ఆ గీతం ఏ రాగం కోరుకోదు-
మెరిసే మబ్బుల పదాలు వినవస్తాయి,
పక్షి రెక్కల మృదంగం ధ్వని తోడుగా.
నింగి పెదవి విచ్చుకుని
నవ్వు వెలువడుతుంది
అదృశ్య శ్రోతలెవరివో
బాటలు బయటపడతాయి
మరి ఇక,
గుంపులుగా తరలి వచ్చిన గాలుల
సవ్వడి చప్పట్లు వాడంతా..
తదుపరి పాటకి రాగం కట్టమని
నా మది మారాము చేస్తుంది.
ఈదులాడే కదలికలో
దాగి బిడియంగా గానం చేస్తాను!



