“థిమిత థిమిత..ఏమి థిమిత..పసుపు థిమిత..ఏమి పసుపు
వంట పసుపు..ఏమి వంట..పిండి వంట..ఏమి పిండి..తెలక పిండి..ఏమి తెలక..గొర్రె తెలక..ఏమి గొర్రెపాల గొర్రె..ఏమి పాలు..జెముడు పాలు..ఏమి జెముడు..పాత జెముడు... “
వంట పసుపు..ఏమి వంట..పిండి వంట..ఏమి పిండి..తెలక పిండి..ఏమి తెలక..గొర్రె తెలక..ఏమి గొర్రెపాల గొర్రె..ఏమి పాలు..జెముడు పాలు..ఏమి జెముడు..పాత జెముడు... “
ఈ పాట ఎందుకు ఎత్తుగడలోకి వచ్చిందంటే కాస్త నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళాలి..ఆహా! అంత తేలిగ్గా తీసుకెళ్ళను, ఆ ఫ్లాష్ బాక్ కి ముందు గా పదారేళ్ళ కథ ఆరంభం కావాలి..అక్కడ నుంచి ఇక్కడకి రావాలి మరి!!!
ఫ్లాష్ బాక్:1
అమెరికా నుంచి అమాంతంగా సిడ్నీ కి చేరాము.
ఫ్లాష్ బాక్:2
వేసవికాలం అమ్మమ్మగారికి మా సంగతి కన్నా కారాలు కొట్టించి, నువ్వులు గానుగాడించి, వడియాలు, పచ్చళ్ళు పెట్టించే పనుల జోరు కనుక పాలేర్లని బెదిరించో, లొంగదీసో కాదు వారంతా మా దోస్తులే కనుక వాళ్ళ భుజాల మీద స్వారీ చేస్తూ పొలానికి చెక్కేసేవాళ్ళం (దసరా సంక్రాంతి కానుకల లంచాలు కూడా బెలిపించి లే) తాటి కమ్మలు, కిత్తనార ఆకులు, బ్రహ్మ జెముడు, నాగ జెముడు మా భీకర గర్జనల పోరాటాలకి రాతి గదల్లా మారేవి, పొలాల గట్లు, పల్లెపట్టు బంజరులు మా యుద్ధభూములు..పల్లేరు, బలురక్కసి పెరిగిన నేలమీదకి శత్రువుని తోసుకోడం ఒక కళ. అలా పాపం ఆ సాత్వికమైన, సాధు మొక్కల్ని ముల్లచేట్లు, పిచ్చి పొదలు పేరిట దుమ్ము దులిపేవారం. అంతకు మించి పెద్దగా పాత్ర లేదు వాటికి. మరి ఆ పాటో అని స్వగతాల్లోకి జారకండి, నాతో పాటు కలిసి నడవండి.. కారాలకి నాలుగు రోకళ్ల పోటు లేదా రెండు రోకళ్ళ పోటు వేయటానికి వచ్చే బాపనమ్మ, చంద్రమ్మ వంటివారు పాడేవోరు, ఆయాసం అలసట తెలియకుండా అలా జానపదాల్లో మంచి ముత్యాలవంటి పాటల సాహిత్యం వెలిగింది ఒకప్పుడు. పాట అంతా కాదు కానీ కొట్టుకునేప్పుడు పిల్లలం ఒక విధంగా కసిగా పిండికొట్టేసినట్లే థిమిత థిమిత అని అరిచేవారం! కనుక పాట పాత్ర ముగిసి జెముడు ప్రవేశించింది కథనంలోకి...
సరే, అక్కడితో చక చకా సిడ్నీ కి ఎగిరిపోయాము (మేము కాదు మనం) రెండేళ్ళు గడిచాక మొదటిసారి పిల్లాణ్ణి తీసుకుని అమ్మగారింటికి వచ్చాను, వచ్చేముందే ఇల్లు మారాము కనుక ఇరుగు పొరుగు ఎవరూ తెలియదు. ఎంచక్కా ఏడూ వారాలు అడ్డు ఆపు లేకుండా హాయిగా గడిపి వెనక్కి వెళ్తూ ఓ బుల్లి సనికెల్లు పట్టుకుని వెళ్ళటం మరవలేదు. అంతకు మునుపు గడిచిన రెండేళ్ళు చాలా ఇబ్బంది పెదిపోయా అల్లం వెల్లుల్లి కొట్టుకోవాలన్నా, మిరియాలవీ దంచుకోవలన్నా..వెనక్కి వచ్చిన రెండో రోజు ఇండియాలో అల్లరి మరిగిన పిల్లాడు “Chicken Corn Cob” నవుల్తూ గంతులు వేస్తూ, సోఫాలు ఎక్కి దూకుతూ ఆడుతున్నాడు. నేను ఓ పిడికెడు మిరియాలు Omelette కోసం పొడికొడుతున్నాను; అప్పుడు ఎవరో తలుపు కొట్టారు అనేకన్నా బాదేస్తున్నారు. కంగారుగా peephole నుంచి చూస్తే ఒక బాహుబలి ఎర్రగా మొహం వేసుకుని ఊగిపోతూ..హడలిపోతూ తలుపు తెరిచా..
సంభాషణ ఆంగ్లంలో జరిగింది. “ఏమి థిమిత” (అతను) “మిరియాల థిమిత” (నేను) “మిరియాలు కాదు నా తల పగలకొడుతున్నావు. నీ సంతు గోడలు కూలుస్తున్నాడు” అతనలా అనగానే తెగ సంబరం వేసినా మర్యాదగా అడిగాను “అందుకు నేను ఏమి చెయ్యగలను. “ అని మెల్లిగా అడిగాను. కాస్త తాగిన మత్తులో ఉన్నాడు. “నువ్వేమీ చెయ్యనక్కర్లా, మీ పనులన్నీ నేనే చేస్తా. మీ తలలు, గోడలు పగలకొడతా” అని అరుస్తూ వెళ్ళిపోయాడు. ఇక యువ నడవటం కూడా మానేసి పాకేవాడు భయం భయం గా. నేను సన్నికెల్లు కడిగి ఆరబెట్టి పూజ చెయ్యటం మొదలుపెట్టా ‘మరే ఆపదా రాకుండా చూడు రాయమ్మా!’ అని. అలా మూడేళ్ళు గడిచే క్రమంలో పరిచయాలు పలకరింపులుగా, పరామర్శలుగా మారాక చెప్పాడు “ఆ రోజు మనసు బాగోలేదు, ఏమీ అనుకోవద్దు..నువ్వు కూడా ఎగిరి దూకొచ్చు, నా గుండు కూడా పొడి చేయొచ్చు” అని నవ్వుతూ ఆ యుగోస్లోవియన్ వ్యక్తి.
కొన్నాళ్ళకి స్నేహ పుట్టినప్పుడు మళ్ళీ వచ్చాడు ఈసారి వలలుడు లా బూందీ దూసే అపకలా, యుద్దానికి ఊదే కొమ్ముబూరలా ఇంత బారు జెముడు ముక్క ఇచ్చి తినమన్నాడు; “నీకు మంచిది మా ప్రాంతంలో తింటాము,” అని. అప్పుడు తెలిసింది ఆహారమని, చిన్ననాటి గద కాదని..ముందు పెద్ద “బీరకాయ” అనుకున్న నేను జడుసుకున్నాను. ఇంకా ఏమి చెయ్యొచ్చు అంటే నీకు అలవాటు కదా కుండీలో పెట్టి పెంచుకో అన్నాడు. అలా ఒక కుండీ లో వేసిన ఆ కొమ్మ చిలవలుపలవాలు గా పెరిగి భలే పూసేది, కాసి పళ్ళు కూడా వచ్చాయి. కానీ Stem, fruit మాత్రం నేను తినలేదు. పిల్లలని ‘ఆ మొక్కలా ఎదగాలి,’ అనుకుని పక్కన నుంచో పెట్టి ఎత్తులు బేరీజు వేస్తుంటే వాళ్ళు కూడా కాస్త ఎడంగా ముళ్ళు గుచ్చుకోకుండా నుంచుని చూసుకునేవారు. అలా అలా రెండేళ్ళు నన్ను భలేగా ఆకట్టుకున్న ఆ మొక్కని వదిలిరాక తప్పలేదు..పొరుగున ఉన్న కొంకిణీవారు సంతోషంగా దత్తత చేసుకున్నారు.
ఇక్కడితో ఫ్లాష్ బాక్:2 కూడా అయిపోయి వేగంగా 2015 వచ్చిపడ్డాము (మీక్కావాల్సిన BGM కలుపుకోండి)
Mexican Organ Pipe Cactus, కొంచం ఉప్పుప్పగా లైటుపులుపుగా కొద్దితీపికలగలిపి జ్యూసీగా గింజలతో ఉంటుంది గుజ్జు. ఇక్కడ మాత్రం టెక్సాస్ లో బాగా ఉంటాయి, అక్కడున్న కొద్దిసమయంలో ఎన్నో చూసాను. మా మిడ్వెస్ట్ లో కోసిన ముక్కలు, పళ్ళు ఎప్పుడూ దొరుకుతుంటాయి.
నా చిన్నప్పుడు నాగజెముడు.., బ్రహ్మజెముడు మొక్కలు/పొదలు విరివిగా ఉండేవి. ఇప్పుడు మావైపు ఊళ్ళల్లో ఎక్కువగా కనపడటం లేదు.
ఓహో ! చాలా సంతోషం మీ బ్లాగ్ చూశాను .
ReplyDeleteనెనర్లు!
Deleteమా వూళ్లో లో చూసినప్పుడల్లా అనుకునేదాన్ని - ఎవరు తింటారబ్బా ఈ బ్రహ్మజెముడు అని - మీ పోస్ట్ పుణ్యమా అని బోల్డన్ని విశేషాలు తెలిశాయి.
ReplyDeleteఅవునా లల్లి?! రుచి చూడు ఓ మారు
Delete