తల్లివేరు, తాము విడివడిన కొమ్మారెమ్మల జాడ తెలియని ఆకులు
ఎన్ని ప్రదక్షిణాలు చేస్తూ వెదుకులాటలో! చీరికలు, మచ్చలు, చీకిన ఈనెలు...
వానధారలో అమ్మదనం కురిసినట్లు-
ఆకులలో మెరుపు వచ్చింది, నిశ్చలంగా నేలలోకి ఒదిగిపోయాయి
విచ్చుకున్న రేకుల్లో వన్నెకొక వయ్యారాలతో గాలికి ఊగిన పూలు
ఎన్నలేని బింకపు చేతల విరగబాటులో! తుమ్మెదలు, తూనీగలు, చుట్టూ గిరికీలు...
కిరణమాలి సెగదనం కమ్మినట్లు-
సెకనులో వర్ణాలు మాయమైనట్లు, సూర్యకాంతి బింబిస్తూ కొమ్మలోకి ఒదిగిపోయాయి
ఎండావానల ఇంద్రజాలం ఇలాతలం లో ఎందరికి మేలుకొలుపు!?

No comments:
Post a Comment