మబ్బులు కమ్ముతున్న ఆకాశం, మనసు- రెండిటా
కలియజూస్తే వర్ణాలెన్నో లోపలా, వెలుపలా.
దీర్ఘ నాదం తో
కొరడాలు ఝుళిపిస్తూ గాలులు
మెలితిరిగే జ్ఞాపకాల్లో
చిక్కులు /చిక్క/పడుతున్న గుర్తులు
వర్షం మొదలౌతుంది ఏదో నిమిషం లో-
వినువీధుల్లో దారితప్పిన పిడుగు,
నేల దారి పడుతుంది.
వ్యాకులపాటుతో అలజడిలో
మనసు అల్లాడుతుంది
పెళపెళరావాలతో దిగ్గుళ్లిన ఆకాశం
నీలి సరోవరం గా నిశ్చలం గా మారి,
రెక్కల తెడ్లతో సాగే కొంగల గుంపు కనిపిస్తుంది
మనసులో కొలనులో
నిర్మలమైన భావాలు పురివిప్పుతాయి
నక్షత్రాలు జనిస్తాయి-
మెరుపు నవ్వులు రువ్వుతూ
దారులు పరుచుకుంటూ
వెన్నెల తీరానికి చేరతాయి.
మనోనేత్రానికీ తారాపథం అందుతుంది-
అంతర్వాహినిలోకి పయనిస్తూన్న యోచనలు
తీరానికి వచ్చే తరుణం కొరకు చూస్తూ మనసిలా...
కలియజూస్తే వర్ణాలెన్నో లోపలా, వెలుపలా.
దీర్ఘ నాదం తో
కొరడాలు ఝుళిపిస్తూ గాలులు
మెలితిరిగే జ్ఞాపకాల్లో
చిక్కులు /చిక్క/పడుతున్న గుర్తులు
వర్షం మొదలౌతుంది ఏదో నిమిషం లో-
వినువీధుల్లో దారితప్పిన పిడుగు,
నేల దారి పడుతుంది.
వ్యాకులపాటుతో అలజడిలో
మనసు అల్లాడుతుంది
పెళపెళరావాలతో దిగ్గుళ్లిన ఆకాశం
నీలి సరోవరం గా నిశ్చలం గా మారి,
రెక్కల తెడ్లతో సాగే కొంగల గుంపు కనిపిస్తుంది
మనసులో కొలనులో
నిర్మలమైన భావాలు పురివిప్పుతాయి
నక్షత్రాలు జనిస్తాయి-
మెరుపు నవ్వులు రువ్వుతూ
దారులు పరుచుకుంటూ
వెన్నెల తీరానికి చేరతాయి.
మనోనేత్రానికీ తారాపథం అందుతుంది-
అంతర్వాహినిలోకి పయనిస్తూన్న యోచనలు
తీరానికి వచ్చే తరుణం కొరకు చూస్తూ మనసిలా...
ఆలోచనా వాహినిలో వాన రేపిన అలజడి,వన్నెలీనుతూ నిశ్చల సాకారమై,వెన్నెల తీరానికి బాటచూపిన భావనా లాహిరిలో కవి కలం ఆలోచనలను అలలపై ఊయలలూపింది.
ReplyDeleteనెనర్లు ఉమాదేవి గారు. 'వర్షం మొదలౌతుంది ఏదో నిమిషం లో' అన్నది కన్నీటి వాన ని కూడా కలుపుకుని. ఇది ఆ వర్షాధార కవిత. మీరా చిత్రం చూసారనే నమ్మిక!
Delete