మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...!
(సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ నెనర్లు!)
ReplyDeleteసప్తాశ్వంబుల సారథి,
తప్త హృదయ మరువపత్ర తత్వంబులన
న్నాప్తుని యుషోదయముల
న్వ్యాప్తమహీతలపు చిత్ర వాసక మిదియే !
జిలేబి
జిలేబి గారు! నమస్తే..ఎప్పటి మాదిరే మీ unconditional ప్రోత్సాహం blogs పట్ల గౌరవాన్ని చెదరనీయదు.
Deleteఈ యుషోదయాలను పట్టి యిచట బెట్టి
ReplyDeleteవివిథ రోచిష్షుల మనోఙ్ఞ రవి కళలను
తీర్చి వ్రాయు కళాత్మక దృష్టి యొకటి
కలదు ' ఉష ' యందు మరువంపు మొలక గనుక .
అరుణోదయ రేఖలు ముం
దరుదెంచి తిమిర మరుగగ , తరుణాదిత్యుం
డురుగతి కవోష్ణ మిడుచు , కు
ధరముల మీదుగ నడుగిడె ధగ ధగ లాడన్ .
నెనర్లు వెంకట రాజారావు గారు! ఈ పద్య ఛందోబద్ద రీతుల్లో నిష్ణాత భలే...!
Deleteమీ ఈ చిత్ర-ఉదయ-చిత్ర పరంపర సూర్యుడి వెలుగుల ప్రస్థానం భలేగా చూపించింది.
ReplyDeleteలలితా! చాలా సంతోషం, శ్రద్దగా అన్నీ చూస్తూ వ్యాఖ్యలు కలుపుతున్నందుకు. నెనర్లు బంగారు...
Delete