళ్ళ విరహం తర్వాత కలిసినప్పుడన్నా సింగులర్ form లోకివచ్చేసి వుంటే అప్ట్ గా వుండేదేమో?
ReplyDeleteరవిగారు, చాలా నిశితదృష్టితో ఇచ్చిన చక్కని సద్విమర్శకి చాలా థాంక్స్.
ReplyDeleteఆ ఏకవచన సంబోధన ఈ పార్ట్ ఎక్కడ ఆగిందో ఆ తర్వాతి సన్నివేశం నుండీ మొదలైనట్లుగా వ్రాయాలనుకున్నాను. ఎందుకంటే ఆ ఎడం వారి మధ్య ఆ అసంకల్పిత చర్యకి దోహదపడింది. వారి నడుమ ఆ సాన్నిహిత్యపు తాలూకు సంభాషణ ఇంకా జరగాల్సివుంది.
ఏమంటారు?
ప్రతి ఎడబాటొక కలయిక కు సూచిక కాక పోవొచ్చు కాని
ReplyDeleteఎడబాటు తరువాత కలిసే కలయిక ప్రేమ సంగమ చిహ్నమైతే
కలిసే ఆ సాగర సంగమమొక అధ్బుత అనుభవం అది పలికించే మధురోహల వూసులు ప్రతి ప్రేమ జంటకొక వేద సుస్వర సంగీతాలు
రవి గారు: ప్రేమ లో ఏక వచనం సహజమే కాని అవధులు లేని అనురాగం ఆరాధన తో కూడిన ప్రేమ ఐనప్పుడూ మీరు నువ్వు కలిసి మెలిసి సహవాసం చేస్తాయి..
అంత ఆత్మ సంయోగం చెందాక ఏకవచన ప్రయోగమే వస్తుంది ఇంక గార్లు , బూరలు పోయినట్టే .అప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న స్తితిలో మాట రాని మౌనమే వాళ్ళని ఆ అసంకల్పిత చర్యలకి ప్రేరేపించినది కూడా .
ReplyDeleteభావన,చిత్రం నా కవితలకి వచనా వ్యాఖ్యానం, నా కథలకి కవితా వ్యాఖ్యానం అన్న అలవాటు నీకొక సహజ పరిణామం గా అబ్బినట్లుందే. :)
ReplyDeleteనువ్వు రవిగారికిచ్చిన సమాధానం స్వానుభవమే. అదే కథలోకి కాస్త జొప్పించాను. ఒక్కో క్షణం "పో రా" [ముద్దుగా] మరోసారి "పోరా" [గోముగా] కాస్త మర్యాద ఇవ్వాల్సివస్తే "పోండీ" [విసుగ్గా] ఇదీ మనదైన బాణీ ;)
రవిగారు, "మాట రాని మౌనమే వాళ్ళని ఆ అసంకల్పిత చర్యలకి ప్రేరేపించినది కూడా" నూటికి నూరు పాళ్ళు ఏ ప్రేమ జంట విషయంలోనైనా సహజచర్యేనేమో! ఒక స్పర్శ తెలిపే భాష్యాలు వేయి. నెనర్లు.
couldnt comment earlier 'cause of several reasons....though sometimes cannot comment..... please do note that i'm always in the "Q" to read the serial ...:)
ReplyDeleteఅమ్మయ్య ! మొత్తానికి విశ్వ నోట ముత్యాలు రాలాయి .
ReplyDeleteబాగుంది . అంత కొంచం తో ముగించకపోతే ఇంకొంచము రాయొచ్చుగా ? మీ సొమ్మేం పోతుంది ?