ఏటి నీటి వేదిక






ఆ గీతం ఏ రాగం కోరుకోదు-
మెరిసే మబ్బుల పదాలు వినవస్తాయి,
పక్షి రెక్కల మృదంగం ధ్వని తోడుగా.

నింగి పెదవి విచ్చుకుని 
నవ్వు వెలువడుతుంది
అదృశ్య శ్రోతలెవరివో 
బాటలు బయటపడతాయి
మరి ఇక, 
గుంపులుగా తరలి వచ్చిన గాలుల
సవ్వడి చప్పట్లు వాడంతా..

తదుపరి పాటకి రాగం కట్టమని
 నా మది మారాము చేస్తుంది.
ఈదులాడే కదలికలో
దాగి బిడియంగా గానం చేస్తాను!

1 comment:

  1. అక్షరం అక్షరం నడుమ అనుభూతి జొప్పించి, పదాల మాలలు అల్లలేకపోతున్నాను అని ఒక నేస్తానికి చెప్పిన తదుపరి క్షణమే లోలోపల మిగిలున్న తడితో తపనదో ఉనికి ఇలా వెలికి వస్తూ ఉంటుంది. నెనరులు.

    ReplyDelete