చిలకడ పూవు, గులాబీ కాయ, బీర పండు లేవన్నవారికి సవాల్!

పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూసేను?
మా పెరటితోటలో చిలకడ పూసేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాసేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను
పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ

*****

ఇదేమిటి దుంపకి పూవు, పూవుకి కాయ, కాయకి పండు కలిపి సవాలేమిటీ అంటారా. మరివి చూడండి.


పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూసేను?
మా పెరటితోటలో చిలకడ పూసేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

ఇది నిజంగా చిలకడ దుంప తీగె - పూవు

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాసేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను

ఈ రకం గులాబీ పూల కన్నా కాయలు టీ తయారీకి ఎక్కువ వాడకం

పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ


ఎవరేమన్నా ఇదే నా బీర పండు ;)
కాదన్నవారు తెచ్చి చూపండి!
వెదికి తెచ్చినవారికి వేయి వరహాలు





సుమారుగా రాత్రి పదిన్నర సమయం లో కిటికీ లోంచి ఆకర్షించి మరీ నా కామేరాకీ పట్టుపడిందీ శ్వేత చిలుక!

*****
ఇక, చిత్రానికి కథ - మొన్న పిల్లకాయలతో పాటలు పాడిస్తే, మా బుల్లి మేఘన పాడిన పాట ఇది.

జామ చెట్టుకి జామ కాయలు
ఈత చెట్టుకి ఈత కాయలు
చింత చెట్టుకీ చింత కాయలు
మల్లె చెట్టుకీ..
కాయలుండవు కాయలుండవు
పువ్వులుండునూ.. పువ్వులుండునూ..

14 comments:

  1. మల్లెపూల మారాణిలా ఉన్నారు పై ఫొటోలో

    ReplyDelete
  2. ఉషగారూ! సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగుందండీ.....గులాబి కాయలూ,బీరపళ్ళూ బావున్నాయి..ఇంతకీ అవి తింటానికి పనికొచ్చేవేనా...;)....అది బీరపండుకన్నా నాకు సొరపండులా అనిపించింది...ః)

    ReplyDelete
  3. చాలా బావున్నాయండి
    చిలగడపూలూ, గులాబికాయలూ ఇదే మొదటిసారి చూడటం

    ReplyDelete
  4. ఏదో టమేటాను చూసి మీరు బీర అని పొరపడివుంటారు. బీర కాయ పండైనంతమాత్రాన అంతలా రూపురేఖలు మారిపోతాయా! నిజంగా ఆస్చర్యమైన విషయం, ఏమో లేండి కలికాలం ... ఏమైనా జరొగొచ్చు. :)

    నబకోవ్( రష్యనే అయ్యుంటాడు, అవునా? :)) ) బాగానే చెప్పాడనిపిస్తోంది.

    ReplyDelete
  5. Sweet potato & photos.. both are so sweet...:)

    ReplyDelete
  6. @లలిత గారు, ఇదెక్కడి లింకో మరి. నా మొదటి మరువం బ్లాగు లోనూ మీరు మల్లెలని గూర్చే కామెంటారు, నాకు బాగా గుర్తు. :) మీ వ్యాఖ్య గుర్తుచేసిన పాట వలన గున్నమావి, కోకిలమ్మ గుర్తుకు వచ్చాయి. మాకు మరికొన్ని కబుర్లు వస్తాయిక. థాంక్స్.

    @లత గారు, తృష్ణ, థాంక్స్. నాకూ మొదటిసారి దుంపలు పండించటం. గులాబీ కాయ చూశాను కానీ, ఇంతలా గోంగూర పండంత ఎర్రగా ఇదే చూట్టం.

    ReplyDelete
  7. @ కౌటిల్య గారు, థాంక్స్. గులాబీ కాయ హెర్బల్ టీ కి వాడతారు. ఇక "బీర/సొర మాట" తర్వాతి సమాధానం లో ఉండి :) అన్నట్టు మీ పాకవేదం తప్పక చదువుతున్నాను, దోసకాయ ఇగురు దగ్గర మీతో పేచీకి రావాలి, ఆ రోజు ఓపిక చాలక ఆగాను. మీకు మీరే పిలుచుకున్నారిపుడు.

    ReplyDelete
  8. @Snkr గారు, మీ అనుమానానికి థాంక్స్. పైన నా మాట మళ్ళీ చదవండి. :)

    ఎవరేమన్నా ఇదే నా బీర పండు ;)
    కాదన్నవారు తెచ్చి చూపండి!
    వెదికి తెచ్చినవారికి వేయి వరహాలు

    అవి Yellow Teardrop Tomatoes - రుచిలో కూడా కొత్తగా ఉన్నాయి. అందుకే ఒక రాయి వేసా ఎవరైనా "మాకు తెలుసు" అంటారని.

    ఇక నబకోవ్ - నాకు తెలిసింది 1% త్వరలో 1% మిగిలుంది అనగా చెప్తాను నా అభిప్రాయం. :)

    ReplyDelete
  9. అవునవును...అప్పుడు నా బుఱ్రకి తట్టలా...అవి టమాటాలు కదూ....ఒకసారి ఒక హార్టికల్చర్ ఎక్స్ పో లో చూశా.....

    పేచీకా....మరి వచ్చెయ్యండి...ః)....ఏం తప్పు రాశానబ్బా...ఏమో మరి....ః)

    ReplyDelete
  10. కౌటిల్య, అవునండి టమాటాలే. నాకూ సరదా శ్రద్ద కనుక వీలైనన్ని రకాలు పెంచటానికి ప్రయత్నిస్తాను. పైగా ఇక్కడ అన్నీ అభిరుచులకీ 'స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్' దొరుకుతారు, ఆన్లైన్ చదవటం కాక వారి వారి స్వానుభవాలు వలన ఇంకాస్త ఆసక్తి కలుగుతుంది. విషయసేకరణ, సమాచారం తేలిగ్గా ఉంటాయి (ఇది నా అనుభవం లో మాట). పిల్లలని అలా పెరట్లో తిప్పుతూ మొక్కలూ, పూలు ఇలా పరిచయం చేస్తూ, పాటల్లా పాడుకుంటూ - ఆడుకుంటూ వేసవి కొన్ని వారాంతాలు లైవ్లీగా ఉంటాయి.

    ReplyDelete
  11. అవి చిలగడ దుంపలు కావనుకుంటా నండి . పెండల మేమో నని నా అనుమానము . చిలగడ దుంప తీగ ఫొటో మీకు మేయిల్ చేసానుగా ! నాకు వెయ్యివరహాలివ్వండి మరి :)

    ReplyDelete
  12. మాలా గారు, మా చిలకడదుంపలనే అ/వ/ను/మానిస్తారా? :) మన దేశపు పంట, ఇక్కడివి వంగడాలు తేడా కావచ్చు. నాకు తెలిసినవరకు తమలపాకు, మనీ ప్లాంట్, పెండలం, చిలకడదుంప ఒక ఫామిలీ ప్లాంట్స్ - అందుకే ఆకులకీ పోలిక. నాలా పెరటితోట ప్రీతి ఉన్నవారం కొందరం కలిసి దాదాపుగా ఆరు రకాలు Sweet Potato Plants ఆనైన్ లో http://www.newhopeseed.com/sweet_potato.html తెప్పించాము. చివరికి నాకు మూడు రకాలు పండాయి. వంటలూ అయ్యాయి :)

    గూగులమ్మ లో బొమ్మల విభాగం లో వెదికితే మన ఇద్దరి రకాలు కనపడుతున్నాయి. సో ఏ అనుమానాలు వద్దు. ఇలాంటి అనుమానం వచ్చేవారికని ఇక్కడే రాసాను జవాబు. నాది "బీరపండు" కి మాత్రమే వరహాల ఆఫర్. ;)

    ReplyDelete
  13. chala bavundi usha gaaru the way u expressed a expressionlo oka happiness kanipinchindi
    kallurisailabala.blogspot.com

    ReplyDelete