కాలం, లోకం, జీవితం మూడు ఉత్పాతాలై,
నను ముప్పిరిగొని,
గాయం, శోకం, నైరాశ్యం ముప్పేటపూని
నన్ను మళ్ళీ మళ్ళీ ఉరితీసాక,
విగతజీవినయ్యాననుకున్నా,
జీవఛ్ఛవాన్ని చేసి ఇటు విసిరాయ్.
వినోదక్రీడకి నేనంతగా నచ్చానని
అన్యాపదేశంగా తెలిపాయ్.
ఈ మజిలీలో నీవున్నావని
కలనైనా వూహించితి కాదు.
నాకలవాటైన వేదనలో,
శంకలో మునిగిన చూపులో
నీ రూపు సరీగ్గాకాననైతినిన్నాళ్ళూ,
నీ వాక్కునర్థంచేసుకోలేకపోతిపలుమార్లు.
ఎంత చిత్రమీ మన పయనం
కలవనిదిక్కులుగా సాగి కలిసిపోయామీక్షణం.
ఒకమారా తొలి తలపుల్లోకి తొంగిచూసి
ఈ కొన్నీ తిరిగి చెప్పనీ,
నీహారిక నీవనుకుంటే
హిమాలయమై వున్నతశిఖరమై అబ్బురపరిచావ్.
గాలిదుమారమనుకుంటే
నా జీవనవేణువు ప్ర్రాణవాయువుగా నాలో చేరిపోయావ్.
శిలనీవనుకుంటే,
నాచేతికి స్నేహపు ఉలిచ్చి నా నేస్తంగా చెక్కించుకున్నావ్.
మరలిపోనని మనం ఒకటని మరులు గొలిపావ్,
గతపుగరళం చిలికి, నేటి వెన్న చేతిలొ పెట్టావ్.
రాదంటూనే నా జీవితచిత్రానికి మెరుగులుదిద్దావ్,
రంగుల కలలనిచ్చావ్. రేపుకొరకు చూడమన్నావ్.
సడలిపోని నెనరు నెయ్యం పంచావ్,
నీవినా నేనిక మనలేను,
నీతో కలిసిసాగే ముందొకమాట
కాదనక స్వీకరించు,
బదులుగ ఒక చిరునవ్వు నాకు పంపు
మన్నించవా మిత్రమా?
Its nice....
ReplyDeleteచాలా బాగుంది ఉష గారు,ఉదయమే మంచి కవిత తో మనసును ప్రశాంతం చేసారు
ReplyDeleteI remembered the movie "Iddaru" and Prakash Raj's dialogues. I know it was a dubbed dialect of Telugu that they used but some of the line he uttered were really impressing. I love that movie. I tried many times to write something on friendship but failed utterly all the time. I must say all those who CAN do it are great in my view. You did the best job like many best writers.
ReplyDeleteAlso I remembered my favorite part of W. B. Yeats poem which I used in my "about me" on orkut.
about me:
Think where man's glory most begins and ends,
And say my glory is I have such friends.
And this inspired me to a small bunch of lines.
Some emotions never have reasons.
Some relations never have endings.
Some tears are never forgotten.
Some hugs are never felt enough.
Some smiles never have meanings.
Some feelings never need voices.
Life is never full without some friends.
పద్మార్పిత, నేస్తం - ధన్యవాదాలు.
ReplyDeleteఆనంద్, ఇక్కడ కూడా నవీనత, అచ్చం మీ కవితల మాదిరిగా, విభిన్నత, ఇదీ అచ్చం మీ ఆలోచనల మాదిరిగా, చూపారు. "ఇద్దరు" చూసిన గుర్తు లేదు, ఒకసారి తెచ్చుకుని చూస్తాను. మీ ప్రశంస కూడా వైవిధ్యంగా వుంది. I am so glad that I met you in this blog world. Your lines all just apply to my life and those small set of friends are what make me feel that my life is at peace and help me find contentment.
చాలా బాగుంది ఉష గారు.
ReplyDeletebeautiful.!
ReplyDeleteచాలా బావుంది ఉష గారూ..!!
ReplyDeleteచాలా రోజుల తరవాత వచ్చాను ఇటు వైపు..
మీ మరువపు గాలి సోకగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.. :)
చాలా బాగుంది ఉష గారు!!
ReplyDeleteఈ మధ్యకాలంలో ఇంత పద ప్రయొగం, ఇంత చక్కటి వర్ణన చూడలేదు.
మరిన్ని టపాలకై వేచి ఉన్నాను :)
వేణూ గారు, మీ పునర్దర్శనం నాకు ముదావహం, ధన్యవాదాలు.
ReplyDeleteమధురా, నిజం. నాకు కూడా మీ బ్లాగుకి వచ్చినపుడు అదే భావన. మనం మనం ఎంతైనా సాహితీమిత్రులం కదా! నాకు కూడా ఉద్యోగరీత్యాగా, తదితరగా కాస్త వత్తిడి వుంటుంది. అయినా కొంత సమయం వీలు చిక్కించుకుంటున్నాను.
సాయి, సతీష్, నా బ్లాగుకి సాదర స్వాగతం.
సతీష్, మీ ప్రశంసను సవినయగా స్వీకరిస్తూఒ, అలాగే మీరు మీరు మళ్ళీ మళ్ళీ ఆసక్తిగా చదివేట్లుగా నా కవితలు వుండాలని ఆశిస్తున్నాను.