జంటగానం


రేయి వెన్నెలంతా కొమ్మల్లోకి నింపుకుని
తెలవారి పుప్పొడి పదాలు రాల్చిన మొక్క.
పగటి కాంతులు గుప్పిట పట్టుకుని
సంధ్య వేళ మొగ్గల పాటలు విప్పిన తీగ
రేయింబవళ్ళ సాక్షిగా నెయ్యం చేస్తాయి.

కలల విత్తులు నాటుతున్న మనిషికి
కొమ్మంటు జోడీలు వెదికే మనసు,
ఊహలకి ఆలంబన తరిచే మనసుకి
అరచేత స్వర్గాల మురిసే మనిషి,
ఆశానిరాశల సాక్షిగా బతుకు సాగిస్తారు..

8 comments:

  1. బాగుందండి....ఇంత అందమైన ఆలోచనలు ఎలా వస్తాయి మీకు!

    ReplyDelete
  2. పగటి కాంతులు గుప్పిట పట్టుకుని
    సంధ్య వేళ మొగ్గల పాటలు విప్పిన తీగ

    చాలా బాగుందండి. నాదికూడా అదే బావన. మీకు ఇంత అద్భుతమైన ఆలోచనలు ఎలావస్తాయండి

    ReplyDelete
  3. చాలా చక్కగా రాసారండీ...చాలా నచ్చింది నాకు

    ReplyDelete
  4. నిజంగానీ నాకూ అదే సందేహమండీ..ఇంత అందమైన ఆలోచనలు, ఆ ఆలోచనలకు పొదిగే సొగసైన మాటలు ఎలా వస్తాయండీ మీకు?

    ఉష గారూ.. మీ బ్లాగ్ లో (వేసట ఎరుగని విరహిత) నా వ్యాఖ్య మొదటిదే కానీ...మీ బ్లాగ్ ని చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతూ వుంటానండీ. ఇంత అద్భుతంగా రాసే మీ ముందు నా పిచ్చిరాతలు పరవాలంటే కాస్త జంకుగా అనిపించి వ్యాఖ్యలు రాయలేకపోయానండీ.

    ReplyDelete
  5. పద్మార్పిత, ప్రసూన, రాధిక(నాని), స్ఫురిత, ప్రణీత [మొత్తం హల్లులు సంయుక్తాక్షరాలు గుణింతాలు దిద్దించేసారు ఐదుగురూ కలిసి.. ;)], ముందో ప్రశ్నకి సమాధానం చెప్పండి అంతా కలిసి మరి! ఎవరిదో ఓ పిచ్చి మనసు రాసుకున్న భావాలను అంత అందంగా ఆస్వాదించే అద్భుతమైన అభిరుచి మీకు ఎలా అబ్బింది? :)

    అందరికీ నెనర్లండి..ఈ భావాలకి మూలమైన ఆలోచన నాకు కల్పించిన కాలాలకి వందనాలు.

    ReplyDelete
  6. ఇదేదో విదేశీ కుట్ర ల వుంది ......క్షమించాలి ఆడవాళ్ళ కుట్రల వుంది.ఫెమినిసం డౌన్ డౌన్ ...హ్హ హ్హ హ్హ హ్హ !
    బావుంది ఉష గారు....!

    ReplyDelete
  7. సావిరహే గారు, కవిత మీద అభిప్రాయానికి నెనర్లు. పోతే నా వరకు బ్లాగరు జాతి, మా "కవి" కులం, వారి సానుకూలురు, కలిసి ఎదగాలన్న అభిమతం తప్పా మిగిలిన బేధభావాలు లేవు. మీరు క్రొత్త కనుక ఈ ఒక్కసారికి అన్యధా భావించరనే, మీ మనోభావాలు దెబ్బ తినవనే ఈ మాట చెప్తా.

    ReplyDelete