...2015...

మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
యద్భావం తద్భవతి

మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం,
మాకెందుకిక దిగులని.

బిరుసెక్కిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేతకి పోగులు పోగుచెసుకుంటూ...

ఆ పక్కనే కాంక్రీటు చీల్చుకుని ఈ మొక్క
మొక్క వేర్లని చీల్చుకుని పొడుచుకొస్తూ మరొక మొలక
చూసిన దిశని బట్టి రవ్వంత నీడ

నాలుగు రకాల జీవితేచ్ఛ చుట్టూ పరుచుకుని-
తరిచిన కొలదీ సేద తీర్చే కొండంత ఊరట ఒండ్రుగా ప్రవహిస్తూ... 

ఎవరి జీవితం వారికి స్వాగతిస్తూ ద్వారాలు తెరుస్తుందిNo comments:

Post a Comment