ఆమని వచ్చేసింది, కోయిలమ్మ వస్తుందనుకున్నా!
దూరాభారం అనుకుని ఆగిపోయిందేమో?
ముందుగా కబురీయను వచ్చిన కాకమ్మదిగో!
కప్పు మీద కూర్చుని కావుకావుమంటుంది.
పాతకాపు పక్షులు ముందే మకాంవేసాయి.
విడిచివెళ్ళిన గూటిజాడలు వెదుకుతున్నాయి.
చేపపిల్లలు చెదురుమదురుగా ఎగురుతున్నాయి.
విడిదిచేయను ఒడ్డుగట్లు ఎంచుతున్నాయి.
పాదులు, కలుపు మొక్కలు కలగలిసి ఎదుగుతున్నాయి.
వేరుమొక్కలు, కుదుర్లు మడిమడిలో పడిపడినవ్వుతున్నాయి.
మోడులు మేనివిరుపులుతో ముదిత రూపులు దిద్దుకుంటున్నాయి.
చివుర్ల సిరిమువ్వలుకట్టుకుని కొమ్మలు నాట్యమాడుతున్నాయి.
గాలి నాదస్వరం వూదుతూ తానూ తాండవమాడుతున్నది.
వాన తనసర్వం జార్చేస్తూ తానూ తక్కువకానంటున్నది.
ప్రకృతి తనమర్మం ఏమిటో ఎపుడూ తెలియనీయదు.
ఋతువు మాత్రం వతను తప్పక వస్తూపోతుంటుంది.
తనువూ మనువుల తన్మయ౦!
ReplyDeleteఈ కవిత౦తా ప్రకృతిమయ౦!!
మీరు విశ్వనాథ సత్యనారాయణగారి "తెలుఁగు ఋతువులు" చదివారా?
ReplyDeleteఉషాగారు , కవిత బావుందండీ ! రాబోయే ఉగాది ఓ అడుగు మీ బ్లాగ్ లోకి వేసే వస్తుందేమో మావద్దకు .
ReplyDeletekuhu kuhu...welcome to your aamani!
ReplyDeleteఆనంద్, అదే మరి నేను వూహించిన స్పందన మీ నుండి. ఆమనిలో తనువూగని ప్రాణి వుంటుందా, మనమేమనా మహర్షులమా ఆ మాయలోకి పడకపోను? ప్రకృతి మహా శక్తిపరురాలు. సహజశీలంతొనే మనని లొంగదీయగల యుక్తిపరురాలు.
ReplyDeleteరాఘవ, మీ ద్వారగా ఇలా ఎన్నో సాహిత్య సంపదలు నాకు అందించబడుతున్నాయి. సదా కృతజ్ఞతలు. నేను చదివింది ఎక్కువేనన్న అహం కాకపోయినా నమ్మకాన్ని మటుకు మీ వ్యాఖ్యలెపుడూ సవాల్ చేస్తాయి. అది నాకు మరిన్ని సాహితీరుచులను విందుగా కానుక్చ్చిపోతుంది. "తెలుఁగు ఋతువులు" వెదికే ప్రయత్నంలో పడతాను. చదివి చెపతాను.
పరిమళం గారు, ఉగాది కోసమే మా ఆమని వొళ్ళంతా కళ్ళు చేసుకుంది, మరువం కూడా అదే పనిలో పడింది.
వెంకటసత్యవతి గారు, మీ ఇంటి బుల్లి గువ్వ కుహ కుహ అంటుందని నాకిలా పరోక్షంగా తెలిపారన్నమాట. ఒకసారి మా ఆమని తోటలోకి పంపరాదు, మరువం చిగుర్లతో పన్నీటి గంధ స్నానాలాడించి పంపుతాను.
అందరకూ ధన్యవాదాలు.
ఉగాది రాకుండానే ఉగాది పండగ అనుభూతిని తెప్పించారుగా:) బాగా రాసారు
ReplyDeleteనేస్తం, మీరు రాని మరువం టపా కోయిల పాట లేని ఆమని తోటలా తోస్తుంది. ఆలస్యంగానైనా గుర్తుంచుకుని వచ్చినందుకు, మీ గుర్తువదిలి వెళ్ళినందుకు ముదావహం.
ReplyDelete