ముగ్గురు స్నేహితుల కథ!

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులట. కావాలంటే 'అనగనగా' అని కలిపి చదువుకోండి.

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళగా, నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయిందట. ఆ ఘటన కి విలపిస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరినీ ఒక బజ్జీ బండి బూచాడు వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేపి హత్య చేశాడట.

విల విల్లాడి, వల వలా ఏడుస్తూ ఉల్లిపాయ దేముని సన్నిధిని చేరి "నా మిత్రులిరువురి కొరకూ నేను విలపించాను. నా కోసమెవరు ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

విజ్ఞానం: ఉల్లిపాయ కోస్తే కళ్ళనీళ్ళు ఎందుకు వస్తాయి?

నీతి: అన్ని కథలు నీతికథలు కావు. అన్ని కథల్లో కథ ఉండనట్టే, సత్యమూ ఉండదు. కానీ సరదా ఉంటుంది. బాల్యావస్థ లో మెసిలే ప్రతివారికీ అది కావాలి.

నచ్చినవారు ఒక స్మైలీ, నచ్చనివారు తమ స్వంత కథ వ్రాసి వెళ్ళమని రచయిత మనవి. :)

***

ఈ కథ కి మూలం మా టీచర్లే - కామేశ్వరి, సావిత్రి గార్లు. ఒక విషయానికి ముందిలా తేలికపాటి పిల్లల్లో ఆసక్తి రేపే అంశం ఎత్తుగడగా మొదలెట్టి క్రమంగా అసలు పాఠ్యాంశం బోధించేవారు. నేనీ కథ చెప్పి పిల్లలు నవ్వి, కాస్త కులాసాగా ఉన్నాక, అసలు తెలుగు లో చర్చ మొదలు పెట్టాననుకోండి. ఒకటొకటిగా అంశాల్లోకి వెళ్తాము. (జీవించటం) స్నేహితులు ఎలా ఉండాలి? అసలు మన ప్రయత్నమెంత ఉండాలి? దైవాన్ని ఎందుకు గురిగా పెట్టుకోవాలి? (సైన్స్) మంచు ఎందుకు నీళ్ళలో కరుగుతుంది? ఉల్లిపాయలో ఏ రసాయనం అలా కంటికి నీళ్ళని రప్పిస్తుంది? (వంట) పచ్చిమిరప బజ్జీ ఎలా చేస్తారు?ఇవి వాళ్ళకి కొత్త గా తెలుగుబడి నేర్పేవి కాకపోయినా తెలుగు మాట, సేత వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకోవటానికి బెట్టుచూపకుండానే నేర్చేసుకుంటారు.

17 comments:

  1. ఈ కథ మా పిల్లలకి చాలా ఇష్టమైన కథ లలో వకటి :)

    ReplyDelete
  2. మాలా గారు, ఒక స్పందన వరకు అని ఆగానండి. ఈ కథ కి మూలం మా టీచర్లే - కామేశ్వరి, సావిత్రి గార్లు. ఒక విషయానికి ముందిలా తేలికపాటి పిల్లల్లో ఆసక్తి రేపే అంశం ఎత్తుగడగా మొదలెట్టి క్రమంగా అసలు పాఠ్యాంశం బోధించేవారు. నేనీ కథ చెప్పి పిల్లలు నవ్వి, కాస్త కులాసాగా ఉన్నాక, అసలు తెలుగు లో చర్చ మొదలు పెట్టాననుకోండి. ఒకటొకటిగా అంశాల్లోకి వెళ్తాము. (జీవించటం) స్నేహితులు ఎలా ఉండాలి? అసలు మన ప్రయత్నమెంత ఉండాలి? దైవాన్ని ఎందుకు గురిగా పెట్టుకోవాలి? (సైన్స్) మంచు ఎందుకు నీళ్ళలో కరుగుతుంది? ఉల్లిపాయలో ఏ రసాయనం అలా కంటికి నీళ్ళని రప్పిస్తుంది? (వంట) పచ్చిమిరప బజ్జీ ఎలా చేస్తారు?ఇవి వాళ్ళకి కొత్త గా తెలుగుబడి నేర్పేవి కాకపోయినా తెలుగు మాట, సేత వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నేర్హుకోవటానికి బెట్టుచూపకుండానే నేర్చేసుకుంటారు. నాదొక బాట. ఉషారాణీ మాట, రాణీబాట! ;)

    అసలు పిల్లలకేమిటి పెద్దలకీ నచ్చాలి ఈ కథ.

    ReplyDelete
  3. రెండు:):)ఇస్తే అభ్యంతరమా?

    ReplyDelete
  4. హే, వస్తున్నాయి స్మైలీలు, వస్తూ నాకు (:@ అను 'sad monkey face' ని తప్పించాయి. స్మైలీలు పంచిన రాణి, రామి, పద్మార్పిత గార్లకు ధన్యవాదాలతో ఆ స్మైలీ చరిత్ర అను కథ ఉచిత బహుమతి అనగా "The Very Long History of Emoticons" అంటూ వచ్చిన వ్యాసమన్నమాట http://www.good.is/post/the-very-long-history-of-emoticons/

    ReplyDelete
  5. "బాల్యావస్థ లో మెసిలే ప్రతివారికీ అది కావాలి"

    గొప్ప మాట! అసలు బాల్యవస్థని దాటాక నిజజీవితం అంటూ వుంటుందా? సాహిత్యం అంతా ఆ బాల్యావస్థ పునరు జ్జీవనమే కాదా?

    ఇలాంటి కథలు మరిన్ని చెప్పండి...మిమ్మల్ని చెప్పమంటున్నానంటే నేను చాలా మరిచిపోయాయన్న క్షోభ కూడా వుంది!

    ReplyDelete
  6. "అసలు బాల్యవస్థని దాటాక నిజజీవితం అంటూ వుంటుందా?" :-) True..makes me wonder, too!!

    ReplyDelete
  7. కథ చాలా బాగుంది. ఇది నాకు తెలియని కథ... అందుకే చాలా ఆసక్తిగ చదివాను. నవ్వకుండా ఉండలేకపోయాను.

    థ్యాంక్యూ సో మచ్ ఉష గారూ...

    ReplyDelete
  8. మధుర ముచ్చటగా ఇచ్చిన మూడు, Maddy గారి ఒకటి కలుపుకుని ఇవాళ్టి విన్నర్ నా స్మైలీనే. పాపం నా కథకిక ఎదురు కథ లేదు. ;)
    @geetika మీకు నచ్చినందుకు, మీకు నా :)

    ReplyDelete
  9. Afsar గారు, KumarN గార్లు, మీ మాటలకి మళ్ళీ లోలోపల డిబేట్. 'సాహిత్యం లేకపోతే జీవితం చచ్చిపోదు, జీవితం లేకపోతేనే సాహిత్యం చచ్చిపోతుంది' అని నమ్ముతాను. బాల్యంలో చాలా జీవం ఉంటుంది. అందుకే మిగిలిన జీవితమంతా ఆ స్మరణలు. నా వరకు ఇప్పటికీ, ఇకపై కూడా ఆ బాల్యావస్థని దాటాలన్న ఉద్దేశం నా మనసుకి లేదు.

    తప్పక మీరన్న మాట ప్రకారం కథలు జ్ఞాపకానికి తెస్తాను అంటే తెస్తాను.

    ReplyDelete
  10. :):):):):):):):):):):):):):):):)హా...అలిసిపోయాను. ఇంకా ఇంకా చాలా చాలా ఎన్నో ఎన్నెన్నో......

    ReplyDelete
  11. జయా, ఈ కథ చెప్పటం వెనుక ఉద్దేశం అదేనండీ. అందరికీ పెదాలు సాగి సాగి స్మైలీదేమునికి మొక్కులు తీర్చటమే. ఈ ఉల్లి మిరప మంచు కేవలం పూజాసామాగ్రి మాత్రమే! థాంక్యూ. మీ వంతు ఇచ్చినందుకు. ;)

    ReplyDelete
  12. చిన్న చిన్న కథలతో ఎలాంటి విషయమైన హత్తుకునేట్టు చెప్పవచ్చు మంచి ప్రయత్నం

    ReplyDelete
  13. బుద్దా మురళి గారు, ధన్యవాదాలు. నా దగ్గరకి వచ్చే పిల్లల్లో చాలా వరకు ఇంటిలో తెలుగు ఎక్కువగా మాట్లాడరు, అంచేత ఒక్కసారే పంచతంత్రం లేదా చందమామ కథల్లోకి తీసికెళ్ళటం కష్టం. సో, ఇదొక బ్రిడ్జ్ వంటి యత్నం.

    ReplyDelete