ఇవాళ సమయమంతా నా పాత ఫోటోలు అటూ ఇటూ సర్ది, మరొక 2 గంటలు కొత్తవి తీసి ఇలాగ గడిపేసాను. అందులోవే కొన్నిపంచుతూ - మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ...
ఇక్కడ నేల, నీరు సాక్షిగా మిడిసిపడుతున్న జలపుష్పం చూసారా? మీలో ఎవరికైనా దాని ఊసులు తెలుస్తాయా?
|
జలపుష్పం - జతపడిన జంట |
2008 నుంచి నన్ను
ఎరిగినవారికి ఆ పైన ఉన్న బొమ్మ ఏమైనా గుర్తు చేసిందా? అవును, దాదాపు 25 మందిమి కలిసి 35 రచనలతో రాసిన జలపుష్పాభిషేకం సంకలనానికి నాంది పలికిన నా రచన "ఎనిమిదో చేప" గీతం లో జంట వీళ్ళే. యారన్ ని అడిగి పంచుతున్నానిది. మా ఇంటి వెనుక చెరువులో జల పుష్పం అది. మరి కొన్ని జలపుష్పాల వయ్యారం ఇక్కడ. అవి తినరు, అలా పట్టి ఇలా వేసేస్తారు. అతను అలా నన్ను అడిగి వచ్చినవాడే. ఇప్పటికీ ఈ బొమ్మ పిల్లలకి చేప ని చూపటానికో, సరదా జ్ఞాపకానికో పనికొస్తుంది.
|
http://en.wikipedia.org/wiki/Adenium |
10 రోజుల నిడివితో తీసిన ఈ పూలని చూసి, పేరు చెప్పండి. అక్కడా ఇక్కడా వెదికి చీట్ చేయొద్దు. :)
చెప్పిన వారికి నా మొక్క ఇవ్వను కానీ పెంచటం నేర్పుతా! ;) |
DESSERT ROSE |
|
చిక్కుడు తీగె, కుదురు రెండున్నాయి ఇక్కడ |
అబ్బో - చెప్పొచ్చారు కానీ, ఆ గుత్తులు చూసి కణుపు చిక్కుడు అని చెప్పలేమా ఏమి!
|
చుక్కకూరపూత
ఇక్కడ సోరేల్ దొరికినా అది మన చుక్కకూర లా తోచదు.; అందుకని తంటాలు పడి తేవాలీ విత్తనాలు, పాట్లు పది పెంచాలలాగే!
|
|
పొదీన పువ్వు |
ఈ పూల పేర్లు, క్రిందన ఉన్న ఆకు కూర చెప్పటం కాదు, ఈ చలి దేశాన పెంచానని అచ్చెరువూ పడాలి. అదే మీకు క్లూ...
|
బచ్చలి కుదురు |
ఇక మిగిలిన ఈ జతా చాలా దగ్గరవి. చెప్తే మీకొక రెసిపి ఇస్తాను...
|
ముల్లంగి పూత |
|
మా మొదటి ముల్లంగి దుంపలు |
మామూలుగా ప్రతి ఏడు పెంచే వాటికి తోడుగా, కనీసం 2 రకాలు కొత్తవి కలుపుతా - పోయినేడాది ఆ పై 6 కొత్తవి వచ్చాయి. నాకు తోట పని అంటే ఉన్న ఇష్టం, ఇంకా ఎవరెవరు ఏమి పెంచుతారో అన్న ఆసక్తి కలిపి ఇలా! ఇక మీ మీ తోటల - పలుగు పారల కబుర్లు చెప్పినా సంతోషమే, చెప్పకపోయినా సంతోషమే. నా తోట నాదేగా! ;)
చివరిగా వివిధ వేడుకల్లో మా పూల అమరిక: ఒక్కోసారి అంతా పద్దతిగా పెంచి, ఇలా త్రెంపటమా అనిపించినా, అస్తమానూ తోటలో తిరగలేను, ఇలా నా చేరువగా ఉన్నాయన్న స్వార్థం!
|
డైనింగ్ టేబుల్ మీద సెంటర్ పీస్ గా |
|
నా బతుకమ్మ ఏది ఇందులో? |
|
రాండమ్ గా పేరిస్తే ఇలా |
|
కాస్తంత పద్దతిగా చేరిస్తే ఇలా |
|
పడతుల సిగలోకి సిద్దమవుతూ - బిక్కు బిక్కుమంటూ |
బాగున్నాయండి మీ ఫొటోలు .
ReplyDelete1. ఆ పింక్ కలర్ పూలు బిళ్ళ గన్నేరు కదూ :)
2. బచ్చలికూర , చుక్కకూర పూలు .
3. ముల్లంగి .
ఎన్ని కరెక్ట్ ?
మాలా గారూ, ముచ్చటగా మూడోవారికి ఛాన్స్ ఇచ్చి అన్ని పేర్లూ చెప్పేస్తా... ఈలోగా ఇంకొక్కసారి మళ్ళీ చూసి చెప్పండి. :) బిళ్ళగన్నేరు కాదు, నేను అవీ పెంచుతాను - మాకు ఇక్కడ దొరికే రకం మనవాటికన్నా కాస్త చిన్న మొక్క, నా బిళ్ళగన్నేరు కుదురు ఇదిగో ఇక్కడ -
Deletehttps://picasaweb.google.com/112283300174396077528/MyGarden#5744973687442026466
పై లిఙ్క్లో పువ్వు చూసి, అప్పుడు పోస్ట్ లో పువ్వుకి, దానికి తేడా మీరే పట్టుకోండి.
విజయమోహన్ గారూ - ఇంకొక్క ఘడియ ఆగండి! :) క్విజ్ కదా కాస్త సరదా పడేవారుండరా?
ఆ పుష్పాన్ని నేనూ చిత్రీకరించా! కానీ పేరు తెలియదు.http://chilamakuru.blogspot.in/2011/07/blog-post.html
ReplyDeleteచుక్కకూర, ? , తెల్లబచ్చలి, ? (ఆవ మొక్క మాదిరిగా ఉంది కానీ పుష్పాలు తెల్లగా ఉన్నాయే!తెలియక తెల్ల ముఖమేసా!),ముల్లంగి
అవి కణుపు చిక్కుడు కాదండీ,
ReplyDelete'గన్నేరు' పేరు ఖాయం.
బిళ్ళన్నేరు ఇక్కడ చూడండి http://chilamakuru.blogspot.in/2011/04/blog-post.html
ReplyDeleteఇది ఆ గులాబీ రంగు పూల వివరాలు: అది DESSERT ROSE ఆసక్తి ఉన్నవారికి ఇతరత్రా వివరాలు ఈ క్రిందన ఉన్న లింక్స్ లో ఉన్నాయి. నేను 4 సం. గా పెంచుతున్నాను. తెలుగులో ఎవరికైనా తెలిస్తే బావుణ్ణు.
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Adenium
http://www.angelfire.com/hi/AdeniumsofHawaii/
బిళ్ళగన్నేరు కాదని నిరూపించేసాము, పోతే మౌళి గారు "గన్నేరు" అన్నారు. బహుశా దేవగన్నేరు పూలని అన్నారనుకుంటున్నాను. ఆ పూల వివరం - http://en.wikipedia.org/wiki/Plumeria
మా మిడ్వెస్ట్ లో ఇందాకా నాకు దేవగన్నేరు/ Plumeria పెంచటం కనపళ్ళా. కాకపోతే, due to its resemblance to DESSERT ROSE పొరబడటం చాలా కామన్.
మిగిలిన అన్నీ మొక్కల పేర్లు కలిపాను.
ReplyDeleteమాలాగారు, విజయమోహన్ గారు, చెప్పిన వరకు మీవి సరైన పేర్లే.
మౌళీ గారూ, మీరు అన్నాక చూసాను; తరుచుగా అక్కడే మెసులుకుంటాను కనుక నాకు ఈ తీగె చిక్కుడు క్రిందన ఉన్న కుదురు చిక్కుడు ఉందని తెలుసు. దాని కాయలు ఆ తీగె దాని కున్నంత పొడవు కాదు, మనకి సంక్రాంతి కి వచ్చే కణుపు చిక్కుడులా, చిన్నగా బాగా గింజపట్టి అదీ 3 కణుపులతోనే ఉంటాయి. ఇవి ఇక్కడి వంగడాలు, స్థానిక రైతుల వద్ద తీసుకున్నవి కనుక కాస్త రూపు, రుచి తేడా, అంతే!
మీ ముగ్గురకూ ధన్యవాదాలు.
ఈ వేసవిలో చాన్నాళ్ళ కి మీ తోట నుంచి మరువపు పరిమళాలు మా ఊరువరకి పరిమళి స్తున్నయండీ .మీ ఇఖ్బాన చాలా బావున్నయండీ .నేను అంతే కాలానుగుణంగా ఇంట్లోను వీధుల్లోనూ కంటికింపుగా వున్నా పూలను అన్ని గదుల్లో అమర్చుతాను ప్రస్తుతం మా ఇంట్లో పూసే పందిరి మల్లి పూలు కొమ్మలతో సహా వాజుల్లో వుండాల్సిందే మా ఇంటి ప్రక్క స్థలం లో వున్నా తంగేడు (అగ్నిపూలు )రాధాకృష్ణ పూలు మా ఇల్లంతా పావనం చేస్తుంటాయి :-)
ReplyDeleteచిన్ని, మీ వంటి పాత స్నేహితుల అభిమానమే నిజమైన పరిమళం. ;) నా వరకు మొక్కలు లేని ఇల్లే నరకం. పూలు, కూర మొక్కలు లేని ఇల్లు ఆ నరకాన మరిగే నూనె మూకుడు...పూల వరకు మన ఇద్దరి అభిరుచీ ఒకటే. ఇపుడు తగ్గింది కానీ చిన్నప్పుడు ఏమీ లేకపోతే కరివేరు, పున్నాగ, మందార వంటివి కూడా తల్లో తురుముకునేదాన్ని. అమ్మ తెగ నవ్వుతూ చెప్పేవోరు; అలా కాన్వెంట్ డ్రస్ లో, ఆ పూల తల తో మరియమ్మోరు లా ఉండేదాన్నిట! మీ వ్యాఖ్యకి థాంక్స్!
Deleteచాలా చాలా చాలా బావున్నాయి తోట పూలు/కబుర్లు..:)
ReplyDeletethanks for sharing !