ఉగాది వచ్చింది, పండుగ వచ్చింది
ఉగాది పండుగ వచ్చింది, వస్తూ వేడుక తెచ్చింది ||ప||
ఉగాది పచ్చడికి రుచులు ఆరంట,
ప్రతి ఏడాదికీ ఋతువులు ఆరేనంటా.
ఆరు రుచులు, ఋతువులు కాదా ఎంతో విభిన్నం!
ప్రతి వీక్షణం తెలుపునది ప్రత్యక్షసాక్షిగా? ||చ||
మాఇంట ఎప్పటికి మమతలు వెల్లువంట,
ప్రతి ఎదకీ మధురిమలు కోకొల్లలంటా.
మా మమతలు, మధురిమలు కావా ఎంతో అపురూపం!
ప్రతి క్షణం అందించునవి ప్రభవించేజ్యోతిగా ||చ||
పాటలలో కూడా పాదం మోపారే....
ReplyDeleteమరి గానంలో శృతి కలిపేదెప్పుడో???
ఉగాది శుభాకాంక్షలు
చాలా బాగుంది ఉష గారు. అభినందనలు.
ReplyDeleteమీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చాలా బాగుంది ఉష. నాలాంటి వారికి తేలికగా అర్ధం అవుతుంది.
ReplyDeleteరేపు చెపుతాను ఉగాది శుభాకాంక్షలు. :)
మాఇంట ఎప్పటికి మమతలు వెల్లువంట,
ReplyDeleteప్రతి ఎదకీ మధురిమలు కోకొల్లలంటా
-- అద్భుతంగా వుంది. రానున్న సంవత్సరం చెబుతోంది ఈ పాదం.
శుభాకాంక్షలు
ఉష గారూ..
ReplyDeleteఎన్నాళ్ళకెన్నాళ్ళకి.. మీ మరువపు తోటలో ఇంత సులువైన మాటలు చెప్పారు.
పని వత్తిడిలో ఉంది ఈ మధ్యన మరువపు గాలే పీల్చలేదండీ :(
మీ కవితలేమో.. ఏదో హడావిడిగా.. చూసామా.. లేదా అన్నట్టు చూస్తే కుదరదాయే ;)ఆలస్యమైనా..ఎప్పుడో ఒకప్పుడు తప్పక చదవాల్సినవే..అదీ కాక.. మీరు వ్రాసేంత వేగంగా చదవడం పూర్తి చేయడం కూడా కష్టమే సుమా :(
మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ.. ఉగాది శుభాకాంక్షలు.
రాయడమే కాకుండా.. పాడే పుణ్యం కూడా కట్టుకుంటే బావుంటుందేమో ;)
ఉషగారు, మీ కవితల్లో ఉ౦డే అ౦ద౦లాగా మీ జీవిత౦లో ఆన౦దాల అ౦ద౦చ౦ద౦ కూడా దినదినాభివృద్ధి చె౦దాలని కోరుకు౦టూ, మీకూ మీ కుటు౦బసభ్యులకూ కూడా తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు.
ReplyDeleteమన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.
ReplyDeleteఉష గారు, చాలా బాగుంది...మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ విరోధినామసంవత్సరంలో మనమంతా ఈ సాహితీ సావాసం ఇలాగే కొనసాగించాలని నా అభిలాష.
ReplyDeleteప్రదీప్, గానం సరేనండి, మరి స్వరరచన మీరు చేసేస్తే, నా కూని రాగాన్ని కోయిల గళంగానో, కాకరుపుగానో మార్చి గానంచేయటానికి నేను సిద్దం! మరిక మీదే ఆలస్యం.!!
ఆత్రేయ గారు, మీవారలందరకూ, మీలోని కవికి, సాహిత్య స్నేహాభిలాషికీ నా శుభాకాంక్షలు.
ప్రియ, కొంచం కష్టతరమే కానీ అసాధ్యం కాదు కనుక ఇలా సరళీకృతం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ మునుపొకసారి చెప్పినట్లుగా నాలోని భావం ఉదృతని బట్టి పదాలు, పాదాలు అవే వెలికి వస్తాయి. నీవది మనసులోవుంచుకోవాసిందని మనవి.
మాలాతి గారు, "ధన్యుడనైతిని ఓరన్నా, నా పుణ్యము..." మీరు వ్యాఖ్య పెట్టిన రోజు పుడమి పులకింత అంత ఆనందం. అది ఎందుకో నా మనసుకి, మీకూ స్పష్టంగా తెలుసు. మీ దీవెనగా కూడా ఇది స్వీకరిస్తున్నాను. అదే పునాదిగా ఓ మమతల పొదరిల్లు కట్టుకుంటాను.
మధురా, పొగిడినట్టు తెగిడారా? లేదా ఎత్తిపొడూపు పొగడ్తాగా మారిపోయిందా? మీ అభిమానానికి జోహార్లు. మరువం గాలి ఆరోగ్యానికి చాలా మంచిదని "చరకసంహిత" లో వ్రాసివుంది. మరి మరువకుండా వతనుగా ఈ గాలి పీల్చటం మానకండి. మీకూ, మీ అమ్మా,నన్నాగార్లకి, తమ్ముడికీ, మిగిలిన మీవారు అందరకూ నా శుభాకాంక్షలు. ఇకపోతే ప్రదీప్ నడిగి స్వర రచనో, సంగీత సారధ్యమో మీరు పుచ్చుకుంటే త్వరలోనే స్వర రాగ కచ్చేరీ పెట్టేద్దాం.
ఆనంద్, మీపేరులోని ఆనందాన్నంతా నాకు పంచేసినట్లుగవుంది మీ ఆకాంక్ష. కృతజ్ఞతలు. మీ జీవితంలో ఇది అపురూపమైన సంవత్సరం కానున్నది. కనుక ప్రతి క్షణం మధురాతిమధురంగా, ఒక్కో స్మృతీ అత్యంత అద్భుతంగా కవితగా ప్రాణం పోసుకోవాలని అభిలాష, ఆకాంక్ష మీకు కానుకలుగా ఇస్తున్నాను.
ఆదిలక్ష్మి గారు, మీ ఇంటిల్లపాదీ ఈ నూతన సంవత్సరంలో లో అమ్మవొడిలో పరుండి, ఆడుకున్నంత అనుభూతుల్ని ఆనందించండి.
పరిమళం, మీ మనసు, మీ రచనలు కూడా మరింతగా పరిమళించాలని అభిలషిస్తున్నాను.
అందరరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గడిచిన వత్సరంలోని మీ మీ రచనలకి అభినందనలు. మరెన్నో రచనల్లో ఇలాగే కలుసుకుందాం. మీ ప్రియ నేస్తం - మరువం ఉష.
Wow. Very cute song.
ReplyDeleteThanks Srujana. My daughter had sung this song at our community ugadi celebration. I had to change the last two lines in each stanza to make it easy for her to sing! This post bagged comments from some scholars that I respect the most ever since I opened this blog. Yours is an addition to my joy. ;)
ReplyDeleteఇలాంటి బాల గేయాన్ని ఎలా మిస్ అయ్యానబ్బా? బహుశా నిద్రావస్థలో వున్నానేమో :)
ReplyDeleteyeah, భా. రా. రె. too here. what a landmark post.. ;)సంతోషం. వీలైతే నేనే పాడేద్దును.. ప్చ్ కాస్త ప్రక్కకి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. :)
ReplyDelete