ఆ మంచు గుట్టల మీద
ఆకతాయి గాలుల ఆటకాయతనం ముద్ర వేస్తుంది.
గాలికి కుంచె రూపు వస్తే,
సృష్టిలో అద్వితీయమైన చిత్రలేఖన సృష్టి జరుగుతుంది.
ఊపిరి తీయనీయని బ్రతుకు నుంచి
త్రుంచి తెచ్చుకున్న ఓ గుప్పెడు క్షణాలు ఊదామా,
ఇక ఆరీ ఆరని వైనాల ఆ చిత్రాల మీద గంపెడు ఊహలై నిశ్వసిస్తాయి...
ఎవరికి ఆ అందమైన గానం వినిపించాలో
తెలియక తడిబడిపోతాము,
మరవరాని కాల గమనం అని మురిసిపోతూ...
పరకాయించి చూస్తే ఆ మంచులో
ఎన్నెన్నో లోతైన సంగతులు ఉన్నాయి!
కరుగుతున్న దృశ్యం...మనసు కరిగించే దృశ్యం! మరువం - ఈ దృశ్యాన్ని మరువమన్నా మరువం :)
ReplyDeleteనమస్తే .. ఏదో పాత ఫైల్స్ వెతుకుతూ ఉంటే, మీరు 2010లో బ్లాగు మూసేస్తాను అని పోస్టు పెట్టిన రోజున మీ బ్లాగు మొత్తాన్ని నేను PDF చేసి పెట్టుకున్నాను. అది దొరికింది. ఒకటో రెండో పోస్టులు మీ ప్రస్తుత బ్లాగులో మిస్స్ అయ్యినట్లు కనబడింది. మీకు ఆ PDF file కావాలంటే, నా మైల్ ఐడీకి ఓ టెస్ట్ మైల్ పెట్టండి. లంకెను పంపిస్తాను.
ReplyDeleteచాలా సంతోషమండి. నా అక్షరాలని పట్టించుకుని, ఒకరు పదిలపరిచారన్న ఊహకి కంటనీరు వచ్చింది. ఇంకా గోమ్తుపూడిన భావనే నా వేళ్ళలోనూ...చూస్తాను నేనే కొన్నిటిని వెనక్కి లాగానా?
Deleteఙాపకాల దొంతరాలు
ReplyDelete