బంధాలకి బంధనం

నిశిరేయి చుక్కపాటుకి
కనుదోయిలో నిలుపుకున్న
చిత్రం చెరిగిపడింది

రెక్కతొడిగిన మానసం
తానెరుగని చిరునామాకి
లేఖ మోసుకెళ్ళింది

అందని దూరాన మూర్తికి
అక్షరాభిషేకమిస్తూ
ప్రియదర్శిని పరవశించింది

వేగుచుక్క వాకిట జార్చిన

పొగమంచు తెరవెనుక
తెలిసినరూపు పలకరింపుగా నవ్వింది

ఎంతెంత దూరం, ఎందుకింత దాహం,
ఎద లయకి వుంటుందా విరామం
ఎలా వేయాలీ బంధాలకి బంధనం

11 comments:

  1. ఉష,
    పొగమంచు వెనక ఉన్న రూపం తప్పకుండా కనులముందుకు వస్తుందిలే.. చాలా బావుంది..

    ReplyDelete
  2. రాధిక(నాని), థాంక్స్.
    జ్యోతి, ఏమిటో ఇలా సుదూర తీరాల పిలుపుల కోసం, ప్రియభాషణాల కొరకు ఒక్కోసారి తపన! నెనర్లు.

    ReplyDelete
  3. బ్రతికి ఉన్నంత వరకి విరామం వుండదేమో కదండీ

    ReplyDelete
  4. చిన్నీ, ఆ అనుబంధాల్లోనే కావాల్సిన విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతుంటే, కాలం వాటి వలననే ప్రియంగా తోస్తుంటే ఇక విరామం ఎందుకు కదా! కాకపోతే కాలం, నేస్తం జారిపోకుండా పట్టుకోవాలన్న ఆరాటం తప్పదు కదా. పాటలో మాదిరిగా

    "Friendship is what we are looking for..
    కాలం నీ నేస్తం..
    Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day పయనించే షిప్పే friendship రా ... "

    నెనర్లు.

    ReplyDelete
  5. :)"ఎలా వేయాలీ బంధాలకి బంధనం" మీరే చెప్పాలి.

    ReplyDelete
  6. విజయమోహన్ గారు, "అవును ఎలా వేయాలి?" మొదట్లోనే గోల పెట్టానండి "ఏమి వ్రాయలన్నా నాకు ముందే సిరివెన్నల గారో, ఆరుద్ర గారో ఆఖరుకి కలల్లో నేనే వాడేసిన వైనంగా ఉందని.." :) కనుకా నిజానికి దేవులపల్లి గారివి దొరికితే బావుండేది కానీ ఈ సారికి సిరివెన్నెల గారికి వదిలేసా.. నా అనుబంధాలకి నా నీరాజనం..ఇవే నేను వేసే బంధనాలు.

    "నువు చూసే ప్రతి స్వప్నం, నా రాతిరి దారికి దీపం
    నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
    గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
    మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం!"

    ఇది "నీ స్నేహం" చిత్రం లోని గీతంలో చరణం. అలాగే ఆ పాట పల్లవిలోనివీ పదాలు..
    "
    .
    కంటిపాపని కాపుకాసే జంట రెప్పల కాపలాగా
    నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
    స్నేహమంటే రూపు లేని ఊహ కాదని
    నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి"

    http://www.sirivennela-bhavalahari.org/?p=3481

    ReplyDelete
  7. బాగు బాగు మీ కవితకు జయహో రాస్తూ ఉండగలరు !
    .......మీ సావిరహే

    ReplyDelete
  8. సావిరహే గారు, అసలు మాట "స్నేహమంటే రూపు లేని ఊహ కాదని, నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి!" కనుక నేనే జయహో రాసుకుంటే, ఆత్మస్తుతి ఆయుఃక్షీణం అడ్డం పడుతుంది లేదూ సుత్తి అనబడును కాదా? :) నా నేస్తాలు 'జయహో' కొట్టేసారు. ఇదిగో కొత్త వాళ్లకి వల పట్టాను. మీ తొలివ్యాఖ్యకి ధన్యవాదాలు.

    సుజ్జీ, సావిరహే గారి మాటననుసరించి ఎవరైనా కన్స్లటెంట్ ని పెట్టి జయహో అనిపిద్దాం అనుకున్నానోయ్ నేస్తం.. పని దివ్యంగా పూర్తి చేసేసావు. నీకు నచ్చినందుకు, ముక్తసరి మురిపాల జయహో కి థాంక్స్. :)

    ReplyDelete
  9. సరే అసలు కోణం కూడా ఇక్కడ రాసేస్తే పోలా..నిజానికి ఇది నాయికా భావనలతొ మొదలు పెట్టి అలాగే రాసిన కవిత. ఎందరు పడతారాని చూసా.. :) దొరకలేదని సంబరపడ్డాను గానీ ఒకరు నా నాడి పట్టేసారు, కనుక విరహవాహిని తొణికిపోతుంది. విరహిత తాకిడిలో కవి హృదయం కొట్టుకుపోతుంది..చూడాలి ఆ పదబంధన ఎన్ని బంధానాలు బిగిస్తుందో అనుబంధానికి..ఆ ఒక్కరికీ కృతజ్ఞతలు.

    ReplyDelete