అనగనగా ఒక చిన్నారిలోకం,
అమ్మ ఒడి, నాన్న పంచే బలిమి కలబోతల "జీవని"
ఆ చల్లని జీవన వాహిని లో గలగలలు ఈ పిల్లలు
అందరిదీ ఒకే మూలం...మానవత్వం!
అమ్మ ఒడి, నాన్న పంచే బలిమి కలబోతల "జీవని"
ఆ చల్లని జీవన వాహిని లో గలగలలు ఈ పిల్లలు
అందరిదీ ఒకే మూలం...మానవత్వం!
పూల రంగులు, పాల పొంగులు చిన్ని ఊసుల్లో
మంచి గంధాలు, ఫల మాధుర్యాలు చేతల్లో
లేడి పరుగులు, తువ్వాయి చిందులు పాదాల్లో
బడి గుడిగా, బ్రతుకు లక్ష్యంగా...బాల్యం!
మంచి గంధాలు, ఫల మాధుర్యాలు చేతల్లో
లేడి పరుగులు, తువ్వాయి చిందులు పాదాల్లో
బడి గుడిగా, బ్రతుకు లక్ష్యంగా...బాల్యం!
అమ్మైనా నాన్నైనా ఉండుంటే సాగని సరదాలు
అర్థం పర్థం ఎరుగని పోటీ లేని పయనాలు
ఆటపాటలు, లలితకళలు మురిసి విరిసే ప్రాంగణాలు
ఎదుగుతూ- ఎదుగుతున్న ఒద్దికలో- ప్రతిభా ప్రావీణ్యాలు
అర్థం పర్థం ఎరుగని పోటీ లేని పయనాలు
ఆటపాటలు, లలితకళలు మురిసి విరిసే ప్రాంగణాలు
ఎదుగుతూ- ఎదుగుతున్న ఒద్దికలో- ప్రతిభా ప్రావీణ్యాలు
"జీవని" ఎవరంటే!? చిందే నవ్వులా, చెదరని మమతలా-
ఉత్తేజం ఉత్ప్రేరకం ఉత్సాహం ముప్పేట అల్లిన దారం,
ఆ లోగిలి మమతలు పెనవేసి కట్టిన దండకి.
మానవీయ వైనాలు కొలువుదీరిన ఆలయం
ఉత్తేజం ఉత్ప్రేరకం ఉత్సాహం ముప్పేట అల్లిన దారం,
ఆ లోగిలి మమతలు పెనవేసి కట్టిన దండకి.
మానవీయ వైనాలు కొలువుదీరిన ఆలయం
/* తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను సమాజంలో భాగస్వాములను చేయడం, తరచుగా వారిని దాతలతో మాట్లాడించడం అన్న ప్రధాన లక్ష్యాలతో జీవని పని చేస్తోంది. ఈ విధంగా పిల్లల్లో మానవ సంబంధాలను నెలకొల్పడం మన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 10 మంది పిల్లలతో జీవని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం అవుతోంది. కరువు జిల్లా అయిన అనంతపురంలో మేము తలపెట్టిన ఈ యగ్నం విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాం.*/
Source: http://jeevani2009.blogspot.com/2009/06/blog-post.html
ఉష గారు మీకు రెండు విధాల ధన్యవాదాలు.
ReplyDeleteజీవని గురించి టపా పెట్టినందుకు, చాలా కాలం తర్వాత తిరిగి బ్లాగులో కామెంట్ పెట్టే అవకాశం ఇచ్చినందుకు...
బ్లాగర్ల తోడ్పాటుతోనే జీవని ఎదిగింది.