ఉగాది: ఏమిటి, ఎందుకు, ఎలా...


పిల్లలకి విషయం గురించి అయినా ముందుగా "ఏమిటి, ఎందుకు, ఎలా" అంశాలు ఆకళింపుకు రానిదే అది బుల్లి బుర్రల్లో నిలవదు కనుక నా బడి పిల్లలకి నా శక్తానుసారం చెప్పాను. వారిలో జిజ్ఞాసకి ఎంత చెప్పినా ఇంకాస్త చెప్పొచ్చును అనిపిస్తుంది. ఈ పోస్ట్ చదివినవారెవరైనా ఇంకేమైనా సమాచారం ఇవ్వగలిగితే మా అందరికీ ఆనందం. ముఖ్యంగా పిల్లలకి అనువైన పాటలో, పద్యాలో వంటివి.

నేను చదివినంతలో యేటి పోస్టుల్లో కుమార స్వామి గారు వ్రాసిన

శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు

పిల్లలకి బోధనకి బాగుంది. ముఖ్యంగా వారి చేతివ్రాతలో ఉన్న ప్రతి కనుకా ప్రింట్ తీసుకుని దాచుకున్నా అదొక ఆనందం.

ఇక నా వంతుగా నాదే మునుపటి పాట (చాలా మందికి తెలిసినదే) వారికి నేర్పి నేనూ పాడుకున్నాను.

ఉగాది వచ్చింది, పండుగ వచ్చింది!

ఉగాది వచ్చింది, పండుగ వచ్చింది
ఉగాది పండుగ వచ్చింది, వస్తూ వేడుక తెచ్చింది ||ప||

ఉగాది పచ్చడికి రుచులు ఆరంట,
ప్రతి ఏడాదికీ ఋతువులు ఆరేనంటా.
ఆరు రుచులు, ఋతువులు కాదా ఎంతో విభిన్నం!
ప్రతి వీక్షణం తెలుపునది ప్రత్యక్షసాక్షిగా? ||చ||

మాఇంట ఎప్పటికి మమతలు వెల్లువంట,
ప్రతి ఎదకీ మధురిమలు కోకొల్లలంటా.
మా మమతలు, మధురిమలు కావా ఎంతో అపురూపం!
ప్రతి క్షణం అందించునవి ప్రభవించేజ్యోతిగా ||చ||


ఉగాది రాబోవు కాలాలలో మీకు, మీ కుటుంబ సపరివారానికీ సుఖ సంతోషానంద భరితమై మీ జీవితాలలో ఆహ్లాదాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ.

7 comments:

  1. సోదరి
    మీరాదేశంలో ఉన్న మన సంస్కృతి సంప్రదాయాలను మరువం లా మరువనందుకు అభినందనలండి.------ఓ అన్న
    http://tellenglish.blogspot.com/

    ReplyDelete
  2. ఉష గారూ !
    మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  3. u can find some more information on 'ugadi" here:
    http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF

    ReplyDelete
  4. @V.Venkata Pratap గారు, తెలుగు భాష, తెలుగుదనం పట్ల ఆపేక్ష, తగు కృషిపెట్టగల ఆసక్తి ఉన్నందున ఈ ప్రయత్నం. నాలా మరెందరో ఉన్నారీ గడ్డపైన. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    @SRRao గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  5. తృష్ణ, థాంక్స్. నేను రెండు వారాల క్రితం జరిగిన మా ఊరి ఉగాది 'ఎస్సే రైటింగ్' పోటీలకి న్యాయనిర్ణేతని :) ఆ సందర్భంగా వచ్చిన వ్యాసాలన్నీ ఒకటే సోర్స్ ను వాడి వచ్చాయి. వికిపీడియా కాక అమ్మమ్మ, నానమ్మల నోటి మాట/పాటలు దొరుకుతాయని ఆశపడ్డానన్నమాట. :( దాదాపు మన పండుగలన్నిటికీ పిల్లలకి/పెద్దలకి జానపదాలుగానో, ఏవో ఒక సాంప్రదాయ గీతాలున్నాయి. మరి ఉగాదికి పంచాంగశ్రవణం, కవి సమ్మేళనం అని వదిలేశారేమిటో.

    ReplyDelete
  6. పాట బాగుంది మమతల వెల్లువలా మరువపు కొమ్మలా
    మీకు ఉగాది శుభాకాంక్షలు ఉష ;)

    ReplyDelete
  7. థాంక్స్ రామి. ఎందుకో ఉగాదికి మంచి సాంప్రదాయ గీతాలే లేవు (జానపదాల్లోనూ, లలితా గీతాల్లోనూను). మా గోదావరి ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల పడికట్టుననుసరించి కొత్త అల్లుణ్ణి ఆహ్వానించటం, వరసైనవారు ఆటలు పట్టించటం జరుగుతుంది కానీ అవి ఇక్కడి పిల్లలకి నేర్పగల నేపథ్యాన్ని/సందర్భాన్నీ ఇవ్వవు. సో, నా చేతి/కాలానికి పని తప్పలేదు అంచేత.

    ReplyDelete