నన్ను మరణించనీయవవి!

నవ్వేటి పూలు
నడిచేటి నదులు
ఎగిరే మబ్బులు
నడయాడు నావలు
సడిచేయు సంద్రాలు
ప్రతిజీవి గానాలు
తన ఊసులు
తనకై చూపులు
తనున్న నిన్నలు
తనని కన్న కలలు
తనపై అలకలు
తనకై అలవోకలు
జగతిన ప్రకృతి అందాలు
విధాత మహిమకి ప్రతీకలు
నాకై తన చందాలు
నాలో ప్రకృతికి మూలాలు
అమరం అందచందాలు
ప్రేమ పరిమళించు నా వూపిరులు

19 comments:

  1. ప్రకృతి ప్రతి కదలికలో, మనిషి మదిలో మొలకెత్తే ఆనంద మొలకలే జవాబు లేని ప్రశ్నలై దేవుని అస్తిత్వాన్ని ఇంకా నిలబెడుతున్నాయి కదా? మనిషి పూర్తిగా రాక్షస ప్రవృత్తి వైపు మళ్ళకుండా, మనసు లోగిలిలో ప్రేమ చిగుర్ల మొలకలు నిత్యం విరబూపింప చేస్తుంది కదా?

    అవునండీ మిమ్మల్ని అంతగా అనుభూతికి గురిచేసి ఇలా కవితా రూపునిచ్చిన ప్రకృతి చిత్రాలేవి?

    ReplyDelete
  2. బాగుంది మీ కవిత.

    ReplyDelete
  3. రాఘవ, మీ చిర్నవ్వుకి బదులుగా ఇదిగో నా చిలిపి నవ్వు ;) ;) ;) సరళమైన వ్యాఖకి సంతోషం. :)

    పద్మార్పితా, నెనర్లు.

    ReplyDelete
  4. భా.రా.రె గారు చక్కగా తాత్పర్యం చెప్పారు. ప్రకృతినంతా గుండెల్లో బంధించేయలేను కదా. కొన్ని మాత్రం చిత్రాల్లో పట్టాను. పైన లింకు ఇచ్చాను. గమనించారా? ఇక తనని నా నీడకే పంచను కదా, నాలో లీనం నేనే తను. తానే నేను. ;) తనని మాత్రం చిత్రించి దాచేసా గుండెలో.

    http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA

    ReplyDelete
  5. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాల జలసి గా వుంది ...హమ్మో ,హమ్మో అంత సౌందర్య వనం మీ సొంతమా ...మీ ఆల్బం చూసాక నా ఫీలింగ్ చెప్పనా , అమాంతం గా నేనో పక్షిని అయ్యి మీ ముంగిట వాలాలని........నాకో paataఅప్రయత్నంగా నా నోట వెంట వచ్చేసింది ....'కనులముందు నీవుంటే కవిత పొంగి పారద,తోలిచిగురులు చూడగానే ఇలా కోకిల కూయదా ' తప్పేమో వాక్యాలు సరిచేయోచ్చు :)

    ReplyDelete
  6. వర్మ గారు, నా కనులనే మీవిగా చేసుకుని చూడలేకపోయినా నా అనుభూతినే మీ పరంగా అస్వాదిస్తారనే ఈ ప్రయతనం. ప్రకృతి నా మొదటి గురువు, నేస్తం. తనలో మమేకమవటమే నా నైజం. నెనర్లు.

    ReplyDelete
  7. చిన్నీ, నా కళ్ళు నోచుకున్న ఈ వరాన్ని మీకూ పంచాలనే ఈ ప్రయత్నం. మీది జెలసీ కాదు నాపట్ల అభిమానం అది. జీవితం ఏమిటి అన్న స్కోత్కర్ష నాలో జనించిన ప్రతి యోచన "ఇందుకు" అని ఒక అర్థాన్ని వెదికిపెడుతుంది. నేస్తం రాక, తన ప్రేరణతో ఈ మరువం జననం, మీ అందరి పరిచయం, ఈ ప్రకృతి అందాలు, వాటిని నాతో కలిసి ఆస్వాదించే ఆప్తులు, అనునయాలు, ఆప్యాయతలు, - ఇవే నా అస్తులు. పిట్ట మాదిరి ఎందుకు, ఇనప రెక్కల కోడి [విమానం] ఎక్కి మీరే రండి, నాకు వంటలో మంచి ప్రావీణ్యం వుంది. కవితలు, ఉత్తరాలు, చిత్రాల సేకరణ తర్వాత నా చేతిలోని కళ అదే వండి విందు భోజనాలు పెట్టటం. ;)

    ReplyDelete
  8. సరళంగా ఉందీ ...హృద్యంగా ఉంది మీ కవిత !
    మరువం ! మీ పూవనం సౌరభం అద్భుతం !

    ReplyDelete
  9. పరిమళం, మీ వ్యాఖ్య, నా వనం సరిసమానం - పూ పరిమళ భరితం. నా జీవితమే నిత్యనూతన రసోల్లాసం, మరువపు సుగంధభరితం. నెనర్లు. :)

    ReplyDelete
  10. Some times great things look so simple.

    "నవ్వేటి పూలు
    నడిచేటి నదులు
    ఎగిరే మబ్బులు
    నడయాడు నావలు
    సడిచేయు సంద్రాలు
    ప్రతిజీవి గానాలు"

    So beautiful an expression.

    ReplyDelete
  11. గీతాచార్య, సృజన, ఏమని చెప్పను ఈ భాగ్యం. ఈ ద్వితీయం మరిన్నిసార్లు పునరావృతం అవ్వాలి మరువం మురిసి విరియాలి. అమరం అవ్వాలి ఈ చరిత.

    ReplyDelete
  12. "జగతిన ప్రకృతి అందాలు
    విధాత మహిమకి ప్రతీకలు" ..కానీ మనమేం చేస్తున్నాం చెప్పండి? ఆ అందాలని నాశనం చేయడం లేదూ? బాగుందండి కవిత..

    ReplyDelete
  13. మురళి, మనిషి తను కూడా ప్రకృతి అందాల్లో భాగమే అన్నది గ్రహించి అందులో మమేకమైననాడు మానసిక ఆనందాన్ని సృష్టిలోని ప్రతి జీవికి దొరుకుతుంది. బహుశా బ్రహ్మంగారి మాట "ఏడువూర్ల కొకరు దీపం పెడతారు" అంటే అమానుషులుగా మారినవారిలో మనిషి ప్రవృత్తి మిగిలేది ఏ ఒక్కరిలోనేనని చెప్పటమేమో. నన్ను పరిహసించినా ప్రకృతిలోని ప్రతి ప్రాణితో సంభాషించటం నా నైజం. ప్రకృతిగా జీవించటం నా మతం. ప్రేమే నా దైవం, ప్రేమించటం నా వ్యసనం. ;)

    ReplyDelete
  14. కవిత బాగుంది. మీ ఛాయా చిత్రాలు అద్భుతం. ఉన్నపళంగా రెక్కలు కట్టుకుని మీ ముంగిట వాలాలనిపిస్తోంది ;)

    ReplyDelete
  15. మధుర, మీరొస్తానంటే పూల తేరు పంపుతాను. ఎగిరే మబ్బుల్ని తోడురమ్మని చెప్తాను. ఈ లోపు కుశలమడగను నేనే కల్లోకి వస్తాను. జాగు చేయకండి మరి. నెనర్లు ;)

    ReplyDelete
  16. బాగున్నాయి, చిన్ని పదాలు పెద్ద అర్ధాలు.
    నింగి తోకకు చిచ్చు పెట్టినట్టు దూకే తోక చుక్కలు... యుద్దాన రాలి పడే వీరులా
    అందాన్నంతా లోన దాచుకుని ఏమీ తెలియనట్టు తెల్ల మొహం వేసే మంచు గడ్డలు... బుంగమూతి పెట్టిన భామలా?
    శ్రేష్టమైన రెంటి కలయిక కనక అంబరం, ఎవరిని చూసి సిగ్గుపడిందో ఎర్రబడింది
    రాలిపోయే ముందు కడసారి చూపులా ఆ పువ్వుల చూపులు ఆకులపై, ఎవరు విడదీస్తున్నారు ఆ సోదర బంధాన్ని.. విధేనా...ఆ చండశాసన రాకాసేనా?
    భస్మాసురుని వోలె తపమా? వరమిచ్చ వచ్చిన చెప్పాను ఒడిసి పట్టే కొంగ రాజమా
    అడుగైనా ఎత్తు లేదు, ఆ పుట్ట గొడుగుల కింద ఏ వామనుడు దాగున్నాడో, విశ్వరూపం చూప ఎదురు చూస్తున్నాడో
    నీలాకాశపు రాణి కట్టిన చీర వన్నెలు కావా ఆ హరివిల్లు హొయలు
    పచ్చని గడ్డి ఇచ్చే హాయి పట్టుపరుపులపై వచ్చేనా
    కొండకు నామం పెట్టి కిందకు దూకింది ఒక గంగ, ఎంతటి పాషాణమైనా కరిగించే ఆత్మ విశ్వాసమేగా ఆ గంగ ధైర్యం
    ====
    మీరు తీసిన కొన్ని ఫోటోలకు నా స్పందనలివి, మొత్తం అన్నింటి మీదా రాసే సమయం లేక ఇలా ముగిస్తున్నాను

    ReplyDelete
  17. ప్రదీప్, చిన్న పదాలు తన కోసం, పెద్ద అర్థాలు మీవంటి వారి కోసం. :) నా చిత్రాలకి నిండుతనం కల్పిస్తూ, మీ పదాల్లోని విశిష్టత తేటతెల్లం చేస్తూ, ఒకటేమిటి చెప్పలేనన్ని భావాలు, మీ ఒక్కో పంక్తిని ఒక కవితగా తీర్చాలన్న ఉత్తేజం ఇచ్చారు. "రాలిపోయే ముందు కడసారి చూపులా ఆ పువ్వుల చూపులు ఆకులపై" వేదనని శ్వాసించే నాకు ఈ పంక్తి వెంటాడుతుంది. పిందె నుండి రాలిన పూవు చూసి ఇందాకే ఓ చుక్క నీరు కూడా వెలికి వచ్చింది. నా బలహీన మనస్తత్వం [అది భూత దయ అన్నది అర్థం కాని వారు] ఎలా బ్రతుకుతుందో అని జాలిపడ్డ వారంతా నివ్వెరపడేలా ఈ బండి లాగిస్తున్నానంటే అందుకు ఈ ప్రకృతే కారణం. I am so happy for the lines you have penned down....

    ReplyDelete