కంటికి తోడు కావాలి

నేల చీకాకు పడేంత వాన,
వద్దంటే వెల్లువయ్యే కన్నీటివరదలా.
గడ్డి జిగట అడ్డం పడి,
ఎగురలేని తూనీగ గోల.
నానిన నేలలో ఏ జ్ఞాపకాల విత్తూ మొలవదేం?

కవాటాల మోతకే తల్లడిల్లే గుండె,
తలపుల ఉరుములకి తబ్బిబౌతుంది.
చీకటిలో వెర్రి మిణుగురు ఒళ్ళు కాల్చుకుని,
అపరిచితులకి దోవ చూపెడుతుంది.
కొత్తదారికి ఇంకా కన్ను, కాలు అలవడలేదేమోనని..

వెలుగు నవ్వు మోస్తున్న రంగురంగుల పువ్వు,
తూగి కొమ్మదాపున దాగుడుమూతలాడుతుంది.
గట్టు దాటలేని కొలను తలబద్దలయేలా ఊగి,
ఊగిసలాటల ఉయ్యాల తాళ్ళు తెంఫుకుంటోంది.
దృశ్యం కరిగేలోపు జ్ఞాపకాల సంకెల బిగించికట్టిపడేస్తుంది కన్ను.

*** *** *** *** *** *** *** *** *** *** ***
సరదాగా ఒక్కో కన్ను మార్చుకుందామన్న ఊహని రేపెత్తిన నేస్తానికి, నా కన్ను మూటగట్టిన ఈ పదాలు చూసి పారిపోతావో, నీ కంటి కలతో ఈ వేదన కడిగిపడేస్తావో మరి! ఏదేమైనా ఇక ఇది నీ సొంతం.
కవిత అంటే మరిచిపోయానా అని మీమాంసకి గురి చేసిన స్వీటీ గారికి, రాత్రంతా ఉరుముల మెరుపులతో వెక్కిరించిన వానకీ కృతజ్ఞతలు.


వ్యాఖ్యలు చదివే/రాయని అలవాటున్నవారికీ ఈ చక్కని కవిత పంచాలన్న "నా" నిస్స్వార్థ ఉదారతతో పంచుతున్న..
స్వాతి శ్రీపాద గారి స్పందన ఇది.

నాలో నేను

అదృశ్యంగా గాయాలు అశృవరదలై
తలదాచుకునే తావుకోసం
చూపుల గాలాల్తో శూన్యాన్ని తడుముతున్నవేళ
అప్పుడెప్పుడో అక్కడెక్కడో మెరక గుండెలో
పొడిపొడిగా అక్షరాలు వెదుక్కున్న ఆహ్వానం

పెదవులు ఇసుమంతైనా కంపించలేదు
చూపులు నడిపిన రాయబారాలు
ఆవంకనుండా ఈ వంకనుండా
అర్ధంకాని అయోమయం అమావాస్యలో
ఏమూలనైనా నెలవంక తొంగిచూడదా?

నాలోలోపల నాలుగువేల ప్రపంచాలను
ఆవిష్కరించుకున్న నాకు
ఎందుకీ వ్యర్ధపు వెదుకులాట
ద రూల్ ఈజ్ సింఫుల్
ఇచ్చుకున్నవారికి ఇచ్చుకున్నంత
తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత

నాది ఇచ్చే హస్తమే కాని పుచ్చుకునే
లౌలిత్యంలేదు
ప్రేమైనా మరింకేదైనా
ఇట్నించి అటే కాని అట్నించిటుకాదు
గుప్పిళ్లకొద్దీ విసురుతున్నాను
అందుకునే తీరికలేదిక

33 comments:

 1. huh.. too complicated for ppl like me ;)

  ReplyDelete
 2. నాలో నేను

  అదృశ్యంగా గాయాలు అశృవరదలై
  తలదాచుకునే తావుకోసం
  చూపుల గాలాల్తో శూన్యాన్ని తడుముతున్నవేళ
  అప్పుడెప్పుడో అక్కడెక్కడో మెరక గుండెలో
  పొడిపొడిగా అక్షరాలు వెదుక్కున్న ఆహ్వానం

  పెదవులు ఇసుమంతైనా కంపించలేదు
  చూపులు నడిపిన రాయబారాలు
  ఆవంకనుండా ఈ వంకనుండా
  అర్ధంకాని అయోమయం అమావాస్యలో
  ఏమూలనైనా నెలవంక తొంగిచూడదా?

  నాలోలోపల నాలుగువేల ప్రపంచాలను
  ఆవిష్కరించుకున్న నాకు
  ఎందుకీ వ్యర్ధపు వెదుకులాట
  ద రూల్ ఈజ్ సింఫుల్
  ఇచ్చుకున్నవారికి ఇచ్చుకున్నంత
  తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత

  నాది ఇచ్చే హస్తమే కాని పుచ్చుకునే
  లౌలిత్యంలేదు
  ప్రేమైనా మరింకేదైనా
  ఇట్నించి అటే కాని అట్నించిటుకాదు
  గుప్పిళ్లకొద్దీ విసురుతున్నాను
  అందుకునే తీరికలేదిక

  ReplyDelete
 3. @SWATEE..garu,

  Mee kavitha baagundi..

  ReplyDelete
 4. వెంకట్ గారు, సో ఇంప్లైడ్ లాజిక్...సరళమైన భాష [అంతా మీలా తిట్టాక "సంక్లిష్టంగాఅ రాస్తున్నావు." అన్నాక నేనూ కష్టపడి నేర్షుకున్నది] లో రాస్తే చదువుతున్నారన్నమాట! :) అప్పుడప్పుడు ఇవీ కాసింత చదివిపెట్టాలి మరి! థాంక్స్.

  ramnarsimha గారికి, స్పెషల్ థాంక్స్.

  స్వీటీ గారికి, నేను నేస్తాలకి థాంక్స్ చెప్పను. అవసరమైతే నా మాట/కవిత అడ్డు వేస్తానంతే! ;)

  ReplyDelete
 5. లాలిత్యం అంటే తెలుసు లౌలిత్యం ఏంటి? స్వాతి గారు/ఉష గారు అర్థం చెప్పండి!!

  ReplyDelete
 6. వెలుగునవ్వు మోస్తున్న రంగురంగుల పువ్వు,
  తూగి కొమ్మదాపున దాగుడుమూతలాడుతుంది .
  ఉషగారు,చాలాబాగుంది.

  ReplyDelete
 7. @ఉష గారు
  తప్పకుండా ;)

  ReplyDelete
 8. ఆహా చాలా బాగున్నాయి రెండు కవితలు. ఒకదానికి మించి మరోటి పోటీ పడుతున్నాయి. చాలాకాలానికి మంచి కవితలు చదివానన్న తృప్తి. అభినందనలు. ధన్యవాదాలు.

  ReplyDelete
 9. చాలా గందరగోళంగా ఉంది
  ఒకర్ని ఇంకొకరు డామినేట్ చేస్తూ బావున్నాయి పద్యాలు/కవితలు/పోస్ట్ మీరు ఏదనుకుంటే అదే
  మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటే JK

  ReplyDelete
 10. ఆత్రేయ గారు, నన్ను ఉరుములతో ఊదరగొట్టిన ఒక తలపూ మీదీనండోయ్! మొత్తానికి రప్పించాను తలపు నుంచి తలుపు ఇవతలకి! :౦

  రాధిక, ఒకసారి పైన పదాలన్నీ ఒక్క సంబోధన మినహాయిమ్చి, ctrl-A, ctrl-C and ctrl-V చేసుకోండి.

  ఇద్దరికీ నెనర్లు.

  ReplyDelete
 11. @USHA

  You can get comprehensive information from

  "Mahathma Gandhi`s Autobiography"..

  Do you have it?

  Otherwise you can find it in the Internet..

  I ll try to inform the Website as early as

  possible..

  Any how thanks..for asking me about Mahathma

  Gandhi`s information.. I am a big fan to him..

  Yours sincerely,
  Ram..

  E-mail:rputluri@yahoo.com

  ReplyDelete
 12. కంటికి తోడు.. నిరంతరం కాపు కాసే కలలో, కన్నీరో తోడెప్పుడూ వుంటూనే వుంది గా నేస్తం. కల జారితే కన్నీరో.. కన్నీటీ తో శుభ్రం చేసిన మది తలపున చిగురించిన కలో నడిపించే తోవలో వొంటరెందుకవుతావు... ఇంకా వీటికి తోడు గా ఇంకా ఏవో కావాలాంటావా.. మరి మనసులోని ఇంకో మాట ఇలా మార్చి చూడూ...నాకు దుఖం సముద్రం మీది వానల్లే ఆగాగి... ఆగకుండా కురుస్తూనే వుంటుంది. కొన్ని అనుభవాల ఆల్చిప్పలలో పడి ముత్యాలైతే నా దుఖాన్ని చూసుకుని నాకే గర్వమవుతుంది.. చాలా సార్లు ఆ దుఖం నిరర్ధకం గా సముద్రం లో కలిసి... వుహు కాదు నిరర్ధక మెందుకవుతుంది.... కాదు... నా కన్నీటి జడుల పాయలెన్నో కలిసే కదా హృదయ సముద్రానికంత వైశాల్యం కలిగింది. ఆ జడుల హోరులెన్నో తనలో కలుపుకునే కదా అనంత సాగర ఘోష నా హృదయ సవ్వడైంది... నా జీవన గతినే నిర్దేశించే నా దుఖం నాతొ వుంటూ నాతోనే కలిసి బతుకుతూ నన్ను బతికిస్తోంది. ఇంత తోడు మనదే గా నేస్తం ఇంకా వొంటరెందుకు తోడూ కోసం వెతుకులాటెందుకు...

  ReplyDelete
 13. @ఉష గారు,

  "జన్య" గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను..

  మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాలల గురించి వివరాలు కావాలి..

  @నా గురించి:-

  నేను "విద్యారంగంలో సంస్కరణలు" అనే అంశంపై అధ్యయనం చేస్తున్నాను..
  పత్రికల్లో కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగింది..

  చిరునామ:-ఖైరతాబాద్, హైదరాబాద్..

  ReplyDelete
 14. @GANDH`S AUTO-BIOGRAPHY:-

  Website:-

  (www.wikilivres.info/wiki/An-Autobiography-or-the -story-of -my-experiments-with-truth)

  ReplyDelete
 15. ramnarsimha/Ram గారు, జన్యా ని గూర్చి వివరాలకి మీరు info@janyaa.org కి ఈ-మెయిల్ ద్వారా సంప్రదించండి. లేదా, http://janyaa.org/projects.php ముందుగా చూస్తే కొన్ని వివరాలు తెలుస్తాయి. సుమారు ఐడియాకి నేను రాసిన టపా కొంత ఉపకరిమ్చవచ్చు - అది రాసిన నాటి నుంచి కొన్ని మార్పులు ఉన్నా అవి చిన్నవే. http://maruvam.blogspot.com/2009/11/janyaa-better-learning-for-brighter.html

  గాంధీ గారిని గూర్చిన సమాచారానికి ధన్యవాదాలు.

  ReplyDelete
 16. ఏమిటో చాలా గందరగోళంగా ఉంది.. కాస్త నిదానించి చూసాను. ఇక్కడ రాధిక గారు [కొత్త రాధిక] "స్నేహమా" రాధిక అనుకుని చమత్కరించాను. సో, రాధిక(నాని) గారితో కలిపి ముగ్గురు రాధికలు. సరేనండి..ఇక్కడ రాసిన ఇద్దరు రాధికల గార్లకూ థాంక్స్.

  ReplyDelete
 17. వెంకట్ గారు, ఇవాళ నా భరతం పట్టాలని నిర్ణయించారల్లే ఉందిగా... :)

  అసలేమంటే ఆంగ్ల భాష వాడకంలో బ్రెయిన్ ఒక సౌలభ్యాన్ని వాడి తప్పుని ఒప్పుగా మారుస్తుందట, అనినా మొదటి చివరి అక్షరాలకే స్పెల్ చెక్ అన్నమాట. అలాగ నేను swatee అన్నదాన్ని sweetee గా చదువుకుని, అలాగే ఆ అండర్స్టాండింగ్ సాగదీసి లౌలిత్యాన్ని => లాలిత్యం అనేసుకున్నాను. ఈ వివరణ సరా. ఇక అది swatee/sweetee/స్వీటీ గారు తొంగిచూసి సవరించుకుంటారని అలాగే వదిలేసా.

  ReplyDelete
 18. హరేకృష్ణ, ఎంత అదృష్టవంతులండీ మీరు - మనసు భాష గందరగోళం అనేవారంతా మేధావులని నా భావం + వాళ్ళంతా సాధారణ/సగటు మనిషికి అందరు, అంచేత మీమీద గౌరవం పెరిగి పోయింది. :) నాకు మల్లేనే మీరూ మీ మనోభావాలని చిన్నబుచ్చకూడదు మరి. కనుకా "మీ ఉత్తమ బ్లాగు చదువరి" అవార్డ్ అలానే ఉంచాను.

  జోక్స్ అపార్ట్ - ఇది వాన ఛాయలు, హృదయ వేదనలు కలేసిన కవిత అండి. పదం పదం విడదీసి చెప్తే ఈ నిగూఢత పోతుంది. ఉదయం లేవగానే ఇలా వచ్చిన భావోద్వేగం అలా రాసేసా. ఇక అది నాది కాదు, దాని మనుగడ అది ఇక్కడ సాగదీయాలి/సాగించుకోవాలి. :) నెనర్లు.

  ReplyDelete
 19. భావన, ఏమి చేయనూ, ఈ హృదయానికి ఎలా చెప్పనూ [తత్వాలు పాడదామా].. నాకు దుఃఖం కావాలి. తనూ కావాలి. కనీసం ఒంటరి నా కంటికి చూపు తోడు కావాలి. నాకు మాత్రం నిన్ను చూసాక [జనాలు తిట్టిపోస్తారు :) ఈ బట్టబయలు ప్రేమలేవిటీ అని ;)] "ఏ మనిషయినా...అద్దంలోకి చూసె క్షణాన...ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న...నేను నీకు తెలుసా?" అన్న ప్రశకి సమాధానం దొరికినట్లే ఉంటుంది. మనబోటి వాళ్ళకి జ్ఞాపకాల పట్ల మక్కువ "కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి వద్దంటే పోదండి ప్రేమ" పాటలో మాదిరిగా పోయేది కాదు. ఏడుపు వదిలేదీ కాదు. కానీ..

  ReplyDelete
 20. ఏంటేంటీ ,
  నేలకి చికాకా వాన వస్తే...
  నానిన నేలలో మొలవని జ్ఞాపకాల విత్తులా? నానిన నేల చూస్తే గుర్తు రావా ఏవీ? కొంపదీసి అమ్నేషియానా ?
  మిణుగురు ఒళ్ళు కాల్చుకుందా ? దాని నైజమే వెలగడమైతే!
  కంటికి తోడేంటీ? ఒంటికన్ను రాకాసిలా
  (సరదాకే సుమా! సీరియస్ అవ్వొద్దు)

  ReplyDelete
 21. too good anDi chala bagumdi

  ReplyDelete
 22. ఉషాగారు , పైన అందరూ చెప్పిందే ఐనా మళ్ళీ చెప్తున్నా మీ ఇద్దరి కవితలూ పోటీపడుతున్నట్టూ .....
  మధ్యలో కొన్నిరోజులు కామెంట్స్ తీసేశారు చూడండి ఎంత సందడి మిస్ అయ్యారో ...హరేకృష్ణ , ప్రదీప్ గారు వీళ్ళ అల్లరి ఎవరు భరిస్తారు :)

  ReplyDelete
 23. we, the poets,can always coin our own vocabulary. laulyaanni laulityaMgA marchukunnAnu

  ReplyDelete
 24. @ స్వీటీ గారు, వివరణకి థాంక్స్. నేనూ ఇలా పదాలు [నా కోసమే] సృష్టిస్తుంటాను -
  ఉదా: నా మనసు వరించిన "వేదన". అలా పిలిచి విసిగి దానికో పేరు పెట్టాను - "మనోవరం"
  కులం, తత్వం, లింగం కలిపి ఒకటే మాట మనిషి+పనిముట్టు+స్త్రీ = మమ్ముట్టి
  మమెలీ = మమ్ముట్టి మెమొరీ లీక్
  ఈ నెల గతనెల సృజనలివి! :)

  @ హను గారు, ధన్యవాదాలు మీ పునరాగమనానికి, వ్యాఖ్యకి.

  ReplyDelete
 25. దీపూ వచ్చావా? ఇంకా రాలేదే, కోయదొరలా ఈకల టొపీ కట్టుకుని, ఒక్కో బాణం నా మీద వేసి, కవితలోంచి ఈక పీకి ఆ టొపీకీ గుచ్చుకుంటూ.. నిజంగానే మిస్సయ్యాను బాబు! :)
  ఇక మరి కబడ్డీలోకి..
  ఏవిటేవిటీ..చీకాకు పడకూడదా..ఏమి బీడు పడితే నెర్రలు విచ్చి అరవదా? కోపమొస్తే కడుపు విచ్చి పగలదా.. ఇదీ అంతే ఎక్కువ తడిసి పడిశం పడితే తుమ్మి చీకాకు పడింది.
  విత్తనాలు ఎక్కువ నాని చీకిపోవా.. ఓ ఓ ఈ కాలం కుర్రాళ్లకి "మా" కాలపు మాటలు అర్థం కావు.
  నానిన నేల అదీ బంక మట్టి నేల చూస్తే నేను చేసిన బొమ్మలు గుర్తుకొస్తాయి.. నేను చీపురుకట్ట, కొరడా, కత్తి ఇలా సాయుధాలు చేసేదాన్ని.
  "రాత్రి దేశపు" నియంత అయిన "చీకటి" [ఎక్కడో విన్నట్టుందా, తవరి సృష్టే ఇవి] వద్ద బానిస ఈ మిణుగురు, దాని వళ్ళే కాగడాగా కావలి కాసి, బాటసారులకి మార్గం చూపాలి, అచ్చంగా వేదనకి బానిసైన నా మనసు వచ్చిపోయే తలపులకి తలుపులు తీసి మూసినట్లు.. చాలా? ఇన్ని జ్ఞాపకాల దృశ్యాలు మోసిన కన్ను అలిసి కనీసం ఆసరా కోరదూ? ఒకటా రెండా కాదు, అది మోసే బరువు లెక్క అసలుకి.
  ఇవన్నీ నా సరదా సమాధానాలు..కావాల్సినన్ని స్మైలీలు కలుపుకుని..బీ హాప్పీ! ;)

  ReplyDelete
 26. పరిమళం గారు, ఒకరొకరుగా [ఇంకా రావాల్సిన వారున్నాగానీ] మీరంతా వనంలో విహరిమ్చి ఇలా మాట కలుపుతుంటే నిజంగానే వేసవి సెలవులకి అమ్మమ్మ గారి ఊర్లో గడిపిన అనుభూతి. :) అందులోనూ ఊరికే బజ్జుంటే నాకు వెగటు. ఎగిరి గంతులేసే వసపిట్టనసలే.

  మీకు తెలియనిదేముంది..ప్రయారిటీస్ మారతాయి, పళ్ళెం బరువెక్కితే కాస్త సర్థాలిగా.. ఒక్కోసారి త్రాసు ఒరిగితే, తూకం రాయి వెయ్యాలి, లేదా తూచే సరుకు తీయాలి. ఇది నాకు మామూలే... ఈ ఏడాది చాలా ఏళ్ళకి స్టేజ్ మీద నృత్యం చేసాము, పైగా మరికొన్ని అతి ముఖ్యమైన/ప్రత్యేకమైన సమయాలు ఏకాంతంగా గడపాల్సి వచ్చి బ్లాగుని వెనక్కి నెట్టాల్సి [మీరు కనుక ఇంత వివరణ].. థాంక్స్..ఇక చెలరేగిపోండి. భా.రా.రె. వస్తే బాకాలు కూడా వచ్చేస్తాయి. :)

  ReplyDelete
 27. పైన కవిత ఈకలు చాలు కానీ, కింద వ్యాఖ్య ఈకలు పీకుదాం ఇప్పుడు
  1. " భూదేవంత సహనం " - ఈ ఒక్క మాట చాలు. నానిన నేల చూస్తే అన్ని గుర్తొచ్చినప్పుడు ఇంకేం, అన్ని విత్తులు మొలిచాయిగా ;)
  2. "మీ" కాలపు మాటలు "మా" కాలమైనా ఒకటే, మారాల్సిన అవసరం లేదు.
  3. కొవ్వొత్తీ వెలుగుతుంది, మిణుగురూ వెలుగుతుంది. తేడా ఏంటో అందరికీ తెలుసు.
  4. రెండు కళ్ళూ కలిసినా మోయలేని భారాన్ని మనసనే మూడోకంటికివ్వాలట, ఎవరో చెప్పారు
  5. నేను రాసింది రిపీట్ చేస్తే అయిపోదు, I ask where is justification!!!

  బల్ల బద్దలయినట్టుంది. ఇంకా బానే ఉంటే చెప్పండి, మళ్ళీ వచ్చి ఇంకొన్ని ముక్కలు చేస్తా ;)

  ReplyDelete
 28. కవన విహారి కొలని కంటిలో మెరిసెటి బిందువు
  జాలు వారు రచించినా జ్ఞాపకాల పొదరిల్లు?

  బాగుంది ఉషా

  ReplyDelete
 29. పద్మార్పితా, అంత ముక్తసరిగా చెప్పబట్టే కన్ను పాదరసంలా మీ వ్యాఖ్య మీంచి జారిపోయిమ్ది...థాంక్స్.
  భా.రా.రె. బాణీ మార్చారేమి? షేక్స్పియర్ అన్నమాటని గుర్తు. వనమాలి ప్రతి మొక్కా ఎదగాలనే ఎంతో ఆపేక్షగా కత్తిరిస్తాడట. ఇక్కడి ప్రతి విమర్శకులు వనమాలికి ప్రతినిధులే. వనమాలి ఎవరని అడగకండి ప్లీజ్! :) మీ అభినందనకి థాంక్స్.

  ReplyDelete
 30. *** నాయిస్ గా తోచినవారికి నా ముందస్తు క్షమాపణలు. శతకోటి బోడి బ్రాగింగ్ బ్లాగుల్లో నాదీ ఒకటనుకుని మీదారి మీరు పట్టండి. పిల్లకవులం ఇలా లాక్కుని పీక్కునే ఎదుగుతాము. ఇవే నా సాధనలు.***

  దీపూ, నాకు సరీగ్గా గుర్తు లేదు కానీ ఫెవికాల్/క్విక్ ఫిక్స్ కదా మన బ్రాండ్స్, ఇక్కడి సూపర్ గ్లూ వేసి ఆ పగలగొట్టబడిన బల్లనే అతికి, దానిమీదనే గుద్ది మరీ వాదనకి దిగుతున్నాను.

  .. నేను స్త్రీవాదిని కాదు. మానవతావాదిని. ఎన్నాళ్ళు భూదేవంత సహనమని ఆమెని కట్టగలం? ఆ భూదేవితో పోల్చి మరొక మనిషినీ కృంగదీస్తాం? విత్తులు, మొలకలు ఏవైనా తేమ తగలాలి కానీ ఊబిలో ముంచి కాదు. ప్రేమ తడి, ఆర్థ్రత గోరువేడి - నీరెండ మాదిరిగా.
  .. పదీ పదిహేనేళ్ళకే మారేకాలం కాదులే, ఓ రాయి వేసా మీరేమంటారోనని.
  .. వెలింగించే వత్తుకీ, స్వయంప్రకాశానికీ ఆ మాత్రం తేడా తెలుసునులే మాస్టారూ!
  .. ఆ మనసే గుడ్డిదై గుడ్డిప్రేమకి బానిసై వూసుల మూటలు మోస్తూ ఎక్కడెక్కడో తిరిగే, చివరకి ఈ వేదన ఆసామి చేతికి చిక్కింది.
  .. మీరెన్ని అన్నా ఈ కవితకి సత్తా ఉంది, అది నిలబడగల నేల మీదే పుట్టింది. మీరే గట్టున ఉండి నేల తీరు అంచనా వేయలేకపోతున్నారు. పడతారేమో పాపం! :) అసలే తిక్కదాన్ని నా ట్రిగ్గర్ నొక్కుతారా హమ్మా!

  ReplyDelete