గిన్నెలో చీకటి!

దుప్పట్లో మిన్నాగు లా ఇదేమిటో అనుకుంటున్నారా!?

స్నేహ కి నాకు నడుమ ఒకానొక ఉదయాన-
అమ్మా! ఇక్కడ చీకటిగా ఉంది
ఏమి పిల్లల్రా ఈ మాత్రం వెలుగు చాలదా?
నువ్వే చూడు..చాలా చీకటిగా ఉందమ్మా, Light అనకుండా Bright ఏంటి?
సరే! లైట్ వేసుకో
గిన్నెలో చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఎలా పోతుంది? లైట్ చెయ్యాలిగా...
ప్చ్! స్నేహీ.. వస్తున్నా ఉండు
చూడు, ఎంత చీకటిగా ఉందో! ఇంకొంచం పాలేస్తావా
ఓ......ర్నీ, "టీ" సంగతా నువ్వనేది, చిక్కగా ఉందా :)
మరి "Dark" గా ఉంది కదా!? చీకటి అనరా!?
సరేరా.. అలా వెళ్లి కూర్చో (నేను నవ్వాపుకుని ఇంకాసిని పాలు కలిపి ఇస్తూ), పంచదార వేస్తారు, పాలు పోస్తారు/కలుపుతారు అనాలిరా
మరి...
చాలు చాలు..చల్లారిపోతుంది, తాగేయ్
అమ్మా! You're wrong! చలి ఆరదు, chill అవుతాయి టీ
అబ్బా! తల్లోయ్ తాగరా బాబు

3 comments:

  1. తెలుగు మాటలతో మీ స్నేహ-తల్లి ఆటలు - అచ్చు మా బుజ్జిజింకల్లానే :)

    ReplyDelete
    Replies
    1. అవును, ఎన్నో మరపుకి మరలిపోయాక ఇలా కొన్నైనా దాచిపెడితే వాళ్ళ భావి ఊసుల్లో ఊరిన ఉసిరికాయలా ఉంటాయని... నెనర్లు లల్లీ!

      Delete


  2. నెనరులు లల్లీ ! వారికి
    మనకాలపు కతల చూడ మరపు మరలిబో
    వన భావి కాల వూసుల
    గనవచ్చిక్కడ జిలేబి కమ్మని మెమరీస్ :)

    జిలేబి

    ReplyDelete