పూపొదరిల్లు - పుస్తకలోకం

నా బెండ మొలకలు
తోట మొత్తం ఇక్కడ నొక్కి వీక్షించండి

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో " -
గుంటూరు శేషేంద్ర శర్మ

తోట పనిలో ఉండే తాదాత్మ్యత అనుభవంలోకి వచ్చిన వారికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నా వరకు జీవితంలో ఒక భాగం తోటపని. "నా పాతిక సంవత్సరాల శోధనలో దొరకని ప్రశాంతత తోటపనిలోనే లభ్యమైంది." అన్న ఒక సన్యాసిని మాటలు చదివాక నా నమ్మకం మరింత దృఢపడింది. నిజానికి ఇది ఆరాధనా లేక అభిరుచా అన్నది నేను చెప్పలేను. క్రింద చిత్రం ఇవాళ తెల్లారుఝామున తీసినది. ఉదయారుణ కాంతుల్లో మౌనమూర్తి నా తోటని చూస్తే తెలియని అనుభూతి.


ఏ నిశిరాత్రీ నిలవదు, ఇలా ఉదయారుణ ఆశగా పరావర్తించకా మానదు..

మా ఊర్లో మిణుగురులు ఈ ఋతువులో చాలా వస్తాయి..ఎన్నంటే చుక్కలన్నీ ప్రాణం పోసుకుని, దివికి దిగివచ్చి విహారానికి వచ్చాయేమోంతగా.. అలాగే ఇక్కడి కీచురాళ్ళు కూడా చాలా ఎక్కువ ద్వని చేస్తాయి..ఒక్కోసారి నిశిరాత్రుల్లో ఆటల పాటల తేలే ఆ జీవుల్ని చూస్తే నాకూ అలా మారిపోగలిగితేనో/పరకాయకాయ ప్రవేశం చేస్తేనో అనిపిస్తుంది.

నా బదులు తాము ఆ పని చేస్తున్నట్లు మొగ్గలన్నీ పూలై తలలాడిస్తాయి. మౌన గీతాలు పాడి మనసునలరిస్తాయి. నాకూ పేరు తెలియనన్ని ఈ మాదిరి గడ్డిపూలు నా చిన్నప్పటి నుంచీ నన్ను అబ్బుర పరుస్తూనే ఉన్నాయి.



గడ్డిపూల జాతర ఆపతరమా?

ఇక ఈ శోభాయామాన ప్రకృతిలోకి ఇక మీరెవరి పయనం వారే కానీయండి...

అన్నట్లు ఈ ఏడు నా తోటపని గూర్చి ఓ రెండు మాటలు. ప్రతి సంవత్సరం కొన్నైనా కొత్త రకాలు పెడతాను.


కూరగాయలు, దుంపల వరకు కొత్తవి tomatillo , ఈ కొత్త మొక్కేమిటో అని ఆసక్తి కలిగితే ఇదిగో ఇక్కడ చూడండి. ఐదారు రకాల చిలకడదుంప


ఇక కొత్త పూల రకాలు మీరు వచ్చి చూసి పేరు పేరునా పలుకరించి తీరాల్సిందే.

ఇంత చక్కని పూపొదరింట, కూరగాయల తోటలో అంతే చక్కని అనుభూతి ఇచ్చేదే పుస్తక పఠనం. కాదంటారా? కాకపోతే నాకు ఈ రెండు పనుల వలన ఎరిక మరిచిపోయేంత భాగ్యం కలుగలేదు, కనీసం ఆ దిశగా నేను నా మనసుని మలచలేదు కానీ ఈ పనుల్లో లీనమౌతూనే నేపధ్య సంగీతం మాదిరి నానమ్మ నాతో కలిసి చేసిన తోటపని జ్ఞాపకాలో, నాన్నగారు చదివించిన పుస్తకాల తాలూకు ఘడియలనో కలుపుతాను.


అలాగే నా తోట ప్రక్కనున్న చెరువులోని ఈ జలపుష్పాలకి రొట్టెలు తినిపిస్తూ.. ;)


మీనమా, నీ సొగసు చూడ తరమా?

ఈ ఏటి తాజా మొక్కలివిగో ఇక్కడ నొక్కి చూడండి. మీ మనసుకి నచ్చిన చిత్రమో, కాప్షనో తప్పక ఉండి తీరుతుంది. వచ్చే నాలుగు నెలల్లోనూ మరిన్ని ఫల పుష్ప చిత్రాలు ఇక్కడ చోటుచేసుకోనున్నాయి. ఇక గత ఐదేళ్ళవీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి.

ఇంతవరకు ఏకకాలంలో ఒక రచనే చదివేదాన్ని.. ఈ మధ్యన అలా కాదని కొన్ని పుస్తకాల పఠనం ఒకసారే మొదలుపెట్టాను. అలవాటు కానిదైనా, ఆకళింపుకి వచ్చే వరకు నిదానంగా చదువుతున్నా ఈ పద్దతీ బావుంది. తోటలో కొత్త మొక్కల్లా, చదువులో ఈ కొత్తదనం అన్నమాట. ఏమి చదువుతున్నాను అంటారా?

ప్రతి వనమాలీ చదివే తీరాల్సిన పుస్తకం:
The Education of a Gardner - Russel Page

వృక్షో రక్షతి రక్షితః - సీతారాముల్లా లేరు?
ఇక మిగిలిన పుస్తకాల మాట:

భ్రమణకాంక్ష - ఎం.ఆదినారాయణ
బాల [1945-1959] విహంగ వీక్షణ సంపుటి
ఖాళీసీసాలు - స్మైల్

The Road Less Traveled [Two parts] by M. Scott Peck

Things a Computer Scientist Rarely Talks About by Donald E. Knuth

ఈ చివరి పుస్తకం మీద సమీక్షలో రాయబడిన ఈ క్రింది వాక్యం అలా మనసు మీద పడిపోయింది.

God definitely wants people to be actively searching for better understanding of life's mysteries


అలాగే "Creativity, Spirituality, and Computer Science," మూడూ నా ఆసక్తులకి ఆనవాళ్ళు కనుకా ఈ పుస్తకం నా చేతిలోకి రావటం జరిగింది.

అలా ఏదో ఒక కారణం గా నా లోగిలి లోకి వచ్చిన ఇవన్నీ అచ్చుప్రతుల్లోనివి. ఇవికాక కొన్ని ఆన్ లైన్ రచనలు అలా అలా కలదిరిగి చదివేవీ ఉన్నాయి. కానీ, ఇది చదవండి అని కానీ, చదివినదాని మీద కానీ వ్యాఖ్యానించేంత శక్తి, సామర్థ్యాలు నాలో లేవు. ఇది చదివినవారు కొందరి దృష్టి అటు మళ్ళించటం తప్ప.

గువ్వపిట్ట - ఎదగటానికి గూడు చాలా?

ఏదో తెలిసీ తెలియని రాతలు ఇక్కడ పెడుతున్నా ప్రోత్సాహానికి మాత్రం కొరవలేదు. మరోసారి బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు. కానీ "
ఇప్పటికీ నాకు రాయడం కన్నా మహానుభావుల రచనలు చదువుకోవడంలోనే ఆనందం ఎక్కువ. ఎందుకంటే మనం మన సొంత ఆలోచన అనుకున్నది ఎవరో ఎక్కడో ఎప్పుడో రాసే వుంటారు - శ్రీ రమణ" ఈ మాటలు చదివి సాలోచనలో పడనివారుండరేమో, నాలోను అదే. నా తోట కూడా ఈసారి మరీ ముద్దుగా మురిపిస్తుంది, వదలాలని లేదు. అందుకని మరి ... :)


కాలం నింపుతున్న కావడి బిందెలు
మనసు దుబ్బుల్లోకి తొణికితే,
కన్నీటి గంగావతరణం అన్నట్లే..

గతం నింపుతున్న లంకె బిందెలు
మనుగడలో పాతుకుపోతుంటే,
రేపు కొరకు అన్వేషణ సాగినట్లే..

అక్షరాల హస్తాల్లో గోరువెచ్చని స్పర్శ,
పదాల పాదాల్లో ఆనంద నర్తన,
వెదికే మనసుకి లేనిది ఏది..


ఈ ఏటి గార్డెన్ : http://picasaweb.google.com/ushaa.raani/2010#
మునుపటివి: http://picasaweb.google.com/ushaa.raani/MyGarden#

23 comments:

  1. నాకు మీ ఇల్లు మీ తోట ...సూర్యోదయం లో మీ తోట పిచ్చి పిచ్చగా నచ్చేసాయి ...చెప్పాలంటే కాస్త (బోల్డంత )జలసీ గా వుంది .మీకు దగ్గరలోనే నా అభిరుచులు .

    ReplyDelete
  2. ఎంత బాగుందో మీ తోట .

    ReplyDelete
  3. ఎంతబాగుందో మీ పొదరిల్లు.

    ReplyDelete
  4. పాత గార్డెన్ ఫొటోలు తనకి చూపిస్తే మా అమ్మయి అన్న మాటలు రాస్తున్నానండీ....
    "ఇవన్నీ ఉంటే ఇంక వాళ్ళు కూరలకి వెళ్ళఖర్లేదు.." అంది...:)

    ప్రస్తుతమ్ ఏమీ పెంచటం లేదు కానీ పాత రాతి యుగంలో నేనూ పెద్ద తోటను పెంచానండీ.....:)

    ReplyDelete
  5. వినయ్ గారు, ధన్యవాదాలు.

    "ఉత్తమ సాహిత్యం జీవితాలని మారుస్తుంది. మనసుకి జవసత్వాలని అందిస్తుంది.." - 'ఈ శలభం ఏ దీపం కోసం?' కాశీనాధ & కాశీనాధ [April 1999] స్వాతి అనుబంధనవల నుంచి. మొదటిసారి చదివినపుడే ఆ రచనలోని ఒక కవిత బాగా నచ్చింది. ఈ మధ్యన మళ్ళీ చదివాను. ఆసక్తి ఉన్న పాఠకులకీ చదివే అవకాశం కల్పిద్దామని...

    ఈ శలభం ఏ దీపం కోసం?
    ఈ హరిణం ఏ వ్యాఘ్రం కోసం?
    ఈ విహగం ఏ లుబ్ధకు కోసం?
    ఈ కుసుమం ఏ ఘట్టన కోసం?
    ఈ హృదయం ఏ ఛురికల కోసం?
    ఈ సహనం ఏ హననం కోసం?
    ఈ విభవం ఏ దంష్ట్రం కోసం?
    ఈ జ్వలనం ఏ శమనం కోసం?
    ఈ భవనం ఏ కంపం కోసం?
    ఈ పయనం ఏ గమ్యం కోసం?
    ఈ మధనం ఏ గరళం కోసం?
    ఈ శపథం ఏ ఓటమి కోసం?
    ఈ కెరటం ఏ పతనం కోసం?
    ఈ కవనం ఏ బధిరుని కోసం?

    ********************

    ఈ బింధువు ఓ సింధువు కోసం!
    ఈ మధనం ఓ అమృతం కోసం!
    ఈ కెరటం ఓ ఉధృతి కోసం!
    ఈ పయనం ఓ గమ్యం కోసం!
    ఈ అనలం ఓ యజ్ఞం కోసం!
    ఈ క్షితిజం ఓ ఆమని కోసం!
    ఈ కవనం ఓ సంస్కృతి కోసం!

    ReplyDelete
  6. ఉషాగారు , చిన్నిగారికే కాదు నాక్కూడా ........

    ReplyDelete
  7. పరిమళం, తప్పకుండానండి. అతిథుల్లేక తోట, వాకిలి, లోగిలి అన్నీ వెల వెలబోతున్నాయి.. నిన్ననే కాస్త హుషారు ఎక్కువై మళ్ళీ నా బుక్ షెల్ఫ్ లో వెదుక్కుని 'వందేళ్ళ తెలుగు కథ" , "కాడి, వలసదేవర" జంటనవల "ఒకేఒక్కడు" Great Expectations బయటకి తెచ్చాను.. నా అభిరుచి నచ్చుతుందంటే హాయిగా అలా ఎగిరి వచ్చేయటమే.. మీకైతే బెల్లం ఆవకాయ కూడా షేర్ చేస్తాను - మీరెలాగూ సున్నుండలు, పూతరేకులు, చెగోడిలు, రేగి వడియాలు తెస్తారుగా..[ఎంత తెలివో చూసారా? ]

    ReplyDelete
  8. హాయిగా..హుషారుగా.. తోటలో షికారు పోదమా...అనిపిస్తోందండీ! :-)

    ReplyDelete
  9. మధురా, మరికనేం. Book Nook కి కూడా సిద్దమైరండి. మీ సంచులు నాకు నా సంచులు మీకు మార్చుకుని తోటలో షికారు, పుస్తకాల్లోకి విహారాలు చేసేద్దాం.

    ReplyDelete
  10. ushgaaru just read abt ur donation to jeevani.....

    "Manchi pani chesaaru....very good,thx...."

    ReplyDelete
  11. vinay garu thank u from our side

    ReplyDelete
  12. వినయ్ గారు, మీ వలనే తెలిసింది. పంపినరోజునే జీవని గారు ఇంత పని చేసేస్తారని తెలియలేదు..ఇప్పుడు ఇదొక ప్రచారం మాదిరి కాకపోతే చాలు. ఈ సమాచారం ఇంకొకరు ముందుకు వచ్చేలా చేస్తే మరింత ముదావహం.

    మా స్వంత విద్యా సేవా సంస్థ జన్యా ఉంది. http://janyaa.org/

    అలాగే మరికొందరు మిత్రులు/బంధువులు నడిపే మరొక ఐదు సంస్థలకి మా సహకారం ఉంది. కనుక వీటి వెనుక స్ఫూర్తిని గూర్చి ఇక కాసిని కబుర్లు, కహానీలు ఎప్పటిలానే...
    * * * * *
    సరైన సమయమని చెప్పాలనిపించి..
    మా తాతగారు గొప్ప దానశీలి[ట] ఆయన మాత్రమే కాదు, అమ్మ,నాన్నగారు దేవాలయ సంబంధిత, దానధర్మాల తో పాటుగా బంధువర్గాల్లోనూ చితికిన వారికి తగు సాయపడేవారు. నాకు చిన్నప్పటి గురుతులివి. ఆపై ఉపనిషత్తు వివరణలో చదివాను ఏడింట మూడు తన స్వకార్యానికి/స్వంతానికి కాక పైన చెప్పిన పనులకి వినియోగించాలని...అది మాత్రం నా మీద ముద్ర వేసింది. ఇప్పటికి పదికి ఒక వంతు స్థాయికి రాగలిగాను. అలాగే మా పిల్లలూ సేవా కార్యక్రమాల్లోకి వెళ్తారు. స్నేహ హెయిడీకి తనంత తను తిరిగి పోగేసిన మూడు వందల డాలర్స్ పంపటం నాకు తృప్తి. ఇవీ రోల్ మోడల్స్ కదా.

    నాది స్త్రీలు, వృద్దులు, పిల్లల వైపు సాగే సేవలు. అందులో భాగం గా కొన్ని అనుభవాలు. ఇంకా జరిగినా ఇవి ఆ బాణీల్లో మొదటివి.

    హైదరాబాదులో ఉద్యోగం చేసినప్పుడు పాత కాగితాలు ఏరే ఓ మామ్మ వచ్చేది..అలా కొన్నాళ్ళకి పరిచయం.. భోజనం లేదా ఓ గ్లాసు పాలు/మజ్జిగ, ఆమ్లెట్ వేసి ఇచ్చేదాన్ని.. "ఈ పని మానేయ్, నా మొక్కల పని చూడు నాతోనే ఉండు" అంటే మాత్రం సాయంత్రానికి పారిపోయేది ఏదో ఒక సాకుతో.. ఓ సారి కొత్త చీర, దుప్పటి అవీ కొనిచ్చాను శీతాకాలం రాగానే.. మర్నాటికి మళ్ళీ పిచ్చి వాలకం తో వచ్చింది.. వాచ్మన్ చెప్పాడు..నేను ఇచ్చినవి అమ్మేసి సారాయి తాగేసిందని..బోరున "బిడ్డా నీ కాల్మొక్కుతా.." అని ఏడుపు.. మళ్ళీ మామూలే..అలా అక్కడ ఉన్నంత కాలమూను..

    వైజాగ్ లో చదువుకునే రోజుల్లో మా లాబ్స్ దగ్గర ఓ పిల్లాడు దీనం గా అడుక్కుంటుంటే ఇల్లెక్కడా అని అడిగి నాతో తీసుకెళ్ళి అప్పజెప్పి వచ్చాను..చదివించండి, నేను మళ్ళీ వస్తాను డబ్బు సాయం చేస్తానని..మళ్ళీ వారానికి లైబ్రరీ దగ్గర అడుక్కుంటూ.. ఈసారి కోపమొచ్చి వెంటపడి పట్టుకుని అడిగితే అమ్మనే పొమ్మంది అడుక్కురమ్మని అన్నాడు. ప్చ్..

    ఓ సారి ప్రయాణం మధ్యలో సూర్యాపేట దగ్గర ఓ తాత "డబ్బు కొట్టేసారు. ఊరు పోవాలని" గోల గోలగా అరుస్తూ అడుక్కుంటుంటే పర్స్ లో మొత్తం తీసి చేతిలో పెట్టేసా..మా తిరుగు ప్రయాణంలో మళ్ళీ అదే పిలుపు.. బాధ వచ్చింది. ఎందుకిలా మోసాలు అని.. ఏమో ఆకలిదప్పులు అలా అన్నీ మరిచిపోయేలా చేస్తాయేమో కదా..

    నా జాలిగుణాన్ని వాడుకుని భబ్రాజిమానాన్ని చేసేవారే ఎక్కువ..ఒకరు మోసగించారని తెలిసినా మరొకరు అర్థిస్తే ఆగలేను..

    ReplyDelete
  13. ఒక సారి ఇలా నేను చాలా వ్యధ చెందానండీ, నేను స్కూల్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి తాను ఓ పత్రికా విలేఖరిని అని పరిచయం చేసుకున్నాడు. మా స్కూల్ సమస్యలు ఉంటే చెప్పమన్నాడు. నేను ఏమీ లేవని చెప్పాను. ఓ వారం రోజుల తర్వాత అతను ఫోన్ చేసి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు ఓ 1000 ఇవ్వండి మళ్ళీ ఇస్తాను అన్నాడు. అతన్ని నమ్మాలా ఒద్దా? అది తిరిగి రాదు అని తెలుసు. రాకపోయినా ఫర్వాలేదు. కానీ మనం మోసపోయాం అని తెలిస్తే బాధ. మొత్తానికి డబ్బు ఇవ్వలేదు. కానీ చాలా రోజులు నన్ను ఇది వెంటాడింది. నిజంగా సమస్య ఉందేమో అని.

    అన్నిటికంటే ఎక్కువగా భయం వేసేది, ఒకసారి మోసపోతే మొత్తం మీద నమ్మకాన్ని ఎక్కడ కోల్పోతామో అని. బండలా మారిపోతామేమో అని...

    ReplyDelete
  14. Jeevani garu,

    If Rs.1000/- was not a big amount 4 u..

    You might have helped him at that time..

    ReplyDelete
  15. @USHA garu,

    You are a true service-oriented person..

    I pray the God..to give you a great energy

    to help the needy..

    ReplyDelete
  16. meeru elanti vaarini join chesukuntaaru and......enta expenditure avutundi per child cheppagalara.........


    jeevani vaalllu school only for orphans kosme pedutunnatlunnaru...first ivi baane vntaayi next funding ela ani naaku pedda doubt.

    mee phone nums ivvagalara
    vinaychakravarthi@gmail.com

    ReplyDelete
  17. ramnarsimha గారు, మీ నోటిచలవగా నాకలా సహకారమందించగల అవకాశం, వెసులుబాటు ఇలాగే సాగితే తప్పక చేస్తానండి. ముమ్మారు తొంగిచూసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  18. జీవని గారు, కొన్నిసార్లు ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ [సారీ అండి సరీగ్గా ఇదే అర్థం వచ్చే తెలుగుపదాలు ఉన్నాయేమో కానీ బుర్ర పనిచేయట్లేదు] ఆప్లై చేసి తీసుకునే నిర్ణయాలు తదుపరి సమయంలో కాస్త బాధిస్తాయి, తప్పదు. ఇంత విస్తారమైన జీవితంలో కొన్ని ఆలోచనలు, చేతలు అలా మనకే అరుచిగా తోస్తుంటాయి. ఇవాళే అనిపిమ్చింది -- ఈ అనుభవాలతో ఓ టపా రాద్దామని. నేర్చుకునేదేమీ లేదు కానీ మనని మనం సమీక్షించుకోవచ్చునని. నెనర్లు.

    ReplyDelete
  19. వినయ్ గారు, మీ ప్రశ్న నాకా? జీవని గారికా? మాది స్కూల్స్ లో డ్రాప్ రేట్ తగ్గించటానికి సాధన చేస్తున్న సంస్థ. ప్రస్తుతానికి ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో ఆధ్యాపకులకు, విధ్యార్థులకి శిక్షణ ఇస్తున్నాము. మా సైట్ లో అన్ని వివరాలూ ఉన్నాయి.
    http://janyaa.org

    మా సంస్థ నిర్వహించే వివిధ ఫండ్ రైజర్ కార్యక్రమాలను గూర్చిన బ్లాగు http://janyaa.wordpress.com/

    నేను స్థానికంగా శనివారాలు తెలుగుబడి నడిపి ఆ ఆదాయం కూడా జన్యా సేవల కొరకు తరలిస్తాను.

    మాకు డొనేట్ చేయాలనుకుంటే వివరాలిక్కడ http://janyaa.org/donate.php

    [All donations to Janyaa are tax-deductible.

    Can we interest you to donate $20 per pay check? It takes just $20 to educate a child for 1 whole year. ]
    **********

    మీ ప్రశ్న జీవని గారికైతే వారు మీకు ఈసరికే వివరాలు అందిమ్చి ఉండాలి. నెనర్లు. మీరిచ్చే తదుపరి వివరాలను బట్టి వ్యక్తిగత ఉత్తరం రాస్తాను. ఈ సమాచారం అందరికీ ఉపయోగమని రాసానిక్కడ. అన్యధా భావించవద్దు.

    ReplyDelete
  20. @JEEVANI garu,

    Thanks..for reply..

    ReplyDelete