ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

వచనమనుకునో, వ్యాసమనుకునో వచ్చిన వారికి క్షమార్పణలు.. అలాగే చిన్న సాంకేతికలోపంతో ముందు పోస్ట్ డిలీట్ అవటంతో మళ్ళీ పెట్టాను.

Time holds the control of life, yet if one is strong, could sustain its tests, just said in a different way

*** *** *** *** *** *** *** ***
మనిషినేనా అని నొచ్చుకుంటే
కాలం మనసుని ఎరగా వేసి
గాయపు చేపల బుట్ట చేతికిస్తుంది

మనిషినోచ్ అని మిడిసిపడితే
కాలం సుడిలోకి విసిరి
ఎదురీతల పందాల్లో ఓడిస్తుంది

మనిషిని అని విశ్వసిస్తే
కాలం సూదిమొన గుచ్చి
వెన్నున్న వానపాముని చేస్తుంది

మనిషినే కాననుకుంటే
కాలం కసిగా తొక్కినా
ఎరుపునెత్తుటి బొద్దింకలా బతికేస్తాను

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

కాలమా! బలమైన శత్రువుచేతిలో భంగపడ్ద
పరాజితుడు మహాబలుడు అవుతాడు.
నీవు నేర్పిన ఈ పాఠమే రేపటి నా విజయానికి నాంది.

*****************************
yikes, it sucks..ney not really the choice is absolutely yours..

ఈ రెండు చిత్రాలు నా లోగిలి ముంగిట సాయంత్రపు వేళలవి, సమయాలు ఒకటే కాలం తీరు వేరు. రోజులు వేరూను.

కావాలనుకుంటే నిన్నటి అందమైన జ్ఞాపకాన్ని,



రేపటి పీఢకలగా మార్చగల ధీశాలి కాలానికి ఎక్కుపెట్టి వదిలిన ఎన్నో ప్రశ్నల మాదిరి గానే



ఇది కాలానికి అంకితమిస్తున్న ఓ పరాజితహాసం!

2 comments:

  1. అవును ఉష, కాలం చాలా బలిష్టమైనది. మనతో ఎన్నో ఆటలు ఆడుతుంది. అవసరమైనంతసేపు మనమూ కాలంతో ఆడాలి. అదుపుతప్పుతుంది అన్నప్పుడు , గాయం ఐనప్పుడు బాధకలిగినా వెంటనే తేరుకోని ఆ కాలాన్నే నిలదీయాలి. కాలం నేర్పిన పాఠాన్ని మనసులో పెట్టుకుని తప్పకుండా విజయం సాధించగలం.. ఎంత బలవంతమైన శత్రువైనా పోరాడి ఓడాలి లేదా గెలవాలి తప్పు నిరుత్సాహపడకూడదు. అది మనకే నష్టం

    ReplyDelete
  2. జ్యోతి, థాంక్యూ. జీవితం ఓ నిమిషం వెలుగుల వెన్న ముద్ద, మరునిమిషం చీకటిలో తేలుకాటుగా తోచేది ఈ కాలం చేసే గారడీ వలనే కదా?

    ReplyDelete