ఆ ఒక్కటీ అడక్కు!

అడగనివన్నీ అపురూపంగా కొని తెచ్చిచ్చిన
నాన్ననేనడిగిన దానికి మాత్రం ఒకటే మాట చెప్పారు "ఆ ఒక్కటీ అడక్కు"
అదలా ఇదిలా అని నేనడగకనే అన్నీ విడమరిచి విప్పిచెప్పిన అమ్మా అంతే
ఆమాట ఎత్తగానే తప్పుకుపోయింది ముందే ఇదేమాట చెప్పి "ఆ ఒక్కటీ అడక్కు"

అడగని ప్రశ్నలన్నిటికీ పిలిచి మరీ సమాధానాలు నేర్పిన అయ్యోరూ
చివరికి నాకు మిగిలిన ఆ ఒక్కదానికీ అదే మాట వదిలారు "ఆ ఒక్కటీ అడక్కు"
మరేం నీకిది తెలుసా అని నన్నడిగి, నాకు తెలిసినవన్నీ తోడేసిన మిగిలినవారంతా
మచ్చుకి నేనడిగిన ఆ ఒక్కదానికీ అదే అనేవారు "ఆ ఒక్కటీ అడక్కు"

అందినవన్నీ అలుసుచేయకు ఆపై మరి ఆశపడకని అదమాయించబోతే
అక్కసుగానో, ఆక్రోశంతోనో నా తనువు వెళ్ళగక్కిన వాక్కదే "ఆ ఒక్కటీ అడక్కు"
తాను వుబలాటపడేది అనువు కాదని తెలిసినా, ఆగనని చేజారనుందని
నేనదుపు చేయబోయిన క్షణం నా మనసు నాకెదురు చెప్పిన మాటదే "ఆ ఒక్కటీ అడక్కు"

ఇన్ని దైవఘటనల మీదటా ఇక నేనేం ఆశించను? మరి నను నీ నెలవుకి కొనిపో ప్రభూ..
నా వేడుకోలు విన్నా నేనింకా మిగిలున్నానంటే వాడిమాటదేనా "ఆ ఒక్కటీ అడక్కు"

చివరికి మిగిలింది ఇదా అని నాలో నేను తలపోసుకుంటే నాకు తోచింది ఒకటే
ఆగండాగండి అదేంటని మీరడగాలనుకునే ప్రశ్నకి నా జవాబొకటే "ఆ ఒక్కటీ అడక్కు"

22 comments:

  1. hmm,
    నాన్న అడగద్దాన్నరంటే అది క్రమశిక్షణను పాడు చేసేదయి ఉండాలి
    అమ్మ అడగద్దంటే అది ద్వేషాన్ని పెంచేదవ్వాలి
    గురువుగారు అడగద్దొన్నారంటే అది మరో పరిశోధనకు దారి తీసేదవ్వాలి
    స్నేహితులు అడగొద్దాన్నరంటే అది వారిని చిన్నబుచ్చేదవ్వాలి
    తనువు అడగొద్దంటే, తనువు అలసిపోయి ఉండాలి
    మనసు అడగొద్దంటే అది విసిగిపోయి ఉండాలి
    దేవుడు అడగొద్దంటే అది మృత్యువును జయించమన్న వరమవ్వాలి

    ఇన్ని నియమాలను అనుసరించి నేను చెప్పగలిగిన జవాబు ఏమవుతుంది ???
    తెలిసినా చెప్పకపోతే మీ తల వేయి ముక్కలగుగాక

    ReplyDelete
  2. ఇదేదో బాగుందే! ఇంత చెప్పిన తరువాత నేనెలా అడగకుండా వుంటాను? ఇంతకీ "అది" ఏమిటండీ? complete freedom...?

    ReplyDelete
  3. ప్రదీప్, అమ్మా అలా భయపెట్టి కనిపెట్టేద్దామనే, ఆశ, దోశ... నా తల కోటిముక్కలైనా చెప్పనుగాన చెప్పను.

    సృజన, నా బ్లాగుకు సాదర స్వాగతం. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    మురళి, ధన్యవాదాలు

    అశ్వినిస్రీ, ఒహొ, మీరిలా వచ్చారా, కాస్త బామాలి అసలు గుట్టు లాగేద్దామనేం, అదేం కుదరదబ్బా.

    మీయెవ్వరికీ నేచెప్పనుగాన చెప్పనంతే.;)

    ReplyDelete
  4. మీయెవ్వరికీ నేచెప్పనుగాన చెప్పనంతే.;)
    అడిగిన వారికి తప్ప అందరకి చెప్పేయండి.

    ReplyDelete
  5. Usha, very nice. But is it possible to increase the font size a little bit. Just a request. Makes it easier to read.

    ReplyDelete
  6. ఏదో మీరే చెప్తారని చూసా, శపించా అయినా మీరు చెప్పట్లేదు కనుక నేనే చెప్తున్నా. ఆ ప్రశ్నేమిటంటే
    " Don't ask me that " ని తెలుగులో ఏమనాలి?
    ;)

    ReplyDelete
  7. కృష్ణారావు గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం, వ్యాఖ్యకి ధన్యవాదాలు. మరి మళ్ళీ మళ్ళీ రావాలి ఈ మరువపువనానికి. మరవకండేం.

    ప్రియా, font మార్చాను మరి, ఇపుడెలావుందో కాని!

    ప్రదీప్, మరీ మొహమాటపెట్టేస్తున్నారు. కనుక మీవంటి మంచి మిత్రుని మాట మన్నించి మాటగా కాదు కానీ, ఎక్కడో విన్న పాటగా చెప్పేస్తున్నా... ;)

    "a little sweet, a little sour, a little close, not too far, all I need all I want is to be free..."

    Yep, I have assessed what I asked and made some small adjustments as life taught and now just want these reasonably memorable moments.

    ReplyDelete
  8. Usha, thank you. I like this font. :) But I noticed no one is complaining about it. Well..

    ReplyDelete
  9. @ ప్రియ గారూ..
    మీకు చదవడానికి పెద్దగా కావలంటే Ctrl మరియు + నొక్కిది ఏ వెబ్ పేజి అయినా ఫాంట్ పెరుగుతూ వెళ్తుంది.
    @ ఉష గారూ..
    చిన్న ఫాంట్ ఉన్నప్పుడే బాగుందని నా అభిప్రాయం. పెద్దగా చూడాలంటే పైన చెప్పినట్టు చేయచ్చు.

    కవిత సంగతి కొస్తే.. ఆఖరి రెండు లైన్లు నాకసలు నచ్చలేదండీ.. చివరికి చెప్తారేమో ఇంత సేపూ ఊరించినందుకు అనుకుని గబగబా చదివాను :( మీ జట్టు పచ్చి ఇలా అయితే.. ;)

    ReplyDelete
  10. మధురా, మీరు చెప్పిన కిటుకు వుంది కనుక తిరిగి పాత ఫాంటుకి మార్చేసాను. Priya,I hope you don't mind for that.

    అపుడే జట్టు పచ్చి ఎందుకబ్బా, మీ అందరికీ అలా దూరమవటం ఎందుకనీ, వయసుతో కాస్త పరిణితి వచ్చింది కనుకాను చివరిగా నాకు కావాల్సిన ఆ ఒక్కటి పైన చెప్పాగా, చదవలేదా? చదవకుండానే నా మీద అలా నిప్పులు కురిపించారా?

    ఎక్కడో విన్న పాటగా చెప్పేసాను... ;)

    "a little sweet, a little sour, a little close, not too far, all I need all I want is to be free..."

    Yep, I have assessed what I asked and made some small adjustments as life taught and now just want these reasonably memorable moments.

    ReplyDelete
  11. ఉషగారు, మరీ అంత మొహమాటపెట్టేసానా ! సరే లెండి మొత్తానికి సమాధనమైతే తెలిసింది. ఈ కవితకు ఇన్స్పిరేషనన్న మాట ఆ పాట.
    కానీ నేను మొదటి వ్యాఖ్యలో రాసినట్టు మొత్తం అన్నింటికీ ఒకటే సమాధనమైతే ఉండదని నా ఉద్దేశ్యం.

    ReplyDelete
  12. ఏ మాత్రం రాజేంద్ర ప్రసాద్ ,రంభ నటించిన తొలి తెలుగు చిత్రం ఏదని అడిగి ఉంటారు మీరు మీ అమ్మ.నాన్న,గురువుగార్లను ...
    :P

    ReplyDelete
  13. అబ్బోసి మీకూ చలచిత్ర పరిజ్ఞానం ఎక్కువేనా, నాది అంతే, కాకపోతే దర్శకులు, సంగీత దర్శకులు, ఇలా టెక్నీషియ్నన్లు ఎవరా అని ఆరాగా చూసి అవే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాను. ఎందుకంటే నేను చేసేది "రాళ్ళెత్తిన కూలి" కొలువు కనుక వారంతా నా మాదిరిగా అగుపడతారు. అంచేత ఆ దారిన పోతా... ధన్యవాదాలు.

    ReplyDelete
  14. అవునూ ప్రదీప్ మీరీ మధ్య కానీ జీళ్ళ వ్యాపారమేదైనా మొదలు పెట్టారా, ఇక ఈ కవితని మళ్ళీ చదివి ఇంకేమైనా అన్నారంటే మీ తల, మీరు వ్రాసే కంప్యూటరు కోడూ ట్రిలియనో, జిలియనో ముక్కలవుగాక. సో ఈ శాపాల బిజినెస్సు కూడా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా... హ హ హ్హా సరదాకేలేండీ.. లైట్ తీసుకోండి...

    ReplyDelete
  15. సరేలెండి ఇక ఆపుచేస్తున్నా...
    నా తల, నేను వ్రాసే కోడ్ ట్రిలియన్ ముక్కలవ్వాలన్నందుకు చాలా ఆనందం. ఎందుకంటే ట్రిలియన్ ముక్కలవ్వాలంటే అంత పెద్దవవ్వాలి కదా ఆ రెండూ!!

    ReplyDelete
  16. వారెవ్వా, ప్రదీప్, మీకు మీరే సాటి, మీకిక ఎదురు లేదు. నదురూ లేదు, బెదురూ లేదు, సాగిస్తూనేవున్నారుగా మాటల తూటాలతో దండయాత్ర. ;) సామం, పనిచేయలేదు, దండమూపనిచేయలేదు. ఇక నాకూ వేరే మార్గాలు లేవు. అయినా మిరియం గింజని పగలగొట్టటానికే నాకు భయం మీకిచ్చిన శాపానికి ఎపుడో తూచ్ చెప్పేసా, సో మీరూ, మీ కోడూ రెండూ సేఫే! ;)

    ReplyDelete
  17. ప్రదీప్! హమ్మయ్యా! మాటలు చిరుదరహాసపుమౌనంలోకి దిగాయన్నమాట. మీరిలాగే ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ మరువాన్ని పలకరించను రావాలని ఆకాంక్ష. ఈ టపాకి మీరు వ్రాసిన వ్యాఖ్య నిజంగా బాగుంది. అవును నిజమైన సమాధానం కొన్ని "ఒక్కటీ" ల సమూహం మీరన్నట్లుగా. కానీ నేను ముందే చెప్పినట్లుగా మరో అవకాశం వచ్చినా అందులో ఏ "ఒక్కటీ" ఇప్పుడు అడగనేమో. అది పరిణితో, సంతృప్తో, నిర్లిప్తతో నాకు తెలియదు. ఈ స్థితిని చేరను సహకరించిన జీవితానుభవాల్ని ఉదహరించను మాత్రం సమయం, అవసరం లేవు. ఆ పాటలో రచయిత సరీగ్గా నా మనసునే వ్యక్తపరిచారు, అందుకే దాన్ని ఉటంకించాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  18. హమ్మయ్య ఇక మాటల సమరం అంతమన్నమన్నమాట.
    ఆ పాట విషయానికొస్తే ఇదివరకు సినిమా చూసేప్పుడు అంతగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ చూస్తే నాకు మంచి అనుభూతి కలిగింది. మంచి పాటను పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
    మీ మరువంలో మరో మంచి కవిత కోసమెదురు చూస్తూ....

    ReplyDelete
  19. ధన్యవాదాలు. చిత్రం ఒక మంచి పాటని ఈ వ్యాఖ్యాపరంపర మనకు మిగల్చటం.

    ReplyDelete