సహాయం: వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు?

బాల సాహిత్య మిత్రులకి, ఒక అభ్యర్థన. నేను నా బడి పిల్లలకి జాతీయములు + తెలుగు కథలు (ముఖ్యంగా పంచతంత్రం, చందమామ కథలు, నేను కూర్చే కథలు) కలిపి నేర్పే ప్రక్రియలో ఉన్నాను. ప్రధానంగా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని కాదు, ప్రవృత్తి రీత్యా పిల్లలకి మంచి నేస్తాన్ని అయినదాన్నే మాత్రమే! వారిలో కుతూహలం, ఆసక్తి కలగాలి, నేర్చినవి గుర్తుండాలి - అది నా గురి.


తొలి ప్రయత్నం - "వేసిందే ఒక గంతు, విరిగిందే ఒక కాలు" అన్న జాతీయం. వికిపీడియా నుంచి "అనుభవ రాహిత్యం. శాస్త్ర బద్ధంగా కాక ఏదో వచ్చీరానట్టు చేయటం.అరకొరగా పని చేశానని అనిపించటం, " వివరణ కాక నాకు ఈనాడు వారి సోదాహరణలు దొరికాయి. ఇక తగిన పంచతంత్రం కథ వెదకాలి. ఎవరికైనా తెలిస్తే చెప్తే నా కష్టాన్ని పంచుకున్న పుణ్యం దక్కుతుంది మీకు.


ఇవికాక, మీకు తోచిన స్వంత కథ/విశేషం పంచుకుంటే సంతోషం. నేను కట్టే కథ మీతో త్వరలో పంచుకుంటాను.

2 comments:

  1. Usha gaaru,
    I have some kids Short stories books and panchatantra stories, I will try to look in them and let you know.
    I liked your concept. Good effort

    Thanks,
    Surabhi

    ReplyDelete
  2. సురభి గారు, తప్పక చూసి ఇవ్వండి. ముందుగానే థాంక్స్. బ్లాగుల్లోని మిత్రులు వేణు గారి మాట "బాల్యం నీ తోడుగా ఉంటే వృద్ధాప్యం నీ దరిచేరదు" అన్నట్టు, బాల్యపు గురుతులు, చేతలు, కఠఌ, కబుర్లు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి.

    ReplyDelete