ప్రవాహమైన "త్రిపద" లట!

1-
పాట
ప్రవాహం
పరవశం
-2-
నది
ప్రవాహం
సాగరకాంత
-3-
కథ
ప్రవాహం
పాత్రోచితం
-4-
మాట
ప్రవాహం
ఇష్టాగోష్టి
-5-
వేట
ప్రవాహం
మత్స్యజీవి
-6-
బాధ
ప్రవాహం
విలాపము
-7-
నవ్వు
ప్రవాహం
సంజీవని
-8-
ధ్వని
ప్రవాహం
సంగీతము
-9-
భక్తి
ప్రవాహం
కైవల్యము
-10-
కళ
ప్రవాహం
అక్షయము

*****
(సహృదయతతో అందరినీ ఆకట్టుకునే నూతక్కి బాబాయ్ గారికి సహకారం ఇస్తూ, ఇలా ఓ పావుగంట ప్రయోగం, నాకు కాస్త సవాల్ నేనే కల్పించుకుని 'ప్రవాహం' అనే పదం రెండవ పదం గా వాడాను ఈ పది త్రిపదల లోనూ
"ట్రై."
"త్రిపద"
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.

చిరు పద కవితా ప్రక్రియలలో
స్వీయ మనోజనిత సృజితం
వినూత్న ఆవిష్కరణం.

రెండక్షరాలు తొలిపాదం
మూడక్షరాలు రెండోపాదం
నాలుగక్షరాలు మూడవపాదం
భావసారం చిలుకుదాం .

ప్రయత్నించండి
సాధన చేయండి
వస్తువుకా కొదవలేదు
అక్షరాలా అడుగంటవు

కాని
అక్షరాల పొదుపు
భవ్యతకోమలుపు.
..........................................
ఇలా రాద్దాం .నచ్చితే కొనసాగిద్దాం.)

3 comments:


  1. బ్లాగ్ టపా
    ప్రవాహం
    కామెంటులు :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జీలేబీ గారు, రెండక్షరాలు తొలిపాదం మూడక్షరాలు రెండోపాదం నాలుగక్షరాలు మూడవపాదం కనుక మొదటి పాదం లో టపా ఉంచేద్దాము. అన్నట్లు మీరన్న ప్రవాహాలు ఇపుడు భూగర్భం లో నిక్షిప్తమై పోయాయిగా!? ;)

      Delete
  2. యివి నా వద్ద నిక్షేపంగా ఉన్నాయిగా . అమ్మాయ్ ఉషా . నానో యజ్ఞం ఆ తరువాత నానీల మీద పని చేయడం ఆటరువార నానోలు దరిజేర్చడం అమెరికా ప్రయాణం వీటన్నింటితో తో త్రిపదలు కు కొంత అన్యాయ జరిగిన మాట వాస్తవమే. అలా అని విస్మరించాలేడమ్మాయ్. త్రిపదలు ఓసంకలన పుస్తకంగా వస్తుంది అందులో నీవూ , Chandrasekhar Vemulapalli మరో యిద్దరు ఔత్సాహికుల త్రిపదలు కూడా వెలుగు చూస్తాయి. ప్రస్తుతం నానో బుక్ ముద్రణ కై పని చేస్తున్నాను. మరలా డిసెంబర్ నానో యజ్ఞం దగ్గరకొచ్చింది...మరిరి కొన్ని రాసి ఉంచమ్మాయ్ Usha... బాబాయ్ నూతక్కిరాఘవేంద్ర రావు.

    ReplyDelete