“కంటి నిండా కాటుక పెట్టవే ఓ యమ్మ నన్ను కల్కావతారమనవే
బొజ్జ నిండా బువ్వ పెట్టవే ఓ యమ్మ నన్ను బుద్దావతారమనవే…”
బొజ్జ నిండా బువ్వ పెట్టవే ఓ యమ్మ నన్ను బుద్దావతారమనవే…”
ప్చ్..ఏమిటో ఈ మామ్మలు, అమ్మలు ఇలా అలా కూనిరాగాలు తీస్తూ లాలించి పెంచేసారు. బిడ్డలకీ నేర్పాలన్న ఊసే మరిచారు. ఆ పై పాట పూర్తిగా తెలిసినవారున్నారా? వివరాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి.
> పోస్ట్ రాసి, పనిలో పనిగా వెదుకుళ్ళాటలో పడ్డాను. మొత్తానికి దొరికింది. నిజానికి పైన సాహిత్యం కాస్త తప్పుగానే రాశాను. పాట సాహిత్యం నాకు మాగంటి వంశీ గారి సైట్ లో దొరికింది. మునుపు అక్కడ బాలసాహిత్యం లో వెదికి లేదనుకున్నాను. సెకండ్ పాస్ లో దొరికింది. http://maganti.org/newgen/lalitasangitam.html కి వెళ్ళి (మిగిలిన పాటలూ చూస్తారని ఇది ఇచ్చాను), "దశావతార" బాక్స్ మీద నొక్కితే పాట లింక్, http://maganti.org/lalitasangitam/lalita28.pdf లో పాట ఉంది. <

ఎప్పట్లానే ఎడం బ్రెయిను కుడిదాన్ని కలేసుకొని మరీ గనులు తవ్వినట్లు తోడిపారేస్తుంటే వెలికి వస్తున్న తదితర వివరాలు...
గీతలో శ్లోకం నానమ్మ చెప్పినా గానీ,నా వరకు కూచిపూడి నృత్య సాంప్రదాయపు రీతిలో అత్యంత ప్రీతితో నర్తించిన దశావతారాలు - మేము నర్తించిన రోజులకి ఫోటోలే అపురూపం, కనుక శోభానాయుడు గారిని అరువడిగానిది. :) - తర్వాతే ఎక్కువ అవగాహన వచ్చింది. తదుపరి దేవాలయం చిత్రం లోని “మాధవుడె ఎత్తినాడు పది అవతారాలు” అంటూ సాగే దశావతారాల పాట లో అవతారాల విశిష్టత/వర్ణన చాలా నచ్చింది. ఇంతకు మునుపు వినని వారు, తప్పనిసరిగా విని తీరాలి.
ఇక్కడ కలిపిన కవిత నేను 01/31/2009 నాడు రాసుకున్నది. విశేషాదరణ వచ్చింది సహజంగానే. సర్వేశ్వరుని లీల ఎవరికైనా ఆనందమేగా!
దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?
అమ్మా నాన్నల అనురాగసంగమంలో, ఆవేశమధనంలో ఉద్భవించిన పవిత్రసింధువువి.
అమ్మ గర్భమే ఆనంద కడలిగ దేవదుంధుబులు మ్రోగగ అరుదెంచిన దశావతారానివి.
జననీ జఠరే శయనమంటూ అమ్మపంచిన గోరువెచ్చని పాన్పుపై పవళించిన వటపత్రశాయివి.
అమ్మమ్మా, నానమ్మా, అంటూ తిరిగిన ఓ అమ్మాయిని ఏకంగా అమ్మని చేసిన శుభారంభానివి.
ఆరు నెలల గడవకమునుపే అటునిటు ఈదులాడుతూ,
గిలిగింతలిడుతూ, చిరుపాపవై చిత్రాలు చేసిన మత్స్యావతారానివి.
నెలలునిండి నడకకే అలిసిన అమ్మకి ఇసుమంత వెసులునీయని ఆకతాయివి.
చేతుల, కాళ్ళ చిరు తాపులతో, చిన్ని శిరస్సుతో నా లోకాన ఉద్భవించిన కూర్మావతారానివి.
అమ్మ స్తన్యమిచ్చిన తొలి క్షీరమారగించి ఆ వేవేలానుభూతి లోకాలు తిరిగిరాను,
నీతొ నన్ను తీసుకుపోయి, పుడమంత నా సంతసాన్ని నీవే మోసిన వరాహావతారానివి.
నిండు మూడైన లేని నెలపాపవే, అయితేనేం, ఎంత సుధీర్ఘ సాధకుడివైనావు,
నీకు రాని చేష్టేదైనా నిలువునా చీల్చి, బోర్లడి, దొర్లాడి, పారాడిన నరసింహావతారానివి.
బుడి బుడి అడుగుల నీ చిరునడకకి నే మడుగులొత్తుతూ, ఎండవానల నిను కాపాడుతూ,
నెమ్మదించని నీ ఉత్సాహాన్ని ఉల్లాసంగా చూస్తూ, తలపోసితి నీవొక వామానావతారానివని.
మారాముల వేళ, గిల్లికజ్జాల వేళ, పంతమాడువేళ, కేళీ వినోదాలా,
ఆదమరువక, వెనుకడుగువేయక అరివీర భయంకురడవైన పరశురామావాతారానివి.
అభ్యసించిన విద్యలెల్ల నీకనుక్షణం తోడుండగ, నీకబ్బిన సంస్కారం తావినద్దగ,
ఎల్లలులేని విశ్వాన నిత్యం కీర్తిజీవన పారాయణం చేస్తూ భాసిల్లిన శ్రీరామావతారానివి.
యుక్తవయసుకి వచ్చావంటే నీవే కాదా నా నెచ్చెలివని మేళమాడిన కొంటెవాడివి.
చిలిపి నీ కళ్ళ ఏ చిన్నదుందోనని నన్ను కూతూహలపరిచిన కృష్ణావతారానివి.
నిర్వాణం చెందిన వేళ నిన్ను తెలుసుకుంటినమ్మా, నన్నెంత తీర్చావో, నీవెంత తల్లడిల్లావో,
పగలు, రేయి, కాలాతీతంగా, మనం మారదాం ఇక నేను నీకు ముందుటానన్న బుద్దావతారానివి.
రేపేమి ఆపత్తు రానుందో, ఈ మాపేమి విపత్తు దాగునుందో, నాకిక సత్తువలేదీ శోధన చేయను,
వేదననిక నే తలవను, వెతలనిక స్వీకరించను, వాటన్నిటినీ ఖండించగ నీవే నాకు కలికావతారానివి.
***********************************************
చివరిగా ఓ మాట:
యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్తానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
నా పిల్లల వలన జీవితంలో నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కొన్ని, కలగనున్నాయని నమ్మకం కలిగిస్తున్న మరి కొన్ని స్ఫూర్తిగా వ్రాసినా, ఈ వర్ణన ప్రతి భాథ్యత గల బిడ్డకీ చెందుతుంది. అటువంటి మంచి వ్యక్తిని తీర్చిదిద్దిన ప్రతి అమ్మా, నాన్నకి ఈ కవితతో వందనం.
***********************************************అమ్మ గర్భమే ఆనంద కడలిగ దేవదుంధుబులు మ్రోగగ అరుదెంచిన దశావతారానివి.

ఈ కవితకి అప్పట్లో వచ్చిన అనేక స్పందన ల్లోని ఒక పద్యం:
ఉ|| మానవ జీవితంబనెడు మాన్య విశేష విచిత్ర చిత్రమే
కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్!
- డా. ఆచార్య ఫణీంద్ర
చిన్న పిల్లల గీతాల్లో దొరికిన పాట:
కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్!
- డా. ఆచార్య ఫణీంద్ర
చిన్న పిల్లల గీతాల్లో దొరికిన పాట:
మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమగురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభద్రావతారం
బుద్దితో మాచిట్టి బుద్దావతారం
కలివిడితో మాయన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమగురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభద్రావతారం
బుద్దితో మాచిట్టి బుద్దావతారం
కలివిడితో మాయన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం
ఇన్నీ చెప్పాక ఇదీ మరవకూడదు. మన బ్లాగుల్లోని మంచి చిత్రకారుడు “లీలామోహనం” బ్లాగరి శ్రీ చిలమకూరు విజయమోహన్ గారు. వారి లేఖిని జార్చిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. ఇదొక మచ్చుక. మిగిలిన అవతారాలు ఉన్నాయి ఆయన చిత్రలేఖా సృష్టిలో – ఈ లింక్ కి గల ముందు వెనుక నెలల్లోని లింక్స్ వెదికి చూడండి.
సరే మరి ఇన్నీ చదివేశారు, అడిగిన పాట తెలియకపోయినా తెలిసిన మాట కలిపి వెళ్ళండి.
యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
ReplyDeleteఅభ్యుత్తానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం గా సరిదిద్దండి
బాగుంది. మీరడిగినపాట అమ్మ పాడుతుండగా వినేవాడిని, గుర్తులేదు.
ReplyDeleteవిజయమోహన్ గారు, సరిదిద్దాను, ధన్యవాదాలు. పాట ఆచూకీ మాత్రం పట్టలేకపోయాను.
ReplyDeleteకష్టేఫలే గారు, మీ దగ్గర ఉండొచ్చుననుకున్నాను ఎందుకో ఈ పాట వివరాలు... :(
puranapandaphani గారు, థాంక్స్. ఈ కవిత నాకు నచ్చిన టాప్-10 లో ఒకటి ఎప్పటికీను. :)
ఉష గారు!
ReplyDeleteనమస్తే !!
మీరడిగిన పాత నా చిన్న్నపుడు పాడుకునేది... గొబ్బి పాటల్లో పాడుకునేది..... కోలాటం లో ఆదుకునేది...
కరెక్ట్ లిరిక్ తెలీకున్న నాకు గుర్తున్నంతవరకు రాస్తున్నా...
దశావతారాల పాట
రెండు జట్లుగా పాడుతారు ఇది.
1 కుప్పికుచుల జడలు వేయవే
ఓ యమ్మ నన్ను కూర్మావ రారున్డనవే
2 కుప్పి కుచుల జడలు వేసేద
గోపాల కృష్ణ నిన్ను కూర్మావతారు డనేద
1 మొగలిపూల జడలు వేయవే
ఓ యమ్మ నన్ను మత్స్యవాతారున్డనవే
౨ . మొగలిపుల జడలు వేసేద
గోపాల కృష్ణ నిన్ను మత్స్యా వాతారుండానేద
౧ బొజ్జ నిండా పాలు పోయవే
ఓ యమ్మ నన్ను బుద్ధావ తారున్డనవే
బొజ్జ నిండా పాలు పోసేద
గోపాల కృష్ణ నిన్ను బుద్దావాతారుండానేద
కంటి నిండా కాటుక పెట్టవే
ఓ యమ్మ నన్ను కల్కవాతరున్డనవే
కంటినిండా కాటుక పెట్టేద
గోపాల కృష్ణ నిన్ను కల్కావ తారు న్డనేద
ఇలా సాగుతుంది దశావతారాల పాట...
ఈ సారి మళ్ళి గుర్తుకోచ్చినపుడు పూర్తీ పాట రాస్తాను
నా జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు
-mani kopalle
ఉష గారూ, నేను పాటకోసం ప్రయత్నం చేస్తున్నా. నాకు దొరికితే చెబుతాను. మీకుదొరికినా చెప్పండి దయచేసి.
ReplyDeleteఉషా గారు ,
ReplyDeleteఎక్కడెక్కడి నుంచో ఆణిముత్యాలు వెతికి తీస్తారుగా మీరు .
మీ కవిత బాగుంది .
mani kopalle గారూ, మీ 'పాట' సాయం అంతా ఇంతా కాదు చాలా ఆనందం ఇచ్చింది. ఎవరో ఒకరు కాస్త సాయం పడతారన్న ఆశ వమ్ముకాలేదు. మీకొక ఆనందకరమైన వార్త - పాట సాహిత్యం నాకు మాగంటి వంశీ గారి సైట్ లో దొరికింది. మునుపు అక్కడ బాలసాహిత్యం లో వెదికి లేదనుకున్నాను. సెకండ్ పాస్ లో దొరికింది. http://maganti.org/newgen/lalitasangitam.html కి వెళ్ళి (మిగిలిన పాటలూ చూస్తారని ఇది ఇచ్చాను), "దశావతార" బాక్స్ మీద నొక్కితే పాట లింక్, http://maganti.org/lalitasangitam/lalita28.pdf లో పాట ఉంది. నాకు మరొక్కసారి పాటని వెదికి తీరాలన్న పట్టుని ఇచ్చిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
ReplyDeleteకష్టేఫలే గారు, పాట దొరికేసింది - పట్టేశాను. పట్టరాని ఆనందంతో పైన వివరాలిచ్చాను. :)
ReplyDeleteమాలా గారూ, మీ అత్తగారికి తెలుసేమో అడగమందామనుకునే లోగా దొరికిందండి. మీ అభిమానానికి థాంక్స్!
ఈ పాట ఇంతకుముందు తెలియదండీ. బావుంది. మీ కవిత కూడా బావుంది.
ReplyDeleteవేదవతి గారి జోజో ముకుందా CD లో ఓ దశావతారాల పాట బానే ఉంటుంది. శ్రీ రమా రమణ లాలి అని పల్లవి అనుకుంటా.. ..
దశావతారాలు అనగానే నాకు "వేదోద్ధార విచారమతే.." గుర్తుకు వస్తుంది.
ఊకదంపుడు గారూ, వ్యాఖ్య ద్వారా మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. "వేదోద్ధార విచారమతే.." వెంబడి వెదికి మరిన్ని విషయాలు చదివి నోట్ చేసుకున్నాను. నా కవిత నచ్చినందుకు సంతోషం. ఈ దశావతారాల పాట పిల్లలకి డాన్స్ గా నేర్పాలని చూస్తున్నాను.
Deleteఉషగారు,
ReplyDeleteమీది ఉడుంపట్టు. పాట చూశా. చెప్పకుండా ఎత్తుకొచ్చేస్తే బాగోదేమో, ఏమంటారు, ఓ మాట చెబుదాం, మంచివారు కదా కాదనరనుకుంటా. :)
kastephale గారూ, ఒకసారి - అక్కడ నా వ్యాఖ్య ఉన్న తేదీ కూడా గమనిస్తూ - http://janatenugu.blogspot.com/2007/10/blog-post_2269.html చూసి రండి. బ్లాగు పట్ల నాకొక నిబద్దత, ఇతరుల సైటు నిర్వహణ, కృషి పట్ల గౌరాభిమానాలు మెండు నాకు.
Delete>> Hello Usha garu, Pata chaala bavundi andi...I love it..!
ReplyDeleteNenu haaram site lo mee story VishwaMithra(konni parts) chadivanu...chala nachindi..Comment ekkada ivvalo teleeledu...anduke ikkada istunnanu...
telugulover2009 గారు - ఆ కథ ఉన్న బ్లాగు మూసివేయటం జరిగింది. మీ అభిప్రాయం ఇక్కడ తెలిపినందుకు థాంక్స్.