అపరాజిత: Invictus (by William Ernest Henley) కు స్వేచ్ఛానువాదం

ధృవం నుంచి ధృవం వరకు నల్లటి గొయ్యి మాదిరిగా
నన్ను కప్పేసిన ఈ రాత్రిలో
అజేయమైన ఆత్మని ఇచ్చిన
దేవుళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతాను

కఠినాత్మక జీవితపు అదిమిపట్టులో
నేను జంకలేదు, గట్టిగా రోదించలేదు
అనుకోని దెబ్బల తాకిళ్ళలో
రక్తసికమైనా నా తల వంచలేదు

ఇక్కడి క్రోధము కన్నీటికి అతీతంగా
అస్పష్టంగా భయభ్రాంతులు అగుపడుతాయి
అయినా కూడా, ఇన్నేళ్ళ బెదిరింపులు
నన్ను పిరికిగా మార్చలేదు, మార్చవు

ప్రయాణం యెలా అడ్డగించబడింది,
శిక్షల చిట్టా యెన్ని నేరాలతో నింపబడింది, అన్నది కాదు విషయం
నా విధికి నేనే యజమానిని
నా ఆత్మకి నేనే అధికారిని

(అనువాదం చేస్తున్నప్పుడు తెలిసింది మూలం లోని క్లిష్టత. నాకు అర్థమైనదేదో వచ్చిన భాషలో స్వేచ్ఛానువాదం చేసాను)

Invictus
BY WILLIAM ERNEST HENLEY

Out of the night that covers me,
Black as the pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

[“Invictus” definition. A popular poem from the late nineteenth century by the English author William Ernest Henley. Invictus is Latin for “unconquered.” The speaker in the poem proclaims his strength in the face of adversity]

4 comments:

 1. 2015 లో అనువాదాలు అన్నది మరి కాస్త పట్టించుకునే విషయం గా తీసుకున్నాను...కాస్త స్ఫూర్తినిచ్చే కవితతో మొదలుపెట్టాలని ఇదిగో ఇలా- ఈ Invictus అనే పదం 3 సార్లు విన్నాను
  1) ఈ పద్యం లోని గళం విప్పిన అనుభవాలన్నీ చవిచూసిన మిత్రురాలి మనోగతపు శీర్షిక గా
  2) గూర్చిన చలనచిత్రం: Invictus, 2009 biographical sports drama film
  3) ఈ పద్యం

  ReplyDelete
 2. Adding few valuable comments from Kavisangamam FB group:
  1) Kapila Ramkumar ఏదైనా భాష లోని పద్యం మనకు నచ్చినప్పుడు అనువాదాల కంటే అనుసరణే సహజంగా వుండేలా చూసుకోవాలి. దానినే నేటివిటీ అంటాము.. చాల వరకు సఫలీకృతులాయారు. అక్కడక్కడ తడబాటూలునా, మొత్తాని సాధించారు. ఇంకా ప్రయత్నిస్తే ఈ సారికి మంచి కవిత మీనుండి వస్తుందని ఆశిస్తూ, అభినందనలు.

  ReplyDelete
 3. 2) Satya Srinivas: try to follow the lines as they are- a suggestion

  ReplyDelete
 4. 3) Abd Wahed : ఈ కవితలో థిక్కారస్వరముంది. ధీమ్ విషయంలో మొదటి స్టాంజాలోను, శీర్షికలోను స్పష్టంగా ప్రకటించాడు. బలమైన జీవితేచ్ఛను ప్రకటించిన
  కవిత ఇది. సవాళ్ళెన్ని ఎదురైనా తలవంచేది లేదన్న ధోరణిలో సాగిన కవిత.
  మొదటి స్టాంజాలో అనువాదం ’’ అజేయమైన ఆత్మని ఇచ్చిన దేవుళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతాను ‘‘.. అనడం నిజానికి వ్యంగ్యమైన అభివ్యక్తి. Unconquerable soul
  అనే పదాలు atheist కాదనుకుంటే కనీసం agnostic అనుకోక తప్పదు. అలాగే gods అని స్మాల్ లెటర్స్ లో రాయడం గమనించదగ్గది.
  ఈ ధిక్కారం మతం మీద మాత్రమే కాదు,
  అప్పటి సామాజిక కట్టుబాట్లు, లేదా సామాజిక
  పరిస్థితులపై ప్రకటించిన ధిక్కారంగా భావించాలి.
  మూడవ స్టాంజా గమనించదగింది.
  ఇందులో shade
  అన్న పదం ’’మృత్యువు‘‘కు ప్రతీకగా వాడాడని భావిస్తాను. "menace of the
  years" అంటే పెరుగుతున్న వయసుకు
  ప్రతీకాత్మక వ్యక్తీకరణ. వయసు పెరగడమంటే చావు సమీపించడంగా అర్ధం చేసుకోవాలి.
  ఎందుకంటే "looms
  the horror of the shade" అనే పంక్తి ఇదే
  విషయాన్ని చెబుతుంది. ఇక్కడ హర్రర్ అనేది మరణానంతరం దేవుని శిక్షలకు సంబంధించిన
  మెటఫర్. మతపరమైన విశ్వాసాలను ధిక్కరిస్తున్నట్లయితే ఈ ప్రతీకలతో మరణానంతరం దేవుని
  శిక్ష గురించి ప్రస్తావించే ప్రసక్తి లేదని కొందరనుకోవచ్చు. ’’ఇహలోకంలోని నిరాశానిస్పృహలతో కూడిన అసంతృప్తి, ఆగ్రహాలు,
  కన్నీళ్ళకు ఆవల, చావుకు సంబంధించిన భయానకవాస్తవాలు నిలబడి ఉన్నాయి. అయినా
  పెరుగుతున్న నా వయసు నన్ను భయపెట్టలేదు‘‘ అని ఈ స్టాంజాను అర్ధం చేసుకుంటే, అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ,
  మరణానికి సమీపిస్తున్నప్పటికీ నాకు శిక్షల గురించి ఎలాంటి భయమూ లేదన్న సవాలు ఇందులో ఉంది.
  చివరి స్టాంజాలో "how strait the
  gate" అనే పదాలు గమనించదగ్గవి. ఇది allegory అని నా అభిప్రాయం. " Enter through the narrow gate. For wide
  is the gate and broad is the road that leads to destruction, and many enter
  through it. But small is the gate and narrow the road that leads to life, and
  only a few find it.". బైబిల్లోని ఈ
  మాటలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్నట్లనిపిస్తుంది. ఈ స్టాంజాలో "scroll" అంటే ధార్మిక గ్రంథమనే నేను భావిస్తున్నాను. ’’ధార్మిక గ్రంథంలోని శిక్షలు ఎంత తీవ్రంగా ఉన్నా పర్వాలేదు, ప్రవేశద్వారం ఎంత ఇరుకుగా ఉన్నా పర్వాలేదు‘‘ అని నాల్గవ స్టాంజాలోని మొదటి రెండు పంక్తులకు భావం. ఇక్కడ
  వైరుధ్యభావాలు లేదా వైరుధ్య తాత్పర్యాలు కనబడతాయి. బైబిల్ చెప్పిన చాలా తక్కవ మంది మాత్రమే
  ఎన్నుకునే ఇరుకుద్వారం ఎంత ఇరుకుగా ఉన్నా ఫర్వాలేదు, దాన్నే ఎన్నుకుంటున్నాను, ఇక శిక్షల భయం కూడా లేదు. అని చెబుతున్నాడా లేక జీవితం నుంచి
  నిష్క్రమించే ద్వారం ఎంత ఇరుకుగా ఉన్నా ఫర్వాలేదు, అక్కడ శిక్షల తీవ్రత ఎలా ఉన్నా
  లెక్కచేయను అని చెబుతున్నాడా అన్న వైరుధ్యం ఉందని భావించినా, ఆ తర్వాతి వాక్యం, ఐయామ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్ అంటున్నాడు. ఇక్కడ
  ఫేట్ అనే పదం కూడా ఐహిక జీవితానికి సంబంధించినది కాదు. ఖచ్చితంగా మరణానంతరం
  గురించే ప్రస్తావిస్తున్నాడు. అది కూడా తన చేతుల్లోనే ఉందన్నాడు, పైగా ఆ తర్వాతి
  వాక్యంలో అంటే చివరి పంక్తి నాస్తికతను స్పష్టంగా ప్రకటించిన పంక్తిగా కనబడుతుంది.
  ఐ యామ్ ది కేప్టెన్ ఆఫ్ మై సోల్ అన్నాడు. యూద రిఫరెన్సుల ప్రకారం ’’ఐ యామ్‘‘ అనేది
  ’’దేవునికి‘‘ పర్యాయపదం. ఇక్కడ ఐయామ్ ది కేప్టెన్ ఆఫ్ మై సోల్ అంటే అర్దమేమిటి?
  ఇది స్పష్టంగా దేవుడిని ధిక్కరిస్తున్న పంక్తి. ఒకసారి రెండవ స్టాంజాను పరిశీలిస్తే, తీవ్రమైన సవాళ్ళు కష్టాలు ఎదురైనా కూడా, రక్తసిక్తమైనా కూడా తలవంచలేదంటున్నాడు. ఫిర్యాదు చేయలేదంటున్నాడు. ఎవరికి
  తలవంచలేదు?
  ఎవరికి ఫిర్యాదు చేయలేదు? ఇలాంటి జీవితమెందుకు ఇచ్చావని దేవుడి ముందు మొరపెట్టుకోనూ లేదు.
  కష్టాల నుంచి గట్టెక్కించమని మోకరిల్లనూ లేదు.
  కొన్ని దశాబ్ధాల క్రితం రాసిన ఈ కవిత నెల్సన్ మండేలాకు
  స్ఫూర్తినిచ్చిన కవిత. నిజానికి హెన్లీ ఆ కాలంలో పెద్ద కవి కాదు. కాని ఈ కవిత
  మాత్రం అద్భుతంగా రాశాడన్నది నిస్సందేహం.

  ...అనువాదం చాలా బాగుంది. బైబిల్ రిఫరెన్సులను తెలుగులో తీసుకురావడం అంత తేలిక కాదు కాబట్టి ఆ విషయానికి నేను ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కాని ఇలాంటి రిఫరెన్సుల వివరణ ఇస్తే బాగుంటుందనే ఇది రాశాను. ఈ కవితలో లయ ఉంది. లయాత్మకంగా అనువదించడం తేలిక కాదు కాని ప్రయత్నిస్తే బాగుండేది. మొక్కువోని ఆత్మవిశ్వాసం కలిగించే మంచి కవిత. (వ్యక్తిగతంగా నేను పక్కా ఆస్తికుడిని కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా, ఒక కవితగా ఇది చాలా మంచి కవిత). ముఖ్యంగా కవితకు చివరి రెండు పంక్తులు ప్రాణం వంటివి. చాలా మందికి స్ఫూర్తినిచ్చన కవితను షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete