(పిల్లల కోసం) భీష్మ ఏకాదశి : విష్ణు సహస్ర నామం పుట్టినరోజు

నా దగ్గర MAHABHARATA, DREAMLAND PUBLICATION పిల్లల వర్షన్, ప్రయాగ రామక్రిష్ణ గారి 'భారతంలో చిన్న కథలు' ఉన్నాయి. మీ ఎవరికైనా ఇతరత్రా పుస్తకాలు/వివరాలు తెలిస్తే పంచుకోండి, ప్లీజ్. ఇక్కడ చెప్పినా లేదూ ushaa డాట్ raani జీమెయిలు ఐడికి పంపినా సరే.

/************************************************************
ఈ ఏడాది నాన్న గారు గుర్తు చేస్తేనే సప్తమి, ఏకాదశి తెలిసేంతగా పనిలో మునిగానని కాస్త విచారించి, కనీసం ఇక్కడ పెట్టుకుంటే పై ఏడాదికి రిఫరెన్స్ అని రాసుకున్నాను.
రేపటి క్లాసు కి నా చిన్నారులు, 5-12సం. ప్రాయపు వాళ్ళ కోసమని రాసుకున్న బ్రీఫ్ నోట్స్.
*************************************************************/

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు "దేవవ్రతుడు". ఇతడు గాంగేయుడు - గంగకి శంతనునికి జనించిన అష్టమ సంతానం. తండ్రి ద్వితీయ వివాహం కొరకు భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడు గా పిలవబడ్డ ఈయనది భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర. కౌరవ పాండువుల పితామహుడు.

తండ్రి ప్రసాదించిన - తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే - వరం ఉన్నందున, కురుక్షేత్ర సంగ్రామం లో (పాండువుల శ్రేయస్సు కోరి, విజయమాశించి, తన పరాజయ/అస్త్రాన్ని అడ్డగల కారణం చెప్పి, శిఖండి ని అడ్డం పెట్టుకున్న అర్జునుని చేత శరాఘాతుడై) అంపశయ్య మీద ఉత్తరాయణం వేచి ఉన్న భీష్మాచార్యుడు రథ సప్తమి మొదలుకుని ఏకాదశి వరకు, రోజుకొక ప్రాణాన్ని త్యజిస్తూ, ఈ భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి ) నాడు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని, ఆ మహత్యాన్ని తెలియచేసి, ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.

11 comments:

  1. పారాయణ చెయ్యండి, నిత్యమూ, మంచిది.

    ReplyDelete
  2. ఉష... మహా శివరాత్రి కూడా వచ్చేస్తోంది... :-)

    ReplyDelete
  3. kastephale గారండి ధన్యావాదాలండి. విష్ణుసహస్రనామం నాకు ప్రియమైన ఒక అధ్యాపకురాలి వలన పరిచయం చేయబడింది. పారాయణ చేసేదాన్ని. ఆ తర్వాతి ఏళ్లలో సహజ్మార్గ్ ధ్యానం లోకి వచ్చాను. పారాయణం చేయను గానీ, మునుపటి అన్ని పూజా విధులకి అర్థ సహిత కారణాలు చదివి రాసుకుంటున్నాను. అడిగినవారికి చెప్తాను. ఇక, నా దగ్గరకి తెలుగు నేర్చుకోవటానికి వచ్చే పిల్లలు కొందరు శనివారపు సామూహిక నామ పఠనానికి వెళ్తారు. కొందరు చిన్మయా మిషన్ వారి బాలవిహారుకీను. కనుక, వాళ్ళకీ నిదానం గా తెలుస్తుంది.

    ReplyDelete
  4. భావన, నీ వ్యాఖ్య చదివి ముందు బయటకి పరిగెట్టా, లేనిపోనిది స్నో స్ట్రాం కానీ మొదలైందా ఏమాని. ;) మొత్తం మీద కదిలింది కనకదుర్గ. శివరాత్రి మరవనే. నాన్న గారి పుట్టినరోజు కదా. + ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆ ఒక్క రోజే తెలవారీ వారకనే క్రిష్ణ లో నదీ స్నానం, ఈత చేసేవాళ్లం. చలికి వణుకుతూ నాన్న గారికి జుట్టుతుడిచే పని అప్పజెప్పి గుప్పిళ్ళలోకి ఊపిరూదుకుంటూ ఎన్ని పసితనపు జ్ఞాపకాలో గుప్పిట పట్టుకున్నాను. శివాలయం లో అన్నయ్య పేర్న ప్రతిష్ఠించిన నాగేంద్రుని విగ్రహానికి అభిషేకం చేసేవాళ్ళం. ఆ వయసుకి అవి అపురూపం. ప్రతి ఏడాది అదొక లెక్క మైలురాయి, అంచేత. థాంక్స్ బంగారు పూర్వ స్మృతుల్లోకి నెట్టావు.

    ReplyDelete
    Replies
    1. చలికి వణుకుతూ నాన్న గారికి జుట్టుతుడిచే పని అప్పజెప్పి గుప్పిళ్ళలోకి ఊపిరూదుకుంటూ ఎన్ని పసితనపు జ్ఞాపకాలో...
      ఉషగారూ,
      ఇది ఎంత తియ్యని జ్ఞాపకం. నాకు, మా నాన్నగారు నెలగంట పెట్టిన తర్వాత తెల్లవారుఝామున రామదాసు బంధిఖానా కీర్తనలు పాడుకుంటున్నప్పుడు, ఆయన దుప్పటిలో దూరి, కాగలించుకుని కూర్చున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఇంత తియ్యని అనుభవాల్ని గుర్తుచేసుకున్నందుకూ, చేసినందుకూ ధన్యవాదాలు.
      మీ బ్లాగు ఆలస్యంగా చూస్తున్నందుకు మన్నించాలి.
      అభినందనలతో,

      Delete
  5. WONDERFUL DIRECTION YOU TOOK IN LIFE

    VERY USEFUL TO THE PRAVASA BHARATHI SANTHATI

    KUDOS ఉషగారు
    GOOD LUCK

    ReplyDelete
  6. :-) చాలా నెలల తరువాత మొన్నే మళ్ళీ బ్లాగ్ లు చదివేను. :-) ఈ సవత్సరం స్నో నే లేదు ఇంకా దానికోసం ఏమి పరిగెడతావు లే! హ్మ్... శివరాత్రి అంటే నాకు ఎంతో ఇష్టం. తెల్లటి మంచు గుట్టలను మెరిపించే వెన్నెలలో కైలాసాన్ని తలపించే కొండల మధ్యన వుంటాను కదా, శివరాత్రి మరపుకు రాదు మరి నాకు కూడా. పిల్లలకు భోళా శంకరుడి గురించి చెపుతావా, మన్మధుడిని బూడీద చేసిన కధ చెపుతావా? లేక పోతే కాశీ విశ్వేశ్వరుడి గురించి, కాల భైరవుడి గురించి చెపుతావా?

    ReplyDelete
  7. భావన - చంద్రుణ్ణి పింజెలుగా రాల్చినట్లున్న మంచు రావటం మానలేదు మా ఊరికి :) శివరాత్రి కథలు గాథలు అపుడు చెప్తాను.
    nsmurty గారు, మీ ఆత్మీయ పలుకు/వ్యాఖ్య కు థాంక్సండి. ఇలా అనుభవాలు, జ్ఞాపకాలు కలబోసుకున్నది నా ప్రియా నెచ్చెలి భావన మూలాన్నే. తనకీ చెందాలి మీ మాట.

    ReplyDelete
  8. బాబా గారు, థాం..............క్యూ సర్. Feel lucky. ఈ మలుపు అనుకోనిది నిజమే. కానీ, నాలో నేను, నాకై నేను మానలేదు సుమండీ. ;) ఆ పార్శ్వం అందిస్తున్న ఉత్సాహమే ఈ బడి పనులకి స్ఫూర్తి. మొదట్లో జడిశాను, మిగిలిన పనుల్లో ఇది లాగగలనాని. ఆద్యాపక వృత్తిలో ఉన్న స్నేహితులొకరు - "some of your teaching techniques are very innovative and interesting." అన్నాక - తల్లితండ్రులు ధృవీకరిస్తున్నాక నిజానికి పిల్లల్లో వస్తున్న మార్పు చూశాక నాకూ మరింత శక్తి, కొత్త కార్యాచరణకి ఆలోచన వస్తున్నాయి. చిన్న సైజు క్లాసు, కానీ రాశి కాదు వాసి అనుకుని సాగిస్తున్నాను.

    ReplyDelete
  9. చాలా ఆలస్యంగా మీ బ్లాగ్ చూస్తున్నందుకు మన్నించాలి. మంచి టేస్ట్ కన్పడుతోంది మీ కలెక్షన్స్ లో.....ఈ విష్ణు సహస్రనామం గురించిన కూడా ప్రస్తావించడం బావుంది...ఉత్తరాయణకాలంలో ఏంచ్ చేసినా శుభప్రదం అనీ దక్షిణాయనం కంటె ఇది మంచిదని విన్నాను.మీ బ్లాగ్ ప్ఫోస్ట్స్ అన్నీ బావున్నాయి.

    ReplyDelete
  10. ఎంటి ఉష గారు, భావన గారే.. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు ....
    ఇంచుమించు సంవత్సరం తరువాత అనుకుంటా మిమ్మల్ని చూడటం... కాదు మీరు కనపడటం ...

    ఉష గారు ఎలా ఉన్నారండీ... మీ గార్డన్ ఎలా ఉంది.. :-)
    భావన గారు మన సాయిబాబా గుడి ఎలా ఉంది. మనూళ్ళొ మంచు బాగా కురుస్తుందా :-)

    ReplyDelete