"new year is one imaginary mark on time continuum" as a friend wrote...but for me 'Now' is an imaginary point between transcendentally ideal and empirically real. As Eliot said "The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality" - I have a long way to reach that quiet yet!
అసలీ కవితకి మూలమైన భావావేశం నన్నింకా సుడులు చుట్టి ఊపుతుంది. అసలు కవితగా వెలికి తేవాలని క్లుప్తత, స్పష్టత సంకెళ్ళలో దాని ఆత్మని చంపేశానా? దెయ్యం పట్టిన మనసులా ఉంది స్థితి. అందంగా ముస్తాబు చేయాలని ముఖం కందేలా దిద్దానేమో. ఇప్పటికి ఇదే నా పరిమితి కనుక, మొదటి దశ లోని రూపాన్నీ ఇక్కడ ఉంచాను.
"జీవితం నాటకం. ఎందుకు అలా పోల్చాను?"
"జీవితనాటక ప్రతి లో గతం అన్నది ఎన్నో తీరని కలలు, ఆశలు - తెరవని పేజీల్లా, నటన కట్టని పుట/మాటల్లా మోస్తుంది, ఎప్పుడైనా ఒక గెలుపు, తీరిన తలపు, మరొక నిరాశ వాటిని తెరిచి చూపుతుంది."
"ఎవరి జీవితమూ ఆదర్శం కాదు. ఎన్ని సత్యాలు తెలుసుకున్న, వైరాగ్యాలు అడ్డుకున్నా, జీవిత కర్తలం మనమే."
"లైఫ్ స్పాన్ లో సఫలత, సంపూర్ణత, ఓటమి, నిరాశ [నాటక నిడివి అనుకుంటే] - ఒక యూనిట్ లో కొలవలేము. ఆయా వ్యక్తుల ఏకాంకం వారిని బట్టే."
"జీవితాలు కాలానుగుణ నాటకాలు/మిగిలే చరిత్రలు."
మొదటి ప్రతి:
ఏకాంకిక ఈ వీధినాటకం,
చావు తెర పడే వరకు.
చెప్పేందుకేముంది విష్కంభం?
చావు తెర పడే వరకు.
చెప్పేందుకేముంది విష్కంభం?
వచ్చిపోతున్న రేపుమాపుల్లో
కిక్కిరిసిన వీధి...
కిక్కిరిసిన వీధి...
ఉండుండి గగ్గోలు పెట్టే గతం,
మడతపడిన పేజీలకి ముఖచిత్రం.
మడతపడిన పేజీలకి ముఖచిత్రం.
నిడివి తెలిసినా నిష్ఫలం,
నాటకానికొక ఏకాంకం,
మనుషుల నడుమ లేదా అంతరం?
నాటకానికొక ఏకాంకం,
మనుషుల నడుమ లేదా అంతరం?
ఎదురుచూసినా రాదే విరామం.
ఏకపాత్రాభినయం మరో విశేషం
మానవ యంత్రాలు కదులుతుంటే
కాలపు నటనలు జీవితచరిత్రలు...
ఏకపాత్రాభినయం మరో విశేషం
మానవ యంత్రాలు కదులుతుంటే
కాలపు నటనలు జీవితచరిత్రలు...
తెలుసుకుంటే జీవిత సత్యం,
వదులుకుంటే వైరాగ్యం,
నాటక కర్తలు నాగరీకులు
వదులుకుంటే వైరాగ్యం,
నాటక కర్తలు నాగరీకులు
*****
మార్పు చేసాక:
మార్పు చేసాక:
ఏకాంకిక ఈ వీధినాటకం,
ముగింపు వరకూ
నిర్విరామ అభినయనం
చెప్పేందుకేముంది విష్కంభం?
ముగింపు వరకూ
నిర్విరామ అభినయనం
చెప్పేందుకేముంది విష్కంభం?
వచ్చిపడుతున్న రేయింబవళ్ళతో
కిక్కిరిసిన వీధిలో,
నిత్య ప్రదర్శన
గతపు ఈలల గోల, చప్పట్ల హోరు
కిక్కిరిసిన వీధిలో,
నిత్య ప్రదర్శన
గతపు ఈలల గోల, చప్పట్ల హోరు
No comments:
Post a Comment