విమోచన

From collections at GALLERIA SOTTIL - Dolphin Resort, Disney World
[ఈ చిత్రం నేను అక్కడ విహారయాత్రలో నా కామెరాతొ తీసినది]
కల చందమామగా
విచ్చుకుంది...

కలల మధ్య
కుప్పకూలిన
వంతెనలా వాస్తవం


కలలేని నిదుర కలవరపడింది
కలలేపిన కన్ను కలతపడింది
కలచెదిరిన చీకటిలో భళ్ళున తెల్లారింది
కలలెరుగని లోకం ఎదుట నిలిచింది

ఎన్ని కలల్లో వెదికినా దొరకని రూపు
కంటిపాపలో కన్ను గీటింది
లెక్కకందని ఊహలు రెక్కలొచ్చిఎగిరాయి
కలలబందీకి కడకి విడుదల దొరికింది

* * * * * * * * * * * * * *
ఒక విధంగా కలలోంచి వాస్తవంలోకి వచ్చిన భావన అయిన కలకాలం కవితకి ఇది మరొక వైపు కావచ్చు.

8 comments:

  1. ఇకనేం ఎగిరిపోండి! :)

    అయితే ఒక జాగ్రత్త! "టామ్ అండ్ జెర్రీ"లో టామ్‌కి ఎపుడూ ఇంటి చూరు అంచు దాటేసి చాలా దూరం గాల్లో పరిగెత్తేసాకనే గుర్తొస్తుంది, కాళ్ల క్రింద చూరు ఖతమైపోయి చాలాసేపయిందని. అపుడు తుళ్లి పడి క్రిందకి చూసి "gravity here I come!" అంటూ జర్రున జారిపోతాడు. అందుకే, మీరు మాత్రం అలా ఎపుడూ రెక్కలు నిజంగా వున్నాయా లేవా అన్నది తరిచి చూసుకోమాకండి; పడిపోగల్రు! గుడ్డి నమ్మకాన్ని గుడ్డిగా నమ్మండి! :P

    ReplyDelete
  2. vimochana title to paatu poem koodaa hattukundi. thank you usha gaaru..

    ReplyDelete
  3. హరేకృష్ణ, అచ్చంగా వంతువేసుకుని మరీ మొదటివ్యాఖ్య రాస్తున్నారా? ఏదేమైనా సంతోషం..కాకపొతే మీలా ఫుట్ బాల మ్యాచ్ లవీ చూసి టపాలు రాయకపోతే ఈ రియల్ వరల్డ్లో ఉండగలనా? :)

    ReplyDelete
  4. కెక్యూబ్ గారు, చాన్నాళ్లకి రాక. నెనర్లు.

    సుబ్రహ్మణ్యం గారు, ఇది మీ మొదటివ్యాఖ్య. ఒక విధంగా ఇది నాకు ప్రమోషన్ అనుకోవాలి. http://poddu.net/?p=605&page=3 చదివిననాటి అభిలాష/ఆకాంక్ష. మిమ్మల్ని ఆకట్టుకోగల ఓ కవిత అన్నా రాయాలని. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. కలలేని నిదుర కలవరపడింది
    కలలేపిన కన్ను కలతపడింది
    కలచెదిరిన చీకటిలో భళ్ళున తెల్లారింది
    కలలెరుగని లోకం ఎదుట నిలిచింది
    చాలా ......బాగుందండి.

    ReplyDelete
  6. రాధిక(నాని), థాంక్స్. మీరు పట్టిందే మొదలు.. ఆలోచన "కలచెదిరిన చీకటిలో భళ్ళున తెల్లారింది, కలలెరుగని లోకం ఎదుట నిలిచింది" తో మొదలైంది.

    ReplyDelete