నది ప్రవహిస్తుంది (నిడదవోలు మాలతి గారి కవితకు అనువాదం)

ఇది నా మరొక/ఆరవ- రవ్వంత పేలవమైన- అనువాదం.  తూలిక (నిడదవోలు) మాలతి గారి ఆంగ్ల కవితలోని పదును, నది ఊపు నా అక్షరాలకి ఇంకా అందలేదు, లొంగలేదు...అయినా నా సాధన లో కనీసం తొలి 10 అనువాదాలని పొందుపరుచుకునే స్వార్థం అన్నమాట ఇది. ప్రదర్శనాభిలాష అనుకున్నా సరిపెట్టుకుంటా...ఒక విమర్శ కలిపితేనో అభిప్రాయం తెలిపితేనో మాత్రం మరింత సంతోషిస్తాను.
------------------------------------------------------------------------------

నది ప్రవహిస్తుంది
చుట్టలు విప్పుకునే వేయి పడగల త్రాచులా

ముమ్మూర్తులా- 
అంతిమరంగాన ఆత్రుతతో, తేజస్సుతో 
మిరుమిట్లు గొలిపుతూ
నేర్పుగా అవయవాలను ఊపుతూ నర్తించే-
నర్తకి వలె
నది ప్రవహిస్తుంది

నది ప్రవహిస్తూంది
చలిస్తూ ముందుకు కదులుతుంది
నది ప్రవహిస్తు తరలిపోతూ ఉంది

ఆకాశాన్ని ఆక్రమించే నరకం లా 
లేదా, ఉగ్రంగా ప్రత్యర్థిని కుమ్ముతున్న యెద్దులా
ఎరని దూకిపట్టుకునే ఆకలిగొన్న సింహం లా 
పర్వత శిఖరాగ్ర గుహలను
పగలగొట్టుకు సాగే ఆమెని
రెప్ప వేయకుండా విస్మయంతో చూస్తాను. 
కొండవాలులలో దిగువకి సాగుతూ
బండరాళ్ళ మీదుగా నడుస్తూ
గండశిలలపై దొర్లుకుంటూ
త్రాటిమీద నడిచే నేర్పున్న గారడీవాడిలా
నది ప్రవహిస్తుంది. 

నది ప్రవహిస్తుంది
అంతలో
ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అయినట్లు
ఒక క్షణం ఆగుతుంది
లేదా
అనిత్యమైన జీవులు,
గతించిన ప్రాణుల ఆత్మలు, 
వారి విశ్వాసాలు,
భయాలు, ఆశాభంగాలు,
క్రోధము, లోభిత్వము,
క్షుద్రమైన అసూయలు,
అల్పమైన విషయాలని
ఆలంబన చేసుకునే అవివేకము,
ఇంకా
వేల రీతుల్లోని
నిరర్థక అభిలాషలు
రవ్వంత తిరస్కారంతో
కలబోసుకుని
నది ప్రవహిస్తుంది

అలా ప్రవహిస్తూ
ఆరితేరిన నర్తకి లా,
తన గమనాన్ని అనుసరిస్తూ,
తెలియని తీరాలకు 
మృదువైన ఆత్మలను
తన హస్తాలతో మోస్తూ,
ఠీవైన తన చేతలతో
నా హృదయాన్ని దోచుకుంటూ
నది ప్రవహిస్తుంది

అలా సాగుతూ
తన ఆకర్షణీయమైన ఎదలోకి
ఆమె ప్రోగుచేసిన వస్తువులను
విడిచిపెట్టేసిన వస్తువులనూ
తను పట్టుకున్న వస్తువులను
ఆమె స్పృశించగలదా అని
నేను ఆశ్చర్య పడతాను
తనలోకి ఇముడ్చుకొన వచ్చే
లెక్కలేనన్ని అల్పమైన వస్తువులను
ఆమె తాకి చూడగలదా?
కాగితపు పడవలు,
భగ్న హృదయాలు,
పూలగుత్తులు,
పుణ్య స్నానాలు,
నది ఒడ్డుల ఉండే ఆలిచిప్పలు,
మురికిపాదాలు,
మానవ విసర్జనలు,
ఉమ్ములు,
మృత దేహాలు,
నాచు, 
తన ప్రేగులు తుంచే
మరపడవలు
సగం కుళ్ళిన దేహాలని
కడుపులోకి నింపుతూ మొసళ్ళు,
ప్రాణాలు నిలుపుకోవటానికి
పోరాడే చిన్న చేపలు
నది ప్రవహిస్తుంది. 

సామాన్యమైన కట్టడాలలో
గంభీరమైన అలక్ష్యం తో కదులుతూ
నది ప్రవహిస్తుంది   
ఉక్కు దూలాలతో పొడుస్తూ 
కంకరమిశ్రమాలు కుమ్మరిస్తూ
సుజలాలను అపవిత్రం చేస్తూ
అజేయమైన ఆమె జలాలను
ఆటంకపరచాలని ఆసాధ్యమైన ప్రయత్నం చేస్తూ
మానవులు నిర్మాణాలు చేస్తారు  
తన గమనాన్ని అనుసరిస్తూ
నది ప్రవహిస్తుంది. 

వారి దురహంకారానికి ఆగ్రహించినదై
నది 
ఒక్క తుడిచివేతతో 
భూమికి కొత్త క్రమం తెస్తున్నట్లుగా   
మనుషులను సవాలు చేస్తూ
తన శక్తిని, సౌందర్యాన్ని, న్యాయవర్తన
ఋజువుచేస్తున్నట్లుగా 
నటరాజ కరాళనృత్యానికి
రంగస్థలి సిద్ధం చేస్తున్నట్లుగా 
ఉప్పెనలా విరుచుకుపడుతుంది,
క్రోధం వెళ్లగక్కుతూ. 
వంతెనలు, ఆనకట్టలు
మనిషి కట్టిన అల్పమైన నిర్మితాలు
వారి ఆవాసాలు
ధ్వంసం చేస్తుంది.

నేను నదీతీరాన కూర్చుని
విస్మయపడుతుంటాను..
ఒడ్డులపై ఉన్న అనేకానేక జటిలమైన జీవితాలకు
తన స్పష్టమైన గంభీర ప్రవాహానికి
నడుమ బంధం ఆమెకి ఎరుకేనా?
మానవజాతి సంఘటితంగా
తల్లులు, కూతుర్లు
తండ్రులు, కొడుకులు చేత
తిరిగి నింపబడుతుంది
రాజకీయాలు, అధికారం,
ధనం చేత కల్మషమౌతుంది  
మానవ ఔచిత్యము 
పాండిత్యము వలన పరాజయం పొంది,
విక్రయ వస్తువుగా మారి
తగ్గింపు వెల కి అమ్మబడిన చోట
హీనమైన ఆయువు తో చుట్టబడుతుంది

మానవజాతి వైఫల్యాలను లెక్కించక
ఆమె నిశ్శబ్దం గా
ఘనమైన సరళిలో సాగుతుంది

అలా కూర్చుని
ఒడ్డున ఉన్న రాళ్లకి కొట్టుకునే
లక్షలాది చిరు అలల 
వినసొంపైన గుసగుసలను
వింటూ ఆశ్చర్యచకిత నౌతాను

ఆమె 
ఏమీ ఎరుగక, నమ్రతతో
స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా
తన గమనాన్ని కొనసాగించడాన్నే
ఉద్దేశించుకుందా?

వేద మంత్రాలు ఆలపిస్తూ
నిస్త్రాణ జీవులకి ఆశ్రయమిస్తూ 
దుఃఖకరమైన ప్రాణులను ఆలింగనం చేసుకుంటూ
విశ్వమైత్రి చాటిచెప్పుతూ
ఘనమైన అంగలతో
నది పీఠభూముల్లోకి ప్రవేశిస్తుంది     

అలా ప్రవహిస్తూ
అనేకమైన ఆత్మలను తాకుతూ
వేల హృదయాలను వెలిగిస్తూ 
ఇంద్రధనుస్సు రంగులను వెదజల్లుతూ
నీలిమబ్బులకు తన ఒడి పడుతూ
నది హుందాగా ప్రవహిస్తుంది
తన ప్రకాశవంతమైన దేహంలో
తానే ఆనందిస్తూ
మంద్రంగా లయబద్ధమైన స్వరాలాలపిస్తూ  
నది ప్రవహిస్తుంది

ప్రాయమెంచని నర్తకిలా నది ప్రవహిస్తుంది,
శతాబ్దాల విజ్ఞానాన్ని
దివ్యలోకాల యోధుల తేజస్సుతో
మహారాజ్ఞి వర్చస్సు ని 
విశదీకరిస్తూ నది ప్రవహిస్తుంది...

నది, జీవము
ఒకదానిలో ఒకటి అంతర్భాగమై
చిక్కైన బంధంలో
మెలిపడి ఉన్నాయి...
నది ప్రవహిస్తుంది
అలా నది ప్రవహిస్తుంటే

జీవితం సాగుతుంది. 

(04/17/2014)
--------------------------------------------
RIVER FLOWS
----------------

The river flows
Like a thousand-hooded cobra
Uncoiling
In a sly, sensuous oscillation
Like an archetypal danseuse
In a dazzling finale,
Full of zest and splendor,
The river flows.

The river flows.
And moves on as she flows.
The river flows
And moves on

I gaze in amazement
As she bursts through 
The caverns on the hilltops
Like a towering inferno
Devouring space,
Or, a raging bull
Charging his opponent,
Hungry lion
Pouncing on its prey,
The river flows
Rolling down the mountain slopes
Stomping on the rocks
Tumbling over the boulders
Like an expert juggler on a rope.

The river flows. 
And
Stops for a moment
As if gasping for breath
Or, 
To size up
With a touch of disdain, 
The transient lives,
The lost souls of animate things, 
Their hopes,
Fears, frustrations,
Anger and avarice,
Petty jealousies,
Foolish clinging 
To insignificant things
And
Thousand shades of
Empty aspirations.
The river flows.

The river flows 
Stealing my heart
With her imperious gestures,
Like a seasoned dancer,
Following her own course, 
Carrying the tender souls 
In her arms 
To the unknown shores
As she flows.

I wonder...
Does she feel the things
She holds
In her luring heart
The things
She collects
In time and tide
And
Leaves behind 
As she moves on?
Does she feel 
The umpteen silly objects
She is forced to contain,
Paper boats, 
Broken hearts,
Flower bouquet,
The holy dip,
Seashells on the riverbeds,
The dirty feet,
The human waste, 
The spit,
Dead bodies, 
The moss,
Motorboats 
Tearing her guts,
Crocodiles glutting
Over the half-decomposed bodies,
Little fish 
Fighting for their lives
The River flows.

The river flows
Moving in a stately defiance
Of the mean structures
Men construct,
Poking steel, 
Pouring concrete,
Desecrating the pious waters
In a desperate attempt to curb
Her invincible waters
The river flows
Following her own course.

Enraged by their arrogance,
The river
Bursts forth into a
Ravishing outpour
Of fury,
Shattering
The dams and bridges 
The mean structures men built
And their dwellings,
In one clean sweep
As if
Breaking ground 
For a new order,
As if challenging
Their inadequacies,
And Proving
Her own strength
Beauty
And integrity.
As if 
Staging the fiery Cosmic Dance 
Of Nataraj.

I sit there on the shore 
And wonder..
Is she aware of the bond 
Between her apparently Unfathomable flow
And the complex lives of the myriads on the banks? 
The mankind conglomerate
Replete with 
Mothers, daughters
Fathers and sons,
Polluted with
Politics, power
And money,
Electric lights 
Engulfed by 
Low life,
And,
Where,
Scholarship has failed
Human decency,
And turned into a market commodity
And sold at discount price

She flows quietly, 
Like a royal gamut
Untouched by the failures
Of mankind

As I sit there,
Listening 
To the murmurs of the
Million little ripples,
Hitting the rocks on the shores,
Melodious to the beat,
I wonder.

Is She,
Unaware, unobtrusive, 
Unattached, indifferent, 
Intent on pursuing 
Only her own course?

The river enters the plateau
In a noble stride
Reciting Vedic chants
Propping up the drooping spirits
Embracing the dismal creatures
And unfolding universal harmony.

As she flows
Touching myriad souls 
Lighting up thousands of hearts,
Splashing the colors of rainbow
Holding up her generous heart
To the dark clouds, 
The river flows
Graciously,
Basking in her own lustrous spirit,
And murmuring rhythmic notes.
The river flows.

The river 
Flows like an ageless dancer
Imparting the wisdom of centuries
The mettle of a divine warrior
And the aura of an empress,
The river flows...

The River
And the Life 
Entwined in one
Intricate bond
Each 
An intrinsic part 
Of the other...
The river flows.
And
As the river flows
Life goes on. 


(Nidadavolu Malathi, 3/3/98)

4 comments:


  1. నది ప్రవహిస్తోందా ? ప్రవహించేది నదియా !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. జిలేబీ గారు, మీరన్నదే సరైన శీర్షిక. ప్రయత్నపూర్వకం గా తప్పా తెలుగు వాడుక, సాధన తగ్గటం ఒక కారణమైతే ఒకటి పదును తగ్గుతున్న నా బుర్ర కావచ్చు. :) నెనర్లు!

    ReplyDelete
  3. (ఇది నా మరొక/ఆరవ- రవ్వంత పేలవమైన- అనువాదం. తూలిక (నిడదవోలు) మాలతి గారి ఆంగ్ల కవితలోని పదును, నది ఊపు నా అక్షరాలకి ఇంకా అందలేదు, లొంగలేదు.)
    LOL ! So self deprecating. Not much is lost in translation ! A bit of nativity and idiom in choice of words was inevitable !

    ReplyDelete
  4. కొంతకాలం అంతర్జాలానికి దూరంగా ఉన్న కారణంగా, మీ పోస్టుల్ని ఆలస్యంగా చూస్తున్నాను.
    ఆకాశాన్ని ఆక్రమించే నరకం లా
    లేదా, ఉగ్రంగా ప్రత్యర్థిని కుమ్ముతున్న యెద్దులా
    ఎరని దూకిపట్టుకునే ఆకలిగొన్న సింహం లా
    పర్వత శిఖరాగ్ర గుహలను
    పగలగొట్టుకు సాగే ఆమెని
    రెప్ప వేయకుండా విస్మయంతో చూస్తాను.

    i compared the original with the above translation again and again. ఎంత అందమైన అనువాదము. ఇంగ్లీషులో క్రియల వరుస ను తెలుగులోకి తీసుకురావటంలో చేసిన నిర్మాణ పర మార్పులు కవితకు తెలుగుదనాన్ని కలిగించాయి. అనువాదంలో మిగిలేదే కవిత్వం అని ఎవరో అన్నారు. మాతృకలో ఉన్నదే కవిత్వం కనుక అనువాదంలోకి అది నేరుగా వచ్చిచేరింది. మాలతి గారికి ధన్యవాదాలతో

    ReplyDelete