ఉదయాన్నే-6

ఊడల్లా నేలలోకిదిగుతుంటాయి కొన్ని వెలుగు ధారలు
ఒడుపుగా కొసలు ముడివేస్తూ ఊయలూగుతుంటుంది ఒంటరి గాలి
నీడలే ఇటుకలుగా కొమ్మకి కొమ్మకీ వంతెన వేస్తూ పనిచేసుకుంటూ పోతుంది పగటివేళ ...!

1 comment:

  1. చెట్లకావల ఉరుకుతున్న వెలుగు-జలపాతాలు!

    ReplyDelete