Memories are arbitrary

లోక సంచారి ఒకరు
పరిమళరూపాన పూటకొక పూసత్రం లో
విడిది చేసి
వేకువఝాముకి పుప్పొడి కంబళి విసిరి కొట్టి
పయనమైనట్లుగా ఉంటుంది...
తాను తిరిగిన దారులన్నీ నాకెరుకనే!
గూడు కట్టని ఒక్కొక్క జాతి పిట్ట
కొమ్మ అంచునో, గుమ్మం మూలనో

నిదుర చేసి
పొద్దు పొడుపు వేళకి పాటతో చుట్టుముట్టి
బందీని చేస్తూంటాయి!
అంత్యాక్షరి ప్రాసలు కలుపుతూ నేనూ జతపడతా...
తలవాకిట నిలిచిపోతాను,
చుక్కలు పొదిగిన దుప్పటి కప్పుకుని
నేలని అదుముకుని
జీవన పరిమళమై తిరుగాడుతాను
కలల సానువుపై రాగమై ధ్వనిస్తాను.



1 comment:

  1. చివరి రెండు వాక్యాలు చాలా బాగున్నాయి.అలాగే "చుక్కలు పొదిగిన దుప్పటి కప్పుకోవడం"అందమైన కవితావాక్యం.

    ReplyDelete