వేచేటి వేళ

విరియబూస్తూన్న వేళ
పెనుగాలి దాడి చేసింది
ఏ తావున మలిగిపోతాయో నలిగి వాకిట పడి ఉన్న ఈ రేకులు!
కలలు, పూలు కలిసి రాలిపోతున్నాయి
నిన్నటి తావి ఒకటి గుండెలో తలదాచుకుంది,
నిదురని తొలిచే మెలకువలో తన పిలుపు నిలిచినట్లు.
ఆకులు కొమ్మని హత్తుకున్నట్లు తలపులు-
మరొక ఆమనికై తోటలా
తన రాకకై విధి వంకా, వీధి దిక్కుగా ప్రతి క్షణమూ ప్రతీక్షణము...

2 comments:

  1. బాగుంది. నిరాశలో ఒకటేలే కలయైనా నిజమైనా....లాగా...

    ReplyDelete
  2. నెనర్లు! నిరీక్షణ కీ నిరాశకీ నడుమ వారధి యేదని చెప్తాము?

    ReplyDelete