ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం వివాహం - 20సం. వయసు కి ఆడపిల్లకి ముప్పేటలా ముప్పిరిగొనే జటిలమైన సమస్య. నాకూ తప్పలేదు, మొదటిదాన్ని ఎంచుకోక! కలాం గారి చలువ అది.
DRDO: Defence Research and Development Organization కి దాదాపు పితృ సమానుడైన ఆయన దూర దృష్టి వలన ప్రవేశ పెట్టబడిన సాఫ్ట్వేర్ లో మాస్టర్స్ కోర్స్ చేసిన మొదటి కంప్యూటర్ నిపుణుల బృందం లోని శాస్త్రవేత్తని నేను. నను కన్నవారికీ, నేను కన్నవారికీ అదొక అపురూపమైన వరం, దీవెన.
ఆ గర్వించే ఉద్యోగ క్షణాలు, అనుభవాలు పక్కన పెడితే సాంకేతికరంగ తండ్రి వంటి వారు ఆయన నాకు. బాబు పసిబిడ్డ గా ఉండగా- ఆయన నివాసం (ఆఫీసర్స్ మెస్) నా గృహం (సైంటిస్ట్ హాస్టల్) చాలా దగ్గర మూలాన- సాయంత్రాలు యువా ని ప్రాం లో తోసుకుంటూ ఆయన గది పక్కగా తిరిగేదాన్ని; ప్రశాంతమైన వదనం తో వీణ వాయిస్తూనో లేదా మౌన ముద్రతో (పుస్తకం, సాలోచన ధరించి) కనిపించేవారు. ఒక్కోసారి నిదానంగా, మరోసారి గౌరవంగా, పలుసార్లు సగర్వం గా చూస్తూ దాటుకునేదాన్ని. చాలా అరుదుగా నన్ను చూసి నవ్వేవారు, ఒకటీ రెండుసార్లు మృదువైన సంభాషణ. బాబుకి మాత్రం ఆయన చూపులు చాలా ఆదరంగానే తాకేవి పెక్కుసార్లు...
ఆయనకీ తెలీదు బహుశా తన ద్వారా స్ఫూర్తితో వెలిగే జ్ఞానజ్యోతి ని నేను ప్రమిదలా కాస్తున్నానని.
భగవంతుని పరీక్షా సమయం జన్మనిచ్చిన నాన్న, జీవనాన్ని కల్పించిన తండ్రి ఒక్కమారు నా ప్రపంచం నుంచి నిష్క్రమించటం...ఒక అందమైన ఊహకి, జ్ఞప్తికి మనిషి భౌతికం గా లేకపోవటం చాలా వెలితి. తప్పదు, మరణం పిలుస్తూ రాదు కానీ చటుక్కున ఒడిసిపట్టుకు లాక్కుపోతుంది ఆత్మీయులని మనసైనవారిని. జీవితమూ తప్పదు వారి పరోక్షం లో నడవక. ఎన్నెన్నో అవధులు ఎరుగని విజయాలకి, వికసించిన వదనాల చిరునవ్వులకి, ఫలించిన కలలకి చిరునామా అయిన వారికి శిరస్సా నమస్కరిస్తూ ఈ అశ్రు నివాళి!
ఎందుకో ఈ సామ్యం, మా నాన్న గారికీ, ఈ పితృ సమానులుకీ ఇది సాధ్యం పడింది, భాగ్యశాలులు;
"అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే!"
దేహిమే పార్వతీపతే = O Lord! give me
వినా దైన్యేన జీవితం = a life without pleading someone
అనాయాసేన మరణం = an easy natural death
దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body
వినా దైన్యేన జీవితం = a life without pleading someone
అనాయాసేన మరణం = an easy natural death
దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body
Golden words from his tweets
ReplyDelete----------------------------
An indomitable spirit stands on two feet.. vision and firm thought - Jul 22
Only when you have the courage to lose sight of shore, can you discover the oceans. - Jul 19
Do not wait for something big to happen. Start with whatever you have now..
There is no greatness without simplicity, righteousness and truth. - Jul 15
There is no right way of doing wrong things.
Righteousness is not only the better of many ways, it is the only way. - Jul 13
A great purpose breaks the walls of human limitation. - Jun 12
కలాం గారి మరణం చాలా బాధ కలిగించింది.ఆయనని ప్రత్యక్షంగా చూసిన, మాట్లాడే అవకాశం దొరికిన మీరు చాలా అదృష్టవంతులు.చివరిలో చెప్పిన శ్లోకం అద్భుతంగా ఉంది.
ReplyDeleteబాగా నచ్చిన శ్లోకం అండి; ఈ మధ్యన అరుదుగా చూస్తున్నా అటువంటి భాగ్యశీలులను. Thanks for sharing your feelings.
Deleteఒకసారి హైదరాబాద్ నుండి ఢిల్లీ ఫ్లైట్ లో స్వాగత ద్వారం దగ్గర్లో మొదటి సీటులో కలాం గారిని చూడగానే మాట్లాడాలనిపించింది.నా సీటు ఎక్కడో వెనుక ఉంది.ఆయనతో మాట్లాడే అవకాశం జారవిడుచుకోవాలనిపించలేదు. ఒక పేపర్ తీసుకుని రెండు ప్రశ్నలు వ్రాసి ఎయిర్ హోస్టెస్ కి ఇచ్చి ఆయనకి అందజేయమన్నాను.నేనడిగిన రెండు ప్రశ్నలివి.
ReplyDelete1.రాష్ట్రపతిగా మీరు సాధించిన విజయమేమిటి ?
2.కాశ్మీర్ వివాదపరిష్కారం కోసం మీరు ఏమి చేసారు ?
ఆయన నన్ను దగ్గరకి పిలిపించుకుని ఓపిగ్గా నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు.అందరితోనూ ఫోటో తీసుకోవడం నాకు అలవాటు,ఆయనతో మాట్లాడిన సంతోషంలో ఫోటో తీయించుకోవడమే మర్చిపోయాను.జ్ఞాపకాన్ని మర్చిపోలేము కదా ?
మీ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నందుకు నెనర్లు. ".జ్ఞాపకాన్ని మర్చిపోలేము కదా ?" true!
Deleteనాన్నగారికీ,పితృ సమానులకీ అనాయాసేన మరణం సాధ్యపడినందుకు ధన్యజీవులైనారు ! ప్రపంచంలోకెల్లా అదృష్టవంతులు వారే కదా ?
ReplyDelete