ముదమారా పెంచుకున్న
తోటలోకి
అనుదినం
అనురక్తితో
నడిచినప్పుడు-
నేల ఫలకం మీద
నీటిజాడ, ఎండా చిత్రిస్తున్న
నిత్యనూతన
దృశ్యాలు
జీవితానికొక
పోలికనిస్తూ...
మనసు కదంబంలో
తలపు, తపన
మెలికపడి
పూలమడిలో
స్వీయ
దర్శనమౌతూ...
ఒక్కసారిగా
తోట
పిలిచినట్లౌతుంది,
పూలు నవ్వినట్లు
తోస్తుంది.
ఊహ మాయమౌతూ
మనిషి రూపు
ఎదురౌతుంది.
చేయి, చేయీ తాకిన
క్షణాన
తనువు చేతన సంతరించుకుని
మేలువచనం
పలుకుతుంది
అంతఃకరణలో
కొత్త నారు
మొలకెత్తుతుంది
కాలం తీసుకొచ్చిన
శుభతరుణం
సారభూమిగా
మారిపోతుంది
మరో మనిషి తోటగా
తనలో ఎదగాలి
ప్రతి మనిషీ
తోటమాలిగా
అనుభవాలు,
అనుభూతుల
విత్తులు
వెదజల్లుతూ
కాలం గడపాలి, అందుకే!
Awesome job andi....
ReplyDeletei like it very much.
please keep going.
Recently i saw a youtube channel in that they are also publish awesome content.
You can also visit:
https://www.youtube.com/c/NewsCabin
మిత్రురాలు బాల ఇవటూరి వ్యాఖ్య "ప్రతీ రాత్రీ వసంతరాత్రి.. ప్రతిగాలి పైరగాలీ..
ReplyDeleteఅలా ఊహలలో ఊగే ప్రతి మనిషీ తోటమాలే ..
ఆ మనిషి మనో ఫలకం సారవంతమైన ఉద్యానవనమే..
వాడిన పూరేకులు నేల రాలినా పండుటాకులు గాలితో కదిలి సడిచేస్తున్నా
వసంతాగమన నిత్యాన్వేషి కుదురులో చిన్న చిగురు మొలక
రేపటి ఆశకి మరో రెమ్మై .. పట్టుగొమ్మై మనసున్న మనిషిగా యెదుగుతుంది ..!
అదే జీవితం ..
చాలా బాగుంది .. ప్రతి మనిషీ తోటమాలిగా యెదగాలన్న స్పూర్తి గొప్ప మానవీయ కోణం .. అసలు పూల సుకుమారమే మనోహరం..ఆ ఉద్యనవనాన్ని పెంచే మానసిక సౌందర్యమెంత సున్నితం గా వుండాలి !!?"
వేలికొసల తాకిడికి పరవశించే మొక్క, ఆకు, మొగ్గ, పువ్వు నేస్తమవ్వాలి ప్రతి మనిషికి - అప్పుడింక ప్రతి హృద్వనం నిత్యకళ్యాణం-పచ్చతోరణమే!
ReplyDelete