సాపత్యం - budding poets

ఇవి నా ఆరోప్రాణం/ నా పాప లోని కవి కదలికలు. నా ఆనంద నర్తనం బహుశా ప్రతి తల్లికీ అనుభవమేనేమో! పిల్లది దాదాపు ఆరేళ్ళ వయసు నుంచీ రాస్తుంది [అంటే గత ఐదేళ్ళుగా..] తాజా రచన నుంచి పాతవి వరకు కొన్ని ఏరి వరసలో పెడ్తున్నాను.
 • లైఫ్ [తెల్సినవారి తండ్రి మరణవార్త విని రాసినది]
This is just like the life of a rose; it begins to bloom, such bright colors that we believe will last for days, but what we don’t observe is that very slowly and quietly the color start fading. Sadly the petals are falling; in only time the last of the petals fall.


పోయినేడు వసంత శోభని తను చిత్రీకరిమ్చుకున్న వైనం
లేక్ ఒడ్డున సాండ్ లో గడ్డి పూవు, సీతాకోకచిలుక, పక్కన మేపుల్ చెట్టు మీద పిట్ట, ముందున్న నీటిలో చేప

 • ఫిష్ - పాపం జలపుష్పాభిషేకం కొరకు రాసింది. తెలుగు మాత్రమే తీసుకున్నానని ఆపేసాను రచనని.

beneath the waters the fish lay
with all colors that shine all day
day is beauty and night is glory
fish are lively and fish in merry
all day long they jump and hop
no one can make them stop..

2009 ఎర్త్ డే కోసం తను గీసిన చిత్రం

 • Ocean

upon the ocean breeze we lay
among all the creatures of underneath
in hope to find what you search for
the one in which means the most
the heavens in which we most believe
is said to be at the horizon of the sea
 • మూన్
Moon shines so bright in the night,
Yet far too high in the sky.
I try to reach for it in the sky,
But miss and get a star instead
While it shines so bright,
I wonder will I ever touch it?


 • అమ్మ - ఇది నా మీద తన ఆరేళ్ళ వయసులో రాసిన మొదటి కవిత

Who tucks me in at night?
Who lets me use her perfume?
Who do I keep in my heart?
Who has deep eye?
Who else is a girl in my family?
Who is like a queen?
Who has black hair like me?
Who is smart in my family?
Who else do you think?
My mother

కనుక మేమిద్దరం కాబోయే కవులమన్న కలగంటున్నవారమే. ఇక నా నర్తనం తాలూకు గురుతిది..నా చేతి వేళ్ళకే పాదాల్లోని శక్తి వచ్చినంతగా ఉంది...ఇదంతా రాసినవి అవే కనుక వాటినే పెడుతున్నాను.


20 comments:

 1. వావ్ చాలా బాగా రాసింది . బాగున్నాయి .
  అమ్మకు ఆనందం కలిగించేలా ఇంకా , మంచి మంచి కవితలు రాయాలి కన్నా .

  ReplyDelete
 2. బాగున్నాయి.. especially the last one.. అయితే మీ జీన్స్ లోనే కవిత్వం ఉందన్నమాట! ;-)

  ReplyDelete
 3. చాలా బాగా రాసింది. భవిష్యత్తులో మిమ్మల్ని మించిపోయేలా , మిమ్మల్ని మరింత ఆనందింపచేసెంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ...

  ReplyDelete
 4. చాలా బాగున్నాయి. Best wishes to బుల్లి usha in the making. :)

  చందమామది బాగా నచ్చింది.

  "I try to reach for it in the sky,
  But miss and get a star instead"

  :)

  Looooved it! చేపది కూడా, అమ్మది కూడా...

  ఏదైనా సరే చేసి, ఇంకా రాయించండి!

  ReplyDelete
 5. మీలో చాలా కళళున్నాయండి. బహుసా అవే మీపాపకీ వచ్చుంటాయి.చాలా బాగా రాసింది.ముందు ముందు తను తెలుగులో కూడా ఒక మంచి కవిత రాస్తుందని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 6. మీ అమ్మాయి పేరు ఎమీటి? ఎమీ చదువుతున్నాది. చాలా బాగా రాసింది అనే కన్నా మీ పాప చూడ బోతె రాయటానికే పుట్టినట్లుంది. మీ పాపకు శుభాబివందనలు.

  ReplyDelete
 7. Hello, first of all I like to thank everybody who commented on my poems that were posted on my mother’s blog as a surprise to me. Currently I am learning to write poems in Telugu from none other than my awesome mom. And for some who wonder who I am my name is Sneha and I have just completed 5th grade. My favorite and most successful subject to write on is the moon and so here is an instant poem on the moon:

  Shining and bright but stands alone,
  A place of which we all adore,
  Seen at night with some stars,
  On a wrapper for some bars,
  The place I speak is the moon,
  Now I see it… now I feel it.

  ReplyDelete
 8. వు పిట్ట కొంచం కూత ఘనం గా వుంది. చాలా బాగా రాసావురా బంగారం. నీకు తెలుగు చదవటమొచ్చుగా అందుకే తెలుగు లోనే అభినందనలు.
  బంగారు తల్లి ఇంతింతై ఎంతెతైనా
  ఎన్నెన్ని ఘనతలు తెచ్చి అమ్మ వొడి లో పోసినా
  బంగారు తల్లి అమ్మకు చిన్నికూతురే
  ఆ రతనాల రాశి అమ్మ తో కలిసి పరుగెత్తే ఇంకో ఉషే.... :-)

  ReplyDelete
 9. చాలా చాలా బాగా రాసింది. మీ హస్తాలు అలవోకగా పట్టిన ముద్రిక చాలా బాగుంది.

  ReplyDelete
 10. :D Thats wonderful Sneha. Best wishes.

  ReplyDelete
 11. మాలాగారు, మధుర, కల్పన, మెహెర్, రాధిక [నాని], అనానిమస్, భా.రా.రె, భావన, సునిత, సుజ్జీ, తన చిరుకవితలు చదివి స్పందించిన మీ అందరికీ నా తరఫునా, స్నేహ తరఫునా ధన్యవాదాలు. తను చాలా సర్ప్రైజ్ అయింది [ముందుగా చెప్పలేదు]. చక చకా జవాబు రాసేసింది. కొన్ని ప్రశ్నలున్నాయి అలాగే సూచనలు. అందుకు ఇంకాస్త వివరంగా సమాధానాలు రాస్తా.

  ReplyDelete
 12. కల్పన, నా కలలన్నీ నెరవేరవు [అందరికి మల్లేనే] చూడాలి తన విషయంలో ఏమౌతుందో..

  భావన, వంట, తోటపని, ధ్యానం ఇలా ఒకటొకటి నా అభిరుచులు తనవీ అయిపోతున్నాయి. అలాగే వ్యాపకాలు - పుస్తకాలు, పరుగులూను. మొన్న నా పదమూడు మైళ్ళ మారథాన్ పరుగునాడు, తను 5K పరిగెట్టింది. నిజానికి ఇద్దరం మంచి స్నేహితులం ఇప్పుడు.

  ReplyDelete
 13. మెహెర్, తనది చాలా స్వేఛ్ఛాప్రవృత్తి.. దానికి భంగం వాటిల్లకుండా సాధన/కృషి చేయించాలని ప్రయత్నిస్తున్నాను.

  తనలోని సృజన నాకు చాలా ఇష్టం. విపరీతంగా బుక్స్ చదువుతుంది. ఒక రీతివి కాదు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, మెడికల్ జర్నల్స్,లీగల్ డాక్స్ అసలు అర్థం అవుతాయా అనిపించేంత వరవడిగా అలవోగ్గా చదివేస్తుంది. అలాగే పిల్లల పుస్తకాలు ఒక్కో సిరీస్ నమిలిపాడేసిమ్ది.

  అనానిమస్ గారు, తన పేరు స్నేహ. వయసు పదకుండు. అయిదో తరగతి పూర్తయి వేసవి సెలవల్లో ఉంది.

  సునిత, మీకు చాలా థాంక్స్..మీరొక్కరే నా ముద్రని పట్టారు :)

  మాలాగారు, అచ్చంగా అమ్మమ్మ మాదిరిగా భలే. థాంక్స్.

  మధుర, అవును మంచి లక్షణాల జీన్స్ అన్నీ నావే ;)

  ReplyDelete
 14. పులి కడుపున పులే పుడుతుందన్న నానుడి నిజమైంది. కళల మాతృమూర్తికి వారసురాలిగా తను ఎదగాలని మనసారా కోరుకుంటూ...
  ఏమైనా తనని ఇండియాలో పెంచకూడదా? ఎందుకో ఇలా అడగాలనిపించింది...

  ReplyDelete
 15. కెక్యూబ్ గారు, మొదటి లైన్ చదవలేదాండి? అది నా ప్రాణం. దాన్ని విడిచి నేను ఉండలేను [ఇప్పటికి] అలా ఎప్పటివరకు సాగితే అందాక వదలను. ఇప్పటి వరకు ఎక్కడా వదిలుండలేదు. కానీ మీ అభినందన కి థాంక్స్. ఏదో ఆలోచనలో చెప్పిన సలహాకీ నెనర్లు. పిల్లలు ఎదగాల్సింది తలీతండ్రుల చేతుల్లోనే అని నా ప్రగాఢ నమ్మకం.

  ReplyDelete
 16. మీ అమ్మాయికి హృదయపూర్వక అభినందనలు. ఇంకా బాగా రాయాలంటే బాగా కవిత్వం చదివించండి. ( అందరికీ తెలిసిన విషయమే, గుర్తు చేస్తున్నా ! )

  ReplyDelete
 17. good works...convey my best wishes to her...my daughter too is on her way...:)

  ReplyDelete
 18. ఉషగారూ తనకి మన నేపథ్యం, వాతావరణం, ఇక్కడి మనుషులతో ప్రత్యక్షంగా వున్న అనుభవం మరింతగా తనని మన సమాజానికి దగ్గర చేస్తుందన్న వుద్దేశ్యమే తప్ప మీనుండి దూరం చేయాలని కాదు. తల్లిదండ్రుల దగ్గర పెరగడమే మంచిది. కానీ మన నేటివిటీ తాను పట్టుకోలేదేమోనని. మీలా అంత ధైర్యం అలవడుతుందా? మన మొండితనం, నిబ్బరం etc...
  సారీ చొరవ తీసుకున్నందుకు.

  ReplyDelete
 19. @జీవని గారు, కెక్యూబ్, తప్పకుండానండి. తనకి చెప్పాను అలాగనే. "నాన్న, నన్ను ఒకరు 'సాధన లేదు నీకు' అన్నారు. నువ్వు నాలా కాకూడదు అని. "సరే చదువుతాను. కానీ ఏ సాధనైనా నా ఫ్రీడం ప్రెఫరెన్స్ ఇంపాక్ట్ చేస్తే నాకు నచ్చదు." అంది. కానీ చాలా కుదురైన ధైర్యవంతురాలు. చెప్పిన సమయానికి మీటింగ్ రాని టీచర్ ని ఆరేళ్లకే వెళ్ళి నిలదీసిన ఘనురాలు. ఒక్కోసారి జీవితం పట్ల కొత్త కోణాలు తన ప్రశ్నల వలనే దృగ్గోచరమౌతాయి. ఇవి మరొక చిన్నారికి స్ఫూర్తి అని రాసేవే కానీ అవాస్తవాలు కావు. ఇక నేపథ్యాలు అవీ ఈనాటి యుగమ్లో ఎక్కడ ఉన్నా సృష్టించవచ్చును. ధన్యవాదాలు.

  @తృష్ణ, మరికనేం త్వరలో బుల్లి తృష్ణ మరో ఐదు బ్లాగులు మొదలుపెట్టాల్సిందే.. నిజానికి యువ నూటికి తొంభై పాళ్ళు తీసుకున్నాడు నా నుమ్చి [మా అబ్బాయి] స్నేహ మాత్రం యాభై శాతం, మిగిలిన యాభై నన్ను పడేయటానికి సమాయత్తమౌతూ తీర్చుకుంటున్న తీరు. అదే నాకూ కకావాలి. గుడ్డిగా నన్ను అనుకరిమ్చకుండా తనదైన బాణీలో ఎదగలి/నడవాలి. నెనర్లు.

  ReplyDelete