జాబిలి రావే!

రావే రావే జాబిలి ఈ దరి రావే జాబిలి ||2||

తూలితూలి సోలే కలువను
చల్లని చూపుల సేదరింప
రావే రావే జాబిలి ఈ దరి రావే జాబిలి


తన నీడే తనకున్న తోడై
ఎడబాటే తన జాలి గాథై
పరిమళమంతా కోలుపోతూ
పలరించే చెలి నీదు రాక
రావే రావే జాబిలి ఈ దరి రావే జాబిలి


తీరని ఆశల మది కంపింప
తీయని వలపుల ఎద వికసింప
శీతల కార్తుల వేచె దాసి
నీ పద సేవల కోరి కోరి
రావే రావే జాబిలి ఈ దరి రావే జాబిలి


శోభ (1958 సినిమా) నుంచి పి.వసంతకుమారరెడ్డి రచన

No comments:

Post a Comment