స్వరకల్పన

ఒక్కసారిగా ఊరంతా వెల్లవేసిన గోడలా-
పెళ్ళలుగా రాలిపడి చిక్కగా పరుచుకున్న మంచుతో

రాలిన ఆకులు రంగులు పిల్లల దుస్తుల్లో...
వాహనాల్లో కుదురుగా అమిర్చిన పూల గుత్తులై పిల్లలు
రానున్న ఆమని కి ఇంకాస్త చిక్కని ఎదురుచూపులు

ఆదమరిచి నిదుర పోనీయని గాలుల,
మూసిన తలుపులు తోసుకు వచ్చే ఆకతాయితనాలు
చలిమంటలు పలు రూపులో ఇంటింటా అఖండ దీపాలు

కొత్త రాగం కట్టమని ఋతువుకొక పాట రాసుకొస్తూ ప్రకృతి-
గుప్పెడు విత్తులు వెదజల్లితే గంపెడు రంగుల గుత్తులై విరిసే బంతి పూలలా
మత్తు వీడని తలపులు అక్షరాల బాణీలు కూర్చుకుంటూ ఇలా...

No comments:

Post a Comment