విశ్వామిత్ర-10

మిత్ర అమెరికాకి వచ్చి రెండున్నర యేళ్ళు అయిపోయాయి. ఒక్కసారి తాతగారి వూరు వెళ్ళి రావాలన్న ధ్యాస పెరిగిపోయింది. ప్రయాణం పెట్టుకుంది. సెలవులన్నీ కలిపి నాలుగు వారాలకి వెళ్ళిరావటం.

వర్క్ లో క్లీన్ రాప్ అప్ చేసి హాండ్ ఆఫ్ చేయటం, కాస్త షాపింగ్, సర్దుకోవటం. దాదాపుగా ఒక నెల కాలం హడావుడిగా గడిచిపోయింది.

విశ్వ ఈ మధ్య రానూ లేదు ఒక మూణ్ణెల్లుగా, ఈ నెలగా పెద్దగా మాట్లాడుకోనూ లేదు. అతను ఎప్పటిలానే ఫోన్ చేయటానికి చొరవ చేయకపోవటం, తనకి కుదరకపోవటం ఓ కారణం. ఈ-మెయిల్స్ మట్టుకు వారాకొకసారన్నా అటు ఇటు వెళ్తున్నాయి.

శనివారం ప్రయాణం. శుక్రవారం రాత్రి అతనికి ఫోన్ చేసింది.


"విశ్వ!ఈ సారి మీరు ఇక్కడకి వచ్చినపుడు నేను వుండను" మిత్ర మాటల్లో దాగని దిగులు.

అటునుండి నిమిషంలో సగం సేపు పాటు మౌనం. "అవును మిత్ర, అక్కడ ఎక్కువ ప్రయాణాలు వున్నాయా?" మాట మారుస్తూ అడిగాడు.

"పెద్దగా లేవు, నవీ కూడా అటునుండి చంటిపిల్లలతో వస్తుంది. తాతగారి దగ్గరే మకాం. దిగగానే ఎలాగూ విష్ణుని కలుస్తాను." అంది.

"అక్కడనుండి ఏమైనా కావాలా" తనే అడిగింది. "సరదాగా గడిపిరండి." అన్నాడతను.

అలా పొడి పొడిమాటలే ఆ కాల్. ఎదురుబొదురుగా వుంటే కాస్త నయం. కనీసం "ఐ మిస్ యు" అనన్నా అనలేదు. కాస్త కినుక వచ్చింది. అంతలోనే నవ్వూ వచ్చింది. తానింకా అతనితో తన మనసులోని మాట చెప్పనిదే అసలే బిడియస్తుడు అంత త్వరగా బయటపడతాడా!

*************************************************

ప్రయాణం సాఫిగానే జరిగిపోయింది. మూడో నాటికి ఇల్లు చేరింది. సురేంద్ర, కస్తూరి కూడా హైదరాబాదు లోనే రిసీవ్ చేసుకున్నారు. మాధవయ్య గారి లోగిలి కళకళలాడుతూ మిత్ర రాకకి మురిసిపోతుంది.

లక్షిదేవమ్మ గారి హడావుడి ఇంతా అంతా కాదు. గుమ్మంలోనే కొబ్బరికాయ దిష్టి తీయించిపడేసారు. సుబ్బాలు సంబరం దాగని కళ్ళతో మిత్ర ని అలా తడుముతూ కబుర్లాడుతూ కూర్చుండిపోయింది.


"అమ్మలు, బడలిక తీరుతుంది కాస్త వేడి నీళ్ళతో నలుగుస్నానం చేయి తల్లీ." నానమ్మ మాటకి తలాడిస్తూ లేచివెళ్ళింది.

సాంబ్రాణి వేస్తూ అడిగింది సుబ్బాలు "మిత్రమ్మా! బారెడు జుట్టు ఇలా మూరెడు చేసేసావేమ్మా?"

చిన్నగా నవ్వింది మిత్ర. "అక్కడ జుట్టు దానం చేయొచ్చు. ఇక్కడ మనం మొక్కుకుని ఇవ్వమా అలాగే అక్కడాను. ఓ మంచి పనికోసం కత్తిరించి పంపాను" అంది.

కాస్త ఆశ్చర్యం దోగాడే కళ్ళతో సుబ్బాలు ఏదో అనేలోపే తనే చెప్పింది "కాన్సర్ వచ్చిన చిన్న పిల్లలకి తలకి విగ్స్ చేయటానికి జుట్టు తీసుకుంటారు. నేనొక అడుగు బారు తీసి పంపాను."

బుగ్గలు పుణికి "మా బంగారు తల్లి. ఈ మంచితనం మాత్రం మీ నానమ్మదే మిత్రమ్మ. " అంది సుబ్బాలు.

ముందు రెండు రోజులు వచ్చే పోయే వారితో ఓపిగ్గా కూర్చున్నా మూడో రోజుకి కాస్త నీరసపడిపోయింది మిత్ర. మంచం దిగబోతూ ముందుకు తూలింది. సుబ్బ ఆసరాతో ఆగింది. ఆ క్షణం ఒక్కసారిగా విశ్వ గుర్తుకు వచ్చాడు.

సాయంత్రం నుండి కాస్త మబ్బు కమ్మిన ఆకాశం వర్షించటం మొదలుపెట్టింది. మంచం మీద సాగిలపడి అలా నేల మీదకి జారుతున్న ఆ వాన చూస్తుంటే, ఏదో పరవశం.


ఆకాశం కడలిని దోచి దాచిన వలపులు, వాన కన్నె వనరాజుకి రాయబారం పంపుతున్నట్లున్న చినుకు పలుకులు. చిగురాకు వూయలూగి, చిటపట చిందులేస్తున్నాయి. ఆ కన్నె వగలు తనవేనేమో. తన వనరాజు - విశ్వ. చిరుసిగ్గుతో తనువంతా జలదరింపు. ఎడం చెయ్యి చాపి వాన బొట్లు పట్టి, ఆ తడి మీద కుడిచేతి వేలుంచి "విశ్వామిత్ర" అని వ్రాసుకుంది.

ఆ రాత్రంతా వాన అలా కురుస్తూనేవుంది. మాగన్ను నిద్రలో కల.

'మునిమాపు వేళ. తమ వూరి తామర చెరువు ప్రక్కగా వున్న పళ్లతోటలో ఫార్మ్ హౌస్ ముందు పట్టెమంచం వేసుకుని పడుకున్న తాను, దూరం నుండి ఆ చెరువు ప్రక్కగా సైకిల్ తొక్కుతూ వస్తున్న విశ్వ. తన దగ్గరగా అతను వచ్చేసరికి తను లేచి కూర్చుని ఏదో నవ్వుతూ చెప్తుంది. చాపిన అతని చేతిలో తామరాకులో చుట్టిన మల్లెలు. అతని వెనగ్గా గంతులేస్తున్న ఎర్ర ఆవు దూడ. మంచం ప్రక్కన దోరకాయల గుత్తులతో బరువుగా వాలివున్న జామ చెట్టు. తన ప్రక్కన కూర్చున్న అతని శ్వాస తన మెడ వంపున సెగలా తాకుతుంది.'

చెదిరిన కలతో పాటు మెలుకువ.


"సుబ్బాలు" అంటూ పిలవగానే ఆ గదిలోనే ప్రక్క వేసుకున్న సుబ్బాలు వెంటనే పలికింది.

"అలా తోటలోకి వెళ్ళివద్దామా?" అడుగుతున్న మిత్ర ని చిత్రంగా చూసింది. "ఇప్పుడా మిత్రమ్మా! తెలవారిందిప్పుడే. నానమ్మ గారింకా లేవనే లేదు." అంది.

"నిద్ర పట్టదింక. పద" అంటూ దిగింది.

మరో పావుగంటకి బ్రష్ పూర్తి చేసి, చుడిదార్ లోకి మారి, సుబ్బని వెంట పెట్టుకుని బయటకి వచ్చింది. ఈ లోగా లేచిన మాధవయ్య గారు "జాగ్రత్త" అని చెప్పి "వెనక బాసి వస్తాడు" అన్నారు.

*************************************************

నెమ్మదిగా నడుస్తూ, తోట చేరటానికి మరో ఇరవై నిమిషాలు పట్టింది. మధ్యలో రైలు కట్ట దాటుతూ ఆ గేట్ దగ్గర ఆగివున్న స్కూటర్ మీద కనిపించిన దేవేంద్ర అన్నయ్యని చూడగానే సంతోషంగా పలకరించింది.

"వచ్చావని తెలిసిందమ్మా. వదినని వాళ్ళ వూర్లో నిన్నే దింపివచ్చాను. పనుల రోజులు కదా. కాస్త కూలీల్ని పురమాయించి ఆనక అటువద్దామనుకున్నాను" అన్నాడు.

ఓ ఐదు నిమిషాలలా కుశలప్రశ్నలు, క్లుప్తంగా మాటలు జరిగాక మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయాడతను. వదిన మరో వారంలో వస్తుందట. కలవాలి అనుకుంటూ కదిలింది.

కలలో కనపడిన ఆ స్థలానికి రాగానే విశ్వ కళ్ళ ముందు దోగాడుతున్నాడు. ఇవన్నీ తనకి చాలా ఇష్టమైనవి, ఆ తోట, జామచెట్టు, అలా మునిమాపు వేళలు, విరిసే మల్లె మొగ్గలు, వాటితో పాటుగా ఇప్పుడు అతను.

"ఏమిటి మిత్రమ్మా, పరాగ్గా వున్నావు? దిష్టి తగిలి వుంటది." సుబ్బాలు గొంతులో కాస్త ఆదుర్దా మరింత ఆపేక్ష.

"పో అన్నిటికి అలా ముడిపెడతావు" ముద్దుగా విసుక్కుంది మిత్ర.

తన వాళ్ల మధ్యలో ఇలా తన మనసైన వాడి ధ్యాసలో అన్నీ మరిచి కాలమిలా ఆగిపోతే? ఆ కల నిజమై సాగిపోతే. వెచ్చని ఆవిర్లతో మొహం కందింది.

ఆ క్షణం తన ఉద్యోగం కానీ, అమెరికా కానీ, ఏమీ గుర్తుకు రావట్లేదు.


*************************************************

మరో రెండు రోజులకి అత్తగారి వూరు వెళ్ళిన నవీ వూర్లోకి వచ్చింది. ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరికీ కళ్ల నిండా నీళ్ళు. ఓ రెండు నిమిషాలు మాట్లాడుకోలేదు. కాన్పు జరిగి ఆరు నెలలలోపే కనుక కాస్త వొళ్ళు చేసినట్లే వుందింకా. కవలలు, ఒక పాప, ఒక బాబు. ముద్దుగా, బొద్దుగా వున్నారు. పోలికలు వెదుకుదామన్నా తెలియటం లేదు.

"నవీ! మీకిద్దరు మీరిద్దరు భలే.." అంది మిత్ర.

నవీ కళ్ళలో ఏదో దిగులు. మొత్తంగా ఏదో మార్పు. గలగల లాడుతూ వుండే తను కాస్త నిదానించినట్లుంది. కదపనా మాననా అనుకుంది.

"మిత్ర, నీతో మాట్లాడాలే. " తనే ఎత్తింది.

"ఊ చెప్పు. నీ నాధుని గాథలు" కాస్త నాటక ఫక్కీలో అంది.

"ప్చ్, నా జీవిత గాథ ఇది." నిరాసక్తంగా అంటున్న నవీ మాటలో సీరియస్ నెస్ అప్పుడు గమనించింది.

"భరత్ కోసం నా అంత నేను ఎంతో మారాను. ఇప్పుడదంతా పిచ్చితనమనిపిస్తుంది. నాకు తెలియకుండానే నా రెండో వర్షన్ నేను సృష్టించుకున్నాను. నా అసలు నన్ను దాచేసాను. అతని ఇష్టాలు నావిగా అతని ఆనందం నాదిగా అనుకున్నాను." అంటున్న నవీ క్రొత్తగా కనిపిస్తుంది.

"నవీ, ఇవన్నీ నువ్వు అమిత ఇష్టంతో అలవరుచుకున్నవేగా. అతని వత్తిడేమీ లేదు కదా?" మిత్ర కాస్త సంశయంగా అడిగింది. ఇంకా జరినదేదో తెలియదు. అలాగని నవీని గుచ్చి గుచ్చి అడగటం భావ్యం కాదు.

"భరత్ ది చాలా ఇండివిడ్యుయల్ పర్సనాలిటీ. తను తన అనుకున్నదే కానీ నాకోసం ఏ ఒక్కటీ మార్చుకోలేదు. కనీసం ప్రెగ్నన్సీ సమయంలో కూడా అంతే. పైగా నేను అలా అడిగితే 'అలా మారటం నాకు నచ్చదు. మన మధ్య ప్రేమకి అది యార్డ్ స్టిక్ కాదు' అంటుంటాడు." నవీ మాటలకి చూఛాయగా సంగతి అర్థమైంది.

'పోస్ట్ నేటల్ డిప్రెషన్ కానీ ఐడెంటిటీ క్రైసిస్ ' కావచ్చిది. బహుశా భరత్ వృత్తిపర వత్తిడిలో వుండీ నవీని కాస్త అలక్ష్యం చేయటమో, నవీకి అతనలా ఏ ఒక్క విషయమూ మార్చుకోకపోవటం కాస్త మనస్తాపం కలిగించివుండవచ్చు అని అనుకుంది.

దాదాపు మరొక రెండు గంటల పాటు మిత్ర అనునయంగా చెప్పిన మాటలతో నవీ తేలిక పడినట్లే అనిపించింది. కాస్త తేటపడ్డ మొహంతో నవ్వుతూ వీడ్కోలు ఇచ్చింది. మళ్ళీ వస్తానని ఇంటికి బయల్దేరింది.

నవీ ని ఒకటి రెండు రోజులు ఒక్కదాన్నీ కాసేపు ఒంటరిగా బయటకి తీసుకెళ్ళి తన మనసులో కమ్ముకున్న ఆ సందేహాలు తీసేయాలి. నిజానికి ఇది భరత్ గ్రహించి చేయాలి కాని అతనితో తనకంత చనువు లేదు కనుక తన వంతు తాను చేయాలి.

తమ కుటుంబ వ్యవస్థలోని ఈ సన్నిహిత సంబంధ బాంధవ్యాలే మానసికంగా కలిగే అసంతృప్తుల్నీ ఆందోళనల్నీ తీసివేయగలవి. మిత్ర ఆ ఆలోచనల్లోనే నవీతో విశ్వ గురించి చెప్పలేదింకా అని కూడా గుర్తు చేసుకుంది.



*************************************************

విశ్వ మనసులో ఏదో వెలితి. మిత్ర వెళ్ళి మూడు వారాలు. మరొక వారం. మనసాగటం లేదు. ఒక్కసారనా మాట్లాడాలని వుంది. తన దగ్గర వాళ్ళ తాతగారి ఫోన్ నంబర్ లేదు. విష్ణుకి కాని, అనంత అక్కకి తెలుసుంటుంది.

డైరీ చేతిలోకి తీసుకున్నాడు. రాండంగా పేజీలు తిప్పాడు. దాదాపుగా మిత్ర ప్రస్తావన లేని పేజీనే లేదు. పెన్ చేతిలోకి తీసుకుని ఆ రోజు పేజీ వ్రాసుకోవటం మొదలు పెట్టాడు.

"విశ్వామిత్ర" అని వ్రాసి మిత్ర అన్న పదం మీద మళ్ళీ మళ్ళీ దిద్దుతూ ఆగాడు.

"మిత్ర మీద ధ్యాసతో పనిలో కూడా పరధ్యాసలో పడిపోతున్నాను. మిత్ర లోని అందం కావాలి అన్న స్వార్థం నాకు లేదు. నిజానికి తన సంపూర్ణ వ్యక్తిత్వం నన్ను ఆకర్షిస్తోంది. ఒక మనసు మరొక మనిషి కోసం తపించటం అన్నది మిత్ర వల్లనే నాకు అనుభవంలోకి వస్తుంది.

స్నేహం అన్న పునాది బలపడిన ఈ తరుణంలో ప్రేమ మందిరం కట్టి తనని అక్కడ దేవతలా కొలవాలనిపిస్తుంది. పురుషాహంకారం అంటూ కారాలు మిరియాలు నూరే నా బంగారికి నీకు నేను బానిసని అని లొంగిపోవలనిపిస్తుంది. నాలోని భావుకతకి వూపిరి తన వూసే. నాలోని ప్రేమికుని చిరునామా తన నెలవు. తను నేనే వున్న ఈ లోకాన నాకు మరేదీ కావాలనిపించటం లేదు."


కాసేపలాగే సుధీర్ఘాలోచనలో వుండిపోయి, విష్ణుకి ఫోన్ చేసాడు.

"విశ్వ, ఇదేమిట్రా వేళకానివేళలో ఈ కాల్." విష్ణు గొంతులో కాస్త కంగారు. అప్పటికి గానీ టైం సెన్స్ తెలియలేదు. నాలుక్కరుచుకుని, "అదికాదురా, మిత్ర వాళ్ళ తాతగారి నంబర్ కోసమని.." విశ్వ మాట గొంతులో వుండగానే విష్ణు మొదలుపెట్టాడు.

"ఊ ఊ అమ్మగారు ఇక్కడికి రాగానే తన మాటల్లో మార్పు పట్టేసానులే." ఈసారి అతని మాటల్లో ఆటపట్టించే ధోరణి.

"విష్ణు అల్లరి ఆపి ఇవ్వరా ప్లీజ్" విశ్వ కి కాస్త బిడియం అడ్డుగానేవుంది.. నిజానికి తనంత తనిలా చొరవగా మిత్ర విషయంలో ముందుకు సాగటం ఇంకా నమ్మశక్యం కావటం లేదు.

నంబరు తీసుకుని కాసేపు మాట్లాడి పెట్టేసాడు.


*************************************************

అజ్జి తాతతో కూర్చుని కబుర్లాడుతూ, నవీ పిల్లల్ని ఆడిస్తున్న మిత్రకి తాతగారి పిలుపు, "అమ్మలు నీకు ఫోన్" అంటూ.

నాన్నగారైతే చెప్పేవారే ఇంకెవరై వుంటారు అనుకుంటూ లేచివెళ్ళింది లోపలికి.

"హెల్లో మిత్ర నేను విశ్వని" ఆ మాటలో ఒక్కసారిగా ఉప్పొంగిన భావాలు. ముప్పిరిగొన్న సంభ్రమాశ్చర్యాలు. మాటరాని మూగదనం.

యుగాల అన్వేషణ ముగిసి ప్రణయమూర్తి ప్రత్యక్షమైన అపురూప అనుభూతి.

"విశ్వ, ఎలా వున్నారు?" గొంతు పెగలటం లేదు.

మాటలన్నీ చేతికందక రాలిపడే ప్రత్తిపూల మాదిరిగా పెదవి వెనుకే అందీ అందక వూరిస్తున్నాయి.

అవతలి ప్రక్క విశ్వదీ అదే స్థితి. ఇద్దరికీ ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నంత ప్రశాంతత.

"మీతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది." విశ్వ మాటకి ప్రేమసింహాసనం మీద కూర్చుండ బెట్టినంత విజయ దరహాసం మిత్ర మోము మీద తొణికిసలాడింది.

"నాకూ మీరు తరుచుగా గుర్తుకు వస్తున్నారు." మిత్ర నెమ్మదిగా మాటలు కూడదీసుకుని అంది.

ఇద్దరి హృదయాలు కలిసి ఆలాపిస్తున్న గీతం - ఎన్నో యుగాలు అజరామరంగా నిలిచేవున్న ప్రేమ. రాగం అవసరంలేని అనురాగం. తనంత తనుగా ఇరు జీవితాల్లోకి విచ్చేసి ఎవరికీ తెలియని ఓ అనుసంధానం ఏర్పరిచే వరం.

మనసుల సాక్షిగా ఏకమైన ఆ ఇరువురి లోకం ఒకటే. మిత్ర చిరు కవితగా వ్రాసుకుంటే, విశ్వ కంటికాంతుల్లో దోగాడిన అనుభూతి అది.

నేను నీతో కలిసి సప్తసాగరాలు ఈదేసాను, సఫలీకృతురాలనయ్యాను.
సప్తస్వరాలు అలాపించేసాను, సుస్వర గానాలు చేసాను, సప్తపది ఇంకేలా అన్నాను.
సప్తర్షిమండలాలు తిరిగి వచ్చాను, సంతృప్తి సంహితనయ్యాను.
సప్తవర్ణ స్వప్నాలు కన్నాను, గాఢమైన సుషుప్తి చెందాను
.
[సశేషం]

46 comments:

  1. మొదటి సారి చదువుతున్నా, రెండింటికి అర్థాలు తెలియలేదు కాస్త చెప్తారా!!??

    సప్తపదింకేలనన్నాను???
    సుషుప్తి ??
    ఏమి అనుకొకండి తెలుగు లో కొద్దిగా వీకు నేను

    ReplyDelete
  2. రాఘవ్, ఒక మహా సముద్రమంటి ఈ తెలుగు భాషలో నాకు తెలిసిందీ కొంతే. అందులోనే నా అనుభూతులు రంగరించిన భావనల్ని వ్యక్తం చేసుకుంటాను.

    సప్తపది అన్నది - మన వివాహ సాంప్రదాయం. వధూవరులు కలిసి వేసే ఏడడుగులు. మిత్ర తన ప్రేమోద్దీపనలో తనకిక అది అవసరం వద్దని అన్నది.

    సుషుప్తి - ప్రశాంతమైన నిద్ర. స్వప్నాలు వచ్చే నిద్ర కలత నిద్ర. మిత్రకి ఆ రెండూ విశ్వ వలనే కలిగాయి. అదే ప్రేమ చేసే మాయాజాలం.

    భాషలో ప్ర్రావీణ్యత వున్నవారికి మరిన్ని వివరాలు తెలియవచ్చు. కానీ నా వరకు ఈ అర్థం, ఆ ప్రయోగం ఇలా కుదిరాయి.

    అడిగినందుకు థాంక్స్. మీకు తగిన వివరాలు ఇచ్చాననే అనుకుంటున్నాను.

    ReplyDelete
  3. విపరీతమైన హదావిడిలో ఉండి కూడా, మావారి "ఎర్ర కళ్ళ" కన్నుగప్పి.... మీ సీరియల్ కోసం బ్లాగ్ తెరిచానంటే మీరు నమ్మాలి మరి...

    'మునిమాపు వేళ. తమ వూరి తామర చెరువు ప్రక్కగా వున్న పళ్లతోటలో ఫార్మ్ హౌస్ ముందు పట్టెమంచం వేసుకుని పడుకున్న తాను, దూరం నుండి ఆ చెరువు ప్రక్కగా సైకిల్ తొక్కుతూ వస్తున్న విశ్వ. తన దగ్గరగా అతను వచ్చేసరికి తను లేచి కూర్చుని ఏదో నవ్వుతూ చెప్తుంది. చాపిన అతని చేతిలో తామరాకులో చుట్టిన మల్లెలు. అతని వెనగ్గా గంతులేస్తున్న ఎర్ర ఆవు దూడ. మంచం ప్రక్కన దోరకాయల గుత్తులతో బరువుగా వాలివున్న జామ చెట్టు. తన ప్రక్కన కూర్చున్న అతని శ్వాస తన మెడ వంపున సెగలా తాకుతుంది.'


    ఈ కల ఎంత బాగుందో....great narration..!

    "కుటుంబ వ్యవస్థలోని ఈ సన్నిహిత సంబంధ బాంధవ్యాలే మానసికంగా కలిగే అసంతృప్తుల్నీ ఆందోళనల్నీ తీసివేయగలవి."
    ఇది చాలా కరక్ట్ అండీ..

    ఆఖరులోని నాలుగు వాక్యాలూ సూపర్....
    రాఘవగారికి సమాధానం చెప్పాలనున్నా సమయమ్ లెదు...అది మీరు రాసుకోండి మరి...

    interesting as ever...Good work usha gaarU..(but.. iam for sure this can't be a complete fiction.. :) :) )

    ReplyDelete
  4. "మిత్రమ్మా! బారెడు జుట్టు ఇలా మూరెడు చేసేసావేమ్మా?"

    మేమైతే పెద్దగానే నవ్వేసాం. ఆతరువాత వాక్యం చదివి అయ్యో నవ్వానే అని కూడా అనుకునున్నాను.

    "ఆ రాత్రంతా వాన అలా కురుస్తూనేవుంది".. ఏవాన? వలపుల వానేనా? :)

    అయినా 4 వారాలే, రోజుకు 24 గంటలు, వారానైకి 7 రోజులు అనుకుంటే మొత్తంగా మీప్రేమికుల భాషలో చెప్పాలంటే 24,19,200 సెకనులు. ఇంతలా ఎలా సాహసం చేసారబ్బా? :)

    కథనం బాగుంది. కాంటెట్ నిడివి కూడా సరిపోయినట్టే వుంది. తరువాత పోష్ట్ కై ఎదురుచూపులు.

    ReplyDelete
  5. నేనొప్పికోను.. నేను చదివేటప్పుడు ఒక్క కామెంట్ కూడా లేదు. కామెంట్ వ్రాసేటప్పటికి నా నెంబరు 4 గా? మీరే కావాలని తొక్కిపెట్టారు.

    ReplyDelete
  6. సరియే నీకిటుల పరధ్యానంబు ఇలన్
    సరి సరియే మరి విశ్వ భావ సంచలితమౌ మదిన్
    వినవే ఇక బెరుకు మాని సన్నిహితుల నుతుల్
    మరి కొనవే ఇక మొగమాట పడక విశ్వప్రేమ భువిన్....

    ReplyDelete
  7. ఉష గారు మీ పద కూర్పులు చలా అద్భుథంగా ఉన్నయండి..

    వూహల రెక్కలతో వయ్యారాల విహారాలు, విలాసాలు, విలాపాలు.
    ఇది నాకుచాలా బాగా నచ్చింది

    ReplyDelete
  8. మిత్ర భావాల అల్లిక చాలా బాగుంది .
    అమెరికా , ఇండియా ల మద్య హాయిగా వ్యాహ్యాళి చేయిస్తున్నారు .

    ReplyDelete
  9. రాబోయే కథకోసం నా చూపులు ...బాగుందండీ

    ReplyDelete
  10. చదివేసానుగా..... తరువాత ఏం జరిగిందో?????????????:)

    ReplyDelete
  11. Narration is getting better and better. No doubt.

    Now that you are touching many points, and issues (hope you can understand :-)) it is taking come completeness. Continue writing. This is the one I like most. Will be back after a while again.

    ReplyDelete
  12. Just noticed that you changed the profile name. Are you getting more and more closer to this Maruvapu vanam? ;-)

    ReplyDelete
  13. ఉషగారు సంతోషం గా పలకరింపు వేరు , పరామర్శ వేరు మీరు యి రెంటిని ముడి పెట్టి దేవేంద్ర అన్నయ తో యిలాఅయిదు నిమిషాల పరామర్శ సంభాషణ జరిగాక అని రాసారు .పరామర్శ అంటే ఎవరన్నా భందువులు పోయినప్పుడు వాళ్ళింటికి వెళ్లి చేసేది పరామర్శ , బహుశా మీరు కుశల ప్రశ్నలయ్యాక అని రాద్దామను కున్నరేమో?
    ఇంక చెరువు గట్టు , మంచం లేగ దూడలు పరుగెత్తడం యి వర్ణన నాకు village లో వినాయకుడు సన్నీ వేసాల్ని గుర్తు చేసింది , మాటరాని మౌనానికి అడ్డం పట్టే సంఘటనా వాళ్ళ ఫోన్ సంభాషణ అది అనుభవించిన వారికే అర్ధం అవుతాయి .గుడ్ గోయింగ్ కీప్ ఇట్ అప్ .

    ReplyDelete
  14. రవి గారు, థాంక్యూ వెరి మచ్. ఇక్కడ నేను వెంటనే స్పందించి సరిదిద్దాను కనుక వెంటనే సమాధానం వ్రాస్తున్నాను. ఈ మధ్య ఇక్కడనుండి రచనలు చేసేవారొకరు అన్నారు. కొన్ని కొన్ని పదాలు వెంటనే గుర్తుకు రావటం లేదని. వాడకం తగ్గటం, చాలా వరకు ఇంగ్లీష్ లో సంభాషించటం కొంత కారణం కావచ్చు. అసలు ఏ పదమో అన్నది తెలియకపోవటమూ అవ్వొచు. రాత్రి ఈ భాగం వ్రాసేప్పుడు నాకు ఆ పరిస్థితి వచ్చింది. కొన్ని పదాలు అందుకే ఇంగ్లీష్ లో దొర్లాయి. ఇక ఈ పదం అంత విపరీతార్థం ఇస్తుందని తెలియదు. మీ వ్యాఖ్య చూడగానే మార్చాను.

    ఆ సినిమా అక్కడక్కడా బిట్స్ చూసిన గుర్తు. మీరన్నది చూడలేదు. వీలైతే చూస్తాను.

    నాకు నా కలలు బాగా గుర్తు ;) కలల్ని విశ్లేషించుకోవటం కొన్నిటిని వ్రాసుకోవటం అలవాటు. ఈ కథలోకి ఆ కలని కలపానిపించింది.

    అవును కొన్ని అనుభూతులు మాటలకి అందవు. అవి ప్రోది చేసుకునే హృదయాలకీ రాదు విప్పిచెప్పటం చూపటం.

    ఆ చివరి మాటకి సంతోషం.

    ReplyDelete
  15. మీ స్పందన అద్బుతం , విందు భోజనం లో పంటికింద రాళ్ళు రాకూడదనే చదవగానే తప్పు మీ ద్రుష్టి కి తెచ్చా ,
    ఇక పొతే'' విలేజీ లో వినాయకుడు '' మొన్న నే రిలీజ్ అయ్యింది (అందులో నేను కూడా నటించాను అది వేరే విషయం) మీరు బిట్లు బిట్లు గా చూసే అవకాశం ఇంకా అ సినిమాకి లేదు ,అవకాశం వుంటే ఆ సినిమా చూసి , నేనెవరో కని పెట్టి మీ అభిప్రాయం నిర్మోహ మాటం గా రాయగలరు .

    ReplyDelete
  16. రవిగారు, నేను సరిదిద్దాలి అనుకున్నవి తప్పక పాటిస్తాను సర్. ;)

    మరి తప్పక ఆ సినిమా చూసి మిమ్మల్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు యండమూరి తో కలిసి నటించిన సినిమానేనా. ఆయన్ని ఓ మంచంలో పడుకునుండగా ఫొటో తీసి టపాగా వ్రాసారు కదా! ఆ వాతావరణం గుర్తుకు వచ్చిందా? మా వూర్లలో సర్వసాధారణమైన వర్ణనే వాడాను.

    కాగా ఇవాళ నా భరతం పట్టాలని నిర్ణయించుకున్నారన్న మాట! ;) మళ్ళీ చిన్న వివరణ. నాకు మీరన్నది "వినాయకుడు" సినిమాలో ఓ విలేజి లో జరిగే సన్నివేశాలుగా అర్థం అయింది. పైగా మార్నింగ్ రన్ కి వెళ్ళాలన్న హడావుడిలో తరిచి అర్థం వెదకలేదు కాకపోతే నేను చూసినంవరకు ఆ సినిమా అంతా పట్టణ వాతావరణం లో వుంది కదా అనుకున్నాను.

    ReplyDelete
  17. ఉషా ఇట్లైతే నేను నిన్ను సూ చేస్తానమ్మాయి ఇలా గతాన్ని అంతా తవ్వి పోసి పనులేమి చేసుకోనివ్వకుండా కూర్చుంటానికి నువ్వే కారణం అని.. బాగుంది గీతా చార్య అన్నట్లు మొదటి మీద, కధనాన్ని నడపటం లో చాలా పట్టు వచ్చింది . చాలా బాగుంది అందరు ఎక్కడో ఒక చోట తమను తాము ఐడింటిఫై చేసుకునేట్లు వుంది..
    భా.ర.రే నాది అదే మాటా రాత్రి చదివేను చదువుతూ నిద్ర పోయా ఈ రోజంతా కుదరలేదు ఇప్పుడు వచ్చే సరికి ఇన్ని వ్యాఖ్య లు. నువ్వే నయం నేను చూడూ 19 వ స్థానానికి తోసి వేయ బడ్డాను.
    రవి గారు బలే పాయంట్ పట్టుకున్నారే.
    శ్రీ లలితా మీ మెప్పుదల బలే వుంది. ఉషా ఏమంటుందో చూస్తున్నా. ;-) తరువాత నేను నా షాయరి వదులుతా..

    ReplyDelete
  18. హలో హలో భా.రా.రె గారు ఇలా నా లెక్కలతో నా మీదే కసి తీర్చుకున్నారా? ;)

    వానలు, వలపులు మీకు తెలియనివంటారా? విరహాన వేగేవారికి క్షణం అలానే యుగం మాదిరి కనపడుతుందేమో! :)

    ఈ భాగాన్ని అంతగా విడదీసి మీ అభిప్రాయాలు తెల్పినందుకు థాంక్స్.

    నేను జుట్టు నిజంగానే డొనేట్ చేసిన ఆర్గనైజేషన్ వివరాలివి - http://www.locksoflove.org/

    ReplyDelete
  19. తృష్ణ, మీ పట్టుదల చూస్తే నాకు నిజంగానే నిజం చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చేస్తోంది. ;)

    ఆ కల నిజమే. అది నా స్వంతమే, అదీ నిజమే సరేనా?

    ఈ మాత్రం చాలునా, ఇంకొంచం చెప్పనా...

    అంత హడావుడిలో నా టపా చదివినందుకు చాలా సంతోషం. మీవారి కనులెరుపు మీకు సోకలేదనే నా ఆశ.

    ఇంతగా ప్రోత్సాహం ఇస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని.

    ReplyDelete
  20. కార్తీక్, "వూహల రెక్కలతో వయ్యారాల విహారాలు, విలాసాలు, విలాపాలు" పోకడలు కనపడేవుంటాయి కదా?

    మాలాకుమార్ గారు,
    కాస్త మన గాలి పీల్చనిదే ఇక్కడ ఎక్కువ కాలం మనలేమండి. మీరిలా వతనుగా చదువుతున్నందుకు చాలా హాప్పీగా వుంది.

    సునీత, చిన్ని, పద్మార్పిత,
    శుక్రవారం వస్తుందంటే పరీక్ష వ్రాసినట్లు, మీరంతా ఇలా మెచ్చాక స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ఫీలవటం అలవాటైపోతుంది. నిజమే కదా ఇదంతా... ;)

    ReplyDelete
  21. గీతాచార్య, thanks for the compliment. I too am gaining confidence or must have settled down a bit with the story telling. If not, you must have used to my style of writing at least. :)

    I am hoping the pace and added factors have demonstrated so that you end up saying so.

    And, yup, I went back to my old profile name again! You have a keen eye. Thanks for asking that question. "Maruvam" is my soul. That says it all.

    ReplyDelete
  22. శ్రీలలిత గారు, నేను పూర్తిగా ఫ్లాట్. ఇక ఏమంటే మరేంమంటారోనని .. ;) [కాస్త గర్వంగా వుంది మీ చేత భేష్ అనిపించుకున్నందుకు.]

    విశ్వకి వూపిరి పోసినవాడిని చూస్తే నిజానికి ప్రబంధం వెలికి వస్తుందేమో! ;)

    మిత్రదేముందిలెండి నా మాదిరి అల్ప సంతోషి. విశ్వనాథుని స్మరిస్తూ లోకాన్ని విస్మరించే స్వాధీనపతిక. ;)

    మళ్ళీ చాలా థాంక్స్.

    ReplyDelete
  23. భావన బంగారం, గతం ఎవరికి తీపి కాదు కదా? ఈ రోజే మర్నాటికి గతమౌతుందని తెలిసినా నిన్నటి వంకే చూడటం మనకి అలవాటు కాదా? ఇక నీకు లైన్ క్లియర్ ;) ఏదిక ఆ "షాయరి" వదులు మరి. అయినా వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతైనా ఒకటేనని. నువ్వు ఎపుడు వచ్చినా నాకు వూపిరి పోసే మాటే కదా అనేదిట? ;)

    నిజమే భావన, తప్పడడుగుల పాపాయికి అంతా చేయి అందించి నడక నేర్పినట్లే మీరంతా ఇలా నన్ను సరిదిద్దుతూ, వెన్ను తడుతూ ఈ స్థాయికి తెచ్చారు. ఇప్పటికి కథ మీద కాస్త పట్టు వచ్చింది.

    ఇక ఆ తవ్విన గతం గుట్టలు దాటి ఇవతలికి వస్తావా.. ;)

    ReplyDelete
  24. Raghav, I really appreciate it when people ask something and take time to revisit and acknowledge the information/details given. Makes it an effort worthwhile on my part. Thanks!

    ReplyDelete
  25. భావన, చెప్పటం మరిచానోయ్, పదకుండో నెలలో వచ్చిన ఈ పదకుండో భాగానికి (0-10) పదకుండు మంది వ్యాఖ్యలు వ్రాసాక ;) పుష్కరిణి మాదిరి పన్నెండో వ్యాఖ్య [పెద్దగా అర్థాలు వెదక్కు, తెలుగులోకి అనువదించిన తమిళ సినిమా డైలాగ్ అనుకో] వ్రాసి నా తరువాయి భాగానికి పచ్చజెండా వూపినందుకు పరవశనై పాడనా మరువపు పాట. "మది మురెసునులే, నది సాగెనులే. అల ఎగిసెనులో. ఇల మెరిసెనులే. అవీ ఇవీ నా కన్నుల దాగెనులే..." (ఇదీ ఆ అరవ సినిమాలోదే..) త్వరలో విడుదల. :) ( మరి ఆదివారం వొళ్ళు పులిసేలా పనులు చేసాక వ్యాఖ్యలు వ్రాస్తే ఇలాగే వుంటుంది ఈ చలి దేశంలో)

    రవిగారు పైన సినిమా ప్రసక్తి తెస్తే నేను సినిమాకి కథలు, సంభాషణలు వ్రాయాలన్న కోరిక వెలిబుచ్చిన వాడు [ఇంకెవరు నా కన్న ;)] అమాంతంగా నా కలంలోకి పరకాయప్రవేశం చేసి ఇలా సినిమాకి తగ్గ మాటలు, పాటలు వ్రాయించేసాడనుకో. ;) ఇది చదివిన వారి --- నా భాగ్యం. :)

    ReplyDelete
  26. మరువం ఉష గారు,
    మొదటి పేరా చదవగానే అప్రయత్నంగా సన్నని నవ్వు పెదవులనలంకరిస్తుండగా "దూరమైన కొలదీ పెరుగును అనురాగం...విరహంలోనే ఉన్నది అనుబంధం" అని పాడేసుకున్నాను :-) మిత్ర కల గురించి చదివాక "వలపు కన్నా తలపే తీయనా..కలయిక కన్నా కలలే తీయనా..చూపులకన్నా ఎదురు చూపులే తీయనా..నేటి కన్నా రేపే తీయనా" అని కొనసాగించాను. కానీ ఎదురుచూపుల తర్వాత కలిసే కలయిక మరింత తీయన అనుకోండి, బహుశా అందుకేనేమో ఆత్రేయ గారు దూరమైన నేటి కన్నా కలవనున్న రేపే తీయనా అని ముగించారు :-) పాట తెలుసనే అనుకుంటున్నాను.

    కల, దానికి ముందు కురిసిన వాన రెండూ కొన్ని క్షణాలు అలా కనులు మూసుకుని ఆశ్వాదించేలా చేశాయి... పల్లెవాతారణం తో మనసు పులకరింపచేశారు. "మాటలన్నీ చేతికందక రాలిపడే ప్రత్తిపూల మాదిరిగా పెదవి వెనుకే అందీ అందక వూరిస్తున్నాయి" ఈ భావన ఎంత మధురమో కదా అనుభవిస్తేనే తెలుస్తుంది కాని దానిని మీరు వ్యక్త పరిచిన తీరు చాలా బాగుంది. ఇక మిత్ర కవిత అందమైన అమ్మాయి నుదుట బొట్టులా పరిపూర్ణతనిచ్చింది.

    అన్నట్లు మీ ప్రొఫైల్ పేరు మార్పు మరువపు వనం పై మీరు పెంచుకుంటున్న ఆపేక్షను మరింతస్పష్టం చేస్తుంది :-)

    ReplyDelete
  27. If not, you must have used to my style of writing at least. :)
    *** *** ***

    Do you think I write comments for crap? I'm hurt hurter hurtest. ;-)

    శైలికలవాటు పడో, మొహమాటానికో నేను బాగుందనను. I hope it's obvious to you from my previous comments too. బాగుంటే బాగుంది. లేదంటే లేదు. మరీ హర్ట్ అవుతారనుకుంటే అసలు జోలికెళ్ళను.
    *** *** ***

    చాలా చాలా వ్రాసినట్టున్నారే ఈ మధ్య? :-D

    ReplyDelete
  28. అడ్డ గాడిద, :) థాంక్స్.

    గీతాచార్య, "కీ" ఇచ్చి వదలటం అంటే విన్నారా? :) పోనీ నాడి చూడటం అన్నా వినివున్నారా... ఇక వదిలేద్దాం. సద్విమర్శ, ప్రశంస సమపాళ్ళలో లేనినాడు ఏ అభిరుచీ, కళా నిలవవు. మీరూ రచయితలే. వ్రాయటం మన చేతిలోది కాదు, మనసు స్పందించే అనుభవాలు, అనుభూతి మిగిల్చే భావనలు కలిగినపుడు వాటంతటవే వెలికి వస్తాయి. అందుకని తక్కువగా వ్రాసానా/చాలా వ్రాసానా అన్న కొలమానం బహుశా అస్థిరం.

    ReplyDelete
  29. వేణు గారు, మీరన్న పాట తెలుసు. ఇంకా చాలానే తెలుసు, నా పెదాలు మూత పడి వుండటం చాలా అరుదు. వాటి మీద పాట నడయాడకపోవటం ఇంకా అరుదు. లేదూ నా చెవులు ఏదో ఒక పాట వినకపోవటం ఇంకాస్త అరుదు. :)

    మీరు "జేగంటలు" చిత్రం లోని 'వందనాలు , వందనాలు వలపుల హరి చందనాలు, వెన్నెల్లో వేచి వేచి వెచ్చనైన నా సామికి వందనాలు, వందనాలు , వందనాలు వలపుల హరి చందనాలు, కన్నుల్లో నీరు నించి చల్లనైన నా దేవికి వందనాలు' వినే వింటారు కదా. మిత్ర అరచేతి గీతల్లే మిగిలిపోవాలని ఆశ పడే విశ్వ. విశ్వ బుగ్గ మీద చొట్టలా మిగిలిపోవాలని కలలు కనే మిత్ర. నా విశ్వామిత్ర జగతిలో ప్రేమకి ఉనికి. ;)

    నా అనుభూతులని నాతో సమంగా ఆస్వాదించగల మీ భావుకతకి ధన్యవాదాలు. కలలు కంటూ అలా కదలకుండా కూర్చుంటానని నన్ను 'స్వప్న, శిల్ప' అని ఏడిపించేవారు. నా కలల్ని నాతో పాటుగా ఇంతమంది దర్శించగలుగుతున్నారంటే నాకు ఆనందంగా వుంది. మిత్ర పేరున నాలోని మరో మనిషి ఆవిష్కరించబడుతుంటే సంతృప్తిగా వుంది.

    ఇంతకు మునుపు రెండు టపాలకీ నా సమాధానాలు కూడా చదివి జవాబిచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  30. కీ ఇచ్చి వదలటం అంటే ఏమిటండీ? సీరియస్లీ నాకు దానికర్థం తెలియదు.
    *** *** ***

    చాలా వ్రాశారంటే నేను రాలేనప్పుడు చదవాల్సినవి చాలా వ్రాశారని.
    *** *** ***

    మీరు చెప్పే చాలా కలల్ని నేను సాకారం చేసుకుంటూనే ఉంటాను. ఎంత పనిలో ఉన్నా నా సన్నిహితులకి ఒక హాయ్ చెప్పటం, అనుకోని బహుమతులనిచ్చి ఆశ్చర్యానందాలకు గురిచేయటం, adventures on a regular basis, చక్కగా వళ్ళో తల పెట్టుకుని సాధించాల్సిన ఈక్వేషన్ గురించి ఆలోచనల్లో తేలియాడటం...

    రీసెంట్ గా ఒక మంచి కలని సాకారం చేసుకున్నాను.సో మీ కథాకథనాలు నాకు ముఖ్యం కానీ, అందులోని కలలు, అనుభూతులు కాదు. అన్నీ నిజ జీవితంలో పొందగలుగుతున్నప్పుడు (అలా నూటికి నూరు శాతం చేయగలుగుతున్నప్పుడు, how can I get carried away by these descriptions? అందుకే నేనెక్కువ కథాంశం గురించి వ్యాఖ్యానించనిది. నిజ జీవితంలో సాధ్యం కానివి కదా కలలు కనేది. కనుక నా కలలు వేరే కోవలోవి).

    ReplyDelete
  31. ఏదైనా ఓ సంభాషణ/చర్చని మొదలు పెట్టటానికి ముందుగా మాట కలపటాన్ని ~breaking the ice వంటిది "కీ" ఇవ్వటం అంటే (నాకు తెలిసిన అర్థం). అభిప్రాయం తెలుసుకొనటం వంటిది నాడి చూడటం. ఇలాగే నా కథాకథనాలు గమనిస్తూ సూచనలిస్తూవుండండి.

    ఇక "మీరు చదవాల్సిన వాటి మాట" - సమయముంటే చదివి ఫీడ్ బాక్ ఇవ్వండి. :)

    మిగిలిన మీ వివరణకి థాంక్స్. బహుశా మీ రాబోయే టపాల్లో చెబుతారేమోగా..

    ReplyDelete
  32. గీతా చార్య: మీరు మరీ పసి తనం తో రాసినట్లనిపించింది మీ కామెంట్ కలలు ఆశ ను సాకారం చేసుకోలేనప్పుడె కనరండి.. కవితా శక్తి కి కల కూడా ఒక అనుభవం అంతే.. సాకారమైనా నిరాకారమైన కలలు మానక పోవటం కూడా ఒక కవితా వస్తువే లక్షణమే.. అందరు అలానే వుండాలని లేదు అది ఒక లక్షణం అంతే.. అడుగులు చేసే సడి ఆగిన క్షణం తిరిగి కొట్టుకుంటుందో కొట్టుకోదో నా చిన్ని గుండె ఓ సాకి వడి వడి గా వచ్చి జీవన మధు పాత్ర లో కలల నిషా ను నింపి ఇవ్వు.. నీ కళ్ళలోకి చూస్తూ మధువు ను వొంపినా తాగినంత మత్తు వస్తుంది లే నా మానసీ.. అని అనటం కూడ కలతో జీవితం సాకారం చేసుకోవటమేకదా..

    ReplyDelete
  33. విశ్వాంత రంగమైన మిత్రానురాగాలు
    మిత్రమా విచలిత నిశ్చేష్టాలైన నా కనుదోయి
    లో మెరిసిన విశ్వాంభర రాగాలు..
    విరించి రాయ మరిచిన అనంత కావ్యాలు
    ఈ ముని మాపు వేళ
    నీకొరకు నేనల్లిన విరుల వరాల మాలలు..
    దూరా భారమని భారమైన గుండెకు
    ఈ దూర శ్రవణ యంత్రమెంత దూరమో
    చప్పున పరుగెత్తా లంటె..
    బెరుకే ఆపిందా నీ నును వెచ్చని శ్వాసే నా మెడ వొంపున పూల హారమై మెరిసిందా...

    ReplyDelete
  34. భావన, చాలా అరుదుగా నా గుండె మూగబోతుంది. అటువంటి క్షణాలు చెక్కే జ్ఞాపకాలు నా మరణంలోనూ మరవను. నీ వ్యాఖ్య, కవిత ఇచ్చిన స్థితి ఇది. మౌనంగా నీ ఎదుట ముకుళించిన చేతులాన్చి నా ఎడద పరుస్తూ...

    ReplyDelete
  35. ఏయ్ పిచ్చి.. ఈ భావం నాది కాదు నీ అనురాగపు హేల చేసిన సవ్వడి అంతే .. నా గొప్ప ఏమి లేదు..

    ReplyDelete
  36. మాటరాని మౌనమిది !
    మౌనంలోని భావం అందుకుంటారుగా ఉషా !

    ReplyDelete
  37. విశ్వా-మిత్రల మనసులు కాస్త బయట పడగానే కవితాలంకారికుల పదాలు పరవళ్ళు తొక్కాయి.
    అహా.. ఏమని చెపుదు నీ కవితా వ్యాఖ్యా మాధుర్యముల్
    ఆస్వాదించినంతనే అమృతమే తృణప్రాయమాయె
    ఎవ్వరి నడుగుదు సుముహూర్తము
    ఇంకా ఏల నమ్మా ఆలస్యము...

    ReplyDelete
  38. భావన, భావుకత మరొ పేరు "పిచ్చి" కదా సామాన్య జన భాషలో. :) నా కథని అంతగా ఎలివేట్ చేసిన నీ "షాయరి" బట్టియం వేస్తూనేవున్నానింకా. కాస్త కుళ్ళుగా కూడా వుంది. మాయదారి దేముడు ఇంత మంచి భావనని నాకు పోటీగా పంపేసాడేమిటా అని. ;)

    పరిమళం, మన భాష బేసిగ్గా అదే కదా నా తోచిన భాష్యం కలిపేదా మరి? థాంక్స్. క్రొత్త ఇల్లు సర్దుకుని ఇటుగా విహరించారన్నమాట. ;)

    ReplyDelete
  39. శ్రీలలిత గారు, నిజం చెప్పేయండి ఏవో మధురోహలు మదిలో మెదిలి ఇలా మళ్ళీ మళ్ళీ మిత్రని తొందరిస్తున్నారు కదూ. శుభతరుణం అంత త్వరగా రానీయడు కదా ఆ పైవాడు. కాస్త కాస్త మనసులు కలిపి ఆపై ముహూర్తాలకి మార్గం సుగమం చేస్తాడేమో. భావనతో పాటుగా మీరూ ఇక్కడ కలిపిన ఈ కవితావ్యాఖ్యలు కథకి మెరుపులద్దుతున్నాయి. థాంక్స్.

    ReplyDelete
  40. "కాస్త కుళ్ళుగా కూడా వుంది. మాయదారి దేముడు ఇంత మంచి భావనని నాకు పోటీగా పంపేసాడేమిటా అని. ;)" ఇందాకటి నుంచి నవ్వుతూనే వున్నాను నీ మాట చూసి... నువ్వు మరీ చోద్యమోయ్.. నీకు నేను పోటి ఏమిటి... నేనేమో వచనం నువ్వేమో పద్యం... నీ మాటలు చూసినప్పుడు, నాకెంతో మంచి అనుభూతి ని ఇంక వచనం లో వ్యక్తీకరించలేనేమో అనుకున్నప్పుడు తప్ప నాకెప్పుడూ కవిత రావాలి.. రాసిన నీ అంత విషయ పరిజ్ఞానం నాకు లేదు లే.. కిందటి నెల కౌముది లో శ్రీనివాస్ ఫణి కుమార్ గారు 'చైతన్య స్రవంతి' అని నాలాంటోళ్ళ మీద తెగ జోకు లు కూడా పేల్చేరు అప్పటికప్పుడు ఏది తోస్తే అది చందస్సు, ప్రాస, తెలుగు గ్రామర్ గట్రా ఏమి లెక్క లేకుండా తోచింది తోచినట్లు గెలికే సన్నాసుల భాష ను చైతన్య స్రవంతి అంటారు అని.. బలే జోకీ గా రాసేరు చదివి కిస కిసా కిల కిలా.. నీకు అప్పుడాప్పుడు మాంచి కామెడి వస్తుంటుంది మొన్నెప్పుడో అర్ధ రాత్రి ఇంతే నిజం గానే అరవ డబ్బింగ్ కు తెలుగు సినిమా డైలాగ్ లు లా గజి బిజి గా చెప్పేవు.. 11 వ నెల 11 వ కామెంట్ అని ఇంకా ఏదేదో కలిపి... నువ్వు మరీ ఉషా..;-)

    ReplyDelete
  41. ఉన్నమాట అంటే అంత వులుకేమిటమ్మా. నేనైతే ఎవరైనా "మంచిది" "అంటే "అవునవును మా చెడ్డ మంచిదాన్ని" ఒప్పేసుకుంటాను. అప్పుడప్పుడు కలలో పైథాగరస్, న్యూటన్ వంటివారు "నీ అంత విషయ పరిజ్ఞానం నాకు లేదు" అన్నట్లు కలగనటమే కానీ ఆఖరుకి మా అమ్మాయి కూడా అనని ఆ మాట అని ఆ కలని నువ్వు సాకారం చేసావు. ఇక "శ్రీనివాస్ ఫణి కుమార్ గారు" నన్ను చూస్తే ఏమంటారో. మనకి భావమే కానీ భాష, శోష రావు. :) మరి చెప్పు ఆయన్ని ఈ ప్రక్కగా వచ్చినపుడు దారికాయాలేమో. మనదీ అంతే నవ్వు వస్తే ఆగని బేరం. ;)

    ReplyDelete
  42. Oh meeru manchi valla? :-D anavasaram gaa kadilisthunnanemo? nakasale manchi vallante bhayam sumandee.

    ReplyDelete