(కామెరా) వాడుకున్న వారికి వాడుకున్నంత మహదేవా! (ఫోటోలు) తీసుకున్నవారికి తీసుకున్నంత నయాగరా! సినిమా లో బ్రహ్మానందంగారు "వాడుకోండిరా..." అని సెలవిచ్చినట్లే నయాగరా కూడా బుర్రనావహించి, కళ్ళు, కాళ్ళు, సర్వాంగాలు పూర్తిగా వాడే అవసరాన్ని/అవకాశాన్ని కల్పిస్తుంది.
చాన్నాళ్ళ క్రితం చదివిన వ్యాసం లో మాట - "ఎవరో ఒక గ్రీకు తత్వవేత్త చెప్పినట్టు ఒకే నదిలో నువెప్పుడూ రెండుసార్లు స్నానం చెయ్యలేవు - ఎందుకంటే, మునకేసి లేచేటప్పటికి కొత్తనీరు వచ్చేస్తుంది కదా?" ఆలాగనే నేను చూసిన క్షణపు నయాగరా నాకే సొంతం, మరొక లిప్తలో రూపు మారిపోతుంది. నేను క్లిక్ చేసిన స్పాట్ మరొకరికి దొరకదు. అందుకే అంతా ధీమాగా చెప్పాను.
కాకపోతే 'ఇది మన నగరం మన ఆస్తి కనుక ఛార్మినార్ ని తాకట్టు పెట్టుకుని నాకు లోన్ ఇవ్వమన్న' అమాయకుడికి అక్క/చెల్లి కాను కనుక సొంతమైన దృశ్యాలు మాత్రం నేను దాచుకున్నాను.
గత 2 ఏళ్ళుగా నా బాగోగులు ఆరా తీసి విచారిస్తున్న స్నేహితుల ప్రశ్నల జాబితాలో మొదటి మూడిట్లో తప్పనిసరిగా ఒకటి - "ఫోటోలేమీ తీయలేదా?" తీయకేమి దివ్యంగా తీస్తున్నాను. "మరి పంచటానికేమి దొబ్బిడాయి?" ఇది అడగలేదు గానీ అర్థం వచ్చేలా సంకేతాలు పంపారు. అందుకే ఆల్బం పెడుతున్నానిక్కడ. కేవలం ఫోటోస్ కోసం మరొక బ్లాగు తెరిచి నడిపే ఆసక్తి లేక, ఇక్కడ/నా నియమాలని ఉల్లంఘించి పోస్ట్ చేసేస్తున్నాను. :)
1. నయాగరా/TheInnerEyeOfNiagara
2. బోనస్: నా గత 2010 ముందు, తర్వాత తోట పరిధి దాటి కాస్త పక్క వీధులకి విస్తరించిన 2011 ప్రకృతి వీక్షణం
ఇలా తిరగటం వలన దొరికిన బాతుపోరు:
నయాగరా వెళ్ళొచ్చినవారికి చూడతగ్గ స్పాట్స్ తెలిసే ఉంటాయి. ఇవి తీసి దాదాపుగా 1.5 సం. గడిచింది కనుక నా ట్రావలోగ్ లో రాసుకున్న నోట్స్ ఇక్కడ ఇస్తున్నాను. అదంతా తెలుగులోకి తర్జుమా చెయ్యనందుకు మన్నిచెయ్యండి.

The 10 places one must consider covering during the trip:
- World's roughest white waters flowing at speed of 22mlies/hour
- Whirl Pool point 120ft. deep
- Point of NO RETURN
- Maid of the Mist
- Cave of the Falls
- Hurricane Point
- Horse Shoe spot
- River side walk
- Goats Island
- Some place so unique to your eye (I am not sharing mine, but you go and figure out from my pictures’ captions) ;)
Personally, I liked these parts of my journey.
- I went for 3-4 miles walk at 6am in the morning along the trails and spent good 3 hours to click on these rarest spots all alone
- I got to know at least 25 people in that short journey and talk in depth of their experiences and hobbies
- Of all the moments I spent the the best was when, I went 5ft close to the American Falls with Yuva (my son) on Sat night at 11pm and got wet under divinely showers
- A professor from Lithuania got in touch with us and spent about 6 hours with me and Sneha (my daughter). She liked us a lot. She wanted to be in touch. (I wasn’t so sure if that excitement would ever last longer, however. And it didn’t as expected)
- Reading Chalam's translation of Tagore’s Gitanjali all along the journey
We missed the Fireworks at the Falls as the event is scheduled on Fri and Sun nights while we were there from Saturday morning through Sunday evening. But I must say; I wasn’t disappointed having seen/witnessed the fireworks on 31st Dec in Sydney, AUZ several times as well as the 2000 Olympics related celebrations.
అవునండీ ఉషా, మీ నయాగరా మీదే! world's roughest white waters" నుంచి ఆ తర్వాత ఫొటోలన్నీ అధుతం!
ReplyDeleteఎంత బావున్నాయో!
మీ కళ్ళతో నయాగరా చూశానివ్వాళ!
మేము కెనడా నయగరా ఫాల్స్ (కి కొద్దిగా దగ్గర) లో నాలుగేళ్ళూ వున్నాం. ఒక ఏడాది అయితే నయాగరా నది పక్కనే ఇల్లు తీసుకొని వున్నాం. ఆ నది పక్కన చెట్ల నీడన విశ్రమిస్తూ సరసమయిన నవలలు మా యాహూ గ్రూప్స్ పాఠకుల కోసం వ్రాస్తుండేవాడిని. అభిమానులు అడిగితే వెబ్ కేం తో నన్నూ, నా నయాగరా నదినీ చూపిస్తుండేవాడిని.
ReplyDeleteBeautiful shot.
ReplyDeletehttps://picasaweb.google.com/ushaa.raani/TheInnerEyeOfNiagara2010#slideshow/5502455963421864434
అందుకే మీ నయాగరా మీదే !
kastephale గారికి, కొత్తపాళీ గారికి థాంక్స్.
ReplyDeleteసుజాత, నిజమేనండి, నా కళ్ళూ మళ్ళీ ఈ ఫోటోల పుణ్యమాని ఆ అందాలు చూసే భాగ్యం తెచ్చుకున్నాయి.
శరత్ గారు, మీ చిరకాల స్మృతులను తిరగతోడానన్నమాట. నిజమేనండి కొన్నిటిని "నా" అనేసుకోవాలనే ఉంటుంది - నదులు, పూలు, ప్రకృతి అందాలు. నదీ తీర/ప్రాంత జీవితం నాకూ అనుభవమే.
ReplyDeleteరామి, థాంక్స్. అక్కడకి వెళ్ళాక చాలా అనిపించింది ఇంకాస్త సమయం ఉంచుకుని వెళ్ళి కెనడా వైపు నుంచి కూడా చూస్తే బావుండేదని. మళ్ళీ కాలం, భాగ్యం కలిసొస్తే చూడాలి.
Impressive :)
ReplyDeleteReading Chalam's translation of Tagore’s Gitanjali all along the journey...Liked:-)
ReplyDeleteCountry Fellow గారు, స్మైల్ గారు, థాంక్స్.
ReplyDeleteకొన్ని కొన్ని సమయాల్లో కేవలం టాగోర్ వి మాత్రమే చదవాలనిపిస్తుంది. ("గీతాంజలి" చదవక మునుపు నా ఎనిమిదో తరగతిలో రాసుకున్న తొలి కవితల్లో ఒకటైన *కవిత కి టాగోర్ ఈ ఆవిష్కరణకి చిరుపోలిక నా మనసు వెదుక్కున్న కారణమేమో!)
* ప్రభు, నీవు పెంచిన ఈ పూలవనాన
పూచిన ఓ పిచ్చిపువ్వును
నా మధురిమ నిను చేరేలోపే
వసివాడిపోతానేమో...
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ReplyDeleteఎన్నాళ్ళకు బ్లాగు తోటలో మరువం పరిమళం...మేడం ఈ నెలంతా ఎలా మిస్సయ్యానా అనుకుంటున్నా..థాంక్సండీ మళ్ళీ రాస్తున్నందుకు, ఉగాది శుభాకాంక్షలతో...
ReplyDeleteవర్మ..
ఇదో చక్కని బ్లాగు!
ReplyDeleteదీనిలోని అంశాలు గానీ, ఫోటోలు గాని, మీ తోట- అన్ని భేషుగ్గా ఉన్నాయి!
(వ్యవసాయ విస్వవిద్యాలయంలో చదువుకున్నా గాని ) మొదటిసారిగా, చిలకడదుంప పూవును మీ తోటలో చూడడం జరిగింది.
Keep it going.
ఉగాది శుభాకాంక్షలు!
మీ అభిరుచి ప్రసంసనీయం .మీ ఫొటోస్ చాలా బాగున్నాయి.అలాగే అన్ని మొక్కలు పెంచటం !మీ తోటపని అందరికి ఆదర్శనీయం.
ReplyDelete